Vedaant
-
5 స్వర్ణాలు సహా మొత్తం 7 పతకాలు సాధించిన నటుడు మాధవన్ తనయుడు
Khelo India Games 2023: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అతని కుమారుడు, భారత అప్ కమింగ్ స్విమ్మర్ వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా గేమ్స్-2023లో పతకాల వర్షం కురిపించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన వేదాంత్.. 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలు సహా మొత్తం 7 పతకాలను కైవసం చేసుకున్నాడు. VERY grateful & humbled by the performances of @fernandes_apeksha ( 6 golds,1 silver,PB $ records)& @VedaantMadhavan (5golds &2 silver).Thank you @ansadxb & Pradeep sir for the unwavering efforts & @ChouhanShivraj & @ianuragthakur for the brilliant #KheloIndiaInMP. So proud pic.twitter.com/ZIz4XAeuwN — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 100, 200, 1500 మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు సాధించిన వేదాంత్.. 400, 800 మీట్లర రేసులో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. వేదాంత్ కొలనులో బంగారు చేపలా రెచ్చిపోయి పతకాలు సాధించడంతో అతను ప్రాతినిధ్యం వహించిన మహారాష్ట్ర మొత్తంగా 161 పతకాలు (56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో కూడా అత్యధిక పతకాలు సాధించిన మహారాష్ట్ర టీమ్ మరో ట్రోఫీని సాధించింది. With gods grace -Gold in 100m, 200m and 1500m and silver in 400m and 800m . 🙏🙏🙏👍👍 pic.twitter.com/DRAFqgZo9O — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 కొడుకు వేదాంత్ ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైపోతున్న మాధవన్.. అతనికి, మహారాష్ట్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ట్వీట్లు చేశాడు. వేదాంత్, ఫెర్నాండెస్ అపేక్ష (6 గోల్డ్, 1 సిల్వర్) ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. వీరి ప్రదర్శన వెనుక తిరుగలేని కృషి చేసిన కోచ్ ప్రదీప్ సర్, చౌహాన్ శివ్‌రాజ్‌లకు ధన్యవాదాలు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి కృతజ్ఞతలు అంటూ తొలి ట్వీట్ చేశాడు. CONGRATULATIONS team Maharashtra for the 2 trophy’s .. 1 for boys team Maharashtra in swimming & 2nd THE OVERALL Championship Trophy for Maharashtra in entire khelo games. pic.twitter.com/rn28piOAxY — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 ఆ తర్వాత ట్వీట్లో మాధవన్ తన కుమారుడు సాధించిన పతకాల వివరాలను పొందుపరిచాడు. మరో ట్వీట్లో టీమ్ మహారాష్ట్ర, ఆ రాష్ట్ర బాయ్స్ టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఇటీవల కాలంలో కొలనులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న వేదాంత్ దుబాయ్‌లో ఒలింపిక్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వేదాంత్ కోసం మాధవన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని దుబాయ్‌కు షిఫ్ట్ చేశాడు. కాగా, గతేడాది డానిష్ ఓపెన్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా వేదాంత్ తొలిసారి వార్తల్లోకెక్కాడు. -
నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్
R Madhavan Son Vedaant Shocking Comments: నటుడు, హీరో ఆర్ మాధవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెలి, సఖీ వంటి ప్రేమకథ చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు మాధవన్. ఈ క్రమంలో అతడికి సౌత్‌లో విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సినిమాల్లో అతిథి పాత్రలు, ప్రతి కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ తండ్రి బాటలో నడవకుండ స్పోర్ట్స్‌లో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. స్విమ్మింగ్‌లో ఇప్పటికే అతడు జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్ ఇటీవల జరిగిన డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో రెండు(గోల్డ్, సిల్వర్) పథకాలు సాధించి మెరిశాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో వేదాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. తన తండ్రి నీడలోనే బతకాలనుకోవడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘నేను హీరో మాధవన్ కొడుకుగానే ఉండిపోవాలనుకోవడం లేదు. ఆయన నీడలోనే బతకాలి, ఎదగాలని లేదు. నాకంటూ సొంతంగా ఓ గుర్తింపు ఉండాలనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించాడు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. అలాగే ‘నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను సంరక్షిస్తూనే ఉన్నారు. నాకు కావాల్సినవన్ని సమకూరుస్తున్నారు. నా కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నా కోసమే దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు. 2026లో జరగబోయే ఒలింపిక్స్ కోసం నన్ను సన్నద్ధం చేస్తున్నారు. దానికోసం దుబాయ్‌లో నేను శిక్షణ తీసుకోవాల్సి ఉంది. అందుకోసం నాన్న, అమ్మ కూడా నాతో పాటు దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు’ అంటూ వేదాంత్ చెప్పుకొచ్చాడు. ఇక కొడుకు మాటలకు మాధవన్ మురిసిపోయాడు. వేదాంత్ సినిమా రంగంలోకి రాకపోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తనకు ఏది ఇష్టమో అదే చేయమన్నానని, తనకి పూర్తి స్వేచ్చా ఇవ్వడం తండ్రిగా తన బాధ్యత అని మాధవన్ పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'బంగారు' వేదాంత్.. డానిష్ ఓపెన్‌లో రెండో పతకం సాధించిన మాధవన్ కొడుకు
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్ వేదాంత్ మాధవన్ మరోసారి మెరిశాడు. నిన్న (ఏప్రిల్ 17) పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం సాధించిన వేదాంత్.. ఇవాళ (ఏప్రిల్ 18) 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. వేదాంత్ 800 మీటర్ల లక్ష్యాన్ని 8 నిమిషాల 17:28 సెకెన్లలో పూర్తి చేశాడు. వేదాంత్ రజతం పతకం నెగ్గి రోజు తిరగకుండానే పసిడి సాధించడం విశేషం. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ (16) ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వరుస పతాకలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) గతేడాది జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించిన వేదాంత్.. లాత్వియా ఓపెన్‌లో కాంస్యం, తాజాగా డానిష్ ఓపెన్‌లో బంగారు, రజత పతకాలు సాధించాడు. వేదాంత్ అంతర్జాతీయ వేదికలపై వరుస పతకాలు సాధిస్తుండటంతో అతని తండ్రి మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మరోవైపు వేదాంత్ సాధించిన విజయాల పట్ల యావత్ భారత చలనచిత్ర సీమ ఆనందం వ్యక్తం చేస్తుంది. దక్షిణాదికి చెందిన మాధవన్.. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. కాగా, డానిష్ ఓపెన్‌లో కొడుకు సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను మాధవన్ స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం.. విదేశీ ఆటగాడికి పాజిటివ్..? -
వరుస పథకాలతో సత్తా చాటుతోన్న మాధవన్ తనయుడు
R Madhavan Son Wins Gold Medal in Danish Open: స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేదాంత్ డెన్మార్క్‌లో జరుగుతున్న డానిష్ స్విమ్మింగ్ ఓపెన్ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. వరుస విజాయలతో దూసుకుపోతూ భారత్‌కు పథకాలను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ పోటీలో వేదాంత్ ఆదివారం రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే పోటీలో సోమవారం గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కొడుకు వేదాంత్‌కు గోల్డ్ మెడల్ ప్రకటిస్తున్న వీడియోను మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ ‘మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుడి దయ వల్ల వేదాంత్ వరస విజాయలను అందుకుంటున్నాడు. ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు’ అంటూ పోస్ట్ పంచుకున్నాడు. కాగా డానిష్ ఓపెన్ 2022లో వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆదివారం కేవలం 10మిల్లీ సెకన్ల తేడాతో గోల్డ్ కోల్పోయిన వేదాంత్ సోమవారం సక్సెస్ ఫుల్‌గా రేసును పూర్తి చేసి భారత్ తరుపున బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా పలువరు ప్రముఖులతో పాటు నెటీజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: R Madhavan: స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
సిల్వర్ మెడల్.. హీరో మాధవన్ కొడుకుపై ప్రశంసలు
స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్విమ్మింగ్ పోటీల్లో దేశానికి సిల్వర్ మెడల్‌ను సాధించాడు. డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో మాధవన్ కొడుకు వేదాంత్ రజత పతకం సాధించి సత్తా చాటాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో వేదాంత్ ఈ ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మాధవన సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మాధవన్ తన కొడుకు ఫోటోను మాత్రమే కాకుండా బంగారు పతకం సాధించిన సాజన్ ప్రకాష్‌ను కూడా అభినందించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. With all your blessings & Gods grace🙏🙏 @swim_sajan and @VedaantMadhavan won gold and silver respectively for India, at The Danish open in Copenhagen. Thank you sooo much Coach Pradeep sir, SFI and ANSA.We are so Proud 🇮🇳🇮🇳🇮🇳🙏🙏 pic.twitter.com/MXGyrmUFsW — Ranganathan Madhavan (@ActorMadhavan) April 16, 2022 -
సజన్‌కు స్వర్ణం... వేదాంత్‌కు రజతం
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్లు సజన్ ప్రకాశ్, వేదాంత్ మెరిశారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్ స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తమిళనాడుకు చెందిన వేదాంత్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. సజన్ 200 మీటర్ల లక్ష్యాన్ని ఒక నిమిషం 59.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ 1500 మీటర్ల లక్ష్యాన్ని 15 నిమిషాల 57.86 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ గత ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గగా... జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించాడు. -
మాధవన్కి గర్వంగా ఉందట...ఎందుకు?
చెన్నై: క్రేజీ ప్రాజెక్టులతో సక్సెస్ పుల్ గా కరియర్‌ను సాగిస్తున్నతమిళ హీరో మాధవన్ ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లోనూ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తనయుడు చేసిన ఫీట్తోఈ విలక్షణ నటుడు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారట. తనయుడు వేదాంత్ స్విమ్మింగ్ లో సాధించిన విజయానికి తాను చాలా గర్వపడుతున్నానని శనివారు తెలిపారు. ఒక తండ్రిగా తనకుచాలా గర్వంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. . అసలువిషయం ఏమిటంటే ఓ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో మాధవన్ కొడుకు వేదాంత్ (12) ఓ రికార్డ్ సృష్టించాడు. ఖాన్ జిమ్ లో జరిగిన స్విమ్మథాన్ లో వేదాంత్.. 4 కిలో మీటర్లను 57 నిమిషాల్లోనే పూర్తి చేశాడట. దీంతో ' తండ్రిగా చాలా ప్రౌడ్ గా ఫీలయ్యే క్షణాలివి అంటూ ట్వీట్ చేశారు. . నేను ఈ ఫీట్ ను కనీసం ఊహించుకోలేను కూడా' అంటూ ట్వీట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు తన కొడుకుతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు కాగా మాధవన్ 18 సంవత్సరాల క్రితం సరితను వివాహం చేసుకున్నారు. త్రి ఇడియట్స్, తనూ వెడ్స్ మనూ లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకున్న గతేడాది సాలా ఖడూస్ సాధించిన బంపర్ విజయంతో వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ థ్రిల్లర్ "విక్రమ్ వేధ’’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే చందమామ దూర్ కే అనే హిందీ చిత్రంలోను నటిస్తున్నారు. Proud day for the Dad in Me.Vedaant swam 4 km Swimathon @ Khan Gym, in under 57 min.Something I can NEVER imagine doing. pic.twitter.com/CLSCNXSpE4 — Ranganathan Madhavan (@ActorMadhavan) February 18, 2017