
బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి కొత్త హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. గత ఏడు సీజన్స్ కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఈ సారి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపించారు. హోస్ట్‌గా అందరితో నవ్వులు పూయించారు.
అయితే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ హౌస్‌లో అడుగుపెట్టారు. గతంలో నటి మహాలక్ష్మిని పెళ్లాడిన ఆయన పలుసార్లు వార్తల్లో నిలిచారు. వీరిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు.
గతంలో ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన రవీందర్ చంద్రశేఖరన్ తాజా తమిళ సీజన్‌లో బిగ్‌బాస్ హోస్‌లో అడుగుపెట్టారు. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది కొత్త హోస్ట్ విజయ్ సేతుపతి రావడంతో తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
#பிக்பாஸ் இல்லத்தில்.. #Fatman 😎 Bigg Boss Tamil Season 8 #GrandLaunch - இப்போது ஒளிபரப்பாகிறது.. நம்ம விஜய் டிவில.. #Nowshowing #BiggBossTamilSeason8 #TuneInNow #VijayTelevision #VJStheBBhost #VijaySethupathi #AalumPudhusuAattamumPudhusu #BiggBossTamil pic.twitter.com/LvYMbNhS1C
— Vijay Television (@vijaytelevision) October 6, 2024
Comments
Please login to add a commentAdd a comment