R Madhavan Son: Vedaant Interesting Comments On Parents In An Interview - Sakshi
Sakshi News home page

R Madhavan-Vedaant: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: మాధవన్‌ కొడుకు వేదాంత్‌

Published Tue, Apr 26 2022 5:50 PM | Last Updated on Wed, Apr 27 2022 9:07 PM

R Madhavan Son Vedaant Interesting Comments On Parents In Latest Interview - Sakshi

R Madhavan Son Vedaant Shocking Comments: నటుడు, హీరో ఆర్‌ మాధవన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెలి, సఖీ వంటి ప్రేమకథ చిత్రాల్లో నటించి లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు మాధవన్‌. ఈ క్రమంలో అతడికి సౌత్‌లో విపరీతమైన లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ప్రస్తుతం సినిమాల్లో అతిథి పాత్రలు, ప్రతి కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మాధవన్‌ తనయుడు వేదాంత్‌ మాధవన్‌ తండ్రి బాటలో నడవకుండ స్పోర్ట్స్‌లో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. స్విమ్మింగ్‌లో ఇప్పటికే అతడు జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.

చదవండి: షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్‌

ఇటీవల జరిగిన డానిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో రెండు(గోల్డ్‌, సిల్వర్‌) పథకాలు సాధించి మెరిశాడు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో వేదాంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. తన తండ్రి నీడలోనే బతకాలనుకోవడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘నేను హీరో మాధవన్‌ కొడుకుగానే ఉండిపోవాలనుకోవడం లేదు. ఆయన నీడలోనే బతకాలి, ఎదగాలని లేదు. నాకంటూ సొంతంగా ఓ గుర్తింపు ఉండాలనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించాడు.

చదవండి: హిందీలో కేజీఎఫ్‌ 2 సక్సెస్‌పై అభిషేక్‌ బచ్చన్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

అలాగే ‘నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను సంరక్షిస్తూనే ఉన్నారు. నాకు కావాల్సినవన్ని సమకూరుస్తున్నారు. నా కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నా కోసమే దుబాయ్‌కి షిఫ్ట్‌ అయ్యారు. 2026లో జరగబోయే ఒలింపిక్స్‌ కోసం నన్ను సన్నద్ధం చేస్తున్నారు. దానికోసం దుబాయ్‌లో నేను శిక్షణ తీసుకోవాల్సి ఉంది. అందుకోసం నాన్న, అమ్మ కూడా నాతో పాటు దుబాయ్‌కి షిఫ్ట్‌ అయ్యారు’ అంటూ వేదాంత్‌ చెప్పుకొచ్చాడు. ఇక కొడుకు మాటలకు మాధవన్‌ మురిసిపోయాడు. వేదాంత్‌ సినిమా రంగంలోకి రాకపోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తనకు ఏది ఇష్టమో అదే చేయమన్నానని, తనకి పూర్తి స్వేచ్చా ఇవ్వడం తండ్రిగా తన బాధ్యత అని మాధవన్‌ పేర్కొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement