బిగ్ బాస్ బ్యూటీ, హీరోయిన్ సాక్షి అగర్వాల్ మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు, ప్రియుడన నవనీత్‌తో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లి వేడుకను గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. జనవరి 2న గోవాలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. మా చిన్ననాటి స్నేహం ఇప్పుడు జీవితకాల బంధంగా మారిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. నవనీత్‌ను పెళ్లి.. నా కలను నిజం చేసిందని సంతోషం వ్యక్తం చేసింది.
సాక్షి అగర్వాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా వివాహం ప్రేమ, సంప్రదాయం, కుటుంబం, సన్నిహితులతో కలిసిన జ్ఞాపకాల వేడుక. నవనీత్‌ని పెళ్లి చేసుకోవడంతో నా కల నిజమైంది. అతని అచంచలమైన మద్దతు నాకు ఎప్పుడు ఉంటుంది. అతని ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో ఉంటాయి. మా జీవితంలో ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినప్పటికీ ఇప్పుడు సరికొత్త అధ్యాయం మొదలైనందుకు చాలా సంతోషిస్తున్నా' అని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.
(ఇది చదవండి: ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?)
కాగా.. సాక్షి అగర్వాల్ ఎక్కువగా తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. మొదట మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన సాక్షి ఆ తర్వాత నటనలో అడుగుపెట్టింది. తమిళ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తమిళ సీజన్-3లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇక సినిమాల విషయానికొస్తే కన్నడ చిత్రం హెద్దరి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్‌లో అట్లీ తెరకెక్కించిన రాజా రాణి చిత్రంలో కీలక పాత్ర పోషించింది. శాండల్‌వుడ్‌లో సాఫ్ట్‌వేర్ గండా (2014) చిత్రంలో కనిపించింది. అంతేకాకుండా రజినీకాంత్ మూవీ కాలా (2018)లో నటించింది. అదే ఏడాది మలయాళంలో ఒరాయిరం కినక్కలాల్ (2018) చిత్రంలో కీ రోల్ పోషించింది. తమిళంలో సిండ్రెల్లా అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత అరణ్మనై- 3, భగీర లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment