proud
-
మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!
భారత సంతతికిచెందిన టాప్ సీఈవోలు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ మొదలు, గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు భారతీయులు గ్లోబల్ కంపెనీలకు సారధులుగా ఉండిమెప్పిస్తున్నారు. 76వ ఇండిపెండెన్స్‌డే సందర్భంగా దిగ్గజ కంపెనీల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటున్న సీఈఓలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్థాయి వారికి అలవోకగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని, మొక్కవోని ధైర్యంతో అడుగులు వేయడమేకాదు, ఆధునిక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకం నుంచి భారత సంతతికి చెందిన టెక్ నిపుణులు, వ్యాపార దిగ్గజాలు గ్లోబల్ కంపెనీల్లో కీలక పదవుల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాహ్మ్ అండ్ హాస్ ఛైర్మన్, సీఈఓగా రాజ్ గుప్తా బాధ్యతలు స్వీకరించి కొత్త శకానికి నాంది పలికారు. ఆ తరువాత స్టాన్ర్ట్ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్, సీఈఓగా యూఎస్ ఎయిర్వేస్ గ్రూప్‌నకు రాకేశ్ గంగ్వాల్ సీఈగా ఎంపికై తమ ఘనతను చాటుకున్నారు. అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్‌పాల్ సింగ్ బంగా లేదా అజయ్‌బంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు. పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ,అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశారు.నెస్లే తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అజయ్‌పాల్ సింగ్ బంగా అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా, అంతకు ముందు ఏప్రిల్ 12, 2010 నుంచి 11 సంవత్సరాల పాటు మాస్టర్‌కార్డ్ సీఈవోగా పనిచేశారు. గతంలో పెప్సికో ,సిటీ గ్రూప్‌లో కూడా పనిచేశారు.ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. గీతా గోపీనాథ్ గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్లోనికోల్కతాలో పుట్టారు. 2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికై తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019-2022 దాకా ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు. జాన్ జ్వాన్‌స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (2005-2022), అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. గోపీనాథ్ క్రీడలు, సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచాయ్ సుందరరాజన్ సుందర్‌పిచాయ్ తమిళనాడులో చెన్నైలోని అశోక్ నగర్లో జన్మించారు. తల్లి లక్ష్మి వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్, తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. 2015లో గూగుల్ సీఈగా నియమితులయ్యారు. అనంతరం కేవలం నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్స్ డిగ్రీని, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.2021లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ , సీఈవో 1990లో ఐబీఎంలోచేరారు కృష్ణ. ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవో ఆతరువాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ ,బ్లాక్‌చెయిన్, నానోటెక్నాలజీతో సహా కోర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆవిష్కరణలతో ఐబీఎం మార్కెట్‌ను విస్తరించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అరవింద్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , అలాగే నార్త్రోప్ గ్రుమ్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన అరవింద్ కాన్పూర్ ఐఐటీనుంచి డిగ్రీ , అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. లక్ష్మణ్ నరసింహన్ స్టార్‌బక్స్ సీఈఓ 2023 ఏప్రిల్ 1న స్టార్‌బక్స్ సీఈవోగా ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ యూనివర్సిటీ ఆఫ్ పుణెలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ , యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జర్మన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఆయనకు ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్ష్టన్ స్కూల్ నుంచి ఆయన ఫైనాన్స్‌లో ఎంబీఏ పొందారు. ఇంద్రా నూయి: భారత సంతతికి చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి 12 ఏళ్ల పాటు అమెరికా దిగ్గజం పెప్సీకోకు సీఈవోగా పనిచేశారు. 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. చెన్నైకి చెందిన నూయి, 1996లో పెప్సికోలో చేరిన ఆమె 2006- 2018 వరకు సీఈఓగా పనిచేశారు. శ్రీకాంత్ దాతర్ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్. హార్వర్డ్ హార్వర్డ్ లో ఏకకాలంలో ఆర్థర్ లోవ్స్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా పనిచేసారు 2021లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీకాంత్ 1976-78లో IIMAలో మేనేజ్మెంట్లో PGP చేసారు. 1978-80 టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తో కలిసి పనిచేశారు. 1985లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం (అకౌంటింగ్)లో పీహెచ్డీ పొందారు. కార్నెగీ మెల్లన్ అండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, 1996 నుండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో IIMAలో విద్యార్థిగా, విద్యార్థి వ్యవహారాల మండలి సమన్వయకర్త (1977-78) గా పనిచేయడమే కాదు ఔట్ స్టాండింగ్ ఓవర్ ఆల్ పెర్పామెన్స్ అవార్డు' అందుకున్నారు. ఆతరువాత, IIMA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (2012-18)లో పనిచేశారు. డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా 2009లో ఆసియాలోనే పాపులర్బ్యాంకు డీబీఎస్గ్రూప్ సీఈవో డైరెక్టర్‌గా ఎంపికైనారు.ఈ గ్రూప్ ఆస్తుల విలువ 2019లో నాటికి 500 బిలియన్ల కంటే ఎక్కువ. 1960లో మీరట్‌లో జన్మించిన పీయూష్ గుప్తా ఢిల్లీలోని సెయింట్ కొలంబా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1980లో అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. ప్రముఖ కంపెనీల్లోని మరికొంతమంది భారత సంతతి సీఈవోలు వివేక్ శంకరన్- ఆల్బర్ట్సన్స్ అధ్యక్షుడు, సీఈవో సంజయ్ మెహ్రోత్రా- మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్,సీఈవో శాంతను నారాయణ్- అడోబ్ ఐఎన్‌సీ ఛైర్మన్, సీఈవో సీఎస్ వెంకట కృష్ణన్- బార్క్లేస్ సీఈవోపునిత్ రెన్జెన్- డెల్లాయిట్ సీఈవో రేవతి అద్వాతి- ఫ్లెక్స్ సీఈవో -
బీజేపీ ప్రధాని కాదు, భారత దేశ ప్రధాని
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యూఎస్ కాంగ్రెస్ నుండి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా భారత ప్రధాన మంత్రికి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న కీర్తిప్రతిష్టలు చూస్తోంటే భారతీయుడిగా చాలా గర్వాంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ విదేశీ వ్యవహారాల ఛైర్ పర్సన్ సామ్ పిట్రోడా. ఫ్యూచర్ లీడర్... ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి సహాయకులుగా వ్యవహరిస్తున్నారు సామ్ పిట్రోడా. వాషింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పర్యటన గురించి ప్రస్తావించగా రాహుల్ గాంధీకి ప్రస్తుత కార్యాచరణపై స్పష్టమైన అవగాహన ఉందని, భారత దేశంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే ఆయన ప్రయత్నం చేస్తున్నారన్నారు. పెరుగుతోన్న మోదీ క్రేజ్... త్వరలో ప్రధానమంత్రి యూఎస్ పర్యటన గురించి ప్రశ్నించగా పిట్రోడా సమాధానమిస్తూ... భారత ప్రధానికి ప్రపంచవ్యాప్తంగా లభిస్తోన్న గౌరవం చూస్తుంటే నా హృదయం కూడా ఉప్పొంగింది. భారత ప్రధాని ఎక్కడికి వెళ్ళినా ఆయనకు గొప్ప ఆదరణ లభిస్తోందని నాతో ఎవరో అన్నప్పుడు ఓ భారతీయుడిగా చాలా గర్వించాను. ప్రధాని మోదీని అందరూ గౌరవిస్తున్నారంటే అది ఆయనకు దక్కిన గౌరవం కాదు, భారత దేశానికి దక్కిన గౌరవం. ఆయన నాతో సహా 150 కోట్ల భారతీయులకు ప్రధాన మంత్రి. కేవలం బీజేపీకి మాత్రమే కాదు, అందుకే ఆయనకు ఇంతటి ఘనత, గౌరవసత్కారాలు దక్కుతున్నాయన్నారు. ఇది కూడా చదవండి: ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే... కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు -
రిషి సునాక్ విజయం: ఇన్ఫీ నారాయణమూర్తి తొలి రియాక్షన్
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎంపిక కావడంపై ఆయన మామ,ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సంతోషం ప్రకటించారు. రిషి విజయంపై సోషల్‌మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. రిషికి అభినందనలు. అతణ్ని చూసి గర్వంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ నారాణ మూర్తి ఆనందం వ్యక్తం చేశారు. యూకే అభివృద్ధి, బ్రిటన్ ప్రజల కోసం రిషి పనిచేస్తారనే విశ్వాసం తనకుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. యూకేకి తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా 42 ఏళ్ల రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధానిగా, ఈ శతాబ్దంలో యూకే ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడుగా కూడా రిషి నిలిచారు. రిషి సునాక్ తల్లి ఫార్మసిస్ట్, తండ్రి డాక్టర్. సునాక్ ఇంగ్లాండ్‌లోని పాపులర్ యూనివర్శిటీలు వించెస్టర్, ఆక్స్‌ఫర్డ్‌లో విద్య నభ్యసించారు. గోల్డ్‌మన్ సాక్స్ కంపెనీలో మూడు సంవత్సరాలు పనిచేశారు. ఆ తరువాత కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ నుండి ఎంబీఏ పట్టా పొందారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ప్రధాని రేసులో గట్టిపోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయారు. అయితే అనూహ్యంగా ప్రధాని రాజీనామాతో నెలకొన్ని పరిణామాల అనంతరం అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా 2009లో ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె అక్షితామూర్తిని రిషి సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
మోదీ@20 పుస్తకావిష్కరణ... ఒక ప్రధాని ఉండేవారంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ యూపీ సీఎం
వారణాసి: యూపీలోని వారణాసిలో రుద్రాక్ష్ కన్వెక్షన్ సెంటర్లో మోదీ@20 అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ... ఒకప్పుడూ ఒక ప్రధాని ఉండేవారంటూ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు చెప్పకుండానే ఆయనతో మోదీని పోల్చారు. ఆయనకు భిన్నంగా ప్రస్తుత ప్రధాని వారసత్వం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే భారత్‌ని ఏక్ భారత్, శ్రేష్ట భారత్‌గా మార్చాలనే సంకల్పంతో ఉన్న మోదీ భారత్‌కి లభించారంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత్ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి తెలియజేసేలా ఆదర్శంగా నిలించిందన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాద మూలాలను శాశ్వతంగా అంతం చేయడంలో ప్రధాని వెనుకాడడం లేదని కొనియాడారు. ఇదే మోదీ నాయకత్వ సామర్థ్యం అని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు సోమ్‌నాథ్ పునరుద్ధరణ కోసం రాష్ట్రపతిని పంపని ఒక ప్రధానిని చూశాం, అలాగే భవ్య శ్రీరామ నిర్మాణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధానిని కూడా చూశాం అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులలో మన ప్రధాని ఒకరు కావడం మనకు గర్వకారణమని అన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, దాదాపు వందల ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన బ్రిటన్‌ని వెనక్కినెట్టి మరీ ఈ స్థానానికి చేరుకుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్నారు. (చదవండి: గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం) -
అప్పుడు మన లెవల్ తగ్గిపోద్ది!
‘‘నేను రోజూ ఓ కొత్త విషయం నేర్చుకుంటాను. ఈ క్రమంలో ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉందన్నది నేను నేర్చుకున్న గొప్ప పాఠం’’ అన్నారు శ్రుతీహాసన్. ఇంకా మాట్లాడుతూ – ‘‘నీకు అన్నీ తెలుసు అనుకున్న రోజు వీడియో గేమ్‌లా నీ లెవల్ ఒకటికి వచ్చేస్తుంది. అందుకే అహాన్ని డౌన్ (తగ్గింపు) చేసుకుని, లెవల్ని అప్ (పెంచుకోవడం) చేసుకోవాలి. ఏదో బోధించాలని కాదు.. చెప్పాలనిపించి చెప్పాను’’ అన్నారు శ్రుతి. ఇక సినిమాలకి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తున్నారామె. బాలకృష్ణతో ఓ సినిమా సైన్ చేశారు. -
ఈ పదం సరిపోతుందో లేదో చూడు!
అవి నడిచే దైవంగా పేరు పొందిన కంచి పరమాచార్య స్వామివారు జీవించి ఉన్న రోజులు. అప్పట్లో ఒక కుటుంబం స్వామివారి దర్శనానికి వెళ్తూ తమతో పాటు అమెరికాలో నివసిస్తున్న తమ స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకువచ్చారు. ఆ స్నేహితునిది ఇంగ్లిష్ ధోరణి. ఇంగ్లిష్ మాట్లాడుతూ అమెరికన్ తరహా జీవితంతో ప్రభావితం అయ్యాడు. సన్యాసుల మీద సదభిప్రాయం లేకున్నా వీరి బలవంతం పైనే స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా భావించాడు. భాషాపాండిత్యాలు ఏమీ లేకపోయినా ఆయన్ని జగద్గురువుగా అందరూ గౌరవించడం నచ్చలేదు. ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వీరు దూరంగా నిలుచుని ఉన్నారు. అయితే వీళ్ళని చూడగానే స్వామి నుంచి పిలుపు రావడం, వారంతా స్వామివారి దగ్గరికి వెళ్ళటం క్షణాల్లో జరిగిపోయింది. ఈ కుటుంబంతో పాటు అతని స్నేహితుడు కూడా స్వామి ముందుకు వచ్చి నిలబడ్డాడు. యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్న స్వామి వచ్చిన ఆ ప్రవాసీయుడితో ‘నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు. నీకు తమిళం వచ్చు. నీ భార్య కూడా ఇక్కడే పుట్టింది కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది. కనుక మీరిద్దరూ తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా?’ అని అడిగారు. దానికి అతను, ‘మేము ఎప్పుడూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాం. మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు’ అని జవాబిచ్చాడు గర్వంగా. స్వామి వారు ‘ఓహో అలాగా! మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్కు రూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా! మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లంలోనే జరుగుతుందా? తమిళంలోనా?’’ అని అడిగారు. ‘అది కూడా ఆంగ్లంలోనే’ అన్నాడు కొంచెం విసురుగా.ఇంతలో ఒక ముసలావిడ స్వామి వారి దర్శనానికి వచ్చింది. అప్పుడు స్వామి వారు అతనికి ఆమెను చూపిస్తూ, ‘ఈమెది ఒకప్పుడు సంపన్న కుటుంబం. ఆ సంపద అంతా పోయినా మఠంపై, నాపై భక్తి ఇసుమంతైనా తగ్గలేదు. ఎంత కష్టం వచ్చినా మొక్కవోని భక్తివిశ్వాసాలను తగ్గించలేని ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు?’’ అని అడిగారు.అతను అలా ఆలోచిస్తూండిపోయాడు. స్వామి వారు మందహాసం చేసి ‘కావలసినంత సమయం తీసుకొని బదులివ్వు’ అన్నారు. చాలాసేపు అలోచించిన తరువాత కూడా అతను ఏమీ చెప్పలేకపోవడంతో ‘నేను ఒక పదం చెప్తాను. అది సరియో కాదో సరిచూసుకో. అది ‘ఎక్విపోయిస్డ్ అని అన్నారు. అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామికి సాష్టాంగం చేసి వారి పాదాలపై పడి క్షమాపణలు చెప్పి స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. భాష, ఆహార్యాన్ని బట్టి జ్ఞానాన్ని అంచనా వేయరాదు. -
బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ
హైదరాబాద్: నగరంలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. వందల మంది నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నగరంలోని మాదాపూర్ కేంద్రంగా ఏర్పాటైన సాఫ్ట్వేర్ కంపెనీ 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి చివరకు వారికి జీతలు చెల్లించకుండా చేతులెత్తేసింది. మాదాపూర్ సైబర్ గేట్‌వేలో serinux పేరుతో కంపనీ ఏర్పాటైంది. శిక్షణతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారు కంపెనీ ప్రతినిధులు. అనంతరం నెలలు గడుస్తున్న వారికి జీతం ఇవ్వక పోవడంతో ఉద్యోగులు నిలదీశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గత రెండేళ్లలో నగరంలో 9 సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడగా 1000 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. కంపెనీ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు బ్యాక్ డోర్ నియామకాలు చేసే కంపెనీలలో చేరవద్దని పోలీసులు కోరుతున్నారు. -
మాధవన్కి గర్వంగా ఉందట...ఎందుకు?
చెన్నై: క్రేజీ ప్రాజెక్టులతో సక్సెస్ పుల్ గా కరియర్‌ను సాగిస్తున్నతమిళ హీరో మాధవన్ ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లోనూ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తనయుడు చేసిన ఫీట్తోఈ విలక్షణ నటుడు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారట. తనయుడు వేదాంత్ స్విమ్మింగ్ లో సాధించిన విజయానికి తాను చాలా గర్వపడుతున్నానని శనివారు తెలిపారు. ఒక తండ్రిగా తనకుచాలా గర్వంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. . అసలువిషయం ఏమిటంటే ఓ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో మాధవన్ కొడుకు వేదాంత్ (12) ఓ రికార్డ్ సృష్టించాడు. ఖాన్ జిమ్ లో జరిగిన స్విమ్మథాన్ లో వేదాంత్.. 4 కిలో మీటర్లను 57 నిమిషాల్లోనే పూర్తి చేశాడట. దీంతో ' తండ్రిగా చాలా ప్రౌడ్ గా ఫీలయ్యే క్షణాలివి అంటూ ట్వీట్ చేశారు. . నేను ఈ ఫీట్ ను కనీసం ఊహించుకోలేను కూడా' అంటూ ట్వీట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు తన కొడుకుతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు కాగా మాధవన్ 18 సంవత్సరాల క్రితం సరితను వివాహం చేసుకున్నారు. త్రి ఇడియట్స్, తనూ వెడ్స్ మనూ లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకున్న గతేడాది సాలా ఖడూస్ సాధించిన బంపర్ విజయంతో వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ థ్రిల్లర్ "విక్రమ్ వేధ’’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే చందమామ దూర్ కే అనే హిందీ చిత్రంలోను నటిస్తున్నారు. Proud day for the Dad in Me.Vedaant swam 4 km Swimathon @ Khan Gym, in under 57 min.Something I can NEVER imagine doing. pic.twitter.com/CLSCNXSpE4 — Ranganathan Madhavan (@ActorMadhavan) February 18, 2017 -
'అవును! నేను చెంచానే.. '
ముంబయి: తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, రాజీనామా అంతకంటే అవసరం లేదని కేంద్ర సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలాని అన్నారు. ఉడ్తా పంజాబ్ చిత్రంలో మొత్తం 89 కట్ లు విధించడంపై పెద్ద దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ ఇప్పటికే కట్ లు కుదరదని, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం అని పోరాడుతుండగా ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తోడయింది. ఈ చిత్రానికి కట్ లు విధించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించింది. అయితే, తన నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిడులు లేవని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన చిత్రం విషయంలో సూటిగా సమాధానాలు ఇచ్చారు. కట్ లు చేస్తేనే చిత్ర విడుదలకు అనుమతి ఉంటుందని అన్నారు. అలాగే, మోదీ చెంచాగా నిహలాని వ్యవహరిస్తున్నారని అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు. 'అవును.. నేను మోదీ చెంచానే(శిష్యుడు).. మోదీ చెంచాగా చెప్పుకునేందుకు గర్వపడతాను. అలా కాకుండా ఓ ఇటాలియన్ ప్రధానికి చెంచాగా ఉండమంటారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. సినిమా చూస్తేగానీ ఆ చిత్ర టైటిల్లో పంజాబ్ అనే పేరు ఎందుకు తొలగించామో మీకు అర్థం కాదని అన్నారు. -
డబ్బులిస్తే... పింఛన్లు ఇప్పిస్తా
రామగుండం: డబ్బులిస్తే.. ఫించన్లు ఇప్పిస్తానంటూ పేదలు, వృద్ధులను మోసం చేయబోయిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ ప్రశాంత్ నగర్లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పింఛన్ల కోసం డబ్బుల వసూళ్లకు యత్నించిన వేణుగోపాల్ అనే యువకుడిని కార్పొరేటర్ రవి, స్థానికులు కలసి పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.