బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ
బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ
Published Wed, Jul 12 2017 3:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM
హైదరాబాద్: నగరంలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. వందల మంది నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నగరంలోని మాదాపూర్ కేంద్రంగా ఏర్పాటైన సాఫ్ట్‌వేర్ కంపెనీ 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి చివరకు వారికి జీతలు చెల్లించకుండా చేతులెత్తేసింది.
మాదాపూర్ సైబర్ గేట్‌వేలో serinux పేరుతో కంపనీ ఏర్పాటైంది. శిక్షణతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారు కంపెనీ ప్రతినిధులు. అనంతరం నెలలు గడుస్తున్న వారికి జీతం ఇవ్వక పోవడంతో ఉద్యోగులు నిలదీశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గత రెండేళ్లలో నగరంలో 9 సాఫ్ట్‌వేర్ కంపెనీలు మూతపడగా 1000 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. కంపెనీ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు బ్యాక్ డోర్ నియామకాలు చేసే కంపెనీలలో చేరవద్దని పోలీసులు కోరుతున్నారు.
Advertisement
Advertisement