ధనుశ్- నయనతార వివాదం.. అప్పుడే పెళ్లిలో కలిశారు.. కానీ! | Nayanathara and dhanush atteneded Marriage In chennai Video Goes Viral | Sakshi
Sakshi News home page

Dhanush-Nayanathara: పెళ్లికి నయనతార దంపతులు.. అక్కడే ధనుశ్ కూడా.. కానీ!

Nov 21 2024 7:04 PM | Updated on Nov 21 2024 7:15 PM

Nayanathara and dhanush atteneded Marriage In chennai Video Goes Viral

ప్రస్తుతం కోలీవుడ్‌ను కుదిపేస్తోన్న వివాదం ఏదైనా ఉందంటే అది ధనుశ్- నయనతారదే. ఇటీవల నయనతార లైఫ్ స్టోరీగా వచ్చిన డాక్యుమెంటరీ రిలీజైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్-నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్‌ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్‌ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసులు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.

ఈ వివాదం మొదలైన తర్వాత కోలీవుడ్‌లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న టైమ్‌లో ఊహించని విధంగా ఇద్దరూ ఓకే వేదికపై మెరిశారు. తమిళ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్‌ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా. ఈ పెళ్లికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా.. నయనతార నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్‌  డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్‌ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement