
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) (జీడీఎన్) జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్‌కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేసి, ప్రియమణి, జయరాం, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.
ఇక పెద్దగా చదువుకోకపోయినా ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్‌టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్‌లో కొన్ని పరికరాల ఆవిష్కరణలు చేశారు జీడీఎన్. ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్‌లో మాధవన్ నటిస్తుండటం విశేషం. మరి... వెండితెరపై మిరాకిల్ మేన్‌గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment