అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు: బుల్లితెర నటి తీవ్ర ఆరోపణలు! | Mahalakshmi Comments Viral On Ravinder Chandrasekar After Arrest | Sakshi
Sakshi News home page

Mahalakshmi: మొదటి భర్తతో విడాకులు.. మళ్లీ మోసపోయా: రవీందర్‌పై తీవ్ర ఆరోపణలు!

Published Fri, Sep 29 2023 6:58 PM | Last Updated on Fri, Sep 29 2023 7:15 PM

Mahalakshmi Comments Viral On Ravinder Chandrasekar After Arrest - Sakshi

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే చీటింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్‌ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అయితే గతేడాది బుల్లితెర నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ‍అయితే ఇటీవల భర్త జైలుకు వెళ్లినప్పటికీ ఎప్పటిలాగే ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. దీంతో భర్త జైల్లో ఉంటే మీకిది అవసరమా నెటిజన్స్ ఆమెను తప్పుపడుతున్నారు. 

(ఇది చదవండి: 'హ్యాపీ బర్త్‌ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!)

అయితే తాజాగా వీరిద్దరి వ్యవహారం కోలీవుడ్‌లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రవీందర్ జైలులో ఉండగా.. ఆయన భార్య మహాలక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఈ విషయాలన్నీ తనకు చెప్పలేదని బంధువులతో వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

మహాలక్ష్మి మాట్లాడుతూ..'పెళ్లికి ముందు ఇలాంటి విషయాలు నాకు తెలియవు. రవీందర్ కూడా సమస్యలుని అనే విషయం చెప్పలేదు.. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు' అంటూ తన భర్త రవీందర్‌ గురించి సన్నిహితుల ముందు చెప్పింది. ప్రస్తుతం ఈ విషయంలో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రవీందర్ జైలుకెళ్లడం వల్ల అతని భార్య మహాలక్ష్మి ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా కొందరు చెబుతున్నారు.

అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా.. ఓ వైపు ఆమెకు ఇప్పటికే పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె అనిల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్‌ వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను మోసం కేసులో అరెస్టవడంతో మహాలక్ష్మి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. కాగా.. ఇటీవలే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: నటి మహాలక్ష్మి భర్త రవీందర్‌ అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement