కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. గత ఏడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నిర్మాత రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వారు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.
ది హిందూ ప్రకారం, ఘన వ్యర్థాల నుంచి ఒక ప్రాజెక్ట్ (విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా) పెట్టుబడి పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని ఆయన నమ్మపలికాడు. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని చేశాడు. అందుకు గాను అతని నుంచి రూ. 15.83 కోట్లు తీసుకున్నాడని సమాచారం. వారిద్దరి మధ్య ఈ ఒప్పందం సెప్టెంబర్ 17, 2020న జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ రవీందర్ మొదట చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడు.
(ఇదీ చదవండి; సీరియల్స్‌లో జగతినే.. అక్కడ మాత్రం తన ఫోటోలు వైరల్)
దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రశ్నంచగా రవీందర్ నుంచి సరైన సమాధానం లభించలేదని తెలుస్తోంది. దీంతో రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలాజీ భావించారు. రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో బాలాజీ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు.
లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. రవీందర్ చంద్రశేఖరన్ ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో విజయ్ అనే తన స్నేహితుడి నుంచి రూ. 15 లక్షలు తీసుకుని, ఒక సినిమా నిర్మాణంలో భాగం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే కేసు కూడా రవీందర్‌పై ఉంది.
(ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్)
Comments
Please login to add a commentAdd a comment