మాధవన్కి గర్వంగా ఉందట...ఎందుకు? | Madhavan proud of son's swimming feat | Sakshi
Sakshi News home page

మాధవన్కి గర్వంగా ఉందట...ఎందుకు?

Published Sat, Feb 18 2017 8:11 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

మాధవన్కి గర్వంగా ఉందట...ఎందుకు? - Sakshi

మాధవన్కి గర్వంగా ఉందట...ఎందుకు?

చెన్నై: క్రేజీ ప్రాజెక్టులతో  సక్సెస్‌ పుల్‌ గా కరియర్‌ను  సాగిస్తున్నతమిళ హీరో మాధవన్  ఇప్పుడు పర్సనల్  లైఫ్‌లోనూ  ఫుల్ హ్యాపీగా  ఎంజాయ్‌  చేస్తున్నారు. ముఖ్యంగా  తనయుడు చేసిన ఫీట్‌తోఈ  విలక్షణ నటుడు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారట.   తనయుడు వేదాంత్‌  స్విమ్మింగ్‌ లో సాధించిన విజయానికి తాను చాలా గర్వపడుతున్నానని శనివారు తెలిపారు. ఒక తండ్రిగా తనకుచాలా గర్వంగా ఉందంటూ ట్విట్టర్‌ ​ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. .

అసలువిషయం ఏమిటంటే   ఓ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో మాధవన్ కొడుకు వేదాంత్ (12) ఓ రికార్డ్ సృష్టించాడు. ఖాన్ జిమ్ లో జరిగిన స్విమ్మథాన్ లో  వేదాంత్.. 4 కిలో మీటర్లను 57 నిమిషాల్లోనే  పూర్తి చేశాడట.  దీంతో ' తండ్రిగా చాలా ప్రౌడ్‌ గా ఫీలయ్యే క్షణాలివి అంటూ  ట్వీట్‌ చేశారు. . నేను ఈ ఫీట్ ను కనీసం ఊహించుకోలేను కూడా' అంటూ ట్వీట్  తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు  తన కొడుకుతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు
కాగా మాధవన్ 18 సంవత్సరాల క్రితం సరితను  వివాహం  చేసుకున్నారు.  త్రి ఇడియట్స్‌, తనూ వెడ్స్‌ మనూ లాంటి   సూపర్‌ హిట్‌ బాలీవుడ్‌ సినిమాలతో  ఆకట్టుకున్న గతేడాది సాలా ఖడూస్  సాధించిన బంపర్‌ విజయంతో  వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నారు.  ప్రస్తుతం తమిళ థ్రిల్లర్ "విక్రమ్  వేధ’’ షూటింగ్ లో బిజీగా  ఉన్నారు.  అలాగే చందమామ దూర్ కే అనే హిందీ చిత్రంలోను నటిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement