సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
ఆఫీస్‌లోని యూపీఎస్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. సెలవు కావడంతో ఆఫీస్‌లో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేద. మంటలు చెలరేగడంతో మిగిలిన కార్యాలయాల్లోని సిబ్బంది కూడా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment