‘‘నేను రోజూ ఓ కొత్త విషయం నేర్చుకుంటాను. ఈ క్రమంలో ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉందన్నది నేను నేర్చుకున్న గొప్ప పాఠం’’ అన్నారు శ్రుతీహాసన్. ఇంకా మాట్లాడుతూ – ‘‘నీకు అన్నీ తెలుసు అనుకున్న రోజు వీడియో గేమ్‌లా నీ లెవల్ ఒకటికి వచ్చేస్తుంది. అందుకే అహాన్ని డౌన్ (తగ్గింపు) చేసుకుని, లెవల్‌ని అప్ (పెంచుకోవడం) చేసుకోవాలి. ఏదో బోధించాలని కాదు.. చెప్పాలనిపించి చెప్పాను’’ అన్నారు శ్రుతి. ఇక సినిమాలకి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తున్నారామె. బాలకృష్ణతో ఓ సినిమా సైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment