![Dhanush Direction Movie Jaabilamma Neeku Antha Kopama Trailer out Now](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/chef.jpg.webp?itok=dxPG9AYi)
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama Movie). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇద్దరు ప్రేమజంటల స్టోరీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కథ మొత్తం రెండు ప్రేమజంటల చుట్టూ తిరిగే కథాంశంగా రూపొందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది.
It's the season to fall in love ❤️✨
#JaabilammaNeekuAnthaKopama Trailer out now:https://t.co/ZTw9vcjKUk
In cinemas on Feb 21, 2025 💞🎬
Written and directed by @dhanushkraja#JNAK @gvprakash @wunderbarfilms @theSreyas @editor_prasanna @leonbrittodp @asiansureshent pic.twitter.com/SCu6o2G0Fi— Asian Suresh Entertainment (@asiansureshent) February 10, 2025
Comments
Please login to add a commentAdd a comment