బిగ్‌ బాస్‌ చరిత్రలో ఇలాంటి పని చేసింది ఆమె మాత్రమే | Tamil Bigg Boss Fame Oviya Reacted To Rumours About That She Is Lesbian And Her Marriage - Sakshi
Sakshi News home page

Oviya On Her Marriage Rumours: బిగ్‌ బాస్‌ చరిత్రలో ఇలాంటి పని చేసింది ఆమె మాత్రమే.. నేను ఏ బిడ్డకు జన్మనివ్వలేదు

Published Tue, Aug 29 2023 5:30 PM | Last Updated on Wed, Sep 6 2023 10:09 AM

Bigg Boss Fame Oviya Opened His Lesbian Comments - Sakshi

బిగ్ బాస్ ద్వారా స్టార్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రతి భాషలోనూ, ప్రతి సీజన్‌లోనూ అలాంటి స్టార్లు ఉంటారు. వారిలో నటి ఓవియా ఒకరు. మలయాళీ అయిన ఓవియా తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్‌తో అలరించింది. ఓవియాకు దక్కిన పాపులారిటీ తమిళంలో మరే బిగ్‌బాస్ స్టార్‌కి లేదన్నది నిజం. అప్పట్లో ఓవియా కోసం చాలా ఆర్మీ గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ ఇమేజ్‌ ద్వారా తమిళ, మలయాళంలో అమెకు పలు సినిమా అవకాశాలు కూడా దక్కాయి. ఇప్పటి వరకు సుమారు 25 సినిమాలకు పైగా నటించిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం 'ఇది నా లవ్ స్టోరీ' అనే మూవీలో మాత్రమే మెరిసింది.

(ఇదీ చదవండి: బస్‌ డిపోలో రజనీకాంత్‌ సందడి.. ఫోటోలు వైరల్‌)

తమిళ బిగ్‌బాస్‌ చరిత్రలో ఓవియా ఒక సంచలనమే అని చెప్పాలి. ఆ షోలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద దుమారమే రేగింది. ఇలా బిగ్‌బాస్‌ చరిత్రలో జరగడం ఇదే తొలిసారి. దాంతో ఓవియా తమిళంలో సంచలనంగా మారింది. ఆ అలజడి కొద్దిరోజుల్లోనే ముగిసినా ఆమెకు ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె చూయిగం అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. ఈ సీరిస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓవియా వివాహం గురించి పలు వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు)

గతంలో ఓవియా పెళ్లిపై చాలా గాసిప్స్ వచ్చాయి. ఓవియా లెస్బియన్ కాబట్టి పెళ్లి చేసుకోలేదని ఒకప్పుడు ప్రచారం జరిగింది. దీన్ని ఓవియా తాజాగ ఖండించింది. 'నేను లెస్బియన్‌ని కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్‌ ఏమీ లేవు. అంతే కాకుండా ఇప్పుడు పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. ఇప్పుడే కాదు, నా జీవితంలో ఇలాంటివి జరుగుతాయో లేదో కూడా తెలియదు. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి అని నేనెప్పుడూ భావించలేదు. అందరూ అనుకుంటున్నట్లు నేను ఏ బిడ్డకు జన్మనివ్వలేదు. నేను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను. పెళ్లయ్యాక బిడ్డను కనాలనే ఆలోచన కూడా నాకు లేదు. పెళ్లయ్యాక ఒత్తిడిలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. నేను అలా ఉండాలనుకోను. నేను నా కోసమే జీవిస్తున్నాను' అని ఓవియా తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement