- బస్సు అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు
- రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
- ఫర్నీచర్ ధ్వంసం
ఎస్సారెస్పీ నీటి కోసం ఆందోళన
Published Thu, Aug 25 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
సుల్తానాబాద్ : ఎస్సారెస్పీ నీటిని వదలాలని కోరుతూ సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై గురువారం టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వీరి రాస్తారోకోతో రాజీవ్‌రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు అద్దాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో డ్రైవర్ సంపత్‌కు గాయమైంది. సీఎం కేసీఆర్, మంత్రులు, కేటీఆర్, హరీష్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సారెస్పీ ఈఈ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సీఈ శంకర్‌తో విజయరమణారావు ఫోన్‌లో మాట్లాడగా రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం వదిలిపెడతామని, మూడు రోజులు అదనంగా ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యాలయ ధ్వంసంపై ఇన్‌చార్జి ఎస్‌ఈ, స్థానిక ఈఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ వారబంధీ ద్వారా విడుదల చేస్తామన్న అధికారుల మాటలు, చేతలకు పొంతన లేదన్నారు. డీ86, డీ84, డీ83 కెనాల్‌లకు 6వేల క్యూసెక్కులు వదిలితేనే కాల్వశ్రీరాంపూర్, గుంపులకు నీరు చేరుతాయని కానీ 600 నుంచి 700 క్యూసెక్కుల వదిలితే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే 70వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో కేడీసీసీ జిల్లా డైరెక్టర్ కల్లెపల్లి జాని, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్, అధికార ప్రతినిధి అమిరిశెట్టి తిరుపతి, కిశోర్, అబ్బయ్యగౌడ్, గణేష్, సతీశ్‌రెడ్డి, సతీశ్, మాజీ ఎంపీపీ గంట రాములు, పార్టీ మండలాధ్యక్షుడు శంకర్, రాజేశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, రాయమల్లు, నారాయణరెడ్డి, బైరి రవి, చందు, తిరుపతిగౌడ్, గట్టు యాదవ్, చక్రధర్, రాజలింగు పాల్గొన్నారు.
Advertisement
Advertisement