love affire
-
కూతురి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు
-
ప్రియురాలు మోసం చేసిందని..
సాక్షి, పెద్దపల్లి : ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు మధు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత వారిద్దరికి గొడవలు వచ్చాయి. ప్రేమ వ్యవహారంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్థాపం చెందిన మధు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఆత్మహత్యా యత్నానికి ముందు ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసి వాట్సప్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన ఆ యువకుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కుటుంబీకులు తెలిపారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి ఇంటి ముందే..
చెన్నై: ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఆమె ఇంటి వద్దే ఓ యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని అన్నానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కన్యాకుమారి జి ల్లా ఇరణియల్ సమీపం తింగల్‌నగర్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ (29) మినీ బస్సు డ్రైవర్. ప్రేమ వివాహం చేసుకున్న ఇతనికి సునిప్రియా (25) అనే భార్య, బిడ్డ ఉంది. ప్రదీప్ డ్రైవర్‌గా పని చేస్తున్న మినీ బస్సులో ఓ యువతి రోజు కళాశాలకు వెళ్లి వచ్చేది. దీంతో ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా ప్రదీప్‌కు అప్పటికే వివాహం జరిగి బిడ్డ ఉన్నట్లు ఆ యువతికి తెలిసింది. దీంతో ప్రదీప్‌ను దూరం పెట్టింది. అయినప్పటికీ ప్రదీప్ ఆమెను కలుసుకొని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. విద్యార్థిని ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడి చేశాడు. దీనిపై సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కులచ్చల్ పోలీసులు ప్రదీప్‌ను పిలిచి మందలించి పంపారు. ఈ స్థితిలో ప్రదీప్ తక్కలై సమీపంలోని యువతి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. యువతి ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆమె ఇంటి ముందే శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన స్థానికులు మంటలను ఆర్పి ప్రదీప్‌ను చికిత్స కోసం ఆసారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రదీప్ మృతి చెందాడు. తక్కలై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ఇక నో సీక్రెట్
తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నటాషా దలాల్‌తో వరుణ్ ధావన్ లవ్‌లో ఉన్నారని ఎప్పట్నుంచో బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. వరుణ్, నటాషా కెమెరా కంట పడకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, థియేటర్స్‌కు సీక్రెట్‌గా వెళుతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్స్‌కి ఫుల్స్టాప్ పెట్టిందీ జంట. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా రిసెప్షన్ వేడుకకు వీరిద్దరూ జోడీగా హాజరయ్యారు. దీంతో ఇక నో సీక్రెట్స్ అని చెప్పకనే చెప్పారు వరుణ్ అండ్ నటాషా. ఇలా జంటగా నలుగురికీ కనిపించడంతో వరుణ్, నటాషా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబో తున్నారన్న కొత్త రాగం బాలీవుడ్లో మొద లైంది. రీసెంట్గా తాను హీరోగా నటించిన ‘అక్టోబర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఏడాదిలో వివాహం చేసుకుంటానేమోనని వరుణ్ చెప్పడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ‘కళంక్’ సినిమాలో నటిస్తున్నారు వరుణ్«. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం ఆయన స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. -
ప్రేమ వ్యవహారంపై పెదవి విప్పిన నటి
చెన్నై : ఆయనకు నేను, నాకు ఆయన అంటోంది నటి ఓవియ. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న తరవాత ఈ అమ్మడి క్రేజే వేరు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించినా రాని పాపులారిటీ బిగ్‌బాస్ గేమ్ షోతో వచ్చిపడింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌తో ఆయన తాజా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అయితే ఈ బ్యూటీ గురించి చాలా గ్యాసిప్స్ ప్రచారం అవుతున్నాయి. ఆమెతో పాటు బిగ్‌బాస్ గేమ్‌షోలో పాల్గొన్న నటుడు ఆరవ్తో కలిపి వదంతులు హోరెత్తుతున్నాయి. వీటి గురించి ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన భేటీలో ఓవియ వివరణ ఇచ్చింది. తనకు పలు అకాశాలు వస్తున్న మాట నిజమేనని, అయితే ఒకే సమయంలో పలు చిత్రాలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. తాను ఆదాయం కోసం ప్రయత్నించి మోడలింగ్ రంగంలోకి వెళ్లానని చెప్పింది. ఆ తరువాత కళవాణి చిత్రంలో నటించే అవకాశం రావడంతో సినీరంగానికి పరిచయం అయ్యానని తెలిపింది. ప్రస్తుతం తాను లారెన్స్‌తో చేస్తున్న ఒక్క చిత్రాన్నే అంగీకరించానని చెప్పింది. ఇక నటుడు ఆరమ్‌తో ప్రేమ వ్యవహారం గురించి జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ తనకు ఒక పార్ట్నర్ ఉన్నాడని, ఆయనకు తాను, తనకు ఆయన అంటూ తెలివిగా బదులిచ్చి ఆ ఆయన ఎవరన్నది చెప్పకుండానే మాట దాటవేసింది. -
విషాదాంతంగా ముగిసిన ప్రేమ వ్యవహారం
హైదరాబాద్ : హైదరాబాద్ తిరుమలగిరిలో ఓ ప్రేమ వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. లోతుకుంటలోని సరస్వతీనగర్ నివాసి భాగ్యశ్రీ రెడ్డి ఓ ప్రయివేట్ పాఠశాలలో టీచర్. సంవత్సర కాలంగా ఆమె వైజాగ్‌కు చెందిన గీతాకృష్ణతో ప్రేమ వ్యవహారం కొనసాగింది. భాగ్యశ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతుండగా.. గీతాకృష్ణ ఎంటెక్ చేస్తున్నాడు. అయితే వీరి ప్రేమను గీతాకృష్ణ పేరెంట్స్ అంగీకరించలేదు. ఆరు నెలలుగా తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై భాగ్యశ్రీ ఒత్తిడి తీసుకు రావటంతో గీతాకృష్ణ కనిపించకుండా పోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటానన్న గీతాకృష్ణ మాట మార్చడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని భాగ్యశ్రీ తల్లిదండ్రులు ఆరోపించారు. గీతాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీతాకృష్ణ తనను మోసం చేశాడంటూ భాగ్యశ్రీరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పారని..
*ఇద్దరిపై గాజు పెంకులతో బాలుడి స్నేహితుల దాడి.. *ఒకరికి చాతిపై, మరొకరికి పొట్టపై గాయాలు విజయవాడ : తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పారనే కోపంతో ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి ఇద్దరు యువకులపై గాజు పెంకులతో దాడిచేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కథనం ప్రకారం... సత్యానారాయణపురం బుడమేరు మధ్యకట్టపై నివసించే బాలుడు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన పాపారావు, రామారావు అనే యువకులు చూశారు. ఈ విషయాన్ని వెంటనే వారు ఆ బాలుడి బాబాయికి తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని మందలించారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి స్నేహితులు వెంటనే పాపారావు, రామారావులతో గొడవకు దిగారు. వివాదం కాస్తా శ్రుతిమించటంతో బాలుడి స్నేహితుడు ఒకరు గ్రౌండ్లో దొరికిన గాజు పెంకుతో పాపారావు పొట్టపైన, రామారావు మెడపైనా దాడిచేశాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో నలుగురు... తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉన్నారు. దీంతో ఈ వయసులో ప్రేమ పేరుతో గొడవలకు దిగడంపై పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు.