మహేష్‌ లుక్‌ రివీల్‌ చేసిన నమ్రత | Namrata Reveals Mahesh Babu New Look | Sakshi
Sakshi News home page

May 31 2018 1:20 PM | Updated on May 28 2019 10:04 AM

Namrata Reveals Mahesh Babu New Look - Sakshi

భరత్‌ అనే నేను సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. స్పెయిన్‌లో ఫ్యామిలీ కలిసి హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్న మహేష్‌, 25వ సినిమా కోసం సరికొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడు. 24 సినిమాలో నటించిన మహేష్‌ లుక్‌ విషయంలో ప్రయోగాలు చేయలేదు. కానీ 25వ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాని మహేష్‌ స్వయంగా ప్రకటించాడు.

ఈ సినిమాలో మహేష్‌ గడ్డం, మీసంతో కనిపించబోతున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలకు మరింత బలం చేకూర్చే ఫోటో ఒకటి మహేష్‌ భార్య నమ్రత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. పూర్తిగా మహేష్‌ ఫేస్‌ కనిపించకపోయినా.. డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో పాటు బాగా పెరిగిన గడ్డంతో మహేష్‌ కొత్తగా కనిపిస్తున్నాడు. జూలైలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement