సాక్షి, పెద్దపల్లి : ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు మధు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత వారిద్దరికి గొడవలు వచ్చాయి. ప్రేమ వ్యవహారంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్థాపం చెందిన మధు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఆత్మహత్యా యత్నానికి ముందు ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసి వాట్సప్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన ఆ యువకుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కుటుంబీకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment