
ప్రమాదవశాత్తు బావిలో పడిన విద్యార్థిని
కరీంనగర్ : ప్రమాదవశాత్తు హాస్టల్ విద్యార్థిని బావిలో పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలు.. సుల్తానాబాద్‌లోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటున్న అనూష(15) జ్వరం రావడంతో మూడు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లడంలేదు. శనివారం మధ్యాహ్నం హాస్టల్ దగ్గర ఉండే బావిలో ప్రమాదవశాత్తు పడింది. స్థానికంగా ఉన్న యువకులు వెంటనే స్పందించి ఆమెను రక్షించారు.
అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై వార్డెన్ సుమతిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులను అడగ్గా వార్డెన్ హాస్టల్‌కు అప్పడప్పుడు వస్తుందని చెప్పారు. వార్డన్ భర్త మొత్తం హాస్టల్ నిర్వహణ చూస్తారని విద్యార్థులు తెలిపారు.
(సుల్తానాబాద్)