
డబ్బులిస్తే... పింఛన్లు ఇప్పిస్తా
రామగుండం: డబ్బులిస్తే.. ఫించన్లు ఇప్పిస్తానంటూ పేదలు, వృద్ధులను మోసం చేయబోయిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ ప్రశాంత్ నగర్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది.
పింఛన్ల కోసం డబ్బుల వసూళ్లకు యత్నించిన వేణుగోపాల్ అనే యువకుడిని కార్పొరేటర్ రవి, స్థానికులు కలసి పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.