multi-starrer
-
తమిళ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.
-
బాలయ్య, మోక్షజ్ఞతో మల్టీ స్టారర్ కు హనుమాన్ డైరెక్టర్ రెడీ..
-
నలుగురు హీరోలతో సినిమా అసాధ్యం అన్నారు
‘భలే మంచి రోజు’ వంటి హిట్ చిత్రం తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య టాలీవుడ్లో ఓ సంచలనానికి తెరలేపారు. ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ మూవీ తీసేందుకే కొందరు దర్శకులు ఆలోచిస్తుంటే, ఏకంగా నలుగురు హీరోలతో పాటు, ఓ సీనియర్ నటుడితో మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా, డా. రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పాత్రలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శ్రీను వైట్ల క్లాప్ ఇచ్చారు. నటుడు రాజేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆనంద్ ప్రసాద్‌గారితో ‘అమ్మాయి నవ్వితే’ సినిమా చేశా. నలుగురు హీరోలున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో నేను కీలకపాత్ర చేస్తున్నా. మేమంతా కలిసి చేస్తున్న ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఫేస్బుక్లో ఉద్యోగం చేసే టైమ్‌లో రాసుకున్న తొలి కథ ఇది. ఈ కథ చాలామందికి వినిపించా. ‘నలుగురు హీరోలు కలిసి తెలుగులో సినిమా ఎక్కడ చేస్తారు.. ఇది అసాధ్యం’? అన్నారందరూ. ఈ కథ వినగానే ఆనంద్ ప్రసాద్‌గారు ఎగ్జయిట్ అయ్యి, మనం సినిమా చేద్దామన్నారు. ఇంత మంది హీరోలు తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇది. భారీ మల్టీస్టారర్ చిత్రాలకు మా సినిమా నాంది పలుకుతుంది’’ అన్నారు. ‘‘మార్చి మొదటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని ఆనంద్ ప్రసాద్ తెలిపారు. -
ఒక్క సినిమా.. మూడు కథలు
‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమాతో ప్రేక్షకు ల దృష్టిని ఆకర్షించిన యువ హీరో శ్రీవిష్ణు తాజాగా ఓ మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ఇంద్ర సేనని దర్శకునిగా పరిచయం చేస్తూ ఏంవీకే రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మించనున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణుతో పాటు ఓ స్టార్ హీరో, హీరోయిన్ నటించనున్నారు. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఇంద్రసేన మాట్లాడుతూ – ‘‘ఇందులో సమాంతరంగా సాగే మూడు కథలు ఉంటాయి. ఆయా కథల్లో ఉండే మూడు మిస్టరీ లను పరిష్కరిస్తూ సాగే థ్రిల్లర్ మూవీ. కథలు, కథనాలు హాలీవుడ్ సై్టల్లో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, సంగీతం: సతీశ్ రఘునాధన్. -
చిరంజీవిగారితో కుదరకపోతే పవన్‌తో..!
‘మంచి కథ, పాత్రలు లభిస్తే... చిరంజీవిగారితో కలసి తెలుగులో మల్టీస్టారర్ సినిమా చేస్తా! ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ చిరంజీవిగారితో కుదరపోతే... పవన్‌కల్యాణ్‌తో మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమే’’ అన్నారు ఆమిర్‌ఖాన్. మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఆమిర్ చేసిన హిందీ సినిమా ‘దంగల్’ తెలుగులో ‘యుద్ధం’గా అనువాదమైంది. ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారం నిమిత్తం ఆదివారం ఆమిర్ హైదరాబాద్ వచ్చారు. స్ట్రయిట్ తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించగా... ‘‘భాష రాకుండా సినిమా చేస్తే పాత్రలో భావోద్వేగాలు ఆవిష్కరించ డం కష్టమని నా అభిప్రాయం. ఒకవేళ మంచి కథతో ఎవరైనా వస్తే నటిస్తా. తెలుగులో నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. మరి, మల్టీస్టారర్ చేయవలసి వస్తే ఎవరితో నటిస్తారు? అని అడగ్గా.. ‘‘తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్.. తమిళంలో రజనీకాంత్‌లతో చేస్తా. కథలో ఇద్దరు హీరోల పాత్రలూ అద్భుతంగా ఉండాలి’’ అన్నారు. ఆమిర్ హీరోగా సినిమా చేయడానికి రాజమౌళి ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘అవన్నీ పుకార్లు మాత్రమే. ‘బాహుబలి’ తర్వాత ఆయన్ను ఓసారి కలిశానుl. కానీ, సినిమా గురించి ఏం మాట్లాడుకోలేదు’’ అన్నారు. రాజమౌళి కలల సినిమా ‘మహాభారతం’లో ఛాన్స్ వస్తే నటిస్తారా? అనడిగితే... ‘‘మహాభారతంలో కర్ణుడు, కృష్ణుడు పాత్రలు ఇష్టం. కర్ణుడు ఆరడుగుల ఆజాను బాహుడు. ఆ పాత్రకు సూటవను కనుక కృష్ణుడిగా నటించడానికి ఇష్టపడతా’’ అన్నారు. -
ఆ ఇద్దరి కాంబినేషన్లో విక్రమ్ వేదా
సెలక్టెడ్ చిత్రాలనే చేసే నటుడు మాధవన్, వైవిధ్యభరిత చిత్రాల నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌సేతుపతి కలిసి ఒక చిత్రంలో నటిస్తే ఆ చిత్రం కచ్చితంగా విభిన్నంగా ఉంటుందనడంలో సందేహం ఉండదు. సరిగ్గా అలాంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్.మాధవన్, విజయ్‌సేతుపతి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి విక్రమ్ వేదా అనే టైటిల్‌ను నిర్ణరుుంచారు. ఇందులో క్రిమీ చిత్రం ఫేమ్ కదిర్, నటి వరలక్ష్మి, యూటర్న్ చిత్రం ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్, ష్రేమ్, అచ్యుత్‌కుమార్, హరీష్‌వర్మ, వివేక్ ప్రసన్న ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకుముందు తమిళ్‌పడమ్, కాదలిల్సొదప్పువదు ఎప్పడి,వాయైమూడి పేసవుమ్, ఇరుదు చుట్రు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వైనాట్ స్టూడియోస్ శశికాంత్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. దీనికి దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. మాటలను మణికంఠన్, సంగీతాన్ని సీఎస్.శ్యామ్, ఛాయాగ్రహణం పిఎస్.వినోద్ అందిస్తున్నారు. టైడెంట్ ఆర్ట్స్ ఆర్.రవీంద్రన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. విక్రమ్ వేదా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
ఒకరు కాదు... అయిదుగురు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. మంచి కథ కుదిరితే మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి హీరోలు వెనకాడడం లేదు. కానీ, ఇద్దరు మహా అయితే ముగ్గురు హీరోలు కలసి నటిస్తుంటారు. తాజాగా ఐదుగురు హీరోలతో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. తొలి చిత్రం ‘భలే మంచి రోజు’తో హిట్ అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కథ కూడా రెడీ అయిందట. ఇప్పటికే నారా రోహిత్, సందీప్ కిషన్, నాగశౌర్యలకు కథ వినిపించగా వారు ఓకే అన్నారనీ, మిగిలిన ఇద్దరు హీరోలను ఎంపిక చేసే పనిలో దర్శకుడున్నారని తెలుస్తోంది. ఐదుగురిలో ఒక పెద్ద వయస్సు ఉన్న హీరో కథకి అవసరమట. సో, ఆ హీరోని ఫైనలైజ్ చేసే పని మీద ఉన్నారట. ఇప్పుడొస్తున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు భోగట్టా. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. -
మాధవన్, దుల్కర్ సల్మాన్‌తో మల్టీస్టారర్
ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. నటుడు మాధవన్, దుల్కర్సల్మాన్లతో సీనియర్ నటుడు, దర్శకుడు ప్రతాప్‌పోతన్ ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నదే ఆ వార్త. తమిళంలో పలు హిట్ చిత్రాలలో నటించిన నటుడు మాధవన్. ఆపై బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించారు. ఈయన చిన్న గ్యాప్ తరువాత ఇరుదుచుట్రు చిత్రంతో మళ్లీ కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇక మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్సల్మాన్. ఓ కాదల్‌కణ్మణి చిత్రం ద్వారా లవర్‌బాయ్‌గా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈయన రెండవ సారి మణిరత్నం చిత్రంలో నటించడానికి నిరాకరించి ఫ్రీ ప్రచారం చాలానే పొందారన్నది గమనార్హం. తాజాగా మాధవన్, దుల్కర్‌సల్మాన్‌లు ప్రతాప్‌పోతన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. 1990 ప్రాంతంలో కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటించిన ఈయన ఆ తరువాత దర్శకుడిగా అవతారమెత్తి పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. కమలహాసన్, ప్రభులతో వెట్రివిళా చిత్రంతో పాటు మీండుం ఒరు కాదల్ కథై, జీవా, మైడియర్ మార్తాండన్, ఆత్మ, శివల్పేరి పాండి వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులోనూ కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రతాప్‌పోతన్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. తన తాజా చిత్రానికి మాధవన్, దుల్కర్‌సల్మాన్‌లు నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇందులో నటి ధ న్సిక కథానాయకిగా నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. -
శశి దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం
వైవిధ్య కథా చిత్రాల దర్శకుడిగా పేరొందినారు శశి. ఆయన చిన్న గ్యాప్ తరువాత విజయ్‌ఆంటోని కథానాయకుడిగా రూపొందించిన చిత్రం పిచ్చైక్కారన్. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పిచ్చైక్కారన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతను, పంపిణీదారుల్ని కోటీశ్వరుల్ని చేసింది. దీంతో దర్శకుడు శశికి డిమాండ్ పెరిగింది. పలువురు ప్రముఖ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ముందుకొస్తున్నారు. కాగా శశి తన తాజా చిత్రానికి నటుడు మాధవన్, జీవీ.ప్రకాశ్‌కుమార్‌లను ఎంచుకోవడం విశేషం. అదే విధంగా శశి దర్శకత్వంలో చిత్రాలను నిర్మించడానికి పలువురు నిర్మాతలు సిద్ధం అయినా ఆ అడ్వాంటేజ్‌ను శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తీసుకుంది. శశి దర్శకత్వంలో మాధవన్, జీవీ.ప్రకాశ్‌కుమార్ కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఇందులో నటించే హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపక జరుగుతోందని తెలిసింది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ ఇంతకు ముందు డిమాంటీ కాలనీ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. -
అజిత్,శివకార్తికేయన్ కలయికలో భారీ చిత్రం?
కోలీవుడ్‌లో మల్టీ స్టారర్ చిత్రాల నిర్మాణం పెరుగుతోందని చెప్పవచ్చు. సంచలన దర్శకుడు బాలా ఐదుగురు హీరోలతో భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాగార్జున, కార్తీలతో తోళా అనే మల్టీ స్టారర్ ద్విభాషా చిత్రం నిర్మాణంలో ఉంది.తాజాగా స్టార్ నటుడు అజిత్, యువ నటుడు శివకార్తికేయన్‌ల కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాచారం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. వేదాళం చిత్రం తరువాత అజిత్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అజిత్ మరో మూడు నెలల వరకూ నటనకు దూరంగా ఉంటారని సమాచారం. ఆయన విరామం అనంతరం నటించే చిత్రం గురించి ఒక సంచలన ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. అజిత్, యువ నటుడు శివకార్తికేయన్ కలిసి నటించనున్నారన్నదే ప్రచారం. ఇంతకు ముందు అజిత్ హీరోగా వీరం, వేదాళం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివనే ఈ మల్టీ స్టారర్ చిత్రానికి స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ చిత్రం డిసెంబర్ నాలుగున తెరపైకి రానుంది. ప్రస్తుతం ఆయన నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఆర్డీ.రాజా నిర్మించనున్న నర్సు అక్క(టైటిల్ ఇంకా వెల్లడించలేదు)అనే చిత్రంలో నటిస్తున్నారు. -
మునుపెన్నడూ చేయని పాత్రలో నాగార్జున
చెన్నై: కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో నిర్మాణం కానున్నఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున మునుపెన్నడూ చేయని పాత్రను చేయడానికి సిద్ధమయ్యారు. పక్షవాతానికి గురైన ఓ వ్యాధిగ్రస్తుడు వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్ర. ఇందులో నాగార్జున ఈ తరహా వైవిధ్యమైన ఈ పాత్రలో నటిస్తుంటే.. అతని ఆలనా పాలనా చూసే పాత్రలో కార్తీ నటిస్తున్నారు. ఇప్పటివరకూ నాగార్జున 90 చిత్రాల్లో నటించినా.. ఈ తరహా పాత్రను ఎప్పుడూ చేయకపోవడం గమనార్హం. ఒక ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి రీమేక్ చేస్తున్నారు. అయితే దక్షిణాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వంశీ అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం వంశీ టీం లొకేషన్లు వెతికే పనిలో పడింది. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. -
మల్టీస్టారర్ సాహసమే..
నిర్మాత అశ్వనీదత్ ఎన్టీఆర్‌తో ‘ఎదురులేని మనిషి’, చిరంజీవితో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి బ్లాక్బాస్టర్ సినిమాలు అందించిన నిర్మాత అశ్వనీదత్. జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రెండు రోజులుగా జిల్లాలో ఉన్న ఆయన ‘సాక్షి’తో పలు సినిమా విషయూల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు.. ప్ర : రాజకీయరంగం నుంచి తప్పుకొన్నారా? జ : లేదు.. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ప్రచారం చేశాను. వారానికి మూడు రోజులు రాజకీయాలకు కేటాయించాను. వారంలో ఒకరోజు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమవుతూ ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు ఇస్తున్నాను. ప్ర : చిత్ర పరిశ్రమ విశాఖపట్నానికి రానుందా.. జ : అటువంటి ఆలోచనే లేదు. చెన్నై నుంచి హైదరాబాద్ తరలించాక ఇప్పటికీ స్థిరపడలేదు. హైదరాబాద్ కూడా మన తెలుగు ప్రాంతమేగా.. అనుకుంటూనే హైదరాబాద్ కేంద్రంగా సినిమాలు నిర్మించాలని సినీ పరిశ్రమ అనుకుంటోంది. ప్ర : ప్రముఖ నిర్మాతగా సినిమాలు తీయకపోవడానికి కారణం? జ : పరిశ్రమ నష్టాల బాటలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మేలు. ప్ర : నష్టాలకు కారణమేమిటీ? జ : నిర్మాణ రంగంలో నిర్మాత కమాండింగ్ లేకుండాపోయింది. బడ్జెట్ నిర్మాత చేతుల్లో లేదు. ప్ర : సినిమా రంగం లాభాల బాటలో పయనించడానికి ఏం చేయాలనుకుంటున్నారు? జ : చిన్నచిత్రాలు విజయం సాధించాలి. అలాంటి సినిమాల నిర్మాణంలో నిర్మాతకు కమాండింగ్ ఉంటుంది. బడ్జెట్ ప్రకారం సినిమా విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ప్ర : ప్రస్తుతం ఏం సినిమాలు తీస్తున్నారు? జ : పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నవంబర్‌లో ఓ చిత్రాన్ని తీయూలనుకుంటున్నా. ప్ర : ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి ఫాంటసీ సినిమాను మీ నుంచి ఆశించవచ్చా? జ : రామ్‌చరణ్ హీరోగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. తరువాత పవన్‌కల్యాణ్‌తో సినిమా ఉంటుంది. ప్ర : భారీ చిత్రాలు నష్టాలు చవిచూస్తున్నాయంటూనే ఆ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు కదా.. కారణమేమిటీ? జ : భారీ చిత్రాలతో పాటు చిన్నచిత్రాలు తీస్తుంటాను. భారీ సినిమాలకు మధ్యలో రెండు చిన్న సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా.. ప్ర : మల్టీస్టారర్‌పై మీ అభిప్రాయం. జ : ఒక్క హీరోతో సినిమా చేయడానికే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మల్టీస్టారర్ సినిమా నిర్మించాలన్న సాహసం చేసే ఆలోచన లేదు. ప్రశ్న : బాలీవుడ్-టాలీవుడ్ మధ్య తేడా ఏంటీ? జ : హిందీ చిత్రరంగానికీ, మనకూ చాలా తేడా ఉంది. హిందీలో కోట్లు వెచ్చించి సినిమాలు తీస్తున్నా.. నాలుగు నెలల్లో పూర్తయిపోతుంది. తెలుగులో హీరోకు రూ.10కోట్లు కేటాయిస్తున్నా.. సినిమా తీయడానికి మరో రూ.30కోట్లు వెచ్చిస్తున్నా.. పూర్తవడానికి ఏడాదికి పైగా పడుతోంది. కానీ, కారణాలు తెలియట్లేదు. నాటి హీరోల్లో ఉన్న ఐక్యత నేడు కనిపించట్లేదు. -
మల్టీస్టారర్‌కి రెడీ?
తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టడమే కాదు, దాన్ని కొనసాగించే బాధ్యతను కూడా తలకెత్తుకున్నారు వెంకటేశ్. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రంలో మహేశ్‌తో కలిసి నటించి ఈ ట్రెండ్‌ని మొదలుపెట్టిన ఆయన.. రామ్‌తో ‘మసాలా’ చేశారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’ చేస్తున్నారు. ఇలా వరుస పెట్టి మల్టీస్టారర్లు చేస్తూ మిగిలిన హీరోలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకీ. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే... వెంకటేశ్ మరో మల్టీస్టారర్‌కి పచ్చజెండా ఊపేశారట. ఈ దఫా వెంకటేశ్‌తో నటించే స్టార్‌గా రవితేజ పేరు వినిపిస్తుండగా, వీరిద్దరినీ డెరైక్ట్ చేసే ఛాన్స్‌ని వీరు పోట్ల దక్కించుకున్నట్లు ఫిలింనగర్ టాక్. వీరు పోట్ల చెప్పిన లైన్ వెంకీ, రవితేజలకు నచ్చడంతో పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయవలసిందిగా వీరును పురమాయించారట వెంకీ, రవితేజ. ప్రస్తుతం ఈ దర్శక, రచయిత... కథ సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆద్యంతం హాస్యభరితంగా, ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తేలా వీరు పోట్ల కథను సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. కామెడీని పండించడంలో వెంకటేశ్, రవితేజ ఇద్దరూ సిద్ధహస్తులే. వీరి కామెడీ టైమింగ్‌ను ఇష్టపడనివారుండరంటే అతిశయోక్తికాదు. మరి వీరిద్దరూ కలిసి తెరను పంచుకుంటే... సినీ హాస్య ప్రియులకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది?. ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ నవంబర్‌లో సెట్స్‌కి వెళ్లనుందని తెలుస్తోంది. -
వెంకటేష్, రాంచరణ్ కాంబినేషన్ కుదిరింది
తెలుగులో మరో మల్టీస్టారర్ చిత్రం రాబోతోంది. విక్టరీ వెంకటేష్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ ఇద్దరూ కలసి ఓ సినిమాలో నటించనున్నారు. ఇందుకు వీరిద్దరూ అంగీకరించారని నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించారు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు. 'అభిమానులకిది నా దీపావళి కానుక. వారితో కలసి పనిచేసే అవకాశమిచ్చిన ఇద్దరు హీరోలకూ కృతజ్ఞతలు. వెంకటేష్ తన సినిమాను పూర్తిచేశారు. వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం' అని గణేష్ చెప్పారు. కాగా రాంచరణ్‌తో చేసే సినిమా వెంకటేష్‌కు మూడో మల్టీస్టారర్ చిత్రమవుతుంది. మహేష్ బాబుతో కలసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్‌తో కలసి తాజాగా 'మసాలా' చిత్రాల్లో నటించారు.