
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీ కంపెనీ ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల ప్రకారం..మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ బిల్డింగులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
