నువ్విలాంటి సినిమా చేయడమేంటి? | Oviya Being Trolled For Her Upcoming Movie Trailer Having Explicit Content | Sakshi
Sakshi News home page

చాలా అప్‌సెట్‌ అయ్యాం..

Published Sat, Feb 9 2019 3:10 PM | Last Updated on Sat, Feb 9 2019 3:26 PM

Oviya Being Trolled For Her Upcoming Movie Trailer Having Explicit Content - Sakshi

చెన్నై : తమిళ హీరోయిన్‌ ఓవియాపై ప్రస్తుతం ఆమె అభిమానులతో పాటు, సినీ విమర్శకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ నుంచి ఇలాంటి సినిమాలు ఊహించలేదు అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. ఓవియా నటించిన 90 ఎంఎల్‌ అనే సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. మొదట వుమెన్‌-సెంట్రిక్‌గా తెరకెక్కుతున్న సినిమాగా 90ఎంఎల్‌ను ప్రచారం చేశారు.

అయితే ట్రైలర్‌ చూసిన ప్రేక్షకులు మాత్రం.. ‘ఇది చాలా చెండాలంగా ఉంది. మీరు అడల్డ్‌ సినిమా చేయడమేమిటి’ అని ఓవియాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘యువతను పెడదారి పట్టించి డబ్బులు సంపాదించడానికి ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా బాధాకరం. ఇలాంటి వాటిని నిషేధించాలి. నువ్వు అందరిలాంటి దానివి కాదు. ఎంతోమంది యువతులు నిన్ను అనుకరిస్తారు. అలాంటి వారికి నువ్విచ్చే సందేశం ఇదేనా. సారీ ఓవియా చాలా అప్‌సెట్‌ అయ్యాం’ అని ట్విటర్‌ వేదికగా ఆమెను విమర్శిస్తున్నారు.

కాగా అభిమానుల కామెంట్లకు స్పందించిన ఓవియా.. ‘చూడండి. పండు రుచి చూడబోతూ విత్తనం ఎలా ఉంటుందో నిర్ణయించేయకండి. సినిమా విడులయ్యేదాకా ఆగండి. అప్పటి వరకు ఈ ట్రైలర్‌ ఎంజాయ్‌ చేయండి’ అని విషయాన్ని చాలా లైట్‌ తీసుకుంది. ఇక తమిళ బిగ్‌బాస్‌ షో ద్వారా ప్రాచుర్యం పొందిన ఓవియా నిరంతరం ఏదో ఒక కారణంతో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది.  ఆ షోలో తనతో పాల్గొన్న ఆరవ్‌తో ఈమె ప్రేమలో పడినట్లుగా వదంతులు ప్రచారమవుతున్నాయి. అయితే అదేమీ లేదని ఓవియా కొట్టిపారేసింది. ప్రస్తుతం 90 ఎంఎల్‌తో పాటుగా కలవాని-2, కాంచన-3 చిత్రాల్లో ఆమె నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement