sulthanabad
-
5 కోట్ల నిధులతో ఆసుపత్రి అభివృద్ధి
-
ప్రియురాలు మోసం చేసిందని..
సాక్షి, పెద్దపల్లి : ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు మధు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత వారిద్దరికి గొడవలు వచ్చాయి. ప్రేమ వ్యవహారంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్థాపం చెందిన మధు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఆత్మహత్యా యత్నానికి ముందు ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసి వాట్సప్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన ఆ యువకుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కుటుంబీకులు తెలిపారు. -
రేప్ చేసి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
-
లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి
సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ మండలకేంద్రంలోని స్వప్నా కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముత్తునూరి కొమరయ్య(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి స్వస్థలం పచ్చునూరు మండలం మానకొండూరు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సుల్తానాబాద్‌లో కార్డన్‌సెర్చ్
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. శుక్రవారం వేకువజామున జరిపిన తనిఖీల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. మార్కండేయకాలనీదిగ్బంధం చేసి, ఇంటింటినీ సోదా చేశారు. ఎలాంటి పత్రాలు లేని 20 బైక్‌లు, ఒక ఆటోను సీజ్ చేశారు. వంద లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దొంగతనాలు జరిగినా అనుమానితులు ఎవరైనా సంచరిస్తూ కనిపించినా వెంటనే సమాచారం అందించాలని కోరారు. -
ఎస్సారెస్పీ నీటి కోసం ఆందోళన
బస్సు అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు ఫర్నీచర్ ధ్వంసం సుల్తానాబాద్ : ఎస్సారెస్పీ నీటిని వదలాలని కోరుతూ సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై గురువారం టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వీరి రాస్తారోకోతో రాజీవ్‌రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు అద్దాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో డ్రైవర్ సంపత్‌కు గాయమైంది. సీఎం కేసీఆర్, మంత్రులు, కేటీఆర్, హరీష్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సారెస్పీ ఈఈ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సీఈ శంకర్‌తో విజయరమణారావు ఫోన్లో మాట్లాడగా రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం వదిలిపెడతామని, మూడు రోజులు అదనంగా ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యాలయ ధ్వంసంపై ఇన్చార్జి ఎస్ఈ, స్థానిక ఈఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ వారబంధీ ద్వారా విడుదల చేస్తామన్న అధికారుల మాటలు, చేతలకు పొంతన లేదన్నారు. డీ86, డీ84, డీ83 కెనాల్లకు 6వేల క్యూసెక్కులు వదిలితేనే కాల్వశ్రీరాంపూర్, గుంపులకు నీరు చేరుతాయని కానీ 600 నుంచి 700 క్యూసెక్కుల వదిలితే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే 70వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో కేడీసీసీ జిల్లా డైరెక్టర్ కల్లెపల్లి జాని, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్, అధికార ప్రతినిధి అమిరిశెట్టి తిరుపతి, కిశోర్, అబ్బయ్యగౌడ్, గణేష్, సతీశ్‌రెడ్డి, సతీశ్, మాజీ ఎంపీపీ గంట రాములు, పార్టీ మండలాధ్యక్షుడు శంకర్, రాజేశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, రాయమల్లు, నారాయణరెడ్డి, బైరి రవి, చందు, తిరుపతిగౌడ్, గట్టు యాదవ్, చక్రధర్, రాజలింగు పాల్గొన్నారు. -
సమ్మెతో ప్రయాణికుల ఇక్కట్లు
సుల్తానాబాద్ (కరీంనగర్): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన బంద్ కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో విజయవంతం అయ్యింది. పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలు, మినీ ట్రాలీల్లో అధిక డబ్బులు చెల్లించి గమ్యస్థానాలకు చేరారు. రాజీవ్ రహదారిపై ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కనీస వేతనం రూ.15 వేలకు తగ్గకుండా ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడారి సునీల్, భార్గవి, మేఘమాల, శ్రీనివాస్ ఉన్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడిన విద్యార్థిని
కరీంనగర్ : ప్రమాదవశాత్తు హాస్టల్ విద్యార్థిని బావిలో పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలు.. సుల్తానాబాద్‌లోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటున్న అనూష(15) జ్వరం రావడంతో మూడు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లడంలేదు. శనివారం మధ్యాహ్నం హాస్టల్ దగ్గర ఉండే బావిలో ప్రమాదవశాత్తు పడింది. స్థానికంగా ఉన్న యువకులు వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై వార్డెన్ సుమతిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులను అడగ్గా వార్డెన్ హాస్టల్‌కు అప్పడప్పుడు వస్తుందని చెప్పారు. వార్డన్ భర్త మొత్తం హాస్టల్ నిర్వహణ చూస్తారని విద్యార్థులు తెలిపారు. (సుల్తానాబాద్) -
విద్యార్థులతో పాటు భోజనం చేసిన మంత్రి
కరీంనగర్: ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో ప్రారంభించిన సన్నబియ్యం పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . ఈ పథకం సక్రమంగా అమలు చేయడానికి మార్చి నెల నుంచి 50 మెట్రిక్ టన్నల బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి చెప్పారు. మంగళవారం ఆయన కరీనంగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలోని పాఠశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠ శాలలో మరామ్మత్తులు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.