
చెన్నై : ఆయనకు నేను, నాకు ఆయన అంటోంది నటి ఓవియ. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న తరవాత ఈ అమ్మడి క్రేజే వేరు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా రాని పాపులారిటీ బిగ్‌బాస్ గేమ్ షోతో వచ్చిపడింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌తో ఆయన తాజా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అయితే ఈ బ్యూటీ గురించి చాలా గ్యాసిప్స్ ప్రచారం అవుతున్నాయి. ఆమెతో పాటు బిగ్‌బాస్ గేమ్‌షోలో పాల్గొన్న నటుడు ఆరవ్‌తో కలిపి వదంతులు హోరెత్తుతున్నాయి. వీటి గురించి ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన భేటీలో ఓవియ వివరణ ఇచ్చింది.
తనకు పలు అకాశాలు వస్తున్న మాట నిజమేనని, అయితే ఒకే సమయంలో పలు చిత్రాలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. తాను ఆదాయం కోసం ప్రయత్నించి మోడలింగ్ రంగంలోకి వెళ్లానని చెప్పింది. ఆ తరువాత కళవాణి చిత్రంలో నటించే అవకాశం రావడంతో సినీరంగానికి పరిచయం అయ్యానని తెలిపింది. ప్రస్తుతం తాను లారెన్స్‌తో చేస్తున్న ఒక్క చిత్రాన్నే అంగీకరించానని చెప్పింది. ఇక నటుడు ఆరమ్‌తో ప్రేమ వ్యవహారం గురించి జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ తనకు ఒక పార్ట్‌నర్ ఉన్నాడని, ఆయనకు తాను, తనకు ఆయన అంటూ తెలివిగా బదులిచ్చి ఆ ఆయన ఎవరన్నది చెప్పకుండానే మాట దాటవేసింది.