మహేశ్‌బాబు
‘మహర్షి’ సినిమా తర్వాత మరోసారి హీరో మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జేమ్స్ బాండ్ సినిమాల తరహాలో స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఇందులో మహేశ్ సీక్రెట్ ఏజెంట్‌గా (రహస్య గూఢచారి) నటిస్తారని తెలిసింది. మే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు మహేశ్. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి న్యూయార్క్‌కి హాలిడేకి వెళ్లారు. ఈ హాలిడే పూర్తయిన తర్వాత షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment