మునుపెన్నడూ చేయని పాత్రలో నాగార్జున | Nagarjuna to play a quadriplegic | Sakshi
Sakshi News home page

మునుపెన్నడూ చేయని పాత్రలో నాగార్జున

Published Thu, Jan 22 2015 8:35 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

మునుపెన్నడూ చేయని పాత్రలో నాగార్జున - Sakshi

మునుపెన్నడూ చేయని పాత్రలో నాగార్జున

చెన్నై: కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో నిర్మాణం కానున్నఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున మునుపెన్నడూ చేయని పాత్రను చేయడానికి సిద్ధమయ్యారు. పక్షవాతానికి గురైన ఓ వ్యాధిగ్రస్తుడు వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్ర. ఇందులో నాగార్జున ఈ తరహా వైవిధ్యమైన ఈ పాత్రలో నటిస్తుంటే.. అతని ఆలనా పాలనా చూసే పాత్రలో కార్తీ నటిస్తున్నారు.
 

ఇప్పటివరకూ నాగార్జున 90 చిత్రాల్లో నటించినా.. ఈ తరహా పాత్రను ఎప్పుడూ చేయకపోవడం గమనార్హం. ఒక ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి రీమేక్ చేస్తున్నారు. అయితే దక్షిణాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వంశీ అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం వంశీ టీం లొకేషన్లు వెతికే పనిలో పడింది. ఈ చిత్రం  ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement