![Actor Madhavan Buy Brixton Cromwell 1200 Becomes The First Indian](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/madhavan.jpg.webp?itok=nhxy4B8f)
జాతీయ ఉత్తమ నటుడు ఆర్ మాధవన్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దాదాపుగా 7 భాషాల సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు బైకులంటే చాలా ఇష్టం. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ రంగంలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా గర్తింపు ఉన్న బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ బైక్‌ను మాధవన్ కొనుగొలు చేశారు. రెట్రో డిజైన్‌తో పాటు ఆధునిక ఇంజనీరింగ్ వర్క్ స్టైల్‌తో ఉన్న ఈ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు.
ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బ్రిక్ట్సన్ అధికారికంగా భారతదేశంలో తన విక్రయాలను ప్రారంభించింది. నటుడు ఆర్. మాధవన్ తొలి బైక్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాహనాన్ని కొనుగోలు చేశారు. మోటోహాస్ భాగస్వామ్యంతో బ్రిక్ట్సన్ భారతదేశంలో అడుగు పెడుతోంది. బెంగళూరు, కోల్హాపూర్, గోవా, అహ్మదాబాద్, సంగ్లీ వంటి నగరాల్లో డీలర్‌షిప్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. జైపూర్, మైసూర్, కోల్‌కతా, పూణే, ముంబైలలో షోరూమ్‌లు రానున్నాయి. ఈ బైక్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నారు. కొత్త బైక్‌పై తన కుమారుడు వేదాంత్ పేరును చేర్చాడు.
ఇండియన్ మార్కెట్‌లో ఈ బైక్ ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ విభాగంలో ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపిక అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్‌తో కలిగి ఉండి 108Nm టార్క్‌తో పనిచేస్తుంది. నిస్సిన్ బ్రేక్‌లు, బాష్ ABS, KYB అడ్జస్టబుల్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-థెఫ్ట్ కీ సిస్టమ్, TFT డిస్‌ప్లే, పిరెల్లి ఫాంటమ్ ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ప్రీమియం ఫీచర్లతో బైక్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment