Ravinder Chandrasekaran
-
బిగ్‌బాస్ హౌస్‌లో బిగ్‌మ్యాన్.. ఫ్యాన్స్‌ను మెప్పిస్తాడా?
బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి కొత్త హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. గత ఏడు సీజన్స్ కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఈ సారి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపించారు. హోస్ట్‌గా అందరితో నవ్వులు పూయించారు. అయితే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ హౌస్‌లో అడుగుపెట్టారు. గతంలో నటి మహాలక్ష్మిని పెళ్లాడిన ఆయన పలుసార్లు వార్తల్లో నిలిచారు. వీరిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు.గతంలో ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన రవీందర్ చంద్రశేఖరన్ తాజా తమిళ సీజన్లో బిగ్‌బాస్ హోస్లో అడుగుపెట్టారు. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది కొత్త హోస్ట్ విజయ్ సేతుపతి రావడంతో తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై మరింత ఆసక్తి పెరిగింది. #பிக்பாஸ் இல்லத்தில்.. #Fatman 😎 Bigg Boss Tamil Season 8 #GrandLaunch - இப்போது ஒளிபரப்பாகிறது.. நம்ம விஜய் டிவில.. #Nowshowing #BiggBossTamilSeason8 #TuneInNow #VijayTelevision #VJStheBBhost #VijaySethupathi #AalumPudhusuAattamumPudhusu #BiggBossTamil pic.twitter.com/LvYMbNhS1C— Vijay Television (@vijaytelevision) October 6, 2024 -
నిర్మాత రవీందర్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఇంట్లీ ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. సుమారు రెండేళ్ల క్రితం నటి మహాలక్ష్మి శంకర్‌తో వివాహం అయిన తర్వాత ఆయన పేరు బాగా పాపులర్ అయింది. అయితే, కొంత కాలం క్రితం రూ. 16 కోట్ల వరకు ఒక వ్యాపారవేత్తను మోసం చేసినందుకు గాను ఆయన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వారు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆపై ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.లిబ్రా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ అధినేత అయిన రవీందర్ చంద్రశేఖరన్ ఇంట్లో తాజాగా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం రవీందర్ చంద్రశేఖర్ చెన్నైలోని అశోక్ నగర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రవీందర్ ఇంట్లో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.మునిసిపల్ సాలిడ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టేందుకు బాలాజీ అనే వ్యక్తితో రూ. 16 కోట్లు ఇన్వెస్ట్ చేపించిన రవీందర్ ఆపై అతన్ని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ కేసులు జైలుకు వెళ్లిన ఆయన ప్రస్తుతం బెయిల్ మీదు ఉన్నారు. తాజాగా రూ. 16 కోట్ల మోసం కేసులో అక్రమ నగదు మార్పిడికి సంబంధించిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాల తర్వాత ఏవైనా ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. -
అర్ధరాత్రి భర్త చేసిన పనికి బుల్లితెర నటి ఎమోషనల్..!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవలే బెయిల్‌పై రిలీజై వచ్చారు కూడా. ఆ తర్వాత తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై రివ్యూలు ఇస్తూ అభిమానులను అలరించారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ రవీందర్ భార్య మహాలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అర్ధరాత్రి కేక్ తీసుకొచ్చి భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహాలక్ష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతే ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మహాలక్ష్మి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ పుట్టినరోజు తీవ్ర భావోద్వేగాలతో నిండిపోయింది. నా భర్త అర్ధరాత్రి నన్ను నిద్రలేపి కేక్‌తో సర్ప్రైజ్ ఇచ్చారు. అతన్ని భర్తగా కలిగి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అమ్మ, సోదరుడు నన్ను మానసిక వికలాంగుల కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలకు అన్న దానం చేశాం. ఇది నా గుండెకు హత్తుకునే అనుభవం. ముఖ్యంగా మా అమ్మ, చిన్న సోదరుడు చోటేకి ధన్యవాదాలు. మా నాన్న బంగ్లాదేశ్ నుంచి విష్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. అన్ని సమయాల్లో అండగా నిలిచిన మామయ్యకు ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేకమైంది. మీ అందరు నా చుట్టూ ఉన్నందుకు సంతోషంగా ఉన్నా. ఈ రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు సమయాన్ని వెచ్చించినందుకు నా కుటుంబం, స్నేహితులందరికీ, నన్ను ప్రేమించే వారికి కృతజ్ఞతలు' అంటూ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మహాలక్ష్మికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా నటి మహాలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానానికి ఆమె ముందుకొచ్చారు. నేను చనిపోయాక కూడా నా ఆర్గాన్ ఇతరుల రూపంలో బతికే ఉంటాయని ఆమె తెలిపారు. నేను ఒక అవయవ దాతగా మారి ఇతరుల జీవితాల్లో వెలుగులు తీసుకురాగలననే నమ్మకంతో ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. నా నిర్ణయంతో అవసరమైన వారికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Pephands (@pephands_org) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
మరోసారి తెరపైకి నిర్మాత రవీందర్.. ఈసారి ఏకంగా ఆక్సిజన్‌తో!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవలే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. అయితే ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన రవీందర్ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు. తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై రివ్యూలు ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్‌లో వీడియో చూస్తే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా వీడియోలో ఏకంగా ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని మరీ కనిపించారు. అంతే కాకుండా అనారోగ్యంతోనే బిగ్‌బాస్ ఎపిసోడ్‌పై తన రివ్యూ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ మీ పట్టుదల సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్.. బిగ్‌బాస్ రివ్యూలు ఎప్పుడైన ఇవ్వొచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వెల్లడించారు. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకున్నట్లు రవీందర్ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్స్ ఆరోగ్యం సహకరించనప్పుడు వీడియోలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించిన రవీందర్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. -
నేను ఏ తప్పూ చేయలేదు.. ఏడ్చేసిన మహాలక్ష్మి భర్త
చీటింగ్ కేసులో అరెస్టయిన తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే తనను అన్యాయంగా కేసులో ఇరికించాడని వాపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు. 'నాకు మా అమ్మ తర్వాత మహాలక్ష్మి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె నాకు దొరికిన వరం. మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. ట్రోలర్స్ ఎన్నైనా అనుకోండి.. ఎంతైనా తిట్టుకోండి. కానీ మమ్మల్ని వేరు చేయలేరు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినప్పుడు కింద కూర్చోమన్నారు. కానీ అందరికీ వారి శరీరం సహకరించినట్లుగా నా బాడీ నాకు సహకరించదు. నేను చెప్పేది కూడా వినకుండా అరెస్ట్ చేసి లాక్కెళ్లారు. నేను ఏ తప్పూ చేయలేదు. నా మీద ఫిర్యాదు చేసిన వ్యక్తే అనేక తప్పుడు పనులు చేశాడు, దొంగతనాలు చేశాడు. అవన్నీ నాకు తెలిసిపోవడంతో నామీదే తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. నేను అతడిని వదిలిపెట్టను. తన బండారం మొత్తం బయటపెడతాను, దోషిగా నిరూపిస్తాను' అంటూ ఏడ్చేశాడు రవీందర్. ఏ కేసులో అరెస్ట్ అయ్యాడంటే? వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మించాడు రవీందర్. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి దగ్గరి నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020లో సెప్టెంబర్ 17న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత రవీందర్ ప్రాజెక్ట్‌ను పక్కన పడేశాడని, కనీసం తన డబ్బు తిరిగివ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదని బాలాజీ వాదన. దీంతో అతడు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే అతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) చదవండి: తన టైమ్ బాగుందంటోన్న నేషనల్ క్రష్ -
అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు: బుల్లితెర నటి తీవ్ర ఆరోపణలు!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే చీటింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అయితే గతేడాది బుల్లితెర నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల భర్త జైలుకు వెళ్లినప్పటికీ ఎప్పటిలాగే ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. దీంతో భర్త జైల్లో ఉంటే మీకిది అవసరమా నెటిజన్స్ ఆమెను తప్పుపడుతున్నారు. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) అయితే తాజాగా వీరిద్దరి వ్యవహారం కోలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రవీందర్ జైలులో ఉండగా.. ఆయన భార్య మహాలక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఈ విషయాలన్నీ తనకు చెప్పలేదని బంధువులతో వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి మాట్లాడుతూ..'పెళ్లికి ముందు ఇలాంటి విషయాలు నాకు తెలియవు. రవీందర్ కూడా సమస్యలుని అనే విషయం చెప్పలేదు.. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు' అంటూ తన భర్త రవీందర్ గురించి సన్నిహితుల ముందు చెప్పింది. ప్రస్తుతం ఈ విషయంలో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రవీందర్ జైలుకెళ్లడం వల్ల అతని భార్య మహాలక్ష్మి ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా కొందరు చెబుతున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా.. ఓ వైపు ఆమెకు ఇప్పటికే పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె అనిల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను మోసం కేసులో అరెస్టవడంతో మహాలక్ష్మి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. కాగా.. ఇటీవలే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
భర్త జైల్లో ఉంటే ఫోటోషూట్స్‌తో బిజీగా ఉన్న మహాలక్ష్మి!
కోలీవుడ్‌లో నటి మహాలక్ష్మి- నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ జంట వెరీ పాపులర్.. వీరిద్దరూ కలిసి ఫోటో దిగినా, వీడియోలు షేర్ చేసినా ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఆదర్శ దంపతులని కొందరు కితాబిస్తే.. డబ్బు కోసమే అతడిని పెళ్లి చేసుకుందని మరికొందరు విమర్శిస్తుంటారు. ఇకపోతే ఇటీవలే చీటింగ్ కేసులో రవీందర్ అరెస్టయిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆయన ఇంకా జైల్లోనే ఉన్నాడు. భర్త జైల్లో.. భార్య ఫోటోషూట్స్‌తో బిజీలో ఇటువంటి సమయంలో మహాలక్ష్మి చేసిన పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భర్త జైల్లో ఉంటే నటి ఫోటోషూట్లతో బిజీగా ఉంది. వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటోంది. అంతా మంచే జరుగుతుంది.. నా హృదయం నీకోసమే ఎదురుచూస్తోంది అని వాటికి క్యాప్షన్ జోడించింది. క్యాప్షన్ బాగానే ఉన్నా మహాలక్ష్మి ఫోటోషూట్, అందులో ఆమె సరదాగా చిరునవ్వులు ఒలికించడం చూస్తే ఏదో తేడా కొడుతోందంటున్నారు కొందరు నెటిజన్లు. పెళ్లికంటే ముందే డీల్ నిజంగానే మహాలక్ష్మి డబ్బు కోసమే అతడిని పెళ్లాడి, ఇప్పుడు కావాలనే తనని జైలుకు పంపించిందా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే నటి అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వీరు చాలాకాలంగా ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి మాత్రం గతేడాదే జరిగిందని.. దానికంటే ముందే ఈ ప్రాజెక్ట్ గురించి ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. నిర్మాత అరెస్ట్.. కారణమేంటంటే.. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మబలికించాడు రవీందర్. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి దగ్గరి నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020లో సెప్టెంబర్ 17న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత రవీందర్ ప్రాజెక్ట్‌ను పక్కన పడేశాడు. పోనీ, తన డబ్బు తిరిగివ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదు. దీంతో బాలాజీ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) చదవండి: మీరా సూసైడ్.. కంటతడి పెట్టిస్తున్న విజయ్ ఆంటోని భార్య మాటలు.. -
నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. గత ఏడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నిర్మాత రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వారు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ది హిందూ ప్రకారం, ఘన వ్యర్థాల నుంచి ఒక ప్రాజెక్ట్ (విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా) పెట్టుబడి పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని ఆయన నమ్మపలికాడు. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని చేశాడు. అందుకు గాను అతని నుంచి రూ. 15.83 కోట్లు తీసుకున్నాడని సమాచారం. వారిద్దరి మధ్య ఈ ఒప్పందం సెప్టెంబర్ 17, 2020న జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ రవీందర్ మొదట చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడు. (ఇదీ చదవండి; సీరియల్స్‌లో జగతినే.. అక్కడ మాత్రం తన ఫోటోలు వైరల్) దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రశ్నంచగా రవీందర్ నుంచి సరైన సమాధానం లభించలేదని తెలుస్తోంది. దీంతో రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలాజీ భావించారు. రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో బాలాజీ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. రవీందర్ చంద్రశేఖరన్ ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో విజయ్ అనే తన స్నేహితుడి నుంచి రూ. 15 లక్షలు తీసుకుని, ఒక సినిమా నిర్మాణంలో భాగం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే కేసు కూడా రవీందర్‌పై ఉంది. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) -
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!
ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే నటి మహాలక్ష్మి శంకర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో చాలా మంది ట్రోల్స్ చేశారు కూడా. మహాలక్ష్మి డబ్బు కోసమే నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. దీనిపై స్వయంగా మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. అయితే ట్రోల్స్‌ను ఈ జంట పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరోసారి రవీందర్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. నిర్మాత రవీందర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. (ఇది చదవండి: ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!) రవీందర్ చంద్రశేఖరన్ తమిళంలో చాలా సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం రవీందర్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చెన్నైలో రవీందర్‌పై కేసు నమోదైంది. దాదాపు రూ.15 లక్షలు తీసుకుని స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి రవీందర్‌తో కలిసి సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని విజయ్‌కి రవీందర్ హామీ ఇచ్చారు. దీంతో విజయ్ తన వాటాగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆన్లైన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రవీందర్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో విచారణకు హాజరయ్యారు. (ఇది చదవండి: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?)