R Madhavan Son Wins Gold Medal in Danish Open: స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేదాంత్ డెన్మార్క్‌లో జరుగుతున్న డానిష్ స్విమ్మింగ్ ఓపెన్ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. వరుస విజాయలతో దూసుకుపోతూ భారత్‌కు పథకాలను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ పోటీలో వేదాంత్ ఆదివారం రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే పోటీలో సోమవారం గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కొడుకు వేదాంత్‌కు గోల్డ్ మెడల్ ప్రకటిస్తున్న వీడియోను మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
‘మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుడి దయ వల్ల వేదాంత్ వరస విజాయలను అందుకుంటున్నాడు. ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు’ అంటూ పోస్ట్ పంచుకున్నాడు. కాగా డానిష్ ఓపెన్ 2022లో వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆదివారం కేవలం 10మిల్లీ సెకన్ల తేడాతో గోల్డ్ కోల్పోయిన వేదాంత్ సోమవారం సక్సెస్ ఫుల్‌గా రేసును పూర్తి చేసి భారత్ తరుపున బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా పలువరు ప్రముఖులతో పాటు నెటీజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చదవండి: R Madhavan: స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు
Comments
Please login to add a commentAdd a comment