శశి దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం | madavan and g.v prakash next movie with shashi | Sakshi
Sakshi News home page

శశి దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం

Published Fri, May 6 2016 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

శశి దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం

శశి దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం

వైవిధ్య కథా చిత్రాల దర్శకుడిగా పేరొందినారు శశి. ఆయన చిన్న గ్యాప్ తరువాత విజయ్‌ఆంటోని కథానాయకుడిగా రూపొందించిన చిత్రం పిచ్చైక్కారన్. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పిచ్చైక్కారన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతను, పంపిణీదారుల్ని కోటీశ్వరుల్ని చేసింది. దీంతో దర్శకుడు శశికి డిమాండ్ పెరిగింది. పలువురు ప్రముఖ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ముందుకొస్తున్నారు.

కాగా శశి తన తాజా చిత్రానికి నటుడు మాధవన్, జీవీ.ప్రకాశ్‌కుమార్‌లను ఎంచుకోవడం విశేషం. అదే విధంగా శశి దర్శకత్వంలో చిత్రాలను నిర్మించడానికి పలువురు నిర్మాతలు సిద్ధం అయినా ఆ అడ్వాంటేజ్‌ను శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తీసుకుంది. శశి దర్శకత్వంలో మాధవన్, జీవీ.ప్రకాశ్‌కుమార్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఇందులో నటించే హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపక జరుగుతోందని తెలిసింది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ ఇంతకు ముందు డిమాంటీ కాలనీ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement