priya prakash varrier
-
ఎల్లో డ్రెస్‌లో ఎల్లోరా శిల్పంలా ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)
-
`జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama Movie). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇద్దరు ప్రేమజంటల స్టోరీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కథ మొత్తం రెండు ప్రేమజంటల చుట్టూ తిరిగే కథాంశంగా రూపొందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది.It's the season to fall in love ❤️✨ #JaabilammaNeekuAnthaKopama Trailer out now:https://t.co/ZTw9vcjKUkIn cinemas on Feb 21, 2025 💞🎬 Written and directed by @dhanushkraja#JNAK @gvprakash @wunderbarfilms @theSreyas @editor_prasanna @leonbrittodp @asiansureshent pic.twitter.com/SCu6o2G0Fi— Asian Suresh Entertainment (@asiansureshent) February 10, 2025 -
వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ మేళాకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. వీరిలోని కొందరు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇలాంటివారిలో వైరల్ గర్ల్ మోనాలిసా ఒకరు. ఈమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా తన అందమైన కళ్లు కారణంగా సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. మహాకుంభ్‌లో దండలు, పూసలు అమ్మేందుకు వచ్చిన ఆమె అనూహ్య రీతిలో సోషల్ మీడియాలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు.ప్రియా ప్రకాష్ వారియర్ ప్రియా ప్రకాష్ వారియర్.. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లోని ఒక చిన్న క్లిప్ వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయారు. దీంతో ఆమెకు ‘ది వింక్ గర్ల్’ అనే పేరొచ్చింది.భుబన్ బద్యాకర్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లీల విక్రేత భుబన్ కస్టమర్లను ఆకర్షించడానికి ‘కచ్చా బాదం’ పాటను రూపొందించి పాడాడు. ఈ పాట కారణంగానే భుబన్ రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారు.అంజలి అరోరానాడు వైరల్‌గా మారిన కచ్చా బాదం పాటకు ఆమె నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. దీంతో అంజలి అరోరా రాత్రికి రాత్రే సన్సేషనల్ స్టార్‌గా మారిపోయారు. కచ్చాబాదం ఆమె ఇంటి పేరుగా మారిపోయింది.రాణు మండల్రాణు మండల్ ఒక రైల్వే స్టేషన్లో లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ పాట పాడి, రాత్రికి రాత్రే సంచలనంగా మారారు. సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి.దనానీర్ ముబీన్19 ఏళ్ల పాకిస్తానీ యువతి దనానీర్ ముబీన్‌కు చెందిన ‘పావ్రీ హో రహి హై’ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో దనానీర్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయారు.సంజీవ్ శ్రీవాస్తవమధ్యప్రదేశ్లోని విదిశకు చెందిన ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ డ్యాన్సింగ్ అంకుల్‌గా పేరొందారు. సంజీవ్ శ్రీవాస్తవ బాలీవుడ్ హీరో గోవింద శైలిలో నృత్యం చేయడంతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయారు.ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి.. -
సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న 'ప్రియా ప్రకాశ్ వారియర్' లేటెస్ట్ ఫోటోలు
-
చీకట్లో మెగాడాటర్ నిహారిక.. చెరువులో ప్రియా వారియర్!
డ్యాన్స్ తో దుమ్మరేపిన 'బిగ్‌బాస్' హరితేజ చెరువులో తడి అందాలతో కాకరేపుతున్న ప్రియా వారియర్ చీకట్లో అలాంటి పోజులిచ్చిన మెగా డాటర్ నిహారిక బెండ్ అయి గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న పూనమ్ బజ్వా పచ్చ కలర్ చీరలో డీజే టిల్లు బ్యూటీ క్యూట్ పోజులు సైకిల్‌పై పూజాహెగ్డే.. ఫొటోలు కేక అంటే కేక అసలు లుక్ మార్చి ట్రెండీగా తయారైన యాంకర్ అనసూయ హీరోయిన్ కాజల్ ఇంటికెళ్లిన బబ్లీ బ్యూటీ రాశీఖన్నా అందాల విందు చేసిన 'బిగ్‌బాస్' ఫేమ్ లహరి శారీ View this post on Instagram A post shared by Nithya Suresh (@nithya_hari) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) -
సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్
ఒక్క అడుగు జీవితాన్ని మార్చేస్తుందంటారు. అలా ఒకే ఒక్క చిత్రం నటి ప్రియా ప్రకాష్ వారియర్ జీవితాన్నే మార్చేసింది. ఆమె హీరోయిన్గా పరిచయమైన మలయాళ చిత్రం ఓరు అదారు లవ్. ఈ చిత్రం విజయం సాధించిందా అంటే అదీ లేదు. అయితే ట్రైలర్.. ఆ చిత్రానికి కావలసిన దానికంటే ఎక్కువ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా నటి ప్రియాప్రకాష్ వారియర్ తన లవర్‌కు కన్ను కొట్టే దృశ్యం యువత గుండెల్లో గిలిగింతలు పెట్టించింది. ఆ చిత్రం మలయాళంతో పాటు ఇతర భాషల వ్యాపారానికి కూడా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ప్రియా ప్రకాష్ వారియర్‌ను పాపులర్ చేసింది. (ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!) అయితే ఇదంతా జరిగి చాలాకాలమైంది కదా.. మళ్లీ ఇప్పుడెందుకు అంటారా? దీనిపై ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తనకు చిన్నతనం నుంచి సినిమాలు చూడడం చాలా ఇష్టమని చెప్పింది. సినిమాలు చూసి ఇంటికి వచ్చిన తరువాత అద్దం ముందు నిలబడి ఆయా చిత్రాల హీరోయిన్ల మాదిరి నటించేదానినని చెప్పింది. తాను నటి అవుతానని తన తల్లిదండ్రులే కాదు.. తానూ ఊహించలేదని తెలిపింది. అలా చదువుకుంటున్న సమయంలోనే ఆడిషన్లో పాల్గొన్న సెలెక్ట్ అయ్యానని.. ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి తన తల్లిదండ్రులు అంగీకరించినట్లు చెప్పింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో నటిగా మారినట్లు చెప్పింది. కాగా ప్రియా ప్రకాశ్ మలయాళంతో పాటు తెలుగు తమిళం , హిందీ భాషల్లోనూ నటిస్తోంది. కాగా తను తొలి చిత్రం ట్రైలర్లో కన్ను కొట్టిన దృశ్యాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ చూసి చాలా మంచి నటి అవుతుందని, ఈ నటి తన కాలంలో ఎందుకు రాలేదని ప్రశంసలు కురిపించారట. దీంతో ఆయన ప్రశంసల కంటే పెద్ద అవార్డు ఏముంటుందని పేర్కొంది . నటిగా తాను ఎంత పాపులర్ అయ్యానో తెలియదు.. కానీ రిషికపూర్ కితాబును జీవితాంతం మరిచిపోలేనని ట్విట్టర్లో వెల్లడించింది. (ఇది చదవండి: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్ హీరోయిన్‌కు సమన్లు!) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
చిరిగిన జీన్స్‌లో ఐటం బ్యూటీ, పెంపుడు కుక్క బర్త్‌డేకు పార్టీ ఇచ్చిన ఊర్వశి
► చిరిగిన జీన్స్‌లో ఐటం బ్యూటీ ► డ్యాన్స్‌తో ఇరగదీసిన శ్వేతానాయుడు ► సిడ్నీ నగరాన్ని చుట్టేస్తోన్న అరియానా గ్లోరీ ► ఆమ్స్టర్డామ్ యాత్రలో యాంకర్ నేహా చౌదరి ► కుక్కకు నెక్లెస్ వేసి బర్త్‌డే పార్టీ చేసిన ఊర్వశి రౌతేలా View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
BRO Success Meet Photos: ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
'BRO' Movie Success Celebrations: ‘బ్రో’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
BRO Movie HD Wallpapers: సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ మూవీ స్టిల్స్
-
Priya Prakash Varrier Latest Photos: ప్రియా ప్రకాష్ వారియర్ బ్యూటీ లేటెస్ట్ ఫోటోస్
-
చేసింది 6 సినిమాలు.. పాక్‌లోనూ అభిమాన సంఘాలు
ఆమె ఓ సాధారణ యువ నటి. కన్ను గీటిన ఓ వీడియో వల్ల దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఫస్ట్ మూవీ రిజల్ట్ సంగతి పక్కనబెడితే పలు భాషల్లో సినిమా ఛాన్సులు కొట్టేసింది. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేస్తే వాటిలో ఏదీ కూడా హిట్ అవ్వలేదు. అయితేనేం పాకిస్థాన్ లో ఆమె ఫ్యాన్స్ అసోసియేషన్స్ పెట్టారట. అవును ఈ విషయాన్ని ఆ బ్యూటీనే స్వయంగా బయటపెట్టింది. ఒక్క వీడియో దెబ్బకు కేరళకు చెందిన ప్రియా ప్రకాశ్ వారియర్.. డిగ్రీ చదువుతున్నప్పుడే 'ఒరు అదార్ లవ్' (లవర్స్ డే) అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈమె స్టైల్‌గా కన్ను కొడుతున్న వీడియో బిట్ అప్పట్లో రిలీజ్ చేస్తే, ఊహించనంత పాపులారిటీ వచ్చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ తెలుగుతోపాటు ఇతర భాషల చిత్రాల్లోనూ ఛాన్సులొచ్చాయి. (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) తెలుగులో రెండే జస్ట్ ఒక్క వీడియోతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియా వారియర్.. తెలుగులో నితిన్ 'చెక్', తేజా సజ్జా 'ఇష్క్' సినిమాల్లో నటించింది. కానీ ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈమె నటించిన గత మూడు చిత్రాలు మలయాళంవే. అవి కూడా ఏమంత చెప్పుకోద్దగ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేదు. ప్రస్తుతం ఈమె 'బ్రో' మూవీపైనే ఆశలు పెట్టుకుంది. పాక్‌లో ఫ్యాన్స్ బాలీవుడ్ పలువురు పాక్ సింగర్స్, నటులు ఉంటారు కానీ మన యాక్టర్స్ కి దాయాది దేశంలో పెద్దగా అభిమానులు ఉండరు. అలాంటిది ప్రియా వారియర్ కన్ను గీటిన వీడియోకు పాక్ కుర్రాళ్లు పడిపోయారు. దీని గురించి స్వయంగా ఈ బ్యూటీనే చెప్పింది. దేనికి కనెక్ట్ కానీ పాక్ ప్రేక్షకులకు తన వీడియో తెగ నచ్చేసిందని, రోజూ మెసేజులు పెట్టేవారని, బాగా చేశావని మెచ్చుకున్నారని చెప్పింది. మీ కోసం ఇక్కడ అభిమాన సంఘాలు ఉన్నాయని వాళ్లు చెబుతుంటే నమ్మలేకపోయేదాన్నని ప్రియా వారియర్ పేర్కొంది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
సొగసులు ఒలకబోస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ (ఫోటోలు)
-
కుర్ర హీరోయిన్‌కు తెల్లజుట్టు, ఫోటోలు వైరల్
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈమె కన్ను కొట్టే స్టైల్‌కు దేశమే ఫిదా అయింది. కరోనా సమయంలో ఈ కన్ను కొట్టే సీన్ ఎంతగానో వైరల్ అయింది. ఒరు ఆదార్ లవ్ సినిమాలో ఉన్న ఈ ఒక్క సీన్‌తో ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా ఈ కేరళ కుట్టి తెలుగులో ఇష్క్, చెక్ సినిమాలు చేసింది. తెలుగులోనే కాదు మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయింది. ప్రస్తుతం హిందీలోనే నాలుగు చిత్రాలు చేస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్లతో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పింక్ చుడీదార్లో ట్రెడిషనల్‌గా రెడీ అయిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ప్రియా నెత్తిన ఉన్న తెల్లజుట్టును నెటిజన్లు ఇట్టే పసిగట్టారు. అప్పుడే నీకు తెల్లజుట్టు వచ్చిందా? అని షాకవుతున్నారు. ఆమె అభిమానులు మాత్రం జుట్టు తెల్లబడటం సాధారణమేగా.. తను వాటిని దాచకుండా సహజంగా కనిపించేందుకు ప్రయత్నించింది, ఇందులో తప్పేముంది అని వెనకేసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) చదవండి:ఈ శుక్రవారం ఓటీటీల్లో 20 సినిమాలు -
వైట్ డ్రెస్‌లో నెట్టింట వైరల్ అవుతున్న ప్రియా ప్రకాష్ వారియర్ (ఫోటోలు)
-
పాపం ఐదేళ్లకే మతిపోయింది.. మెడిసిన్ వాడాల్సిందేనన్న డైరెక్టర్!
ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్క సీన్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. 2019లో విడుదలైన ‘ఓరు అదార్ లవ్’ చిత్రంలో కన్ను కొట్టిన సీన్(వైరల్ వింక్) మీకు గుర్తుందా? ఆ ఒక్క సీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు ఓమర్ లూలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) అసలేం జరిగిందంటే.. 'ఓరు అదార్ లవ్' చిత్రంలో కన్ను కొట్టే ఐడియా తనదేనంటూ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలను దర్శకుడు ఫన్నీగా కొట్టి పారేశారు. ఒమర్ లులు తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్వ్యూల వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. ఇన్‌స్టాలో రాస్తూ.. ' పాపం పిచ్చిపిల్ల.. ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయినట్టుంది. వలియ చందనాది.. జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. అయితే ప్రియా ప్రకాశ్ వారియర్ డైరెక్టర్ చేసిన కామెంట్స్‌పై స్పందించలేదు. కాగా.. ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఒరు అదార్ లవ్ సినిమాలోని ఈ సాంగ్ యూట్యూబ్‌లో 107 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షెరీఫ్, రోషన్ అబ్దుల్ రహూఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!) View this post on Instagram A post shared by OMAR LULU✌️ (@omar_lulu_) -
చురకత్తిలాంటి చూపులతో ఆగం చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్
-
చురకత్తిలాంటి చూపులతో ఆగం చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్
చురకత్తిలాంటి చూపులతో ఆగం చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ -
ఆరెంజ్ డ్రెస్‌లో కల్యాణి, బ్లాక్ అండ్ వైట్‌లో మలైకా పోజులు
► ఏంజెల్లా మెరుస్తున్న ఏంజెలినా జోలి ► బ్లాక్ డ్రెస్‌లో పోజులిస్తున్న మలైకా అరోరా ► వెరైటీ డ్రెస్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ ► ఆరెంజ్ డ్రెస్‌లో అదరగొట్టిన కల్యాణిప్రియదర్శన్ View this post on Instagram A post shared by Avinash Gowariker (@avigowariker) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by page for sale 😻 (@angelina__jolie_09) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Inaya Sultana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anush 🦭 (@anushkaranjan) -
Fashion: పర్పుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ‘వింక్ బ్యూటీ’! డ్రెస్ ధర ఎంతంటే!
తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ లోని కన్ను కొట్టే సీన్‌తో ‘వింక్ బ్యూటీ’ గా పేరు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాశ్ వారియర్! సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ హీరోయిన్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవడంలోనూ అంతే ఫాస్ట్‌గా ఉంటుంది. అలా ఆమె అభిమానాన్ని చూరగొన్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. ప్రత్యూష గరిమెళ్ల.. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి తను పెద్ద ఫ్యాషన్ డిజైనర్‌ని కావాలని కలలు కన్నారు. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్‌లో తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించించారు. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర డిజైన్‌ను బట్టే. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ ఆమె డిజైన్స్ లభ్యం. కాగా ఈ ఏడాది జూన్‌లో ప్రత్యూష గరిమెళ్ల బలవన్మరణానికి పాల్పడి తన వాళ్లను విషాదంలోకి నెట్టారు. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. కానీ ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ని ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ డ్రెస్ డిజైనర్: ప్రత్యూష గరిమెళ్ల ధర: రూ. 40,800 జ్యూయెలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అదో సరదా వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. ట్రాన్స్పెరెంట్ గొడుగు, రెయిన్ కోట్ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్ స్లిప్పర్స్ వేసుకుని స్కూల్ బస్ కోసం వెయిట్ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. - ప్రియా ప్రకాశ్ వారియర్ -దీపిక కొండి చదవండి: Floral Designer Wear: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్‌తో మెరిసిపోండిలా! -
Priya Prakash Varrier: ఆయనంటే క్రష్.. అదోరకం పిచ్చి
స్టార్ హీరోల దృష్టిలో పడటానికి ఈ తరం హీరోయిన్లు చాలా ట్రిక్స్ ప్రయోగిస్తున్నారని చెప్పవచ్చు. అవకాశాల కోసం కొందరు గ్లామర్ వాడుకుంటుంటే మరికొందరు హీరోలపై పొగడ్తలను మార్గంగా ఎంచుకుంటున్నారు. నటి ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? ఒరు ఆధార్ లవ్ అనే చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది ఈ మల యాళీ కుట్టి. 2018లో తనహ అనే చిత్రంతో నాయకిగా పరిచయమైన ప్రి యా ప్రకాష్ వారియర్ ఇప్పుడు బాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయింది. మధ్య లో చెక్ అనే చిత్రంతో టాలీవుడ్‌ను టచ్ చేసింది. విష్ణుప్రియ చిత్రం ద్వారా శాండిల్ వుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. దీంతో దక్షిణాదిలో ఈమె ఎంట్రీ ఇవ్వని సినీ పరిశ్రమ కోలీవుడ్ మాత్రమే. అందుకని ఈమె కన్ను ఇప్పుడు కోలీవుడ్‌పై పడినట్లు ఉంది. ఇక్కడ అవకాశాల వేట మొదలెట్టింది. అందుకు నటుడు ధనుష్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ధనుష్‌కు సంబంధించిన విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కోలీవుడ్‌ను అటెన్షన్ చేస్తోంది. ఇటీవల జరిగిన ఫిలింపేర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఈ బ్యూటీ అక్కడ సెంటర్ అట్రాక్షన్‌గా మారింది. నటుడు ధనుష్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న విషయాల గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు తనకు ధనుష్ అంటే క్రష్ అని, అదో రకం పిచ్చి అని పేర్కొంది. ఆయన సరసన నటించాలని చాలాకాలంగా కోరుకుంటున్నానని, అలాంటి అవకా శం త్వరలోనే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో ఒక చిత్రం, మలయాళంలో రెండు చిత్రాలు, హిందీలో మూడు చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంది. -
హీరోయిన్ ప్రియా వారియర్.. ఇలా అయిపోయిందేంటి?
అలా కన్నుకొట్టి ఇలా ఫేమస్ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఒరు ఆడార్ లవ్ సినిమా ప్రచారంలో భాగంగా రిలీజ్ చేసిన కన్ను కొట్టే సీన్ దేశవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే! ఆ ఒక్క సీన్‌తో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించుకున్న ఆమెను అభిమానులు ముద్దుగా వింక్ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఈ కేరళకుట్టి తెలుగులో ఇష్క్, చెక్ సినిమాలు చేసింది. కానీ ఇవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందులో ఆమె గిరిజన యువతిగా ముస్తాబైంది. కట్టుబొట్టు, కాళ్లకు పారాణితో అచ్చం గిరిజనురాలిగా కనిపిస్తోంది. అంతా బానే ఉంది, కానీ ప్రియ ముఖంలో చిరునవ్వు మిస్ అవడంతో కంగారుపడుతున్నారు ఫ్యాన్స్. ఎందుకలా బాధగా ఉన్నావు, నిన్నిలా చూడలేకపోతున్నాం, నీకేమైంది ప్రియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కేవలం ఫొటోషూట్‌లో భాగంగానే ఆమె విచారంగా, దీనంగా ముఖం పెట్టినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) చదవండి: అందుకే జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నా: సింగర్ -
చాలా అమర్యాదగా ప్రవర్తించారు: హీరోయిన్‌కు చేదు అనుభవం
ఒక్క వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. 'ఒరు ఆడార్ లవ్' సినిమాలో కన్ను కొట్టే సీన్‌తో ప్రియా వారియర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.. వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి పలు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమెకు ఓ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పుకొచ్చింది. 'ఫెర్న్ గొరెగావ్ హోటల్లో నేను బస చేశాను. ఈ హోటల్ పాలసీ ఏంటంటే.. బయట ఫుడ్‌ను లోనికి అస్సలు అనుమతించరు. ఎందుకంటే అతిథులు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి. నాకీ సంగతి తెలియదు. షూటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఫుడ్ కొనుక్కుని హోటల్‌కు వచ్చాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే? హోటల్ బుకింగ్, రిజిస్ట్రేషన్.. అన్నీ ప్రొడక్షన్ కంపెనీ వాళ్లే చేస్తారు, ఆర్టిస్టులకు సంబంధం ఉండదు' 'నేను ఎంతో మర్యాదగా వారిని వేడుకున్నా.. ఈ ఒక్కసారికి వదిలేయండి.. ఎందుకంటే డబ్బులు పెట్టి ఫుడ్ కొన్నాను, పైగా నాకు దాన్ని పారేయడం ఇష్టం లేదు అని! కానీ వాళ్లు వినిపించుకుంటేగా.. ఆ ఫుడ్‌ను బయటే వదిలేయాలంటూ పెద్ద సీన్ చేశారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. చాలా అమర్యాదగా ప్రవర్తించారు.. దీంతో బయట చలిలో భోజనం చేయాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చిందీ ప్రియా వారియర్. -
వాన పాటకి చాన్స్ వస్తే కాదంటానా?
అలా కన్ను కొట్టి ఇలా ఫేమస్ అయిపోయారు ప్రియా ప్రకాశ్ వారియర్. తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఈ కన్ను కొట్టే సీన్ ఆమెకు ‘వింక్ బ్యూటీ’ అనే పేరు తెచ్చింది. ఈ కేరళ కుట్టి ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇక.. ఈ బ్యూటీని ‘వానాకాలమ్’ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. ► చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలు... వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. అది కూడా ట్రాన్స్ప్యారంట్ గొడుగు, రెయిన్ కోట్ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్ స్లిప్పర్స్ వేసుకుని, స్కూల్ బస్ కోసం వెయిట్ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో వేరే వాహనాలు వెళ్లినప్పుడు మా యూనిఫామ్ మీద బురదనీళ్లు పడేవి. చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలంటే నాకివే. ఆ రోజులే వేరు. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ ఇంట్లో? వానలో తడిచినా ఏమీ అనేవాళ్లు కాదు. మా సొసైటీలో ఉండే పిల్లలమంతా వానలో తడుస్తూ ఆడుకునేవాళ్లం. వానలో తడుస్తూ దాగుడుమూతలు ఆడేవాళ్లం. చివరికి బ్యాడ్మింటన్ కూడా ఆడుకునేవాళ్లం. అయితే వానలో తడిచి, జ్వరం తెచ్చుకుంటే అప్పుడు తిట్లు పడేవి. ► కాగితపు పడవలు చేసేవారా? చేసేదాన్ని. అది మాత్రమే కాదు.. వర్షం నీళ్లను సీసాల్లో పట్టి, ఆడుకునేదాన్ని. ► చివరిసారిగా ఫుల్లుగా ఎప్పుడు తడిశారు? రష్యాలో... షాపింగ్ కోసం బయటకెళ్లాం. ఒక్కసారిగా బాగా వర్షం వచ్చింది. పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చర్చిలోకి వెళ్లాం. అప్పటికే కొంచెం తడిసిపోయాం. ► వర్షాకాలం ఇష్టమేనా? చాలా. నేను మాన్సూన్ లవింగ్ పర్సన్‌ని. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి నా మూడ్ కూడా అలానే ఉంటుంది. మంచి మ్యూజిక్ వింటూ, ఎంజాయ్ చేస్తుంటాను. ► నచ్చే రెయినీ ఫుడ్? మా అమ్మగారు చేసే ఫుడ్ ఏదైనా ఇష్టమే. వాన అంటే మాత్రం న్యూడుల్స్ తినాల్సిందే. ► మరి.. వాన పాటల్లో నటించడం ఇష్టమేనా? నేను ఫిల్మీ పర్సన్. వాన పాటకి చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. అంతెందుకు.. షవర్ కింద నిలబడి దాన్నే వాన అనుకుని, ఎంజాయ్ చేస్తుంటాను. ఇక వాన పాట అంటే కాదంటానా? ► రెయినీ సీజన్లో వర్క్ చేయడం ఇష్టమేనా? అస్సలు ఇష్టం ఉండదు. ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడను. ► నచ్చిన వాన పాట? చాలా పాటలు ఉన్నాయి. ఒక్క పాట అంటే చెప్పలేను. అయితే రెయినీ సీజన్లో మెలోడీ సాంగ్స్ వింటాను. రెయినీ సీజన్ కోసం ప్రత్యేకంగా నా ప్లే లిస్ట్‌లో కొన్ని పాటలు పెట్టుకున్నాను. అవి వింటుంటాను. ► వర్షాకాలంలో ఇబ్బందులకు గురైన సందర్భాలు... వ్యక్తిగతంగా నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. దినదిన గండంలా గడిపారు. ఆ సమయంలో స్వయంగా క్యాంప్స్‌కి వెళ్లి నాకు చేతనైనంత సాయం చేశాను. ఇళ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలీక వాళ్లు పడిన బాధ చూసి చలించిపోయాను. -
తేజ సజ్జ ‘ఇష్క్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇష్క్.. నాట్ ఎ లవ్‌స్టోరి జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ నటీనటులు : తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ నిర్మాణ సంస్థ : మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ దర్శకత్వం : యస్.యస్. రాజు సంగీతం : మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు ఎడిటర్ : ఎ. వరప్రసాద్ విడుదల తేది : జూలై 30, 2021 చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన తేజ సజ్జా‘జాంబి రెడ్డి’తో హీరోగా మారిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ జానర్‌తో తొలిసారే ప్రయోగం చేసి, తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘ఇష్క్. కన్నుగీటుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్. క్రేజీ కాంబినేషన్ లవ్ స్టోరీ ఊహిస్తే.. నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇష్క్ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెంచుతూ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (జూలై 30)న థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘ఇష్క్’ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో తేజ సజ్జా మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. కథ వైజాగ్‌కు చెందిన సిద్దార్థ్ అలియాస్ సిద్దు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనసూయ అలియాస్ అను(ప్రియా ప్రకాశ్ వారియర్)తో ప్రేమలో ఉంటాడు. అను బర్త్‌డే సందర్భంగా ఆమెతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తాడు సిద్దు. కారులో అనును తీసుకొని వైజాగ్ బీచ్ రోడ్‌కి వెళ్తాడు. ఇద్దరు కలిసి డే మొత్తాని ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం సమయంలో అనుని ఓ ముద్దు ఇవ్వమని కోరతాడు సిద్దు. దాని వల్ల వీరికి ఓ పెద్ద సమస్య వచ్చిపడుతుంది. అను, సిద్దు సన్నిహితంగా ఉన్న పోటోలు, వీడియోలు తీసిన మాధవ్(రవీందర్), పోలీసు ఆఫీసర్ని అని చెప్పి వారికి బ్లాక్ మెయిల్ చేస్తాడు. రాత్రంతా కారులోనే వారితో ప్రయాణం చేసి, అనుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. పోలీసు ఆఫీసర్ అనే భయంతో మాధవ్‌ని సిద్దు ఏం చేయలేకపోతాడు. కట్ చేస్తే.. మరుసటి ఉదయం సిద్ధుకి మాధవ్ గురించి ఓ నిజం తెలుస్తుంది. ఇంతకి సిద్ధుకి తెలిసిన నిజం ఏంటి? మాధవ్ నిజంగా పోలీసు ఆఫీసరా? కాదా? తన ప్రియురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన మాధవ్‌కు సిద్ధు ఏ విధంగా బుద్ది చెప్పాడు? చివరకు అను, సిద్ధుల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. నటీ నటులు సిద్దు పాత్రలో తేజ సజ్జ బాగానే నటించాడు. ఫస్టాఫ్‌లో రొమాంటిక్ యాంగిల్లో కనిపించిన సిద్దు.. సెకండాఫ్‌లో రివేంజ్ తీర్చుకునే ప్రేమికుడిగా అద్భుతంగా నటనను కనబరిచాడు. భయపడుతూనే.. తమ జంటను హింసించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. అను పాత్రలో ప్రియా ప్రకాశ్ వారియర్ మెప్పించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగానే చేసింది. ఇక శాడిస్ట్ పాత్రలో రవీంద్ర విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీ, నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ మలయాళం ఇష్క్ సినిమాకి రీమేకే.. ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ. ఆ సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసిన దర్శకుడు యస్ యస్ రాజు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఫస్టాఫ్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లను విలన్ వేధించిన తీరు మరీ లెంతీగా చూపించడం సినిమాకు ప్రతికూల అంశమే. అలాగే సెకండాఫ్‌లో కూడా హీరో రివేంజ్ తీర్చుకునే సన్నివేశాలు కూడా సాగదీతగా, బోరింగ్‌గా ఉంటాయి. ఒకే పాయింట్‌ని పట్టుకొని సాగదీయడం సినిమాకి పెద్ద మైనస్. జంటలపై దాడుల, వేధింపులు అనే పాయింట్ కొత్తగానే ఉన్నా... తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. అయితే ఎండింగ్లో సిద్ధు, అనుల మధ్య వచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుట్టుంది. ఇక సినిమాకి ఉన్నంతలో ప్లస్ పాయింట్ ఏంటంటే మహతి స్వరసాగర్ సంగీతం. ఒక్క పాట మినహా మిగతా పాటలు ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ ఎ. వరప్రసాద్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. మొత్తంగా ఇష్క్ సినిమా చూడడం కాస్త రిస్కే. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆమె కన్ను కొట్టింది, నేను తొడ కొట్టాను: యంగ్ హీరో
Teja Sajja, Priya Prakash Varrier: సినిమా ట్రైలర్లో హీరోయిన్ను ముద్దిస్తావా? అని అంత ఈజీగా అడిగేసిన తేజ సజ్జ రియల్ లైఫ్‌లో మాత్రం ఎవరినీ ఆ ప్రశ్న అడగలేదట. సినిమా ఇస్తావా? అని చాలామంది దర్శకనిర్మాతలను అడిగానే తప్ప ఇలా ముద్దు కోసం అమ్మాయిల వెంట పడలేదని తెలిపాడు. అంతేకాదు తనకు రొమాన్స్ సీన్లలో నటించడమన్నా కూడా చాలా భయమని చెప్తున్నాడు. తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన చిత్రం 'ఇష్క్'. ఈ సినిమా జూలై 30న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు సాక్షితో ముచ్చటించారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ.. 'ఇష్క్' సినిమాలో హీరోగా తన నటనకు 8 మార్కుల వరకు వేసుకోవచ్చన్నాడు. ఇక ఫస్ట్‌డే ఫస్ట్ షాటే ముద్దు సీన్ అవడంతో కొంత ఇబ్బందిగా అనిపించిందన్నాడు. ఫేమస్ హీరోయిన్‌తో నటించడం ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె కన్ను కొట్టింది, తాను తొడ కొట్టాను అంటూ చిలిపిగా బదులిచ్చాడు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఇంకా ఏమేం ముచ్చటించారో కింద వీడియోలో చూసేయండి. -
ఆఫర్లు రానందుకు నాకేం బాధగా లేదు : హీరోయిన్
‘‘వింక్ సెన్సేషన్ అంటూ నా వీడియో వైరల్ అయిన టైమ్‌లో చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ టైమ్‌లో చదువు ముఖ్యమనుకున్నాను. గత ఏడాదే బీ.కామ్ పూర్తి చేశాను. అప్పట్లో వచ్చినన్ని ఆఫర్లు ఇప్పుడు రానందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే బాధపడుతూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేం’’ అన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. తేజా సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా ఎస్.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇష్క్’. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30 విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ – ‘‘మలయాళ ‘ఇష్క్’ చిత్రాన్ని చూసి తెలుగు రీమేక్ ‘ఇష్క్’ ఒప్పుకున్నాను. ఇది రోటీన్ లవ్‌స్టోరీలా ఉండదు. మలయాళ స్టోరీ సోల్‌ను తీసుకుని, ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్లు మార్పులు చేశారు దర్శకులు రాజుగారు. తెలుగు భాష అర్థం చేసుకోగలను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలో నటిస్తున్నారు. -
ట్రైలర్: హీరోయిన్ బర్త్‌డే ప్లాన్, అంతలో ఏమైంది?
Ishq Movie Trailer: తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన చిత్రం ఇష్క్. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ప్రియాతో ప్రేమలో పడిన తేజ ఆమె బర్త్‌డేను స్పెషల్‌గా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తాడు. కానీ ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురై అంతా తలకిందులు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ అన్న క్యాప్షన్ చూస్తుంటే హీరో నిజంగానే హీరోయిన్ను ప్రేమించాడా? లేదా అన్న అనుమానం రాక మానదు. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేసిదిగా ఉంది. యస్.యస్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలవుతోంది. -
'ఇష్క్' రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు: తేజ సజ్జ
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. ఈనెల 30న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ చిత్ర మాట్లాడుతూ..అందరూ అనుకున్నట్లుగా ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. యూత్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా తెరకెక్కించినప్పటికీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. స్టోరీ చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది. పాత్రలు ఎక్కడా కూడా పరధి దాటి వెళ్లవు. ఎక్కడా బోర్ అనిపించదు. సినిమా మొదటి నుంచి ముగిసే వరకు ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. థ్రిల్ ఫీలయ్యే సందర్బాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. మహతి స్వరసాగర్ అందించిన పాటలు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని పేర్కొన్నాడు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం తేజ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో హనుమాన్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇష్క్: సిద్ శ్రీరామ్ మెలోడీ సాంగ్ వచ్చేసింది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆనందమా.. ఆనందమదికే’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి శ్రీమణి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. -
థియేటర్స్‌లోనే 'ఇష్క్' అంటున్న తేజ-ప్రియా ప్రకాశ్
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్ పడింది. తాజాగా థియేటర్లు తెరుచుకున్న కారణంగా ఈ నెల 30న థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. కాగా చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. జాంబిరెడ్డితో హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి హనుమాన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
రష్యా రోడ్లపై స్నేహితులతో ప్రియా ప్రకాశ్ రచ్చ, వీడియో వైరల్
కన్నుగీటు భామ ప్రియా ప్రకాశ్ వారియర్ రష్యాలో హాలిడే వేకషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె తాజా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్నేహితులతో కలిసి రష్యా రోడ్లపై ఆమె చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోలను ప్రియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఓరు ఆధార్ లవ్’ అనే మలయాళ మూవీతో హీరోయిన్గా పరిచయమైన ప్రియా ప్రకాశ్... ఒకే ఒక్క కన్ను గీటుతో కుర్రకారును కట్టిపెడేసింది. దీంతో ఆమె ‘వింక్‌గాళ్’గా దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇటీవల జాంబీరెడ్డి హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్’ మూవీలో నటించిన ప్రియా ప్రకాశ్ షూటింగ్ పూర్తి కావడంతో హాలీడే వేకేషన్‌కు రష్యా పర్యటనకు వెళ్లింది. రష్యా రాజధాని మాస్కోలో స్నేహితులతో కలిసి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్‌కు వెళుతూ అక్కడ రోడ్లపై రచ్చ రచ్చ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులంతో పంచుకుంది. కాగా నితిన్ చెక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ ఆ తర్వాత తేజ సజ్జతో ఇష్క మూవీలో నటించింది. ఎప్రిల్ విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. -
'ఇష్క్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
‘ఇష్క్’పై ప్రియా ప్రకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
`ఓరు ఆధార్ లవ్` అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియా ప్రకాశ్ వారియర్... ఒకే ఒక్క కన్ను గీటుతో 'వింక్‌గాళ్'గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం తర్వాత తెలుగులో నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు.. ‘నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత నేను చేసిన సెకండ్ స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఇష్క్`. నాట్ ఏ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఒక కొత్త సబ్జెక్ట్‌తో రూపొందిన సినిమా ఇది. టీమ్ అందరం కలిసి ఓ మంచి ప్రయత్నం చేశాం. ఈ కథకు తప్పకుండా ప్రతి ఆడియన్ రిలేట్ అవుతారు. సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్లో ఏం జరుగుతుందా? అనే ఎగ్జైట్ మెంట్ సినిమా సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల మైండ్‌లో కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా చూసి ఆడియన్స్ తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు. ఈ చిత్రంలో నేను అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్రలో నటించాను. తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న కాలేజ్ గాళ్. తన క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ‘చెక్’ సినిమాలో నా స్క్రీన్ ప్రజెన్స్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుంది. తేజ సజ్జా మంచి కో స్టార్. ఇంకా చెప్పాలంటే నా ఏజ్‌గ్రూప్‌తో సరిపోయే యాక్టర్. సో సెట్స్‌లో చాలా ఫన్ ఉండేది. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో నేను కాస్త ఇబ్బందిపడ్డప్పుడు తేజ నాకు బాగా హెల్ప్ చేశాడు. దర్శకుడిగా ఎస్ఎస్ రాజుకి ఇది సినిమా తొలి ప్రాజెక్ట్. అయినా చాలా కాన్సన్ట్రేటెడ్గా చేశారు. సెట్లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. క్యారెక్టర్ సోల్‌ను మైండ్‌లో పెట్టుకుని నా స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేయమని చెప్పి దర్శకుడు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం మేజర్‌గా నైట్ షూట్స్ చేయాల్సి వచ్చింది. కొంతగ్యాప్ తర్వాత మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ చేసిన తెలుగు సినిమా ఇది. ఈ ఆఫర్ నాకు సడన్‌గా వచ్చింది. పెద్దగా ప్లాన్ కూడా చేసుకోలేదు. మెగాసూపర్ గుడ్ ఫిలింస్ వంటి మంచి బ్యానర్లో సినిమా చేయడం నా కెరీర్‌కు ఫ్లస్ అవుతుందని వెంటనే `ఇష్క్` సెట్స్‌లో జాయినైపోయాను. ఇక ఇష్క్ ఓ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్. ఆ సినిమా బేస్ లైన్ నాకు బాగా నచ్చింది. కథ బాగా కుదరిందని అనిపించింది. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేశారు. తెలుగు డైలాగ్స్‌లో పలకడం నేర్చుకుంటున్నాను. ఇష్క్ సినిమా చేసేప్పుడు టీమ్ నాకు హెల్ప్ చేశారు. ముందురోజే డైలాగ్స్ తీసుకుని నేను ప్రాక్టీస్ చేసి సెట్స్‌కు వచ్చేదాన్ని. అదీ నాకు కొంత హెల్ప్ అయ్యింది. మలయాళంలో నేను నటించిన తొలి సినిమా ‘ఓరు ఆడార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’గా విడుదలై రెండేళ్లు అవుతుంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఏడాది నా రెండు సినిమాలతో (ఇష్క్, చెక్) తెలుగు ప్రేక్షకులను పలరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా లేకపోతే చెక్ సినిమా గత ఏడాదే విడుదలయ్యేది. ఇష్క్ ఈ ఏడాది వచ్చేది. ఇలా ఏడాదికో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. మనం నటించిన అన్ని సినిమాలు ఆడవు. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకాదరణ లభిస్తుంది. కానీ ఫెయిల్యూర్స్ నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఇప్పటివరకు నేను చేసిన రోల్స్ అన్ని నాకు డిఫరెంట్‌గానే అనిపించాయి. ఇష్క్‌లో నేను చేసిన అనసూయ పాత్ర మోర్ ఇంటెన్స్ అండ్ డ్రమటిక్‌గా ఉంటుంది. సందీప్‌కిషన్ నెక్ట్స్ మూవీలో నేను ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఆ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కర్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.’ అని తెలిపింది. -
గంగవ్వ, ‘కన్ను గీటు భామ’ మూతి తిప్పుడు వీడియో వైరల్
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యస్.యస్. రాజు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయడం అవుతున్నాడు. ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది చిత్రబృందం. రోటీన్‌గా కాకుండా కాస్త డిఫెరెంట్, ఫన్ వేలో ‘ఇష్క్’ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఓ సెలబ్రిటీని పిలవడానినికి తేజ పడిన కష్టాలు చూడడంటూ ఓ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ విడియో సోషల్ మీడియాలో వైరలై నవ్వులు పూయించింది. తాజాగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్, బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన దగ్గరకు వచ్చిన ప్రియా ప్రకాష్‌కు తనదైన మాటలు, చేష్టలతో చుక్కలు చూపించింది గంగవ్వ. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన ‘ఈ కన్నుగీటు భామ’.. మూతి తిప్పినా ముద్దుగానే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఇదో కొత్త అనుభూతిని ఇస్తుంది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా యస్.యస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సమష్టిగా నిర్మించిన ‘ఇష్క్’ సినిమా ట్రై లర్‌ను సోషల్ మీడియాలో హీరో సాయితేజ్ విడుదల చేశారు. ఈ సినిమాను ఈ నెల 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ – ‘‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్ సినిమా తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్’. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించే మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థవారు కొంత గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన ఈ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘యూనిట్లో అందరి సహకారంతో తక్కువ రోజుల్లో మంచి క్వాలిటీతో ఈ సినిమాను పూర్తి చేశాను. హీరోహీరోయిన్లు తేజ, ప్రియలతో పాటు ఆర్టిస్టు రవీందర్ కూడా బాగా నటించారు’’ అన్నారు యస్.యస్. రాజు. ‘‘సూపర్‌గుడ్ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ రెండూ ఒక్కటే. మా బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఆరేడేళ్ల నుంచి తెలుగులో సినిమాలు చేయలేకపోయాం. ఇప్పుడు ‘ఇష్క్’ చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు వాకాడ అప్పారావు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వరసాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, పి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక ముద్దిస్తావా?: ధైర్యం చేసి అడిగేసిన హీరో
పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన తేజ సజ్జ 'జాంబీరెడ్డి'తో హీరోగా మారాడు. ఈ చిత్రం అతనికి హీరోగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అతడు డర్టీహరి డైరెక్టర్ ఎంఎస్ రాజుతో దర్శకత్వంలో 'ఇష్క్' అనే సినిమా చేస్తున్నాడు. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ తేజతో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. ఇందులో "అనూ, రేపు నైట్ నీ బర్త్‌డే ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు, నేను కారులో, ఆ కారు బీచ్ రోడ్డులో.." అంటూ ఊహల్లో తేలుతున్నాడు హీరో. తీరా అనుకున్నట్లుగానే ప్రియా వారియర్‌ను కారులో ఎక్కించుకుని చక్కర్లు కొడుతున్న హీరో ధైర్యం చేసి 'ఒక ముద్దిస్తావా?' అంటూ మనసులో మాట అడిగేశాడు. అందుకు ఆ భామ సై అందా? లేదా? ఇంతలో వీళ్లిద్దరికీ ఏమైనా జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే. అసలు వీరి కారు ప్రయాణంలో ఏం జరిగింది? వీరిపై ఎవరు, ఎందుకు దాడి చేశారు? అన్న అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇష్క్ నాటే సింగిల్ లవ్‌స్టోరీ అనేట్లుగా ఉందీ ట్రైలర్. ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మించనుంది. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్, పరాస్ జైన్ నిర్మించనున్నారు. శ్యామ్ కె నాయుడు కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. చదవండి: శ్రీకారం చుట్టుకుంది కొత్త చిత్రాలు 'జాంబీ రెడ్డి' సినిమా ఎలా ఉందంటే? -
చిట్టి గౌనులో కన్నుగీటు భామ.. నవ్వుతున్న రష్మిక
అదుర్స్’లో ఎన్టీఆర్-బ్రహ్మానందం కామెడీ సీన్‌ను స్ఫూఫ్ చేసి అదరగొట్టిన ప్రగతి ఏ విత్తనం కూడా పువ్వును చూడదంటూ అందమైన ఫోటోని షేర్ చేసిన రాయ్‌లక్ష్మీ అడవి మనిషిగా ఇలా మారానంటూ.. అరణ్య మూవీ మేకింగ్ వీడియోని రానా అభిమానులతో పంచుకున్నాడు పారిపోతున్న వధువు అంటూ.. నవ్వుతూ పరుగెడుతున్న ఫోటోని సన్నీలియోన్ అభిమానులతో పంచుకుంది పిల్లల అల్లరి వీడియోని హీరోయిన్ సమీరారెడ్డి అభిమానులతో పంచుకుంది మంచు లక్ష్మి చిన్నారులకు రైటింగ్ ఎలా నేర్పాలో తెలియజేసే వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆసక్తికర విశేషాలు మీకోసం.. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Rana Daggubati (@ranadaggubati) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
సోషల్ హల్చల్: సింగారాలు ఒలకబోస్తున్న బ్యూటీలు
► పిల్లందం కేక అనిపిస్తోన్న హెబ్బా పటేల్ ► పసుపు రంగు కుర్తీలో దేత్తడి హారిక సెల్ఫీ ► లెహంగాలో సింగారాలు ఒలకబోస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ► ఇతరుల కోసం కాకుండా నీకు నచ్చినట్లు ఉండని చెప్తోన్న నిషా అగర్వాల్ ► నవ్వుతో గాలం వేస్తున్న నభా నటేశ్ ► లంగా ఓణీలో భలేగుంది బాల అనిపిస్తోన్న అషూ రెడ్డి ► బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోయిన మలైకా అరోరా ► కురులు విరబోసుకుని అందాలు పరుస్తున్న లక్ష్మీ రాయ్ ► ఓవైపు క్యూట్, మరోవైపు హాట్ ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ నటి అదితి బుద్ధకోటి View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) -
ముద్దులు పంచుతున్న రాశీ, అబ్బా అనిపిస్తున్న హెబ్బా
♦ సముద్ర తీరాన సాగరకన్యగా మైమరపిస్తోన్న 'సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్ ♦ తన అందాన్ని ముసుగుతో దాచలేకపోతున్న ప్రియా వారియర్ ♦ జీన్స్‌లో అబ్బా.. అనిపిస్తున్న హెబ్బా పటేల్ ♦ చూపులతో చంపేస్తున్న కాజల్ అగర్వాల్ ♦ తెల్ల చీరలో హొయలు పోతున్న జాన్వీ కపూర్ ♦ పిల్లలకు ముద్దులు పంచుతున్న రాశీ ఖన్నా ♦ కళ్లతోనే సైగలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ ఒక్క ఫొటోతో సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
తేజ సజ్జతో జతకట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్
మలయాళీ కుట్టి, కన్ను గీటు భామ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగులో తొలిసారిగా నటించిన చిత్రం ‘చెక్’. హీరో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్‌లు లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికి ప్రియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వెంటనే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో నటించే చాన్స్ కోట్టేసింది ప్రియా. దర్శకుడు ఎస్ఎస్ రాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘ఇష్క్’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. తాజాగా ఈ మూవీకి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మీరు లవ్‌స్టోరీ సినిమాలు చూసి విసిగిపోయారా.. అయితే మీ కోసం ఇష్క్ మూవీని తీసుకురాబోతున్నాం. అయితే ఇది లవ్‌స్టోరీ కాదు’ అటూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది ప్రియా. ఇందులో ఆమె ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన తేజ సజ్జ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ‘ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే టైటిట్‌తో ఉన్న ఈ పోస్టర్లో తేజ సీరియస్ లుక్‌లో కనిపిస్తుంటే, ప్రియా ప్రకాశ్ నవ్వుతూ కనిపిస్తుంది. వారి ముందు పగిలిన అద్దాల ముక్కలు గాల్లో ఎగురుతున్నట్లు ఉన్నాయి. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) -
ఆ తర్వాత నా బలం మొత్తం పోయినట్లనిపించింది
‘‘భిన్నమైన పాత్రలు చేయాలని ఆలోచించి స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకోను. నేను సెట్‌కి వెళ్లే ప్రతిరోజూ ఎగ్జయిటింగ్‌గా ఉండాలి. ఆ ఎగ్జయిట్మెంట్ లేకపోతే సరిగ్గా పని చేయలేం. కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి. కొన్ని వర్కౌట్ కావు. కానీ జర్నీ ఎప్పుడూ ఎగ్జయిటింగ్‌గా ఉండాలి’’ అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. నితిన్, రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్ చెప్పిన విశేషాలు. ► ‘చెక్’లో మానస అనే లాయర్ పాత్ర చేశాను. మొదట భయపడే మనస్తత్వం ఉన్నా చివర్లో ధైర్యంగా మారుతుంది నా పాత్ర. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను. చంద్రశేఖర్ యేలేటిగారి సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన డైరెక్షన్లో నటించడం సంతోషంగా ఉంది. క్యారెక్టర్స్ ఎలా ఉండాలి? ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలని చాలా వర్క్ చేస్తారు. సెట్లో తెలుగులో మాట్లాడేవాళ్లం. ఓ రోజు చందూగారు సీ¯Œ ని ఇంగ్లీష్‌లో చెబుతుంటే ‘ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారెందుకు’ అని నవ్వుకున్నాం. ఈ మధ్య హిందీ సినిమా చిత్రీకరణలో అర్జు¯Œ కపూర్ అయితే ‘నీ పేరులో ప్రీత్ సింగ్ తీసేస్తే నువ్వు తెలుగమ్మాయివే’ అని అన్నారు. ► కోవిడ్ ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికీ చెప్పింది. ఫిట్నెస్ చాలా అవసరం అని తెలియజేసింది. నాకూ కోవిడ్ వచ్చింది. అయితే నన్ను పెద్ద ఇబ్బంది పెట్టలేదు. రెండు వారాల తర్వాత మళ్లీ నా పని చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ కోవిడ్ వచ్చి వెళ్లిన తర్వాత నా బలం మొత్తం పోయినట్టు అనిపించింది. కోవిడ్ మనకు రాకుండా ఉండటమే కాదు.. మనం వేరే వాళ్లకు అంటించకూడదు అనే బా«ధ్యతతో అందరూ ఉండాలి. ► క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. అందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. మేకప్ లేకుండా నటించాను. హిందీలో అర్జు¯Œ కపూర్‌తో ‘సర్దార్ గ్రాండ్స¯Œ ’లో సౌతిండియ¯Œ అమ్మాయిగా, ఆయుష్మా¯Œ ఖురానాతో ‘డాక్టర్ జీ’లో గైనకాలజిస్ట్‌గా, అజయ్ దేవగణ్‌తో ‘మే డే’లో పైలెట్ పాత్ర చేస్తున్నాను. తమిళంలో ‘అయలా¯Œ ’ సినిమా చేశాను. -
హర్ట్ అయిన రకుల్.. ప్రమోషన్లకు దూరం!
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చెక్. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే జనాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంటోంది. కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. సినిమాల్లో రకుల్ చాలా సన్నివేశాల్లో కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తోంది. అదే ప్రియ విషయానికొస్తే చేసింది చిన్న క్యారెక్టర్ అయినా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఢిల్లీ భామ(రకుల్) హర్ట్ అయినట్లు తెలుస్తోంది. చెక్‌లో తన పాత్ర కన్నా ప్రియా ప్రకాశ్ పాత్ర ఎక్కువ ఉండటం రకుల్‌కు నచ్చలేదట. అంతేగాక నితిన్, ప్రియ మధ్య ఎలాంటి పాటలు ఉండవని చెప్పి చివరికి వీరిద్దరి కలయికలో ఓ పాట కూడా చిత్రీకరించడంతో ఈ భామ హర్ట్ అయ్యిందటా. ఇంకేముంది సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చెక్కు సంబంధించిన ఏ ప్రమోషన్లలో కూడా ఆమె కనిపించలేదు. రిలీజ్‌కు ముందు చెక్ టీం ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో రకుల్ కనిపించలేదు. కానీ మరో కథానాయికగా నటిస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం మెరిసింది. అంతేగాక రకుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా రకుల్ దర్శనమివ్వకపోవడంతో అభిమానులు ఆశ్యర్యం వక్తం చేశారు. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రియనే హైలెట్ అవుతోంది. దీంతో సినిమాకు సంబంధించి ఎదో మొక్కుబడిగా ఒకటి రెండు ట్వీట్లు చేసింది తప్ప ఈ సినిమా చేసినందుకు రకుల్ సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ రకుల్‌ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ -
అల్లు అర్జున్‌కు నో చెప్పడమా?: ప్రియా వారియర్
కొంటెగా కన్ను గీటిన వీడియోతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. 'ఒరు ఆడార్ లవ్' సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఆమెకు మాత్రం మంచి పేరు వచ్చింది. తర్వాత ఓ హిందీ మ్యూజిక్ వీడియోలోనూ నటించి, ఆ పాటను ఆలపించిందామె. తాజాగా ఈ కేరళ కుట్టి 'చెక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 26న) రిలీజైంది. ఇదిలా వుంటే ఆమెకు నితిన్‌తో కన్నా ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చిందన్న వార్తలు వినిపించాయి. పైగా ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు కూడా గాసిప్స్ వచ్చాయి. తాజాగా ఈ రూమర్లపై ప్రియా వారియర్ క్లారిటీ ఇచ్చింది. "నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. మలయాళంలో ఆయన సినిమాలు డబ్ చేసేవాళ్లు. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగాను. నాకు ఆయన సినిమాలో అవకాశం వచ్చిందని, కానీ నేను దాన్ని చేజేతులా వదిలేసుకున్నట్లు వచ్చిన వార్తలు నాదాకా వచ్చాయి. కానీ అవి వట్టి పుకార్లు మాత్రమే. బన్నీ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. అలాంటిది ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకుంటానా! తప్పకుండా నటించి తీరుతాను" అని ప్రియా చెప్పుకొచ్చింది. చదవండి: రూటు మార్చిన ‘కన్ను గీటు’ భామ న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్..షేర్ చేసిన యాంకర్ చెక్ మూవీ రివ్యూ -
‘చెక్’ మూవీ రివ్యూ
టైటిల్ : చెక్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణమురళి, మురళి శర్మ తదితరులు నిర్మాణ సంస్థ : భవ్య క్రియేషన్స్ నిర్మాత : వి. ఆనంద ప్రసాద్ దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి సంగీతం : కల్యాణీ మాలిక్ సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటర్ : అనల్ అనిరుద్దన్ విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021 చాలా కాలం తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో. భీష్మ కంటే ముందు నితిన్ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్ తీసుకొన్న నితిన్.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి చెక్. భీష్మతో పాటు చెక్ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్’పై నితిన్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్ మరో హిట్ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథ ఆదిత్య ఒక తెలివైన యువకుడు. తన తెలివితేటలన్నింటిని చోరకళ(దొంగతనం) కోసం ఉపయోగిస్తాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి యాత్ర ( ప్రియా ప్రకాశ్ వారియర్) పరిచమతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కట్ చేస్తే... భారత్‌లో ఉగ్రదాడి జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో ఆదిత్య ఉరిశిక్ష పడుతోంది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆదిత్యకు జైలులో శ్రీమన్నారాయణ(సాయిచంద్)అనే ఖైదీ పరిచయమై చెస్ ఆటను నేర్పిస్తాడు. ఆదిత్య తెలివికి నేషనల్ చెస్ చాంపియన్ షిప్ గెలుస్తాడని బలంగా నమ్మిన శ్రీమన్నారాయణ.. తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్ గేమ్ ఆడేలా ఒప్పిస్తాడు. ఇదిలా ఉంటే ఆదిత్యకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్ లాయర్ మానస(రకుల్ ప్రీత్ సింగ్) ప్రయత్నిస్తుంది. చెస్‌లో ఆరితేరిన ఆదిత్యకు ఆ గేమే క్షమాభిక్ష పెట్టాలా చేస్తుందని బలంగా నమ్మి ఆ రకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ నరసింహారెడ్డి(సంపత్ రాజ్) ఆదిత్యకు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకి ఆదిత్యకు క్షమాభిక్ష లభించిందా లేదా? అసలు ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్ అయ్యాడు? యాత్ర ఎవరు? చెస్ గేమ్ ఆదిత్యకు ఎలా ఉపయోగపడింది? ఎస్పీ నరసింహారెడ్డికి ఆదిత్య అంటే ఎందుకు కోపం? చివరకు జైలు నుంచి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ నటీనటులు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఆదిత్య పాత్రలో నితిన్ ఒదిగిపోయాడు. ఒక చెస్ చాంపియన్ ఎలా ఆడగలడో, ఏ రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేయగలడో అచ్చుగుద్దినట్లు నితిన్ నటన ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా చక్కగా చేశాడు. ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. గత చిత్రాలకు బిన్నంగా ఇందులో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనతో మెప్పించింది. లాయర్ మానస పాత్రలో హవాభావాలు అద్భుతంగా పండించింది. ఇక నితిన్ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయిచంద్‌ది. చేయని తప్పుకు జైలుపాలైన శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలెట్. ఇక మరో హీరోయిన్ ప్రియ ప్రకాశ్ వారియర్‌కు ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్ర నిడివి కొద్దిసేపే అయినప్పటికీ సినిమాకు ఆమె సన్నివేశాలే కీలకం. యాత్ర పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఎస్పీ పాత్రలో సంపత్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్రలో పోసాని, జైలర్‌గా మురళి శర్మ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించడంలో చంద్రశేఖర్ యేలేటి సిద్ధహస్తుడు. ఆయన కథలు జీవితాల్లో నుంచి పుడతాయి. ఆ జీవితాల చుట్టూనే తిరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోను కొన్ని సంఘటనలు.. అవి అందించే ఎమోషన్లు ఉంటాయి. అలాంటి కథలను తీసుకుని.. అనుభూతి ప్రధానంగా తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. చెక్ సినిమా కూడా అంతే. గత సినిమాలే మాదిరే మైండ్ గేమ్‌కి పెద్ద పీట వేశాడు. క్షమా భిక్ష, చెస్ గేమ్ నేపథ్యంలో కథనంతా నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా నార్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ట్విస్ట్‌లన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. కానీ ఎక్కువ సన్నివేశాలు జైలులోనే కనిపించడం కాస్త బోర్ కొట్టించే అంశం. ఇక నేషనల్ చెస్ చాంపియన్ విజేతగా హీరో నిలిచే సన్నివేశాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అలాగే లాయర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా వచ్చి అలా వేళ్తున్నట్లు అనిపిస్తోంది. ఇక క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించదు. ఇక్కడా దర్శకుడు యేలేటి తన మార్క్‌ను చూపించాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తోంది. అయితే హీరో ఎలా బయటపడ్డాడో చెప్పే విశ్లేషణ మాత్రం బాగుంటుంది. అలాగే సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెబుతూ కథను ముగించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే బాగుంది. ఇక కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఉన్న ఒక్క పాట పర్వాలేదనిపిస్తోంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫి బాగుంది. జైలు సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. అనల్ అనిరుద్దన్ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి ప్లస్ పాయింట్స్ కథా, కథనాలు నితిన్, సాయిచంద్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సీన్లు క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
షూటింగ్లో నితిన్పైకెక్కి కింద పడ్డ ప్రియా ప్రకాశ్
కన్ను గీటు భామ, కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, యంగ్ హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీ ఇవాళ(ఫిబ్రవరి 26) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ ‘చెక్’ మూవీ షూటింగ్లో సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. మూవీ షూటింగ్‌లోని ఓ రోమాంటిక్ సన్నివేశం చిత్రీకరణలో నితిన్ నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ తర్వాత వెనకాలే ప్రియా ప్రకాశ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా నితిన్ వీపుపైకి ఎగిరి ఎక్కుతుంది. దీంతో పట్టు తప్పి నెలపై వెల్లకిలా పడిపోయింది. ఆమె పడిపోగానే చూట్టు ఉన్న మూవీ యూనిట్ సభ్యులు ఆమె దగ్గరి వచ్చి పైకి లేపారు. అయితే తనకి ఏమి కాలేదు అన్నట్లు ప్రియా సైగ చేసి కొద్ది సమయం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటుంది. దీనికి ‘జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను విశ్వాసంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో ప్రాతినిథ్యం వహిస్తుంది’ అంటూ షేర్ చేసింది. కాగా వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్‌కు జోడిగా ప్రియా ప్రకాశ్, రకుల్ ప్రిత్ సింగ్‌లు కథానాయికలుగా నటించారు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) చదవండి: రకుల్‌ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?! -
రకుల్‌ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్
'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'సాహసం' వంటి వినూత్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చెక్. ఈ సినిమా టీజర్ చూడగానే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనిపించిందని, కథాంశం అంత వైవిధ్యంగా ఉందని టాప్ డైరెక్టర్ రాజమౌళే కితాబిచ్చారంటే ఈ టీజర్ జనాలను ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ చిత్రం నుంచి 'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను..' పాట ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో తన ప్రియురాలు ప్రియా ప్రకాశ్ వారియర్‌ను చూడలేకుండా ఉండలేకపోతున్నానని పాడుతున్నాడు నితిన్. అక్కడేమో ప్రియా తన అందంతో హీరోనే కాదు కుర్రకారును కూడా తన వెంటపడేలా చేస్తోంది. ఈ సాంగ్ ప్రోమో రిలీజైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో #PriyaPrakashVarrier అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమాలో రకుల్ కన్నా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ప్రియానే బాగుందంటున్నారు కొందరు నెటిజన్లు. చెక్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ప్రియా వచ్చీరావడంతోనే రకుల్‌ను డామినేట్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అవకముందే ఈ మలయాళీ ముద్దుగుమ్మ అందచందాలు, నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా తర్వాత ప్రియాకు తెలుగులో ఇంకెన్ని అవకాశాలు వస్తాయో చూడాలి! కాగా చెక్ సినిమాలో ప్రియా హొయలను చూడాలన్నా, ఉగ్రవాదిగా నితిన్, లాయర్‌గా రకుల్ ఏ మేరకు మెప్పిస్తారో తెలియాలన్నా ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే! చదవండి: కాలంతో పాటు వెళ్లడమే మంచిది: దర్శకుడు హైదరాబాద్‌లో పవన్ షూటింగ్.. భారీ సెట్ -
‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
ఆ హద్దుల్ని చెక్ చెరిపేస్తుందనుకుంటున్నాను
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా టీజర్ రిలీజ్ అవగానే థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేయాలనిపించింది. కథాంశం వైవిధ్యంగా ఉంది. మాస్ సినిమా, క్లాస్ సినిమాకు ఉన్న హద్దుల్ని ఈ సినిమా చెరిపేస్తుందనుకుంటున్నాను. వైవిధ్యమైన సినిమాను కూడా ప్రేక్షకులు ఓ మాస్ సినిమాలా ఆదరిస్తారనుకుంటున్నాను. నితిన్ అన్ని రకాల సినిమాలు చేయగలడనిపించుకుంటున్నాడు’’ అన్నారు. ‘‘చెక్’ పెద్ద బ్లాక్‌బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా నటన వేరేలా ఉంటుంది. నాకు వచ్చిన నటనను మార్చుకుని కొత్తగా నేర్చుకుని ఈ సినిమా చేశాను. యేలేటిగారు ఈ సినిమాకు చాలా డబ్బులు రావాలి అన్నారు. తప్పకుండా వస్తాయి. ఈ సినిమాకి కల్యాణీ మాలిక్ మ్యూజిక్ పెద్ద బలం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఎవ్వర్నీ నిరుత్సాహపరచదు’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ‘‘రెండు సక్సెస్‌ల (ఓ పిట్ట కథ, మిడిల్ క్లాస్ మెలోడీస్) తర్వాత మూడో చిత్రంతో వస్తున్నాం. నితిన్‌కి గుర్తుండిపోయే చిత్రమిది’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో రమా రాజమౌళి, హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్, దర్శకులు గోపీచంద్ మలినేని, వెంకీ కుడుముల, నటుడు సంపత్ మాట్లాడారు. -
కాలంతో పాటు వెళ్లడమే మంచిది
‘‘నేను తీసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచి ఉండొచ్చు. కానీ ‘చెక్’ మాత్రం నిరుత్సాహపరచదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అన్నారు. నితిన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెక్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెప్పిన విశేషాలు. ► నితిన్ తో సినిమా చేయాలనుకున్నాం. రెండుమూడు కథలు అనుకున్నా కుదరలేదు. ఫైనల్‌గా ‘చెక్’ బావుంటుందనుకుని చేశాం. నితిన్‌ని మైండ్‌లో పెట్టుకుని ఈ కథ రాయలేదు. కథ పూర్తయ్యాక కలిశాను. తనకి ‘చెక్’ పాత్ర బాగా సూట్ అవుతుందని చేశాం. ఈ సినిమాలో హ్యూమన్ డ్రామా ఆకట్టుకుంటుంది. ► హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. అయితే బాగా తెలివైనవాడు. క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్ చేస్తుంటాడు. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడుతుంది. అతను క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకుంటాడు. హీరో చెస్ బాగా ఆడి వరుసగా విజయాలు సాధిస్తున్నాడని అతడిపై సానుభూతి కలిగి, ఉరిశిక్షపై రాష్ట్రపతికి అభిప్రాయం మారొచ్చు. ఆట, క్షమాభిక్ష... ఈ రెండు అంశాల నేపథ్యంలో ‘చెక్’ సన్నివేశాలు ఉంటాయి. ఈ కథలో చదరంగం ఆటకు చాలా ప్రాధాన్యం ఉంది. ► 70 శాతం సినిమా జైలులో సాగుతుంది. కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది. ‘ఐతే’ తర్వాత నేను, కల్యాణీ మాలిక్ పని చేయాలనుకున్నా పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇప్పుడు కుదరడం అదృష్టం అనుకోవాలి. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ చిత్రంలో రకుల్ న్యాయవాదిగా నటించారు. ప్రియా ప్రకాశ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ► ఆనందప్రసాద్ చాలా మంచి నిర్మాత. మొదట కథ వింటారు. కథ నచ్చితే మళ్లీ ఫైనల్ కాపీ చూస్తారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవిగారు వెనుక ఉండి నడిపిస్తుంటారు. ‘ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్డ్’ అని చాలామంది నన్ను అంటారు.. అడ్వాన్స్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి. ► ‘చెక్’ సినిమాకన్నా ముందే రెండు సినిమాలు ఒప్పుకున్నాను. వాటిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరే సంస్థలో మరో సినిమా చేస్తాను. -
ప్రియా ప్రకాశ్ వారియర్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా
‘‘నా కెరీర్లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ జానర్ సినిమాలు చాలా ఉన్నాయి. ‘చెక్’ లాంటి యునిక్ కథతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. చంద్రశేఖర్ యేలేటిగారు చెప్పిన 15 నిమిషాల కథ విని సినిమా చేసేందుకు ఒప్పుకున్నా’’ అని హీరో నితిన్ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియిర్ హీరోయిన్లు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరు. ఈ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డా. అవుట్‌పుట్ చూశాక మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనిపించింది. కల్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది’’ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ–‘‘చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తన తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్’ సినిమా కథ. ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకుని సెకండాఫ్ వర్కవుట్ కాక వదిలేశాం. తను లేకపోతే ‘చెక్’ సినిమా లేదు’’ అన్నారు. ‘‘మా సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ‘చెక్’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. ‘‘ఈ సినిమాలో నటించడం పద్మ అవార్డు అందుకున్నంత సంతోషంగానూ ఉంది’’ అన్నారు నటుడు సాయిచంద్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్, ప్రియా ప్రకాశ్ వారియర్, అన్నే రవి తదితరులు పాల్గొన్నారు. -
ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?!
యంగ్ హీరో నితిన్ ఖైదీగా నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్ ప్రారంభమైంది. జైల్లో ఓ పెద్దాయన ఒంటరిగా చెస్ ఆడుతుండటం చూసిన ఆదిత్య(నితిన్) ప్రత్యర్థి ఉంటేనే కిక్కు.. అంటూ ఆటలో దిగాడు. తర్వాత అతడు వేసే ఒక్కో ఎత్తుగడ చూసి ఆశ్చర్యపోవడం పెద్దాయన వంతైంది. అయితే ఆదిత్య ఆటతీరును చూసిన ఆయన చెస్‌లో ఉన్న ఒక్కో పావు గుణగణాలను చెప్తూ దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. అలా ఏనుగు, గుర్రం, ఒంటె గురించి చెప్తున్న కొద్దీ దానికి సరిగ్గా సరిపోయే పాత్రలను తెరమీద చూపించారు. మొత్తానికి కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదిత్య చదరంగంలో తోపు అని తెలుస్తోంది. (చదవండి: నితిన్ ‘చెక్’ ఫస్ట్ గింప్స్ వచ్చేసింది) కానీ టెర్రరిస్టుతో చెస్ ఆడిస్తారా? అని నిలదీస్తున్నాడో వ్యక్తి. పైగా అతడిని దేశద్రోహి అని పోలీసులు ఛీ కొడుతున్నారు. దీంతో దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది లాయర్ రకుల్. ఉరిశిక్ష పడ్డ ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఏమైనా ఉందా అని దారులు వెతుకుతోంది. కానీ ఒకానొక సమయంలో ఆ కేసు నుంచి ఎందుకు తప్పుకునేంది ఆసక్తికరంగా మారింది. రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి అన్న వ్యక్తికి 'యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి' అని రివర్స్ కౌంటరిస్తున్నాడు ఆదిత్య. సమయం దొరికినప్పుడు తోటి ఖైదీలను చితక్కొడుతున్నాడు కూడా! అసలు నితిన్ దేశద్రోహి ఎందుకయ్యాడు? అతడు ఉరి శిక్షను తప్పించుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఎత్తులకు పై ఎత్తులతో ఈజీగా చెక్ పెడుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత నితిన్ మరో చిత్రం 'రంగ్‌దే' రిలీజ్ అవుతోంది. (చదవండి: 'ఆర్ఆర్ఆర్’లో నా క్యారెక్టర్ అదే : రామ్‌చరణ్) -
రాహుల్ సిప్లిగంజ్ ‘లడిలడి’ సాంగ్.. వైరల్
రోహిత్ నందన్, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నో ఐడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకం ‘లడిలడి’ అనే పాట రూపొందింది. శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించగా, ‘బిగ్ బాస్ 3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటకు రఘు మాస్టర్ డ్యాన్స్ సమకూర్చారు. ఈ పాటని ఇటీవల విడుదల చేశారు. రోహిత్ నందన్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుని డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకున్నాను. లాక్ డౌన్ సమయంలో నా స్నేహితుడు శ్రీచరణ్ పాకాలతో కలిసి ఈ ‘లడిలడి’ అనే పాట చేయాలనుకున్నాను. ఈ పాట ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె ఈ పాటలో డ్యాన్స్ చేయడమే కాదు.. పాడటం విశేషం. తొలిసారి నేను చేసిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం, యూట్యూబ్‌లో మిలియన్‌కిపైగా వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను త్వరలోనే హీరోగా ఓ ప్రముఖ దర్శకుడితో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అన్నారు. -
మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాష్
మాలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’లో కన్ను గీటే సన్నివేశంలో నటించి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. అలా సోషల్ మీడియాల్లో సెన్సేషనల్ అయిన ప్రియా మాలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేటు ఆల్బమ్‌లో కూడా ఆడిపాడింది. లడి లడి అంటూ సాగే ఈ పాటలో ప్రియా తన మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటోంది. కొత్త నటుడు రోహిత్ నందన్‌తో కలిసి ఆమె చిందులేసిన ఈ పాటకు రఘు మాస్టర్ కోరియోగ్రాఫి అందించగా.. బిగ్‌బాస్ 3 ఫేం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. పాకాల శ్రీచరణ్ సంగీతం సమకూర్చగా.. విస్పాప్రగడ లిరిక్స్ అందించారు. ఈ సంక్రాంతి సందర్భంగా మ్యాంగో సంస్థ వారు ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో దుమ్మురేపుతోంది. మాస్ బీట్‌లో రాహుల్ సిప్లిగంజ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా ఫీమెల్ వాయిస్‌ను ప్రియా అందించారు. (చదవండి: సింగర్ అవతారమెత్తిన ‘కన్ను గీటు’ భామ) ఇప్పటి వరకు ఈ పాటకు ఒక మిన్యన్ వ్యూస్ రావడంతో ప్రియా ప్రకాష్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నారు. ‘లడి లడి పాట ఒక మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని నేనే గ్రహించలేదు. ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్న. ఈ సందర్భంగా నా టీంకి కూడా ధన్యవాదాలు. ఇది నా ఒక్కదాని బలం కాదు, రఘు మాస్టర్ టీంతోనే సాధ్యమైంది. దానికి నేను న్యాయం చేయగలిగాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక పాట చిత్రీకరణ సమయంలో ఆమె చాలా సార్లు గాయపడినట్లు పేర్కొంది. రిహార్సల్స్‌లోనూ చాలా ఇబ్బంది పడ్డానని, కానీ ఈ పాటకు ఇంతమంచి రెస్పాన్స్ రావడంతో ఆ బాధ మొత్తం పోయి చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ప్రియా తెలుగులో నితిన్ సరసన చెక్ మూవీ నటిస్తున్నారు. (చదవండి: చెక్ మాస్టర్) -
చెక్ మాస్టర్
ఆదిత్య ఓ అద్భుతమైన చెస్ ప్లేయర్. ఎత్తులు పైఎత్తులతో ఈజీగా చెక్ పెట్టగలడు. కానీ ౖజñ ల్లో చిక్కుకున్నాడు. ఈ చెస్ ప్లేయర్ కారాగారంలో ఎలా చిక్కుక్కున్నాడు? అనేది ‘చెక్’ చూసి తెలుసుకోవాలి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియాప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. చెస్ ప్లేయర్ ఆదిత్య పాత్రలో నితిన్ నటించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణీ మాలిక్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. -
సింగర్ అవతారమెత్తిన ‘కన్ను గీటు’ భామ
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న మలయాళీ కుట్టి. . కేవలం 30 సెకండ్స్ వీడియోలో కన్నుకొట్టి దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. అప్పట్లో ఈ వీడియో పై ఎన్నో వేల ట్రోల్స్ వచ్చాయి. ఈమె నటించిన 'ఒరు ఆడార్ లవ్' ఫ్లాప్ అయినా ప్రియాకు మాత్రం ఆ సినిమా విడుదలకు ముందే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ సినిమా ప్లాప్ వల్ల ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు దక్కలేదు. శ్రీదేవి బంగ్లా అంటూ హిందీలో ఒక సినిమా చేసినా అది విడుదల కాలేదు. ప్రస్తుతం తెలుగులో నితిన్, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'చెక్' చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. అంతకు మించి ఈ మలయాళీ కుట్టి దగ్గర ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవు. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో తన రూట్ మార్చుకుని తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టేందుకు రెడీ అవుతోందట. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో తనలో ఉన్న గాయనిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతుండట. సింగర్‌గా అవతారమెత్తి ప్రేక్షకులను మనసును దోచుకునే పనిలో బీజీగా ఉందట. ఈ క్రమంలోనే శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వంలో ఓ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ పాట పాడిందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో విడుదల కానున్నట్లు సమాచారం. -
చివరి షెడ్యూల్లో చెక్
నితిన్ హీరోగా రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘చెక్’. వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నూతన షెడ్యూల్ ఈ నెల పదో తేదీన హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్’ అని టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వచ్చింది. వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. ప్రస్తుతం నితిన్, రకుల్‌ప్రీత్, సంపత్‌రాజ్, సాయిచంద్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు. -
చెక్ ఎవరికి?
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను, ప్రీ లుక్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఈ సినిమా గురించి ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం చూస్తారు. సినిమాలో ఎవరు ఎవరికి చెక్ పెడతారన్నది సస్పెన్స్’’ అన్నారు. ‘‘ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ కనిపిస్తారు. చదరంగం నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సాయిచంద్, సంపత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. -
వారియర్ అయ్యారు సింగర్
కన్ను గీటి ఆన్లైన్లో బాగా పాపులర్ అయ్యారు మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’లో కన్ను కొట్టే సన్నివేశం ప్రియా ప్రకాష్‌ను దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది. తాజాగా ప్రియా వారియర్ సింగర్‌గా మారారు. ఓ హిందీ మ్యూజిక్ వీడియోలో నటించి, ఆ పాటను ఆలపించారామె. అశోకన్ పి. దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్ వీడియో త్వరలోనే విడుదల కానుంది. ఈ పాట టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. క్రిస్టస్ స్టీఫెన్ సంగీతం అందించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఈ మ్యూజిక్ వీడియోను షూట్ చేశామని టీమ్ పేర్కొంది. -
జోడీ కుదిరిందా?
తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తమిళ రీమేక్‌తో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ తమిళంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు మురుగదాస్ శిష్యుడు రవికాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ధృవ్. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా ఎంపికైందని టాక్. ‘ఒరు అడార్ లవ్’ చిత్రంలో కన్ను గీటి యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ మధ్య వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ కేరళ కుట్టి జోరుకి ఈ మధ్య కాస్త బ్రేకులు పడ్డాయని మాలీవుడ్ టాక్. దాంతో ధృవ్ సినిమాలో సోలో హీరోయిన్గా అవకాశం రావడంతో ఈ బ్యూటీ ఫుల్ ఖుషీ అవుతున్నారట. కాగా నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలోనూ ప్రియా ప్రకాష్ వారియర్‌కి రెండో హీరోయిన్గా అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ప్రియా.. ప్రియా... వెళ్లొద్దే!
రెండేళ్ల క్రితం ‘ఒరు అడార్ లవ్’ సినిమా టీజర్లో కన్ను కొడుతూ కనిపించి, ‘కన్నుకుట్టి’గా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు ప్రియా ప్రకాష్ వారియర్. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ఒక్కరోజులోనే ఆరులక్షల ఫాలోయర్స్‌ను సంపాదించిన ఇండియన్ సెలబ్రిటీగా సోషల్ మీడియా రికార్డును దక్కించుకున్న ఘనత ప్రియాది. తాజాగా ప్రియ తన ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం చర్చనీయాంశమైంది. ‘‘మా అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసింది. ఇది తాత్కాలికం మాత్రమే. తను కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటోంది. కొంత సమయం తర్వాత ఆమె తిరిగి ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ కావొచ్చు’’ అని ప్రియ తండ్రి ప్రకాష్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రియ తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించిందని, అందుకే ప్రియ ఇలా చేశారని టాక్. సోషల్ మీడియా స్టార్ కన్నా కూడా నటిగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు ఇటీవలే టిక్‌టాక్‌లో జాయిన్ అయ్యారు ప్రియాప్రకాష్. ప్రస్తుతం ఆమె ఫేస్బుక్, టిక్‌టాక్ అకౌంట్స్ యాక్టివ్గానే ఉన్నాయి. ఇన్‌స్టా నుంచి ఈ కన్నుకుట్టి వెళ్లగానే ‘ప్రియా.. ప్రియా.. వెళ్లొద్దే’ అంటూ అభిమానులు బాధపడిపోతున్నారు. -
ప్రియా షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్
ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన అందాల భామ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ సినిమా ఒరు ఆదార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) సినిమాలో కన్ను గీటే సీన్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో తెగ క్రేజ్ ఉంది. కుర్రకారును పిచ్చెక్కిచ్చే ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చూస్తూ వారిని అలరిస్తుంటారు. దీంతో ఇన్‌స్టాలో 7.2 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించారు ప్రియా. ఫోటో లేక వీడియో పెట్టడం ఆలస్యం క్షణాల్లోనే వేలల్లో లైకులు, లక్షల్లో వీక్షణలు వస్తుంటాయి. ఈ మధ్యే టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ పలు వీడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ హఠాత్తుగా అభిమానులకు షాక్‌కు గురిచేస్తూ ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నారు. కొందరు తనను పనికట్టుకొని ట్రోల్‌కు గురిచేస్తున్నారనే అసహనంలో ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం కొద్ది రోజులు మాత్రమే సోషల్ మీడియాకు దూరంగా ఉంటానిని, త్వరలోనే తిరిగి వస్తానని సన్నిహితువద్ద పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ మలయాళ బ్యూటీ ఇన్‌స్టా నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో అధికారికంగా తెలియనప్పటకీ ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు మాత్రం కలవరపడుతున్నారు. చదవండి: ‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా? అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా? -
మరోసారి మాయ చేసిన ప్రియా ప్రకాశ్!.
ఒక్క కన్నుగీటుతో రాత్రి రాత్రే స్టార్‌గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వరుసగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలో రెడ్ షర్ట్, జీన్స్ ధరించి.. కళ్లద్దాలతో స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు ఈసారి తన సిగ్నేచర్ మార్క్‌తో కాకుండా.. ఫ్లైయింగ్ కిస్‌తో నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది. అదే విధంగా తన కో-స్టార్ రోషన్ అబ్దుల్ రహూఫ్తో కలిసి ఓ మలయాళ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌కు సంబంధించిన విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంది. కాగా ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్‌తో ఆమె నటించిన తొలి సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మలయాళంలో రూపొందిన ఈ చిత్రాన్ని మాతృభాషలోనే కాకుండా చాలా తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశారు. అయితే కథలో అంతగా బలం లేకపోవడంతో ఈ మూవీ పూర్తిగా నిరాశ పరిచింది. అయినప్పటికీ ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మోడలింగ్, వాణిజ్యప్రకటనలతో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే సినిమాల విషయానికొస్తే ఆమెకు తగినన్ని అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ప్రియా ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ వివాదాస్పదంగా మారడంతో.. ఆ సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on Feb 14, 2020 at 3:40am PST -
నైన్త్ క్లాస్‌లోనే ప్రేమలో పడ్డాను
సినిమా: పడ్డానండీ ప్రేమలో మరి.. విడ్డూరంగా ఉందిలే ఇదీ. ఏమిటీ పాటల గోల అని అనుకుంటున్నారా? నటి ప్రియా ప్రకాశ్‌వారియర్ కూడా తన విడ్డూరమైన ప్రేమ గురించి ఇటీవల చెప్పుకొచ్చింది. సాధారణంగా ఓ నటికి ఒక సినిమా హిట్ అయినా పెద్దగా క్రేజ్ రాదు. అదీ సంచలన విజయం సాధిస్తే పేరు రావచ్చు. అయితే తొలి చిత్ర ట్రైలర్‌తోనే అనూహ్య క్రేజ్‌ను సంపాదించుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌వారియర్. అంతే కాదు ఆ ఒక్క ట్రైలర్‌తోనే ఆ చిత్రం ఏకంగా మూడు భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రమే ఒరు ఆదార్ లవ్. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం మాతృభాషలోనే కాకుండా చాలా అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లోనూ అనువాదమైంది. అయితే పూర్తిగా నిరాశ పరిచింది. అయినా నటి ప్రియాప్రకాశ్వారియర్కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. మోడలింగ్, వాణిజ్యప్రకటనలు, మోడలింగ్ అంటూ యమ బిజీ అయిపోయింది. ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా అనే చిత్రంలో నటిస్తోంది. ఇది అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ అనే ప్రచారం జరగడంతో పెద్ద వివాదాంశంగా మారింది. ఇకపోతే తెలుగులో ఈ అమ్మడిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిందీలో నటించాలనే ఆసక్తితో ఉన్న ప్రియా ప్రకాశ్‌వారియర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ బ్యూటీ ఏదో ఒక అంశంతో తరచూ వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటోందనిపిస్తోంది. తాజాగా తన తొలి ప్రేమ వ్యవహారం గురించి ఇలా చెప్పుకొచ్చింది. “నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డాను. సహ నటుడు నన్ను ప్రేమించాడు. ఆ విషయాన్ని ఒక రోజు నాకు చెప్పాడు. అతని సిన్సియారిటీ ప్రపోజల్ ఆకట్టుకోవడంతో నేనూ అతన్ని ప్రేమించాను. అలా కొన్ని రోజులు ఒకరినొకరం ప్రేమలో మునిగి తేలాం. అయితే ఆ వయసులో ప్రేమ నాకే విడ్డూరంగా అనిపించింది. దీంతో మన మధ్య ఉన్నది తెలిసీ తెలియని వయసు ప్రేమ అని, ఇందులో మోహం మినహా నిజమైన ప్రేమ ఉండదని అతనికి చెప్పాను. నేను వివరించిన తీరు అతన్ని కన్వెన్స్ చేసింది. దీంతో ప్రేమకు దూరం అయ్యాం.అయితే ఇప్పటికీ మా మధ్య స్నేహం కొనసాగుతూనే ఉందని’ చెప్పింది. -
నువ్వంటే నాకు చాలా ఇష్టం : ప్రియా ప్రకాష్
ఒక్కసారి కన్నుగీటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆదార్ లవ్ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ఈ భామ త్వరలో బాలీవుడ్ వివాదాస్పద చిత్రం శ్రీదేవి బంగ్లాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మలయాళ, హిందీ ఇండస్ట్రీలలో బిజీగా ఉన్న ఈ భామకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అంటే చాలా ఇష్టమట. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోతో పాటు ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అంటూ కామెంట్ చేశారు ప్రియా. ఈ ఫోటో ఏ సందర్భంలో దిగారన్న విషయం వెల్లడించకపోయినా ప్రియా పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. View this post on Instagram Nuvvante naaku chala ishtam😋 A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on Aug 7, 2019 at 11:10pm PDT -
‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్
ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియ ప్రకాష్ వారియర్. తొలి సినిమా ఒరు ఆదార్ లవ్ రిలీజ్‌కు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ప్రియా ఆ సినిమా ఫ్లాప్ అయినా తనపై వచ్చిన క్రేజ్‌ను మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ఓ వివాదాస్పద చిత్రంలో నటిస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రియా ప్రకాష్ నటిస్తున్న తాజా చిత్ర ‘శ్రీదేవి బంగ్లా’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే వివాదం మొదలైంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ శ్రీదేవి అనే నటి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు బాత్‌టబ్‌లు మునిగి చనిపోయినట్టుగా చూపించటంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ చిత్రయూనిట్‌కు నోటీసులు పంపారు. అయితే ఈ వివాదంపై స్పందించిన నటి ప్రియా ప్రకాష్, ఈ వివాదాలన్నీ చిన్న విషయాలంటూ కొట్టి పారేశారు. నటిగా నా పాత్రకు న్యాయం చేయటం వరకే నా బాద్యత, వివాదాలు వస్తే దర్శక నిర్మాతలు చూసుకుంటారు. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆరాత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ దర్శకుడు. -
వారేవా ఏమి స్పీడు
కెరీర్ ట్రాక్‌లో స్పీడ్ గేర్ వేశారు నితిన్. ఇటీవలే ‘భీష్మ’ షూటింగ్‌ను షురూ చేసిన నితిన్ తన తర్వాతి చిత్రానికి ఆదివారం కొబ్బరికాయ కొట్టారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ముహూర్తపు సన్నివేశానికి వి. ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నితిన్ కెరీర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా ఉంటుంది. చంద్రశేఖర్ యేలేటిగారు తీసుకున్న పాయింట్ గొప్పగా, వైవిధ్యంగా ఉంటుంది. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. షూటింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా కృష్ణచైతన్య దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నితిన్. -
సోషల్‌మీడియా సెన్సేషన్‌కు.. తెలుగులో చాన్స్
ఓవర్‌నైట్‌లో వచ్చిన స్టార్‌డమ్‌ను ఎక్కువకాలం నిలుపుకోలేకపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఒకే ఒక్క కనుగీటు, ముద్దుగన్నుతో కుర్ర హృదయాలను పేల్చిన ప్రియా వారియర్.. ‘లవర్స్ డే’ సినిమాతో చతికిల పడింది. ఈ సినిమా రిలీజైన తరువాత ప్రియా వారియర్‌కు గడ్డుకాలం మొదలైంది. ఈ మూవీలో తన లుక్స్, నటనకు నెగెటివ్ టాక్ వచ్చింది. అప్పటివరకు ఆమెకు క్యూ కట్టిన ఆఫర్స్ అన్నీ ఆవిరయ్యాయి. లవర్స్ డే రిలీజైన తరువాత దాదాపు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా తెలుగులో ఓ అవకాశాన్ని దక్కించుకుంది. నితిన్-చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో ప్రియా వారియర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్రయూనిట్ నేడు నిర్వహించింది. భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ నటిస్తుండగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రంలో బిజీగా ఉన్నాడు. -
మరో ప్రియా ప్రకాశ్ వారియర్..!
ప్రియా ప్రకాశ్ వారియర్ గుర్తుందిగా.. ఒక్క కన్ను గీటుతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌గా మారిపోయింది. ప్రియా ప్రకాశ్లానే ప్రస్తుతం మరో అమ్మాయి కూడా ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారింది. ఆ వివరాలు.. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గత శనివారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్‌రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ యువతి మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కెమెరాలు ఈ యువతిని స్క్రీన్‌పై చూపించడంతో ఆమె చేష్టలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆర్సీబీకి మద్దతుగా వచ్చిన ఆ యువతి మ్యాచ్ జరిగినంత సేపు గ్యాలరీలో తన తోటి ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరలవుతున్నాయి. చివరకు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఈ యువతి గురించి ట్విటర్ సాక్షిగా రెస్పాండ్ అయ్యాడు. ఈ అమ్మాయిని మన ప్రతీ మ్యాచ్ కు ఇన్వైట్ చేయాల్సిందేనంటూ కామెంట్ చేశాడు. దాంతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ అమ్మాయి గురించి ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా ఆమె పేరు దీపిక ఘోష్‌గా గుర్తించారు. View this post on Instagram #RCB girl forever ❤️🏏 A post shared by deepika (@deeghose) on May 4, 2019 at 12:51pm PDT దాంతో ఒక్క రాత్రిలోనే ఈ యువతి ఇన్స్టాగ్రామ్ ఫాలవోర్ల సంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. ఒక్క సారి తన ఫాలోవర్స్ పెరగడంతో ఈ యువతి కూడా తనను తాను ఆర్సీబీ గర్ల్‌గా ప్రకటించుకుంది. అంతేకాక తన పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్లను ఫాలో కావద్దని కోరింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇదే ఆఖరి మ్యాచ్. ఈ సీజన్ ప్రారంభం నుంచి పేలవ ప్రదర్శన చేసిన ఆర్సీబీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో అభిమానులు సైతం తెగ ఆనందపడ్డారు. -
లవ్‌ను హ్యాక్ చేస్తా
‘ఇది డిజిటల్ యుగం. జాగ్రత్తగా లేకపోతే మన ఇన్ఫర్మేషన్ అయినా, మన లవ్ అయినా ఈజీగా హ్యాక్ అయిపోతుంది’ అంటున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. కేవలం కన్ను గీటి సౌత్ నుంచి నార్త్ వరకూ పాపులర్ అయ్యారు ప్రియా ప్రకాశ్ వారియర్. తన తొలి సినిమా ‘ఒరు అధార్ లవ్’ రిలీజ్ కంటే ముందే బాలీవుడ్ ఆఫర్ సంపాదించుకున్నారు. ‘ఒరు అధార్ లవ్’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. బాలీవుడ్ తొలి సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ వివాదాల్లో ఉంది. లేటెస్ట్గా బాలీవుడ్లో మరో సినిమా సైన్ చేశారు ప్రియా వారియర్. మయాంక్ ప్రకాశ్ శ్రీవాత్సవ్ రూపొందించనున్న ‘లవ్ హ్యాకర్స్’ సినిమాలో హీరోయిన్గా ప్రియా ప్రకాశ్ యాక్ట్ చేయనున్నారు. సైబర్‌క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమా గురించి ప్రియా వారియర్ మాట్లాడుతూ – ‘‘అనుకోకుండా ఓ ట్రాప్‌లో చిక్కుకున్న హీరోయిన్ తన తెలివితేటలతో చాకచక్యంగా ఎలా తప్పించుకుంది? అనేది కథ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది’’ అని అన్నారు. -
శ్రీదేవికి కళంకం ఆపాదించగలమా!
శ్రీదేవికి కళంకం ఆపాదించాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదంటున్నారు హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమాలతో పని లేకుండా ఒక్క కన్ను గీటుతోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుంది ప్రియా ప్రకాశ్ వారియర్. తొలి చిత్రం ఒరు ఆదార్ లవ్ ట్రైలర్‌తోనే అనూహ్య పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ కేరళ కుట్టి. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రియా ప్రకాశ్ ఏకంగా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం అంది పుచ్చుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రసాద్ మాంపుళ్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటిస్తుంది. అయితే నిర్మాణం పూర్తి కాకముందే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటి శ్రీదేవికి సంబంధించిన చర్చనీయాంశ సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరగడంతో ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే ఈ చిత్రం పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. శ్రీదేవి బంగ్లా చిత్రాన్ని చట్టబద్ధంగా అడ్డుకుంటామని శ్రీదేవి భర్త బోనీకపూర్ ప్రకటించారు. ఈ వివాదంపై నటి ప్రియా ప్రకాశ్ స్పందిస్తూ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసింది. అందులో.. శ్రీదేవి బంగ్లా చిత్రం నటి శ్రీదేవి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్నది కాదని స్పష్టం చేసింది. ఈ చిత్రానికి ఆమెకు ఎలాంటి సబంధం ఉండదని అంది. శ్రీదేవి జీవిత చరిత్రనో, ఆమె మరణం సంఘటనలతోనో చిత్రాన్ని రూపొందించి ఆమె కుటుంబం మనోభావాలను కించపరచాలన్నది తమ అభిమతం కాదని అంది. శ్రీదేవికి కళంకం ఆపాదించాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొంది. శ్రీదేవి బంగ్లా పూర్తిగా సాధారణ సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్ర టైటిల్‌ను నిర్ణయించడం, శ్రీదేవి మరణించడం ఒకే సమయంలో జరగడం యాదృచ్చికమేనని చెప్పింది. అందుకే ఇంత దూమారం చెలరేగుతోందని ప్రియాప్రకాశ్ పేర్కొంది -
సినీ హోలీ
రంగురంగుల హోలీ వేడుకల్లో ఆనందాన్ని చల్లుకుని, చిరునవ్వులను పంచుకుని అనుభూతులను దాచుకున్నారు సినీ తారలు. కొందరు కుటుంబంతో హోలీని జరుపుకుంటే మరికొందరు హోలీడే అయినా నో హాలిడే అంటూ సెట్లో జరపుకున్నారు. మరికొందరు స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. వాటిలో కొన్ని ఫొటోలే ఇక్కడున్నవి. సన్నీ లియోన్ కల్యాణ్ దేవ్, శ్రీజ కత్రినా కైఫ్ కృతీ సనన్, కంగన నిహారిక, అల్లు అర్జున్, స్నేహ వరుణ్, నటాషా అమలా పాల్, ప్రియా ప్రకాశ్ రాయ్ లక్ష్మీ -
ఉల్కలు– ఉరుములు
ప్రజాభిమానాన్ని చూరగొనడానికి సుదీర్ఘ పరిశ్రమ, ప్రతిభ, కొండొకచో చిన్న అదృష్టం కలిసి రావాలంటారు. అయితే ఇవేవీ అక్కరలేని అడ్డుతోవ ఒకటుంది. నిర్భయ దుర్ఘటన, బాబ్రీ మసీద్ కూల్చివేత, అణు పరీక్ష ఇలాంటివి. అయితే కొన్ని ప్రచారాలు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆశ్చర్యమూ, షాకూ కలుగుతుంది. ఈ మధ్య సినీరంగంలో ఈ అడ్డుతోవల సంఘటనలు, ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి అనూహ్యం, ఆశ్చర్యకరం, ఇంకా చెప్పాలంటే విచిత్రం, విలక్షణం. ఈ మధ్య ఒమార్ లులు అనే దర్శకుడు ‘‘ఒరు ఆధార్ లవ్’’ అనే మలయాళ సినిమాను నిర్మించాడు. ఇది పామర భాషలో ‘విరగదీసే’ చిత్రం కాదు. అయితే అందులో ప్రియా వారియర్ అనే కొత్త అమ్మాయి నటించింది. ఒకానొక సీన్లో ఆ పిల్ల సరదాగా దూరపు క్లాసు బెంచీలో కూర్చున్న కుర్రాడిని చూసి కన్నుకొట్టింది. కుర్రాడు నవ్వాడు. రెండు వేళ్లు బిగించి రివాల్వర్లాగా కాల్చింది. కుర్రాడు గాయపడినట్టు తలవొంచాడు. అంతే, మిన్నువిరిగి మీద పడింది. ఇదేం కొత్త విన్యాసం కాదు. కానీ ఈమె కన్నుకొట్టడాన్ని దేశం ఉర్రూతలూగి అందుకుంది. ప్రచార సాధనాలన్నీ ఒళ్లు విరుచుకుని ఈ దృశ్యాన్ని ప్రచారం చేశాయి. దేశం పిచ్చెక్కిపోయింది. ఈ పాపులారిటీ ఎంతవరకూ పోయిందంటే – దేశంలోని ఇస్లాం వర్గాలు అలా ఓ ఆడపిల్ల బరితెగించడం సంప్రదాయ విరుద్ధమని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి! ఎక్కడ చిన్న మలయాళ సినిమా? ఎక్కడ ఊసుపోని సంఘటన. సుప్రీంకోర్టు ఆశ్చర్య పోయింది. చివరకు ‘‘పోవయ్యా. ఇదేదో చిన్నపిల్లల ఆట’’ అని కేసుని కొట్టి వేసింది. కొన్నేళ్ల కిందట– కొందరు కుర్రాళ్లు కలిసి ఓ సినిమా తీశారు. ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇందులో హీరో. సినిమా పెద్ద ఊడబొడిచింది కాదు. కానీ ఆడుతూ పాడుతూ కుర్రాళ్లందరూ కలిసి – అనురుద్ రవి శంకర్ అనే కుర్రాడి ‘‘కొలవరి డీ’’ అనే పాటను రికార్డు చేశారు. అంతే, ఆ పాట కార్చిచ్చులాగా– భాషలకతీతంగా దేశంలో గంగవెర్రులెత్తించింది. ఎంత వెర్రి! బహుశా ఈ ‘కొలవరి’ నిర్మాతలే ఆశ్చర్యపోయి ఉంటారు. ఈమధ్య మా పెద్దబ్బాయి నన్ను లాక్కెళ్లి ధియేటర్లో కూర్చోపెట్టాడు. సినిమా పేరు ‘‘96’’. 1996లో కొందరు ఓ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇందులో ఆడా మగా–రకరకాల మనస్తత్వాల పిల్లలు. ఓ పదేళ్ల తర్వాత ఈ గుంపు మళ్లీ కలుసుకోవాలనుకున్నారు. కలుసుకోవడమే సినిమా. ఇందులో ఓ అమ్మాయిపట్ల మక్కువ ఉన్నా మనసిప్పలేని మొహమాటస్తుడు హీరో. ఆ పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఓ కూతుర్ని కని సింగపూర్‌లో భర్తతో కాపురం చేస్తోంది. అందరూ కలిశారు. ఇందులో ఓ అమ్మాయి గర్భవతి. నలుగురూ రకరకాలుగా జీవితాల్లో సెటిల్ అయినవారు. ఈ సింగపూర్ అమ్మాయి వచ్చింది. మొహమాటస్తుడయిన కుర్రాడూ వచ్చాడు. తెల్లవారితే మళ్లీ అందరూ విడిపోతారు. ఈ కుర్రాడికీ, ఆ అమ్మాయికీ ఇప్పుడు తమతమ మనస్సులు తెలిశాయి. నిజానికి రాత్రంతా ఏకాంతంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. కలిసి జీవించలేక పోయిన అసంతృప్తి ఇద్దరిలో–ప్రేక్షకులకీ తెలుస్తోంది. అదొక nostalgic pain. అయితే ఏకాంతంలో కూడా వారిద్దరూ సభ్యతను పాటించారు. తమ తమ దూరాల్ని ఎరిగి ప్రవర్తించారు. ఒక్కసారయినా ఏకాంతంలో తొందరపడతారా? అయినా ఒకరినొకరు కనీసం ముట్టుకోలేదు. తెల్లవారింది. ఆమెకు వీడ్కోలు చెప్పాడు హీరో. ఇద్దరి మనస్సుల్లోనూ – వాస్తవం కాని ‘కల’ అలాగే ఉండి పోయింది! ఇంతే కథ. ఇదిపెద్ద పెద్ద చిత్రాల్ని తలదన్నేసింది. హీరో కర్మాగారంలో ‘కళాసీ’లాగ ఉంటాడు. అమ్మాయి ఒప్పులకుప్ప. స్టార్. హీరో ఈసినిమాతో పెద్ద స్టార్ అయిపోయాడు. మొన్న ఒక సభలో ప్రేక్షకులు గింగుర్లెత్తి –‘మీరెలాగూ సినీమాలో ఒకరి నొకరు ఆలింగనం చేసుకోలేదు. ఇప్పుడు మా కళ్ల ముందు చేసుకోం ‘‘అని కేకలేశారు! ఆ దృశ్యానికి ప్రేక్షకుల గగ్గోలు! ప్రజా సందోహంలో ‘పాపులారిటీ’కి అర్థాలు మారిపోయాయి. అయితే – చాప్లిన్ పాపులారిటీకి కన్నుకొట్టిన కుర్రదాని పాపులారిటీకి, కొలవరికీ ‘కొల బద్దలు’ మారాయి. ఉరకలెత్తించే ఉత్తేజాలు కనిపించని ఆధునిక జీవితంలో ఈ చిన్న చిన్న ‘మెరు పుల్ని’ జనసందోహం ఏరుకుంటోందా? లక్షలాది ప్రజల సమష్టి ఆనందానికి ఇది విచిత్రమయిన కుదింపా? సినిమా హృదయాల్ని కదిలించే ఆనందానికి విడాకులిచ్చి– ఇప్పుడిప్పుడు పాపులారిటీకి నరాల్ని నమ్ముకుంటోంది. - గొల్లపూడి మారుతీరావు -
ఆ ఫొటో కావాలి!
‘‘లవర్స్ డే’ చిత్రం విడుదలయ్యాక ఇక్కడ కూడా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక కొత్త నటిగా నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేరళ కుట్టి నూరిన్ షరీఫ్. ఒమర్ లులు దర్శకత్వంలో రోషన్ అబ్దుల్, ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్ ముఖ్యతారలుగా రూపొందిన మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. ఈ చిత్రం ‘లవర్స్ డే’గా తెలుగులో ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నూరిన్ మాట్లాడుతూ– ‘‘నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. ప్రియా ప్రకాష్ వింక్ ఎపిసోడ్, స్క్రిప్ట్ కొంచెం మారడం వంటి అంశాల వల్ల నా పాత్ర నిడివి తగ్గింది. దాంతో బాధ అనిపించింది. ప్రియా ప్రకాష్‌తో నాకు గొడవలు ఏం లేవు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాత గురురాజ్ బాగా హెల్ప్ చేశారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు క్లైమాక్స్‌ను మార్చడం మంచి నిర్ణయమే అనిపించింది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు అల్లు అర్జున్‌గారి సినిమాలను టీవీలో చూశాను. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ‘లవర్స్ డే’ వేడుకకు ఆయన అతిథిగా రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయనతో ఓ ఫొటో దిగాను. ఆయన నన్ను చూసి నవ్వారు. ఆ స్మైల్ చాలు నాకు. ఆ ఫొటో ఎవరు తీశారో తెలుసుకుని తీసుకోవాలని ఉంది. ఒమర్ లులు దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు నూరిన్ షరీఫ్. -
కన్నులతో చెప్పావె.....
తొలి సినిమాతో కావచ్చు...కాలం కలిసిరాక అది ఆడకపోతే...మరో రెండు సినిమాల తరువాతనైనా కావచ్చు... బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. కానీ కేరళ కుట్టి ప్రియా వారియర్... తొలి సినిమా విడుదల కాకముందే కన్నుగీటే దృశ్యంతో స్టార్డమ్ తెచ్చుకుంది. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో నిలిచింది. ‘ఎవరీ అమ్మాయి?’ అని దేశమంతా ఆరా తీసింది. ‘లవర్స్ డే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి కొన్ని ముచ్చట్లు... అదేమిటో మరి... కేవలం ఒకేఒక సినిమాలో ఒకేఒక దృశ్యం తనకు బోలెడు గుర్తింపు తీసుకువస్తుందని కలలో కూడా అనుకోలేదు ప్రియా. తొలిచిత్రం ‘ఒరు ఆడార్ లవ్’లో చిలిపిగా కన్నుగీటే సీన్ చేసింది ప్రియా. ఈ సీన్ సోషల్‌మీడియాను కుదిపేసింది. ‘‘నిజానికి నాకంటే అందంగా కన్నుగీటే వాళ్లు చాలామంది ఉన్నారు. నాకు మాత్రం బాగా గుర్తింపు వచ్చింది’’ అని నవ్వుతుంది ప్రియా. కన్నుకొట్టే సన్నివేశం సంచలనం కావడంతో ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలో ప్రియా పాత్ర నిడివిని పెంచడం కోసం డైరెక్టర్ ఒమర్ స్క్రిప్ట్ కూడా మార్చవలసివచ్చిందట! ‘‘ప్రేక్షకులు నన్ను పెద్ద పాత్రలో చూడాలనుకుంటున్నారు’’ అంటుంది ప్రియా. ఇలా కూడా! పార్లమెంట్లో ప్రధాని మోదీని చూసి రాహుల్‌గాంధీ కన్నుగీటిన దృశ్యం టీవీలో కనిపించిందో లేదో...దీనిపై కామెంట్ తీసుకోవడానికి మీడియా మొత్తం ఆమె ఇంటి దగ్గరే ఉందట! ప్రియాను ఆకాశానికెత్తే కామెంట్లే కాదు, ‘పెద్ద అందగత్తేమీ కాదు... మేకప్‌తో మ్యానేజ్ చేస్తుంది’ అంటూ విమర్శించే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వివాదాలు కూడా అప్పుడే లైన్ కట్టాయి. ‘మాణిక్య మలరాయ పూవి’ పాటపై, ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా టీజర్‌పై వివాదాలు లేచాయి.. ఇలాంటివి పెద్దగా పట్టించుకోకుండా నటన మీదే శ్రద్ధ పెడుతుంది ప్రియా. ‘‘నన్ను నేను నిరూపించుకోవాల్సి ఉంది’’ అంటోంది ఆత్మవిశ్వాసంతో. పాడుతా తీయగా! కేరళలలోని త్రిసూరు విమల కాలేజీలో బీకాం చదివిన ప్రియాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. నటి కావాలనేది తన కోరిక. తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం ఉన్న ప్రియా వారియర్ చక్కగా పాడుతుంది. భవిష్యత్‌లో సినిమాల్లో పాడే అవకాశం వస్తే సంతోషంగా పాడుతాను అంటుంది. ‘‘గుర్తింపు తాలూకు గర్వాన్ని తలకెక్కించుకోవద్దు’’ అని తల్లి చెప్పిన మంచిమాటను ఎప్పుడూ గుర్తుంచుకుంటుందట ప్రియా ప్రకాష్ వారియర్. -
కన్నుగీటి.. నా కేరీర్ నాశనం చేసింది
సొగసుగా కన్నుకొట్టి.. కుర్రకారును తన వైపు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఆ వీడియోతో రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ఈ వీడియోనే తన కేరీర్‌ను గందరగోళంలో పడేలా చేసిందని అంటోంది మరో హీరోయిన్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్, రోషన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఒరు అడార్ లవ్’ రొమాంటిక్ మూవీని ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో ఫిబ్రవరి 14న విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఇప్పుడు ప్రియా వారియర్‌కు వచ్చిన ఇమేజ్ మొత్తం మరో భామ నూరిన్ షెరిఫ్ రావాల్సి ఉండేదట. ఈ విషయాలని నూరిన్ స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పింది. ప్రియా ప్రకాష్‌ని ఉద్దేశిస్తూ నూరిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజానికి ముందుగా సినిమాలో లీడ్ క్యారెక్టర్‌గా నూరిన్‌ని అనుకున్నారట. కథ మొత్తం ఆమె చుట్టూ తిరిగేలా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారట. కానీ, కన్నుకొట్టే సీన్‌తో ప్రియా ప్రకాష్ సెన్సేషనల్‌గా మారడంతో కథ మొత్తం మార్చేసి, ప్రియా పాత్రకు ప్రాధాన్యతనిస్తూ నూరిన్ రోల్ తగ్గించేశారట. ప్రియా వారియర్ సెన్సేషనల్‌గా మారిన తరువాత తనను పక్కన పెట్టారని వాపోయింది. ఆ కారణంగా ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పింది. నిజానికి అంతా తనను సెకండ్ హీరోయిన్ అనుకుంటున్నారని, కానీ తానే సినిమాలో మొదటి హీరోయిన్ అని చెబుతుంది. చిత్ర హీరో రోషన్ అబ్దుల్‌తో మళ్లీ నటించాల్సి వస్తే ఆనందంగా ఒప్పుకొంటాను. ప్రియా వారియర్‌తో నటించాల్సి వస్తే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. వీలైనంత వరకు ఒప్పుకోకుండానే ఉంటాను. ఎందుకంటే నా కెరీర్‌ను ఆమె గందరగోళంలో పడేసింది అని నూరీన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విడుదలకు ముందే ఏ మళయాళ చిత్రానికి లేని క్రేజ్ ‘ఒరు అడార్ లవ్’కి ఏర్పడింది. కన్నుకొట్టిన వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ హీరోయిన్గా మారిన ప్రియా వారియర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దీనికి తోడు ఈ మూవీ టీజర్లో ఘాటైన ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి సినిమాపై అంచనాలు పెంచేసింది ప్రియావారియర్. సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరిచింది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత ఈ మూవీ క్లైమాక్స్‌ని మార్చుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో క్లైమాక్స్ విషాదాంతంగా ముగుస్తుంది. దీన్ని మార్పు చేసి కొత్తగా సన్నిశాలని రీషూట్ చేసి యాడ్ చేయబోతున్నారట. 10 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి హైప్ తీసుకువచ్చేదిగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. -
ఇంట్లోనే నిర్బంధించారు
తనను ఇంట్లోనే నిర్బంధించారని వర్థమాన నటి ప్రియ ప్రకాశ్ వారియర్ చెప్పింది. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత పెద్ద నటినా అని అడగకండి. నిజం చెప్పాలంటే ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కూడా ఇంకా తెరపైకి రాలేదు. అయినా ఒక క్రేజీ నటి అంత ప్రాచుర్యం పొందేసింది. అందుకు కారణం ఒక చిత్ర ట్రైలర్లో ప్రియా ప్రకాశ్ వారియర్ నటనే. ఈ కేరళా కుట్టి ఒరు ఆడార్ లవ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతోంది. ఆ చిత్ర ట్రైలర్ గత ఏడాది విడుదలై సంచలనం సృష్టించింది. పాఠశాలలో తన లవర్‌కు ప్రేమ సిగ్నల్ ఇచ్చే సన్నివేశాల్లో కన్ను కొట్టి, తన చేతి వేళ్లనే గన్‌గా మార్చి గురి చూసి అతని గుండెల్లో పేల్చే సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా పేలింది. అంతే కుర్రకారు రెచ్చిపోయి ఆ ట్రైలర్‌ను వీక్షించడం, అది దేశవ్యాప్తంగా ట్రెండీ అవడం తెలిసిందే. ఆ ట్రైలర్ తెచ్చి పెట్టిన క్రేజ్ ఒరు ఆడార్ లవ్ చిత్రానికి ఎంతగానో లాభించింది. ఇప్పుడా చిత్రం మలయాళంలో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం తెరపైకి వచ్చింది. ఒరు ఆధార్ లవ్ చిత్రం ట్రైలర్ దేశ వ్యాప్తంగా ట్రెండీ అవడం నటి ప్రియ ప్రకాశ్వారియర్కు మంచి క్రేజ్ తెచ్చి పెట్టినా, చాలా భయపెట్టిందట. దీని గురించి ఈ బ్యూటీ ఒక ఇంటర్వూ్యలో పేర్కొంటూ ఒరు ఆడార్ లవ్ చిత్ర ట్రైలర్లో తాను కన్ను కొట్టే సన్నివేశం సంచలనం సృష్టించడంతో తన కుటుంబసభ్యులు చాలా భయపడ్డారని చెప్పింది. అది తన కుటుంబంతో పాటు తనకూ వినూత్న అనుభవం అని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే తనను తల్లిదండ్రులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే నిర్బంధించారని చెప్పింది. సెల్‌ఫోన్ కూడా తనకు దూరం చేశారని వాపోయింది. ఈ చిత్రం విడుదల కాక ముందే ఈ అమ్మడికి పలు అవకాశాలు తలుపుతట్టాయి. అయితే ఈ అమ్మడి ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే పారితోషికాన్ని రూ.కోటి డిమాండ్ చేస్తూ దర్శక, నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తోందట. ఒరు ఆడార్ లవ్ రిజల్ట్ తెలియాల్సిఉంది. ఈ చిత్రం కనుక హిట్‌టాక్ తెచ్చుకుంటే ఇక ప్రియ ప్రకాశ్ వారియర్‌ను పట్టుకోవడం కష్టమే అవుతుంది. అందులోనే క్లాసికల్ సంగీతం, నృత్యంలో శిక్షణ పొందిన ఈ బ్యూటీకి అవి అదనపు అర్హతగా నిలుస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. -
‘లవర్స్ డే’ మూవీ రివ్యూ
టైటిల్ : లవర్స్ డే జానర్ : లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : రోషన్, ప్రియా ప్రకాశ్ వారియర్, నూరీన్ షరీఫ్ సంగీతం : షాన్ రెహమాన్ దర్శకత్వం : ఒమర్ లులు నిర్మాత : ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఒక్క కన్నుగీటుతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఇక ముద్దు గన్నును పేల్చి ఎన్నో కోట్ల హృదయాలకు గాయం చేసిన ఈ అమ్మడు సోషల్‌మీడియా క్వీన్‌గా మారిపోయింది. ప్రియా వారియర్ పైనే ‘లవర్స్ డే’ మూవీ ఆధారపడి ఉందంటేనే ఎంతటి క్రేజ్‌ను సంపాదించిందో తెలిసిపోతోంది. మరి ప్రియాకు వచ్చిన క్రేజ్.. ఈ మూవీని గట్టెక్కేలా చేసిందా? ప్రేమికుల రోజున వచ్చిన ‘లవర్స్ డే’ చిత్రం ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఓ చూసారి చూద్దాం.. కథ : కాలేజ్.. స్నేహితులు.. ప్రేమ.. కుళ్లు జోకులు.. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీ కథ ఇదే. రోషన్.. ప్రియ.. గాధ.. ల మధ్య జరిగే కథే ఈ చిత్రంలో ప్రత్యేకం. రోషన్.. గాధ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు. అయితే వారి ప్రేమను వ్యక్త పరిచాలనుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది. (సాక్షి రివ్యూస్) అనుకోని ఆ సంఘటన ఏంటి.. అసలు ఈ కథ లో వింక్ గర్ల్ ప్రియ వారియర్ పాత్ర ఏంటి అనేది మిగతా కథ. నటీనటులు : కాలేజ్ కుర్రాడిగా రోషన్.. అతని స్నేహితులు బాగానే నటించారు. ముఖ్యంగా రోషన్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచేస్తాడు. ఇక ప్రియ తనకు బాగా పేరు తెచ్చిన.. కన్ను గీటే సీన్.. ముద్దు గన్ను సీన్స్‌తో థియేటర్లో విజిల్స్ కొట్టిస్తుంది. టీజర్, ట్రైలర్లను చూసి ప్రియానే మెయిన్ లీడ్ అనుకుంటే పొరపాటే. (సాక్షి రివ్యూస్) గాధ పాత్రలో నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందం.. అభినయంతోనూ నూరీన్ ఆకట్టుకుంది. ఇక హీరో స్నేహితులు, ప్రిన్సిపాల్, లెక్చరర్, ప్యూన్ పాత్రలు నవ్విస్తాయి. విశ్లేషణ : ఇలాంటి కథలు మనం ఎప్పుడో చూసేసాం. గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో ఈ కాన్సెప్టే మనకు కనబడుతుంది. లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగే ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే సినిమా అంతా సరదాగా వెళ్తూ ఉంటే.. మరీ నాసిరకంగా ఉంటుందేమో అనో.. లేక ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక దర్శకుడు విషాదంతో సినిమాను ముగించేశాడు. (సాక్షి రివ్యూస్) ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుని తను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను చెప్పే సందర్భంలో ఆ పాత్రను ముగించి.. అసలు దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. ఇక సంగీతం కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్. -
పాత రోజులు గుర్తొస్తాయి
ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన చిత్రం ‘లవర్స్ డే’ (మలయాళంలో ‘ఒరు ఆడార్ లవ్). ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి అందిస్తున్నారు. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) విడుదల కానుంది. నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘ఒరు ఆడార్ లవ్’ సినిమాపై క్రేజ్ పెరగడంతో తెలుగు హక్కుల కోసం టాలీవుడ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. దాంతో భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులను సొంతం చేసుకొన్నాం. ఇందుకు సహకరించిన సీతారామరాజు, సురేష్ వర్మలకు థ్యాంక్స్. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఒమర్ లులు ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ తమ యూత్ రోజులను గుర్తు చేసుకొంటారు. స్నేహం, ప్రేమ విలువను అద్భుతంగా చెప్పారు. గతంలో వచ్చిన ‘ప్రేమసాగరం, ప్రేమదేశం’ లాంటి సినిమాల రేంజ్లో ఉంటుంది ఈ సినిమా’’ అన్నారు . ‘‘ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లకు పైగా రిలీజ్ అవుతోంది. తెలుగులో సుమారు 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత వినోద్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: శీను సిద్ధార్థ్, సంగీతం: షాన్ రెహమాన్. -
ఒంటికన్ను రాక్షసి
మధులిక ఆసుపత్రిలో ఉంది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. దాడిలో జ్యోతి చనిపోయింది. ప్రేమను నిరాకరిస్తే చంపేయడమేనా? ప్రేమలో నిరాదరణకు గురైతే చనిపోవడమేనా? ప్రేమికులు ఏకాంతంగా కనిపిస్తే వెంటాడి, వేటాడ్డమేనా? చిన్నప్పటి ఒంటికన్ను రాక్షసిలా ఈ ప్రేమెందుకు పెద్దయ్యాక తలుపులు తడుతోంది?! మాధవ్ శింగరాజు ‘ముందు ఇతరులకిచ్చి తాననుభవించగల ప్రేమ ఆమె యందు సృష్టిచే సేకరించబడుచుండెను కాబోలు..’ అని ‘చలం’ విస్మయంగా ప్రకృతిని తిలకిస్తాడు. అతడి విస్మయం ప్రకృతి కాదు. శశిరేఖ. పదహారేళ్లుంటాయి ఆ పిల్లకు. నీళ్ల కోసం కడవతో కాలువకు వెళ్తుంటే.. ఆ సాయంకాలపు ఆరుగంటల ప్రకృతి ఆమె నుంచి ప్రేమను సంగ్రహిస్తూ ఉంటుంది! అది చూస్తాడు. ప్రకృతి వల్లనే కదా మానవజన్మకు సాఫల్యం. ఇదేమిటి, మిసమిసలకొస్తున్న ఒక కసుగాయి కనురెప్పల్నుంచి వీచే పరిమళంలో ప్రకృతే సోలిపోవడం! చలం కావ్యనాయిక ‘శశిరేఖ’. నూరేళ్ల నాటి శశిరేఖ. ప్రకృతేనా ఆమెలో తన కడవను నింపుకుంది? చలం తనే సృష్టించి, తనే పొందాలనుకోలేదూ.. కొంతైనా శశిరేఖలోని ప్రేమను! తొలి రచనే కాదు, తొలి వలపు కూడా చలానికి శశిరేఖ. ఫోన్లే లేని కాలపు ప్రేమ ఎమోజీ ఆమె. పర్టిక్యులర్‌గా శశిరేఖ అని కాదు. ఏ కాలానికైనా, ఎన్ని కాలాలకైనా స్త్రీని మించిన ఎమోజీ ఉంటుందా ప్రేమకు!‘ఇవ్వడమే’ ప్రేమ అనుకుంటుందేమో స్త్రీ. ఊరికే అలా కళ్లల్లోకి చూస్తుంటుంది. ఏమీ అడగదు. అడిగినా.. ‘ఏమైనా అడగవేం?’ అని అడగడానికే. అదే ఆమె ప్రేమలోని బలం. ఆ బలం వల్లనే ప్రేమలో తను ఆమెకు బలిష్టుడినయ్యానని అనుకోడు పురుషుడు లేదా బాలుడు లేదా బలహీనుడు. పైగా స్త్రీ ప్రేమనే బలహీనం అనుకుంటాడు! అడక్కుండా ఆమె ఇచ్చిందీ, అడిగి ఆమె నుంచి తీసుకున్నదీ.. రెండూ గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ వెళ్లిపోతాడు.. మధ్యలో వాటిని ఏ కాల్వలోనో పారేసి హఠాత్తుగా! ఏమైపోయావని తనిక్కడ ఏడుస్తున్నా.. ‘నేనడిగానా.. నువ్వేగా నా వెంట పడ్డావ్, ఏడువ్’ అని మెసేజ్ వస్తుంది. ‘నువ్వంటే నాకేనా, నేనంటే నీకేం లేదా’ అని అడగడానికి ఫోన్ స్విచ్డ్ ఆఫ్! వేరే సిమ్‌లోకి వెళ్లిపోతాడు. ప్రేమకో సిమ్ ఉంటుంది ఆ ‘వాలెంటైన్’కి. ఏళ్లుగా ఇదే భంగపాటు స్త్రీ ప్రేమకు. అకస్మాత్తుగా ఉత్తరాలు ఆగిపోయేవి. ఏమైపోయాడో తెలీదు. ఏమనుకున్నాడో తెలీదు. ప్రేమను రీచ్ అయ్యాక, ఇప్పుడూ అంతే.. మనిషి నాట్ రీచబుల్. ఆమె అన్నీ ఇచ్చింది. అడిగినంతా ఇచ్చింది. ‘ఇంకెవ్వరికీ ఇవ్వవు కదా’ అని అతడు అనుమానిస్తే.. ‘ఇవ్వడానికి ఉంటే కదా’ అని నవ్వింది. ‘ఉంటే ఇచ్చేదానివే.. ఎవరికైనా’ అంటే, ‘నువ్వు మిగలనిస్తే కదా మిగిలి ఉంటుంది’ అంది. యుగాలుగా ఎన్ని కోల్పోయింది స్త్రీ! కోల్పోవడం ఆమె స్వభావం. తను ప్రేమించినందుకే కాదు, తనను ప్రేమించినందుకూ ఇచ్చేస్తుందేమో. శిఖరాలకు ఆ ఔన్నత్యం, సముద్రాలకు నిగూఢత్వం, అగ్నికి జ్వాలాగుణం, నక్షత్రాలకు ఆ కాంతి.. స్త్రీ ఇచ్చిందే అనిపిస్తుంది. లేకుంటే వాటి ముఖం చూసి షెల్లీ రాసేవాడా, చలం రాసేవాడా పొయెట్రీ! పూలు, పక్షులు, గానం కూడా.. వట్టి ప్లాస్టిక్ వేస్ట్.. స్త్రీ ఆ దరిదాపుల్లో లేకుండా. ఆమె ప్రేమ లోకాన్ని వెలిగించకుండా. స్త్రీ ప్రేమ వల్ల జీవితాన్ని వెలిగించుకున్న పురుషుడు ఆఖరికి ఆమె జీవితాన్నెందుకు చీకటిమయం చేసి వెళ్లిపోతాడు? ఏ యుగపు ప్రశ్న! ఈ యుగంలోనూ ఫ్రెష్‌గా ఉంది. నేనున్నాను కదా.. నీ జీవితానికి పెద్ద వెలుగు.. మీ అమ్మానాన్న ఎందుకు? స్నేహితులెందుకు? వాళ్లతో వీళ్లతో మాటలు ఎందుకు? ఇంకా ఆ ఉద్యోగం ఎందుకు? సినిమాల్లో, సీరియళ్లలో ఆ యాక్టింగ్ ఎందుకు? బ్యాంకులో అకౌంట్లు ఎందుకు? ఒంటి మీద బంగారం ఎందుకు? పాపం అన్నీ ఇచ్చేస్తుంది, ఇచ్చేయడమే తన ప్రేమకు వెలుగు అన్నట్లు. ఇస్తున్న కొద్దీ వెలిగే ప్రేమ స్త్రీది. తీసుకోడానికి ఆమె దగ్గర ఇంకేం లేదని తెలిసేంతవరకే పురుషుడి ప్రేమ. తనేం ఇవ్వడా? ఇస్తాడు. ఇవ్వడంలో స్త్రీకి సంతోషం ఉందని తెలుసుకుని, స్త్రీ నుంచి ఇప్పించుకుని ఆమెకు సంతోషాన్నిస్తాడు! ఎలా ఈ ప్రేమల్నుంచి పిల్లల్ని కాపాడుకోవడం? ఆడపిల్లలే కాదు. మగపిల్లల్ని కూడా. పదహారూ పదిహేడేళ్లుంటాయి. అప్పుడప్పుడే వస్తున్న ఆ గడ్డాన్నీ మీసాల్నీ వేళ్లతో కప్పేస్తే వాడూ ఆడపిల్లలానే ఉంటాడు కానీ ప్రేమ అతడిని పురుషుడిని చేస్తుంది! రెండు జడల నుంచి ఆ క్రితమే ఒక జడకు వచ్చిన పిల్ల ఒకవేళ ఆ పురుషుడిచ్చిన ఐలవ్యూ పువ్వుని జడలోకి బాగుంటుందని తీసుకున్నా.. అదీ ప్రమాదమే. ప్రేమ అనుకుంటాడు వాడు.. పువ్వును తీసుకోవడం, పువ్వును పెట్టుకోవడం! ఇంకెవరో ఐలవ్యూ పువ్వు కాకుండా, వట్టి స్నేహపు పువ్విచ్చి, దాన్ని ఆమె తలలో పెట్టుకున్నప్పుడు చూస్తే కనుక దుఃఖపడి గదిలోకొచ్చి ముఖం దాచుకుంటాడు. నేనేడ్వడం ఏమిటనుకుంటే ఏ బోండాల కత్తినో తెచ్చి దాచిపెట్టుకుంటాడు! దేవుడా.. ఎలా పిల్లల్ని పొత్తిళ్లలోకి తీసుకోవడం. ఎలా వాళ్లను మెడ మీదకు ఎత్తుకుని రెండు కాళ్లు, చేతులు కలిపి ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకోవడం. ఎలా ఒక కారు బొమ్మ కొనిచ్చి ఇంట్లోనే కూర్చోబెట్టడం. ఎలా ఒక చాక్లెట్ కొనిచ్చి మాయ చెయ్యడం. పెరిగిపోయారే. ప్రేమంటున్నారే. అన్నం వద్దంటున్నారే. రాత్రంతా మేల్కొనే ఉంటున్నారే. ఎలా ఈ ప్రేమ దెయ్యం నుంచి పిల్లల్ని తప్పించడం?! ప్రియా వారియర్ వస్తోందే ఎలా! ‘ఓ స్త్రీ రేపు రా’ అని గోడ మీద రాస్తేనో. రేపే వాలెంటైనూ వస్తున్నాడు. ‘రేపు రా’ అని అతడికీ రాస్తే? ఆ ఒంటి కన్ను రాక్షసి, ఆ ప్రేమ ప్రేతాత్మ వింటారా?!బాధ ఉండేదే.. బతుకుల్లోకి పిల్లలు వెళ్లే వరకు. ప్రేమా ఉండేదే.. బతుకు బంధాలకు వాళ్లు మళ్లే వరకు. నీళ్ల కోసం కాలువ కెళుతుంటే మెట్లు దిగేచోట జాగ్రత్త అని చెప్పడం, గులాబీ కొమ్మను విరుస్తుంటే.. ‘నీకు గుచ్చుకున్నా పర్లేదు, నువ్వు పువ్విచ్చే అమ్మాయికి ముల్లు గుచ్చుకోనివ్వకని హెచ్చరించడం మాత్రమే మన చేతుల్లో ఉన్నది. మనం చేయవలసి వున్నదీ. ∙ -
లవర్స్‌డే టీజర్ : ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా’
జస్ట్ అలా అలవోకగా కన్ను కొట్టి కుర్రకారు హృదయాలను దోచేసుకున్నారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. లక్షల మంది కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిన ఈ కన్నుకొట్టుడు పిల్ల నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ‘లవర్స్ డే’ మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్ అవుతుందని నేను అనుకోలేదు.. అయ్యా..సెట్ అయిందా ఏంది సెట్ అయింది. మరి నిన్న నాకు ఎందుకు సైట్ కొంటావ్.. నేనా’ అంటూ రోషన్, ప్రియా వారియర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. షాన్ రెహమాన్ అందించిన బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. -
ప్రియా వారియర్ ‘లవర్స్ డే’ మూవీ స్టిల్స్
-
ప్రేమికుల రోజు
జస్ట్ అలా అలవోకగా కన్ను కొట్టి కుర్రకారు హృదయాలను దోచేసుకున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్లో ప్రియా కన్ను కొట్టడం, ఆ టీజర్ వైరల్ అవ్వడం తెలిసిందే. రోషన్, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఈ నెల 14న పేమికుల దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి బన్నీ (అల్లు అర్జున్) అందించిన సహకారాన్ని మర్చిపోలేం. తెలుగులో ప్రియా వారియర్ పాత్రకు సింగర్ లిప్సిక డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉన్నాయి. ఇందులో ఓ పాట ఆడియన్స్‌కు థియేటర్లో సర్ప్రైజ్గా ఉంటుంది. మంచి బిజినెస్ జరిగింది’’ అని అన్నారు. ఈ సినిమాకు షాన్ రెహమాన్ స్వరకర్త. -
నాని సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ..!
ఇటీవల సక్సెస్ విషయంలో కాస్త తడబడుతున్న యంగ్ హీరో నాని వరుసగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని, తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా నాని, విక్రమ్‌ల సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఒక్క కంటి సైగతో సోషల్ మీడియాను ఊపేసిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సపోర్ట్ చేయడం నా బాధ్యత అనుకున్నా
‘‘సౌత్ ఇండియన్ సినిమాల్లో నేషనల్ వైడ్‌గా, ఇంటర్నేషనల్ వైడ్‌గా వైరల్ అయిన వీడియోస్‌లో ‘కొలవెరి డీ..’ పాట, ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’... ఈ మధ్య కాలంలో ఆ రేంజ్లో వైరల్ అయిన వీడియోస్‌లో ‘ఒరు ఆధార్ లవ్’ కూడా ఒకటి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్, రోషన్ ముఖ్య తారలుగా ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రాన్ని ‘లవర్స్ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. షాన్ రెహమాన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు సౌతిండియా అంటే పిచ్చి. నా ప్రొఫెషన్లో సౌతిండియన్ యాక్టర్ అని రాసుకుంటాను. నేను దక్షిణాదికి చెందినవాడినని చెప్పుకోవడానికి గర్వపడతాను. నేను పుట్టింది చెన్నైలో.. పెరిగింది హైదరాబాద్‌లో.. మలయాళం, కర్ణాటకవాళ్లు కూడా నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి నేను సౌతిండియన్‌నే. నా సినిమాలను కేరళవాళ్లు సొంత సినిమాల్లాగా ఆదరిస్తున్నారు. ఓ ల్యాండ్ మార్క్ ఉన్న మలయాళ సినిమా తెలుగులోకి వస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేయాలని భావించా. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సమయంలో వినోద్ రెడ్డిగారిని ‘బన్నీ’వాసు పరిచయం చేశాడు. ఆయన అడగ్గానే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నేను ఎంత కాలం నిలబడగలనో తెలియదు కానీ.. అవకాశం ఉన్న ప్రతిసారీ నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరి కోసం నిలబడతా’’ అన్నారు. ‘‘మలయాళంలో ఎంత మంది స్టార్స్ ఉన్నా మా సినిమా వీడియోను ఎవరూ షేర్ చేయలేదు. అల్లు అర్జున్‌గారు మాత్రమే షేర్ చేశారు’’ అన్నారు ఒమర్ లులు. ‘‘అల్లు అర్జున్‌గారంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి స్టేజ్‌పై నిలబడే అవకాశం వస్తుందనుకోలేదు. ఆయన్ను కలుసుకున్నందుకు వెరీ హ్యాపీ’’ అని ప్రియా ప్రకాష్ వారియర్ అన్నారు. ‘‘మా యూనిట్‌ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు చిత్రసమర్పకుడు వినోద్ రెడ్డి. ‘‘సీతారామరాజుగారు, సురేశ్‌గారి సపోర్ట్‌తో ‘లవర్స్ డే’ సినిమా అవకాశం దక్కించుకున్నాను. అల్లు అర్జున్‌తో పాటు చాలా మంది నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇందుకు వారికి థ్యాంక్స్’’ అని ఎ.గురురాజ్ అన్నారు. నటుడు అలీ, నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ, పాటల రచయిత చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లవర్స్ డే’ వేడుకలో బన్నీ
-
నన్ను హౌస్ అరెస్ట్ చేశారు
ప్రియా ప్రకాశ్ వారియర్... ఓ సంవత్సరం కిందట జస్ట్ కాలేజీ అమ్మాయి. ఏడాది తర్వాత పాపులర్ గాళ్. అలా అలవోకగా ప్రియ కన్ను కొట్టడాన్ని నెటిజన్లు కళ్లు పెద్దవి చేసుకుని చూశారు. ఆ విధంగా మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాను ‘లవర్స్ డే’ పేరుతో గురురాజ్ తెలుగులో విడుదల చేయనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రియా ప్రకాశ్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ∙ నేను కేరళ అమ్మాయిని. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. మా కుటుంబంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లెవరూ లేరు. కానీ చిన్నప్పటినుండి నటి అవ్వాలని మాత్రం ఉండేది. చివరికి అనుకున్నది సాధించాను. ∙‘ఒరు అడార్ లవ్’ టీజర్ చూశాక అందరూ నన్ను ‘వింక్ గాళ్’ అంటున్నారు. అయితే నేను ఏదో ఒక టైటిల్‌తో ఇండస్ట్రీలో నిలబడాలనుకోవడంలేదు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. ‘ఒరు అడార్..’ని పాట చిత్రీకరణతో మొదలుపెట్టాం. అది పూర్తవ్వగానే టీజర్లా రిలీజ్ చేశాం. దానివల్లే ఇంత పేరొచ్చింది. సోషల్ మీడియాలో నాకు చాలా క్రేజ్ తీసుకొచ్చింది. సాంగ్ రిలీజయిన తర్వాత మా ఇంట్లో చాలా పెద్ద దుమారమే జరిగింది. చాలామంది ఫ్యాన్స్ మా ఇల్లు కనుక్కొని మా ఇంటికి వచ్చి ప్రియాని చూడాలి అనేవారు. మా నాన్న వాళ్లందరికీ మంచి కథలు చెప్పి మాయ చేసి పంపేవారు. నన్ను కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. ∙ కాలేజీలో నన్నెవరూ టీజ్ చేయలేదు. అందుకని కాలేజ్ మారాల్సిన అవసరం రాలేదు. మాది గాళ్స్ కాలేజ్. ఇప్పటికీ స్టేజ్ షోలు, సింగింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొంటాను. టీచర్స్, స్నేహితులు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వాళ్లలో ఏ మార్పూ లేదు. నాకు ఫ్రెండ్స్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లటం, వాళ్లతో సిటీ బస్‌లో ప్రయాణం చేయడం అంటేæ ఇష్టం. ∙ నేను సినిమా చేయాలంటే ముందుగా కథ వింటాను. నచ్చితే ఆ కథను నాన్నకు చెప్తాను. నాకు చాలా ఆఫర్స్ వచ్చినా ఒక్కటీ చేయలేదు అనుకుంటున్నారు అందరూ. దానికి కారణం మేం ‘ఒరు అడార్..’ని చిన్న సినిమాగా మొదలుపెట్టాం. అందుకే ముందుగా చిన్న బిట్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు మా సినిమా టీమ్. అది హిట్టయి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మిగతా షూటింగ్ కంప్లీట్ చేయటానికి ఇప్పటివరకు పట్టింది. అంతేకానీ నాకు అవకాశాలు రాక కాదు. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అంత పెద్ద స్టార్ సినిమాలో ఓ సాంగ్ చేయమని అడిగారు. డేట్స్ కుదరక చేయలేకపోయాను. ఇలా చాలా సినిమాలు మిస్సయ్యాయి. హిందీ ‘సింబా’కి నన్నెవరూ అప్రోచ్ అవ్వలేదు. అవన్నీ రూమర్స్ మాత్రమే. ∙ నేను కేరళ అమ్మాయినైనా నా ఫాలోవర్స్ ఎక్కువ శాతం నార్త్ ఇండియన్స్, హైదరాబాద్ వాళ్లే. చాలా ఇంటరాక్ట్ అవుతారు వాళ్లు. ‘లవర్స్ డే’ క£ý విషయానికొస్తే స్కూల్ డేస్లోని ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు. మీరు వీడియోలో చూసిన ఆ సీన్ ఇద్దరు ఫ్రెండ్స్ చేసే నార్మల్ అల్లరి సీన్. సింగిల్ టేక్‌లో చేసేశాను. మలయాళంలోని ఓ చిన్న సినిమా 4 భాషల్లో రిలీజవ్వటం మలయాళ చిత్రపరిశ్రమలో ఇదే మొదటిసారి. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున విడుదలవుతుంది. ∙ బాలీవుడ్లో చేస్తున్న ‘శ్రీదేవి బంగ్లా’లోని నా పాత్ర వివాదాస్పదమయ్యింది. కారణం ఆ సినిమా ట్రైలర్‌లోని సీన్ దివంగత నటి శ్రీదేవిగారిని పోలి ఉండటమే. సినిమా కథలో భాగం మాత్రమే అది. సినిమా మొత్తం చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అయితే శ్రీదేవిగారి భర్త బోనీకపూర్ సినిమా నిలిపివేయాలని నోటీసు పంపించారు. కేసు కోర్టులో ఉంది. ∙ విమర్శలు వచ్చినప్పుడు మొదట్లో మనసుకు తీసుకుని ఫీలయ్యేదాన్ని. ఎవరైతే ఆకాశానికి ఎత్తుతారో వారే కింద పడేస్తారు. ఒక సినిమా వయసుతో, ఓ సంవత్సరంలో చాలా విషయాలు నేర్చుకున్నాను.ఈరోజు జరిగే నా సినిమా ఆడియో ఫంక్షన్‌కు అల్లు అర్జున్ రావటం చాలా ఆనందంగా ఉంది. ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. నేను ట్రోల్స్‌ను బాగా ఫాలో అవుతాను. అల్లు అర్జున్ చేసే అన్ని వీడియోలను ఫాలో అవుతాను. అన్నిట్లోకి బన్నీ వాళ్లబ్బాయితో చేసిన వీడియో అంటే ఇష్టం. -
సోషల్ మీడియా సెన్సేషన్ కోసం స్టైలిష్ స్టార్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ లవ్ ‘ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాకుండా 2018లో గూగుల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకరిగా ఘనతను సాధించింది. ‘ఒరు ఆడార్ లవ్’లో కేవలం 27 సెకన్ల పాటు ఆమె చేసిన కనుసైగకు రెండు రోజుల్లోనే 45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు. ఇలా ప్రస్తుతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘ఒరు ఆడార్ లవ్ ‘ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. మలయాళ దర్శకుడు ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మలయాళ వెర్షన్ కూడా అదే రోజున విడుదల కానుంది . ఇప్పటికే ‘లవర్స్ డే’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా ‘లవర్స్ డే ‘ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జనవరి 23న వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ‘‘లవర్స్ డే ‘ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానించిన వెంటనే అల్లు అర్జున్ మా కోరికను మన్నించి ఒప్పుకొన్నారు. ఆయన రానుండటంతో మా సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. మా ఆహ్వానాన్ని సహృదయంతో అంగీకరించిన అల్లు అర్జున్‌కు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నామని’’ నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి తెలిపారు. -
‘బోనీ కపూర్.. వీటిని అస్సలు సహించరు’
సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. మలయాళ దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘శ్రీదేవి బంగ్లా’ అనే మూవీలో ప్రధాన పాత్రలో ఆమె నటిస్తున్నారు. శ్రీదేవి అనే సక్సెస్ఫుల్ హీరోయిన్ పాత్రలో ప్రియా కనిపించనున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా చిత్ర యూనిట్‌కు కష్టాలు తెచ్చిపెట్టింది. సినిమా టైటిల్, ట్రైలర్లో హీరోయిన్ బాత్‌టబ్‌లో పడి చనిపోవడం వంటి సీన్లు ఉండటంతో దివంగత నటి శ్రీదేవి జీవితం ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్.. ప్రియా ప్రకాశ్, ఈ చిత్ర దర్శకుడికి లీగల్ నోటీసులు పంపారు. దీంతో శ్రీదేవి అన్న పేరు చాలా మంది అమ్మాయిలు పెట్టుకుంటారని, ఈ విషయమై బోనీతో చర్చిస్తామని ప్రశాంత్ పేర్కొన్నాడు. కాగా బోనీ కపూర్ ఈ సినిమాను అంత తేలికగా తీసుకోబోవడం లేదని ఆయన సన్నిహితులు తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ తన భార్య పేరును, ఆమె పేరిట ఓ నీతిలేని కథను తెరకెక్కించడాన్ని బోనీ అంగీకరించలేరు. ఈ సినిమాను నిలిపివేసేంత వరకు బోనీ కపూర్ అస్సలు ఊరుకోరు. వారి సినిమా గురించి ప్రజల్లో ఆసక్తి రేకెత్తించేందుకు శ్రీదేవి బంగ్లా అనే పేరు పెట్టుకోవచ్చు. అయినప్పటికీ బోనీ వీటన్నింటిని సహించరు. సినిమాను ఆపేందుకు ఆయన చట్టబద్ధంగా ముందుకు వెళ్తారు’ అని వ్యాఖ్యానించారు. బోనీ కపూర్ పట్టుదల చూస్తుంటే ‘శ్రీదేవి బంగ్లా’కు చిక్కులు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వివాదంలో శ్రీదేవి బంగ్లా!
కన్ను కొట్టి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పుడు ఆమె ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రశాంత్ మమ్బ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రశేఖర్ ఎస్.కె, ఎమ్. ఎన్. పింప్లీ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్‌లోని విజువల్స్ తన భార్య శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉన్నాయని బోనీకపూర్ ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా నిర్మాతలకు నోటీసులు పంపారు. గతేడాది ఫిబ్రవరిలో శ్రీదేవి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక.. ‘శ్రీదేవి బంగ్లా’ వివాదం విషయానికొస్తే.. ‘‘ఈ సినిమా టైటిల్లో శ్రీదేవి పేరును వెంటనే మార్చడంతో పాటు వేరే మార్పులు చేయాల్సి ఉంటుందన్న విధంగా బోనీకపూర్ మాకు నోటీసులు పంపారు. బయోపిక్కు అనుమతులు తీసుకోవాలన్న విషయం తెలుసు. శ్రీదేవి అనే పేరు గల నటి లండన్ వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవలసి వచ్చిందనే అంశాల ఆధారంగా మా సినిమా ఉంటుంది. ఇది ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పుడు స్టోరీ లైన్ గురించి ఇంతకన్నా చెప్పలేం. శ్రీదేవి అనేది కామన్ నేమ్. రిలీజ్ కాకుండానే శ్రీదేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతోందనడం సరికాదు. విడుదలయ్యాక ఇది శ్రీదేవి బయోపిక్ అవునా? కాదా? అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఈ సినిమాకి ముందుగా కంగనా రనౌత్‌ని అనుకున్నాం. కానీ సౌత్‌లో మరింత రీచ్ ఉండాలని ప్రియా ప్రకాశ్ వారియర్‌ను తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు ప్రశాంత్. ‘‘సినిమాలో శ్రీదేవి అనేది నా పాత్ర పేరు. ఆమె పేరుతో ఎవరూ వివాదాలు సృష్టించాలనుకోరు’’ అని ప్రియా ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. -
ప్రియా ప్రకాశ్‌కు షాకిచ్చిన బోనీ కపూర్
ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ప్రియా ప్రకాశ్‌కు లీగల్ నోటీసులు పంపారు. విషయం ఏంటంటే.. ప్రియా ప్రకాశ్ ప్రస్తుతం ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రంలో ప్రియ.. శ్రీదేవి అనే టాప్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ట్రైలర్, టైటిల్‌ని బట్టి చూస్తే ఇది దివంగత నటి శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అదీ కాకుండా ట్రైలర్లో శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోయిన సీన్ కూడా ఉండటంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దాంతో నిర్మాత బోనీ కపూర్.. ప్రియతో పాటు చిత్రబృందానికి కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి మాట్లాడుతూ.. ‘గత వారం బోనీ కపూర్ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. మేం ఈ సమస్యను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరేనని బోనీకి నచ్చజెప్పాను. నా సినిమాలో కథానాయిక పాత్ర పేరు శ్రీదేవి. మేం దీన్ని ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ‘ఇది శ్రీదేవి సినిమానా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్ పాత్రలో నటిస్తున్నాను’ అంటూ అసలు విషయం చెప్పకుండా మాట దాటేశారు. -
పచ్చబొట్టేసుకున్నా పిల్లదానా...
కొంటె సైగతో మొత్తం దేశ యువతను కళ్లు తిప్పుకోకుండా చేశారు ప్రియా ప్రకాశ్ వారియర్. ‘వింక్ సెన్సేషన్’ అంటూ గూగుల్‌లో, యూత్ గుండెల్లో ట్రెండ్ అయిపోయారీ బ్యూటీ. కొందరబ్బాయిలైతే ఈ బ్యూటీ బొమ్మను గుండెల్లో పచ్చబొట్టేసుకున్నారు. ఇప్పుడీ బ్యూటీ కూడా పచ్చబొట్టేసుకున్నారు. గుండెలపై కాదు చేతి మీద. చేతి మీద గులాబీ పువ్వు బొమ్మ ట్యాటూ వేయించుకున్నారు. కొమ్మ మీదేమో ‘ఇన్ఫినిటీ’ (అనంతం) అని ఇంగ్లీష్‌లో రాసుంది. అంటే.. హీరోయిన్గా తన పాపులారిటీ అనంత తీరాలకు వెళ్లాలనా? ఏమో... తన ఉద్దేశమేమైనా కావచ్చు. మరి ఈ ట్యాటూ అర్థం తనెప్పుడు వివరిస్తారో చూద్దాం. అప్పటి వరకూ పచ్చబొట్టేసుకున్నా పిల్లదానా దానర్థమేంటి? అని పాడుకోవడమే యూతంతా. అన్నట్లు.. మలయాళంలో ప్రియా నటించిన ‘ఒరు అధార్ లవ్’ తెలుగులో విడుదల కానుంది. -
ప్రేమికుల రోజున...
కొంటె సైగతో దేశంలోని యూత్ అందర్నీ ఫిదా చేసిన ‘వింక్ సెన్సేషన్’ ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్లో ఆమె కన్ను కొట్టే షాట్ ఎంత హల్చల్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రం ‘లవర్స్ డే’ అనే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ కానుంది. సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్ వినోద్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఒరు ఆధార్ లవ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క కంటి సైగతో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత గొప్పది. భారీ పోటీ మధ్య ఈ సినిమా హక్కులను మేం సొంతం చేసుకున్నాం. వేలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రొమాంటిక్ కామెడీగా సాగే ఈ కథకు షాన్ రెహమాన్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శీను సిద్ధార్ధ్, కథ– దర్శకత్వం: ఒమర్ లులు. -
తెలుగులో ప్రియా ప్రకాష్ మూవీ..!
అమ్మాయి ఓరచూపు చూస్తే వలలో పడని అబ్బాయిలు ఉండరని అంటారు. మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ విషయంలో అది మరోసారి రుజువైంది. కాకపోతే ప్రియా ప్రకాష్ వారియర్ మరో అడుగు ముందుకేశారు. ఆమె కొంటెగా కంటి సైగ చేస్తే రాష్ట్రాల సరిహద్దులు దాటి మరీ యువకులు ఆమె గురించి ఆరా తీశారు. కేవలం 27 సెకన్ల వీడియోతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. యువకుల్లో అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రియా నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా గురించి తెలుగు నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘ఒరు ఆధార్ లవ్’ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు. ప్రియా చేసిన ఒక్క కంటి సైగతో ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత గొప్పది. ఆ చిత్రం తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. భారీ పోటీ మధ్య హక్కులను మేం దక్కించుకున్నాం. వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగులో లవర్స్ డే అనే పేరుతో విడుదల చేస్తున్నాం’ అన్నారు. -
వెండితెర మీద కన్నుగీటనుంది..!
ఒక్క ప్రోమోతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ఓ పాటకు ఆమె తన కళ్లతో పలికించిన హావభావాలతో ఒక్కరోజులోనే ఆమె పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెకు పాపులారిటీ పెరిగిపోవడంతో వరుస అవకాశాలు క్యూ కట్టినట్టుగా వార్తలు వచ్చాయి. ఫిబ్రవరిలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినా ఇంత వరకు సినిమా రిలీజ్ కాలేదు. ఇన్ని రోజుల వెయిటింగ్ తరువాత ఒరు అదార్ లవ్ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాను 2019 ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లు బుల్లితెర మీదే ప్రియా ప్రకాష్‌ను చూసి అభిమానులు త్వరలో వెండితెర మీద చూసేందుకు రెడీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రియా ప్రకాష్‌కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. -
మళ్లీ వార్తల్లో నిలిచిన ప్రియా వారియర్
ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆదార్ లవ్ సినిమాలోని మాణిక్య మలరాయ సాంగ్‌లో కన్నుకొట్టి, గన్నుతో పేల్చి కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిందీ భామ. ఈ ఒక్క సాంగ్‌తో బాలీవుడ్లో చాన్స్ కొట్టేసింది. ఇక ప్రస్తుతం ఒరు అదార్ లవ్ సినిమాలోని మరో సాంగ్‌ను రిలీజ్చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇది కూడా మరో కొత్త రికార్డును సెట్ చేస్తోంది. యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డిస్‌లైక్‌లు సాధించిన సాంగ్‌గా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ పాటను పది లక్షలకు పైగా వీక్షించగా, రెండు లక్షలకు పైగా డిస్‌లైక్‌లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రియకు ఇంతటి వ్యతిరేకతకు గల కారణాలు ఏంటో తెలియడం లేదు. తన అభిమానులు సైతం ఈ డిస్లైక్లకు గల కారణాలేంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా మళ్లీ ప్రియా వారియర్ వార్తల్లోకెక్కేసింది. -
ప్రియా వర్రీయర్
ఒక్క కొంటె సైగతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు ప్రియా ప్రకాశ్ వారియర్. నార్త్ టు సౌత్ ‘వింక్ గర్ల్’గా ఫేమస్ అయిపోయారు. ఎంత పాపులారిటీ సంపాదించారో అంతే విరివిగా వివాదాల్లో కూడా వినిపిస్తూనే ఉన్నారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు అడార్ లవ్’ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు విపరీతంగా అప్సెట్ అవుతున్నారట ప్రియా వారియర్. ఇంతకుముందు ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే ఇప్పుడు ఆన్లైన్లో విమర్శలు చేస్తుండటం వర్రీగా ఉందట. మలయాళంలో నజ్రియా నజీమ్ తన కంబ్యాక్ ఇచ్చారు. ఆ హీరోయిన్‌తో ప్రియా ప్రకాశ్‌ను పోల్చి విమర్శిస్తున్నారట. నిజానికి ‘ఒరు అడార్ లవ్’ ట్రైలర్ రిలీజ్ కాగానే ‘ఇంత అందమైన కళ్లను చూడలేదు’ అని ప్రియాని చాలామంది పొగడ్తల్లో ముంచెత్తారు. ఇప్పుడేమో తన కళ్ల కంటే నజ్రియా కళ్లు ఇంకా బావుంటాయి అని కామెంట్ చేశారట సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు. ఇలా సినిమా రిలీజ్ కాకముందే తన మీద నెగటివిటీ, కామెంట్స్ చూడటం తన కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా చేస్తోంది అని పేర్కొన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. సో.. ఇప్పుడు వారియర్ కాస్తా వర్రీయర్ అయ్యారన్నమాట. -
స్త్రీలోక సంచారం
అత్యాచారం వల్ల గర్భం ధరించిన ఓ 18 ఏళ్ల కళాశాల విద్యార్థిని.. లైంగికదాడి కారణంగా తన ప్రమేయం లేకుండా, తనకు ఇష్టం లేకుండా తను గర్భం దాల్చానని, అది కూడా తను మైనరుగా ఉన్నప్పుడు జరిగిందని.. కాబట్టి తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు.. ఈ కేసులో గర్భస్థ పిండం హక్కులను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడింది. ఎం.టి.పి. చట్టం (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్టు) ప్రకారం 20 వారాల వరకు మాత్రమే గర్భవిచ్ఛిత్తికి ఆమోదం ఉన్నందున, ఆ బాధిత విద్యార్థినికి గర్భవిచ్చిత్తి జరిపించవలసిన అత్యవసర స్థితి ఏమైనా ఉందా అని నిర్థారించుకోవడం కోసం వైద్య నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా కోర్టు నియమించింది. ‘‘ఐ యామ్ సారీ. ఇక్కడంతా సెరెనా గెలుపును కోరుకున్నారు. కానీ, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అయితే గెలుపు, ఓటమి కాదు.. సెరెనాతో ఆడడం నా కల. అది ఇవాళ నెరవేరింది’’ అని సెరెనా విలియమ్స్‌పై యు.ఎస్. ఓపెన్ ఫైనల్స్‌లో గెలిచిన జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా.. టెన్నిస్ మైదానంలో ప్రేక్షకులందరికీ క్షమాపణ చెప్పి ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల మనసు దోచుకున్నారు. ఇరవై ఏళ్ల ఒసాకా ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలవడం ఇదే మొదటిసారిగా కాగా.. గెలుపు అనంతర క్షణాలలో ఆమె ఏమాత్రం ఉద్వేగాన్ని ప్రదర్శించక, గ్రాండ్‌స్లామ్‌ల యోధురాలు సెరినా ముందు ఒద్దికగా, వినమ్రంగా నిలుచోవడం సెరెనాను సైతం ముగ్ధురాలిని చేసింది. తిరువనంతపురంలోని మార్ ఐవేనియోస్ కాలేజీలో తన గర్ల్‌ఫ్రెండ్ అయిన చారులతను.. ఇండియన్ క్రికెటర్ సంజు వి.శాంప్సన్ ఈ ఏడాది డిసెంబర్ 22న వివాహమాడబోతున్నాడు. ఐదేళ్లుగా చారులతను తను ప్రేమిస్తున్నానని, తొలిసారిగా ఆమెకు 2013 ఆగస్టు 22న రాత్రి 11 గం. 11 నిముషాలకు ‘హాయ్’ చెప్పానని ఫేస్బుక్లో ఆదివారం శాంప్సన్ బహిర్గతం చేయగా.. ‘‘మా ఆమోదం పొందాకే పెళ్లి సంగతిని ప్రకటించాలని వాళ్లిద్దరూ అనుకున్నారని, తిరువనంతపురంలో జరిగే పెళ్లికి ఇప్పటికే ఫంక్షన్ హాల్ కూడా బుక్ అయిందని’’ శాంప్సన్ తండ్రి విశ్వనాథ్ నిర్థారించారు. సెలవులో ఉన్న ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు సీఈవో చందా కొచ్చర్‌ను విచారణ నిమిత్తం ఏ క్షణమైనా సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పిలిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘న్యూపవర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడైన చందా భర్త.. దీపక్ కొచ్చర్ వ్యాపార లావాదేవీల విషయంలో బ్యాంకు సీఈవోగా కొచ్చర్ ఆయనకు సడలింపులు ఇచ్చేందుకు నిబంధలను ఏమైనా అతిక్రమించి ఉండే అవకాశాలున్నాయా అనే కోణంలో సెబీ ఆమెను ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు. మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన మూడేళ్ల ప్రణాళిక (2018–19 నుంచి 2020–21 వరకు) లో భాగంగా త్వరలోనే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలలో పబ్లిక్ ప్యానిక్ బటన్లు, ఆల్ ఉమెన్ పోలీస్ పెట్రోలింగ్ టీమ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. హోమ్ శాఖ పర్యవేక్షణలోని ఈ ‘ఉమెన్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్’.. దేశంలో మహిళల భద్రతకు ఉద్దేశించిన అన్ని సంస్థలతో సమన్వయం కలిగి ఉండడమే కాక.. మహిళలు, శిశువుల కోసం.. ప్రయాణ విరామ వసతులు (ట్రాన్సిట్ డార్మెటరీస్), శక్తిమంతమైన ఎల్.ఇ.డి. వీధి దీపాలు, ఆపదనుంచి కాపాడే కేంద్రాలు, నేర నిర్థారణ, సైబర్ క్రైమ్ సెల్స్ నిర్వహణను కూడా పర్యవేక్షిస్తుంటుంది. ఎనిమిది దేశాల (శ్రీలంక, ఇండియా, వెస్ట్ ఇండీస్, దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిల్యాండ్) 2021 ఐ.సి.సి. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో అర్హత కోసం జరుగుతున్న ఐ.సి.సి. ఉమెన్స్ చాంపియన్లోని మూడో రౌండ్లో భాగంగా నేటి నుండి ఈ నెల 16 తేదీ వరకు భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. శ్రీలంకలోని గాలాలో సెప్టెంబర్ 11న, 13న, కటునాయకేలో 16న శ్రీలంకతో వన్డేలో పోటీ పడనున్న భారత మహిళా జట్టుకు మిథాలీరాజ్ కెప్టెన్ కాగా, జట్టులో తాన్యాభాటియా, ఏక్తా బిష్త్, రాజేశ్వరీ గైక్వాడ్, ఝులన్ గోస్వామి, దయాళన్ హేమలత, మాన్సీ జోషి, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి స్మృతి మంథన, శిఖా పాండే, పూనమ్ రనౌత్, జమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ ఉన్నారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అప్రతిష్ట మూట కట్టుకున్న ఇండియాకు.. సురక్షితమైన దేశంగా పునఃప్రతిష్ట తెచ్చేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీలోని ఎన్జీవో సంస్థ ‘యునైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్’ కలిసి సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో నిర్వహించిన ఐదు కిలోమీటర్ల ‘ఫియర్లెస్ రన్’ విజయవంతమైంది. 200 మంది మహిళలు పాల్గొన్న ఈ ఫియర్లెస్ రన్‌ను ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ చౌదరి; సోషల్ ఆక్టివిస్టు, ఆసిడ్ దాడి నుంచి బయటపడిన లక్ష్మీ అగర్వాల్ ప్రారంభించారు. ఈ నెల 14న విడుదల అవుతున్న మలయాళీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ లోని ఒక టీజర్ సన్నివేశంలో కన్ను గీటి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కసారిగా సోషల్‌మీడియాలో ప్రసిద్ధురాలైన బి.కాం. విద్యార్థిని ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఎరుపు రంగు దుస్తుల ఫొటో షూట్‌తో తన అభిమానుల హృదయాలపై పూల జల్లులు కురిపిస్తున్నారు! సరిగ్గా చిత్రం రిలీజ్‌కు ముందు ఒక స్థానిక మ్యాగజీన్ ప్రచురించిన ప్రియ ఫొటోలు.. ‘మనకు తెలియకుండా ఈ కొత్త నటి సినిమాల్లోకి ఎప్పుడొచ్చారబ్బా!’ అని ఆశ్చర్యంతో పాటు ఆహ్లాదమూ కలిగించేలా ఉన్నాయి. -
ప్రియా వారియర్‌పై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కన్నుగీటి పాపులర్ అయిన మలయాళ నటి ప్రియా వారియర్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని పాట కారణంగా మత విశ్వాసాలు దెబ్బతిన్నాయంటూ నటి ప్రియ, దర్శక, నిర్మాతలపై తెలంగాణసహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవడం తెల్సిందే. దీంతో ప్రియ, దర్శక, నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సినిమాలో వివాదానికి కారణమైన ఆ పాట 1978 నుంచి ప్రజలకు, ముఖ్యంగా ముస్లింల ఆదరణ పొందిన ఒక జానపద గీతమని ప్రియా తరఫు న్యాయవాది తెలిపారు. పాటపై తమకెలాంటి అభ్యంతరం లేదనీ, చిత్రీకరణే అభ్యంతరకరంగా ఉందంటూ ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘ఎవరో పాటలు పాడుకుంటున్నారు. కేసు నమోదు చేయడం మినహా మీకు మరే పనీ లేదు..’ అంటూ తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడింది. -
స్త్రీలోక సంచారం
ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు అనుబంధ సంస్థ ‘ఐ.సి.ఐ.సి.ఐ. సెక్యూరిటీస్’ డైరెక్టర్స్ బోర్డులోకి ఆ బ్యాంకు ఎం.డి., సి.ఇ.వో. అయిన చందా కొచ్చర్‌ను తిరిగి తీసుకోవడం (రీ–అపాయింట్మెంట్) పై విమర్శలు వస్తున్నాయి. వీడియోకాన్ గ్రూపుతో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ ‘ఇచ్చిపుచ్చుకున్న’ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను నిర్థారించేందుకు ఈ ఏడాది జూన్‌లో జస్టిస్ బి.ఎన్.కృష్ణను బ్యాంకు నియమించుకున్న నాటి నుంచీ చందా కొచ్చర్ సెలవులో ఉండగా, ఇప్పుడు ఆమెను మళ్లీ బోర్డులోకి తీసుకోవడం వల్ల బి.ఎన్.కృష్ణ విచారణను తనకు అనుకూలంగా ఆమె ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని బోర్డులోనే కొందరు సభ్యులు బహిరంగంగానే ఆమె çపునర్నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రసిద్ధ పౌర విమానయాన సంస్థ ‘గోఎయిర్’లో పైలెట్‌గా చేరబోతున్న 31 ఏళ్ల ఇమ్రాన్ హబీబ్.. కశ్మీర్లో తొలి ముస్లిం మహిళా పైలెట్‌గా రికార్డు సృష్టించబోతున్నారు. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన హబీబ్,, డెహ్రాడూన్‌లో ఫారెస్ట్రీ డిగ్రీ, ఫారెస్ట్రీలోనే శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి.. తన చిన్ననాటి కల అయిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి, 2016లో యు.ఎస్. ఫ్లయిట్ స్కూల్లో చేరి, అక్కడ ‘260 ఫ్లయింగ్ అవర్స్’ పూర్తి చేసి, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఢిల్లీలో కమర్షియల్ పైలెట్ కోర్సు చేసి పాసై, అక్టోబర్‌లో విమానం నడపబోతున్నారు. యువతార జెన్నిఫర్ లారెన్స్‌తో పాటు, కిర్‌స్టెన్ డన్స్ట్, కేప్ ఆప్టన్ వంటి అనేకమంది హాలీవుడ్ నటీమణుల నగ్నచిత్రాలను సేకరించి, నెట్లో అప్లోడ్ చేసిన సెలబ్రిటీ హాకర్.. జార్జి గెరఫానోకు బ్రిడ్జిపోర్ట్లోని ఫెడరల్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. విడుదల తర్వాత కూడా గెరఫానో మీద మూడేళ్ల నిఘాకు అదేశించిన కోర్టు.. శిక్షకాలం ముగిశాక అతడు కనీసం 60 గంటలు కమ్యూనిటీ సేవ చేయాలని కూడా ఉత్తర్వు్యలు జారీ చేసింది. ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో 200 మీటర్ల రేస్‌లో రజిత పతకం సాధించిన స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అదనంగా మరో కోటీ యాభై లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. అంతకు ముందు ఈ ఏషియన్ గేమ్స్‌లోనే 100 మీటర్ల పరుగు పందెంలో ద్యుతీ రజితం గెలిచినప్పుడు కోటీ యాభై లక్షల నగదు బహుమతిని ప్రకటించిన పట్నాయక్.. ద్యుతీ టోక్యో ఒలింపిక్స్‌కి సిద్ధమవడానికి అయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. మలయాళీ చిత్రం నటించిన ప్రియా ప్రకాశ్ వారియన్ అందులోని ‘ఒరు అధార్ లవ్’లోని ఒక పాటలో కన్నుగీటడంపై కేసు వేసిన వారిని తప్పు పట్టిన సుప్రీం కోర్టు.. ప్రియ పైన, ఆ చిత్ర నిర్మాతలపైన దాఖలైన కేసును కొట్టి వేసింది. ‘‘సినిమాలో ఎవరో పాట పాడితే, అందుకు ఎవరో నటిస్తే వారిపై కేసు పెట్టడం తప్ప మీకు ఇంకో పని లేదా?’’ అని ఆ ఎఫ్.ఐ.ఆర్. వెనుక ఉన్న వ్యక్తుల్ని కోర్టు మందలించింది కూడా. కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తున్న ‘మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం షూటింగ్ నుంచి సహ నటుడు సోనూ సూద్.. తన తల మీద క్యాప్‌ని విసిరికొట్టి, సెట్స్ నుంచి అర్థంతరంగా వెళ్లిపోవడంతో.. అతడికిక ఆ సినిమాలో చోటు లేనట్టేనని తెలుస్తోంది. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సోనూ సూద్.. తనను, ఇతర నటులను సెట్స్‌లో కంగనా రనౌత్. ఆమె మాటలతో, అహంకారంతో, తలబిరుసుతనంతో పెడుతున్న టార్చర్‌ను భరించలేకపోతున్నాని చెప్పి మరీ వెళ్లిపోవడంతో నిర్మాతలు తల పట్టుకున్నారు తప్ప, కంగనను తప్పు పట్టే సాహసం చేయలేకపోయారని ముంబై నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటలీలోని లేక్ కామో లో ఈ ఏడాది నవంబరులో తమ పెళ్లిన ప్లాన్ చేసుకున్న దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్.. పెళ్లి కంటే ముందే, పెళ్లి తర్వాత ముంబైలో ఇచ్చే విలాసవంతమైన రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరూ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ.. అంతా దీపిక ఇష్ట ప్రకారమే జరుగుతోందని రణ్వీర్ సింగ్ చెబుతున్నారు. ప్రముఖ రచయిత్రి, మోడల్, వంట కార్యక్రమాల టీవీ షోల వ్యాఖ్యాత పద్మాలక్ష్మి 48వ పుట్టిన రోజు నేడు. 2004లో ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీని వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్న పద్మ.. వెంచర్ క్యాపిటలిస్ట్ ఆడమ్ డెల్‌తో, ఐ.ఎం.జి. సిఈవో టెడ్డీ ఫోర్ట్స్మన్తో కొంతకాలం సహజీవనం చేశారు. ప్రస్తుతం కూతురు కృష్ట థియా (తండ్రి డెల్) తో కలిసి ఎక్కువ భాగం యు.ఎస్.లోనే గడుపుతూ టీవీ రియాల్టీ షోల నిర్వహణలో భాగంగా ప్రపంచమంతా పర్యటిస్తున్నారు. -
ప్రియా ప్రకాశ్‌కు ఊరట
-
సుప్రీం తీర్పు.. ప్రియా ప్రకాశ్‌కు ఊరట
న్యూఢిల్లీ : ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. సామాన్యుల నుంచి స్టార్ హీరోల వరకూ ప్రియా ప్రకాశ్ కన్నుగీటుకి ఫిదా అయ్యారు. అయితే ఆ కన్నుగీటు ఆమెకు పేరుతో పాటు సమస్యలు కూడా తెచ్చిపెట్టింది. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ఓ పాటలో ప్రియా ప్రకాశ్ ముస్లింల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించిందంటూ కొందరు ముస్లింలు ఆమెపై కేసు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసులో ప్రియా ప్రకాశ్‌కు ఊరటనిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రియా ప్రకాష్‌పై కేసును కొట్టివేయడమే కాక.. కేసు వేసిన వారిని ఉద్దేశిస్తూ ‘మీకేం పని లేదా.. ప్రతి దానికి ఇలా కేసులు వేసుకుంటూ కూర్చుంటారా’ అంటూ చివాట్లు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు ఫలితంగా ఇన్నాళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ‘ఒరు అదార్ లవ్’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమర్ లులు దర్శకత్వంలో వచ్చిన ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియ కన్ను కొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాట కేరళకు చెందిన ముస్లిం సంప్రదాయపు గీతం అని, ఇందులో ప్రియ కన్నుకొట్టడం అసభ్యకరంగా ఉందంటూ పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రియా ప్రకాశ్ మీద కేసు వేశారు. -
‘ఓయ్ పిల్లాడా ! ప్రియా వారియర్ కంటే..’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా వివిధ దేశాధినేతలను ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలి ఆలింగనంతో (బేర్ హగ్) చిత్తు చేస్తే, ఆయనకు విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రూపంలో ఆలింగనంలో పోటీ ఎదురైందనే సరదా చర్చ సాగుతోంది. శుక్రవారం లోక్‌సభలో ఎన్డీఏ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ తన ప్రసంగంతో, ఆ తర్వాత మోదీని ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆ వెంటనే సహచర ఎంపీలను ఉత్సాహపరుస్తూ కొంటెగా కన్నుగీటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్ చేష్టలన్నింటినీ వివిధ జాతీయ టీవీ ఛానళ్లు పదేపదే చూపాయి. ఈ ఘట్టాలు ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హాస్యపూర్వక వ్యాఖ్యలు, చర్చలకు దారితీశాయి. ► ‘ఓయ్ పిల్లాడా ! ప్రియా ప్రకాష్ వారియర్ (కన్నుగీటిన సీన్ల ద్వారా పాపులర్ అయిన మలయాళీ నటి) కంటే మెరుగ్గా రాహుల్ కన్నుగీటారు. మున్నాభాయ్ కంటే బాగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆస్కార్ అవార్డ్ రావొచ్చేమో?’ నంటూ గౌతమ్ జోషి ట్వీట్ చేశారు. ► ‘ప్రియా వారియర్ కంటే కూడా నిట్టనిలువునా మనిషిని పడగొట్టేలా కన్నుకొట్టడమంటే ఇదే’నని ఆకాష్ సిన్హా పేర్కొన్నారు ► ఈ కౌగిలింత ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండబోతోంది. ప్రియా వారియర్ కంటే కూడా ఈ కన్నుగీటడం మరింత ఎక్కువగా అంటురోగంగా వ్యాపిస్తుందేమోనన్న సందేహాన్ని గీతాశర్మ వెలిబుచ్చారు. ► అయితే రాహుల్ కన్నుగీటడంపై స్వయంగా ప్రియా వారియర్ ‘ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది’ అంటూ స్పందించింది. ► అవిశ్వాసంపై చర్చను పక్కన పెట్టి మోదీపై దాడే రాహుల్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రసంగం బదులు ప్రదర్శన ఇచ్చారు. చిన్నపిల్లాడి మాదిరిగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయడం తప్ప ఓ విజనూ లేదూ, రోడ్డు మ్యాపూ లేదు’ అంటూ మరో ట్విటరాటీ సంజూ శర్మ విరుచుకుపడ్డారు ► ప్రధానిని రాహుల్‌గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత చౌకబారుగా కన్నుగీటడం ఆయన అపరిపక్వతను, స్థాయి లేమి తనాన్ని స్పష్టం చేస్తోంది’ అంటూ ఘోస్ స్పాట్ అకౌంట్ ట్వీట్ చేశారు. ► ముఖ్యమైన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ మర్యాదను, నిబంధనలను రాహుల్ తక్కువచేశారు. జప్పీ (కౌగిలింత) తర్వాత కన్నుగీటడం చూస్తుంటే ఆయన ప్రతిపక్ష నేతా లేక మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి పాత్రా? సిగ్గుచేటు...షెహజాద్ జై హింద్ ట్విటర్ అకౌంట్ నుంచి పేర్కొన్నారు ► ఆలింగనం తర్వాత కన్నుకొట్టడమా? భారతీయులను మూర్ఖులను చేయాలనే యత్నం వద్దు రాహుల్. పార్ల మెంట్లో కామెడీ షో ఏం జరగడం లేదు. పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడేటపుడు సీరియస్‌గా వ్యవహరించు. ప్లీజ్ పరిణతి ప్రదర్శించు...బర్ఖా ట్రెహాన్ ట్వీట్ చేశారు. ► ‘వావ్..వావ్ ! ఏమి హగ్ అండీ. ఎంత అద్భుతమైన రోజు ఇది’ అని సంజుక్త బసు వ్యాఖ్యానించారు. ► ‘న్యూ వైల్డ్ స్టోన్ యాడ్ మాదిరిగా ఉంది ఇది’ అని ఓజాస్ ట్వీటారు. ► రాహుల్ తన ప్రసంగంలో బీజేపీ వైఫల్యాలు ఎండగట్టి, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం ద్వారా మోదీ, బీజేపీ కంటే తాను, కాంగ్రెస్‌పార్టీ ఏ విధంగా భిన్నమైందో చెప్పారు అని శ్రీవత్స పేర్కొన్నారు. -
ప్రియా ప్రకాష్‌తో పోటీపడిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆయనపై నిప్పులు కురిపించారు. ఆవేశంలో కొన్నిసార్లు తడబడ్డారు కూడా. అప్పుడు మోదీ చిద్విలాసంగా నవ్వుతూ కనిపించారు. తడబాటును సర్దుకుంటూ చివరికంటా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్ చివరలో తనకు ఎవరి పట్ల విద్వేషం లేదని, అందరిని ప్రేమిస్తానని చెప్పి సరాసరి మోదీ వద్దకు వెళ్లారు. ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తన సీటులోకి వచ్చి కూర్చున్నారు. ఎలా ఉంది నా ప్రసంగం ? అన్నట్లు పక్కన ఎవరినో చూస్తూ కన్నుగీటారు. ఈ సన్నివేశం సభలో వేడిని తగ్గించి నవ్వులను పూయించగా ట్విట్టేరియన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. వారిలో ఒకరు.. కొద్దిరోజుల క్రితం అందరిని అలరించిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటుతో రాహుల్ కన్నుగీటును కలిపి పోస్ట్ చేయడం విశేషంగా ఆకర్షిస్తోంది. లోక్‌సభలో రాహుల్ గాంధీ కన్నుగీటిన వార్త విని ప్రియా ప్రకాష్ వారియర్ హర్షం వ్యక్తం చేశారు. తనకెంతో పేరు తెచ్చిన విన్యాసాన్ని రాహుల్ ప్రదర్శించడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు. జాదు కీ జప్పీ కాపీ కొట్టారా? ఆప్యాయంగా కౌగిలింకుంటే విద్వేషాలు తగ్గుతాయని, శాంతమూర్తులుగా మారతారని మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని భావనను రాహుల్ గాంధీ కాపీ కొట్టారని కొంత మంది వ్యాఖ్యానించారు. మోదీని ఎలుగుబంటి కౌగిలి ఇచ్చిన రాహుల్ గాంధీ ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచారు. కాగా, మోదీ అనుమతి లేకుండా బలవంతంగా వాటేసుకున్న రాహుల్‌పై కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు. ఇందుకే రాహుల్‌ను ‘పప్పు’ అంటున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘పప్పు’ హ్యాష్‌టాగ్ కూడా ట్విటర్ ట్రెండింగ్ కావడం కొసమెరుపు. -
ప్రియా ప్రకాశ్‌కు భారీ ఆఫర్!
మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే స్టార్ అయిన విషయం తెలిసిందే. ప్రియా రూ. కోటి ఆఫర్ దక్కించుకున్నారు. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ఓ పాటకు ఆమె తన కళ్లతో పలికించిన హావభావాలతో ఒక్కరోజులోనే ఆమె పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెకు పాపులారిటీ పెరిగిపోవడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. భారీ పారితోషికం ఇచ్చేందుకు కూడా పలువురు సినీ నిర్మాతలు ముందుకు వచ్చారు. ఇటీవల ప్రియా ఓ వాణిజ్య ప్రకటన చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఇందు కోసం ఆమెకు కోటి రూపాయల పారితోషికం దక్కినట్టు ప్రచారం జరుగుతోంది. రూ. కోటి డీల్‌పై ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది. అది జాతీయ ప్రకటన అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హాల్చల్ చేస్తున్నాయి. -
మరోసారి ఫిదా చేసిన ప్రియ
‘ప్రియాప్రకాష్ వారియర్’... ఇప్పుడు ఈ పేరుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇంతవరకూ ప్రియావారియర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. ఇదంతా ఒకే ఒక్క ‘కన్నుగీటు’ మహిమ. ఈ మధ్యే ప్రియ పోస్టు చేసిన ఒక ఫోటో చూస్తే ఎంత ముద్దుగా ఉంది అనిపించకమానదు. ఒక చిన్న పప్పి(చిన్న కుక్కపిల్ల)కి ఉండేలాంటి చెవులు, ముక్కును తన ఫోటోకు జతచేసి ఉన్న ఫోటోనొకదాన్ని ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ ఫోటోకు ‘ఎవరైనా నాకు ఆహారం పెట్టడానికి నిరాకరిస్తే’.. అనే క్యాప్షన్‌ను పెట్టింది. పాపం పప్పికి ఆహారం పెట్టకపోతే అది ఎంత అమాయకంగా చూస్తుందో ప్రియ కూడా అలాంటి హావభావాలనే ప్రదర్శించింది. ఈ ఫోటో చూసిన వారికి ఎవరికైనా సరే అబ్బా ఎంత ముద్దుగా.. ఉందో అన్పిస్తుంది. కొన్ని రోజుల కిందటే ప్రియ తన సహనటులు రోషన్ అబ్దుల్ రహూఫ్, వైశాక్ పవనన్, సియాద్ షాజహాన్‌లతో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరయ్యింది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ నటిస్తున్న మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ జూన్ 14న విడుదలకానుంది. ఒమర్ లులు ఈ చిత్ర దర్శకుడు. -
ప్రియా వారియర్ సందడి
ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సన్సేషన్‌గా మారారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ టీజర్లో సందడి చేసిన ప్రియా, ఆ సినిమా విడుదలకు ముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియాకు వచ్చిన ఆదరణ చూసిన చిత్ర యూనిట్ ఆ తర్వాత సినిమాలో ఆమె పాత్ర నిడివిని పెంచేలా రీ షూట్ చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌కు ఏ మ్రాతం తీసిపోని ఆదరణ ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవడానికి అభిమానులు సోషల్ మీడియాలో వెతుకుతూనే ఉన్నారు. తాజాగా ఆమె ఓ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఒరు అదార్ లవ్‌లో నటించిన తన సహ నటుడు అరుణ్ మ్యారేజ్‌కు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంతమంది మాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈ వివాహ వేడకలో ప్రియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పింక్ రంగు చీరలో పెళ్లికి హాజరైన ప్రియా మరోసారి అందరిని మాయ చేశారు. అంతే కాకుండా తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. సంజయ్ దత్ ఫేమస్ సాంగ్ ‘హవా హవా’ పాటను పాడుతూ.. చిన్నగా డాన్స్ కూడా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పెళ్లిలో పాట పాడిన ప్రియా వారియర్
-
కన్ను గీటింది...అవార్డు పట్టింది
ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రెటీగా మారిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం ఈ 19ఏళ్ల యవ్వనవతి సంపాదన, పాపులారిటీ స్టార్ హీరో కంటే తక్కువేం కాదు. కేవలం సంపాదన, పేరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ అమ్మడి ఖాతాలోకి మరో గౌరవం వచ్చి చేరింది. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొందరు నటులను వరించని అదృష్టం ప్రియా వారియర్‌ను వరించింది. ఇంతకు ఏంటా అదృష్టం అంటే ప్రియ తన తొలి అవార్డును అందుకుంది. అందేంటి ప్రియ నటించిన సినిమాలు ఇంతవరకూ ఒక్కటి కూడా విడుదల కాలేదు మరి అప్పుడే అవార్డు అందుకోవడం ఏంటి అనుకుంటున్నారా?. మరేంలేదు ప్రియ అందుకున్న అవార్డు సినిమాలకు సంబంధించింది కాదు సోషల్ మీడియాకు సంబంధించి అవార్డు. 2018 సంవత్సరానికి గాను ‘వైరల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రియ సొంతం చేసుకుంది. ఇది తన జీవితంలో తాను అందుకున్న తొలి అవార్డు అని, అందుకు చాలా గర్వంగా ఉందని ప్రియా వారియర్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రియా వారియర్ నటించిన ‘ఒరు ఆదర్ లవ్’ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మరోసారి కన్నుగీటిన ప్రియా వారియర్
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రేటీ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. కుర్రకారు ఇంకా ఆ మైకం నుంచి తేరుకోకమునుపే మరోసారి కన్నుగీటి యూట్యూబ్‌లో రద్దీని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకు ముందు ప్రియ కన్నుగీటింది ఒక సినిమా కోసమైతే ప్రస్తుతం మాత్రం కన్నుగీటింది ఒక ప్రకటన కోసం. ఒక ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ తమ కంపెనీ ఉత్పత్తుల కోసం ప్రియా ప్రకాశ్ వారియర్‌తో ఒక ప్రకటనను రూపొందించింది. మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో విడుదలవుతున్న ఈ ప్రకటనలో ప్రియ మరోసారి కన్నుగీటి కుర్రకారు మతి పోగొట్టింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రియ నటించిన ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ఆమె కన్నుగీటుకి కుర్రకారు ఫిదా అయిన విషయం తెలిసిందే. గత వీడియోతో పోల్చితే ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో తక్కువ వ్యూస్‌నే పొందింది. ‘ఒరు ఆదర్ లవ్’ సినిమా జూన్‌లో విడుదల కానుంది. -
చక్కనమ్మ ఏ చీర కట్టినా అందమే..
ముంబై : ఒక్క కనుసైగతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ సినిమా విడుదల కాకముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో ఉండడం సహజమే. అందుకే ప్రియా వారియర్ కూడా అభిమానులను ఖుషీ చేసేందుకు తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మలయాళ నూతన సంవత్సరాది ‘విషూ’ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియా వారియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎరుపు రంగు అంచు ఉన్న క్రీమ్ కలర్ చీర కట్టుకున్న ప్రియా.. ఎర్రటి బొట్టు పెట్టుకుని పూర్తి సంప్రదాయ వస్త్రాధారణతో అభిమానులను కట్టిపడేశారు. ప్రియా వారియర్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఒరు ఆదర్ లవ్’ జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమర్ లూలు దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు సియార్ షాజహాన్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షరీఫ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Happy vishu!🌼 📸: @mojin_thinavilayil Wearing: @ann_ancy Makeup & hair: pinky Thank you @mithunmithran A post shared by priya prakash varrier (@priya.p.varrier) on Apr 14, 2018 at 8:07am PDT -
మూడు భాషల్లోకి ప్రియా వారియర్ సినిమా
ఒక్క కనుసైగతో దేశ వాప్తంగా పాపులర్ అయిన మళయాల నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం ఆమె నటించిన ఒరు అదార్ లవ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రియ పాపులారిటీని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సినిమా దర్శక, నిర్మాతలు. ఈ చిత్రాన్ని మరో మూడు భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో ప్రియకు జోడీగా రోషన్ అబ్దుల్ రహూఫ్ నటిస్తున్నాడు. ఒమర్ లులు దర్శకత్వం వహించగా, ఒసెపచ్చన్ ఒళకుంజి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియ పాపులారిటీ దర్శక, నిర్మాతలకు ఏమేరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలిమరి. -
ప్రియా ప్రకాశ్‌కు ఛాన్స్ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్!
సాక్షి, చెన్నై: నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కోలీవుడ్ ఎంట్రీ ఖరారైనట్లేనా? ఇటీవల నటి ప్రియా వారియర్ టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా నిలిచింది. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం ఓరు ఆడార్ లవ్. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ చిత్ర ట్రైలర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్లో ఒక కాలేజీ విద్యార్థులు తమ ప్రేమను చాటుతున్న దృశ్యాలు ఉన్నాయి. అంతేకాక హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ కొంటెగా కన్ను గీటుతూ.. లవ్ బుల్లెట్‌ను గురి చూసి హీరో గెండెల్లోకి వదలడం వంటి దృశ్యాలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ భామ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయింది. ఆమెతో బేటికి మీడియా సైతం పోటీ పడింది. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలో కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. తాజాగా కోలీవుడ్‌లో సూర్యకు జంటగా కేవీ. ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనుందనే ప్రచారం హల్చల్ చేసింది. అయితే దీనిపై డైరెక్టర్ స్పందించారు. అది అవాస్తవమని ఆయన తెలిపారు. అంతేకాక, హిందీలో రణ్వీర్ సింగ్‌తో రొమాన్స్ చేయడానికి ప్రియా రెడీ అయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ అమ్మడిని కోలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. విజయ్‌సేతుపతి హీరోగా సూదుకవ్వుమ్, కాదలుమ్ కడందు పోగుం వంటి విజయం సాధించిన చిత్రాలకు కుమారస్వామి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో చిత్రానికి ఆయన రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
‘అమ్రపాలి’ని కాపీ కొట్టిన ప్రియా వారియర్?
ఒక్క కనుసైగతో కుర్రకారు మతి పొగొట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమా విడుదలవ్వక ముందే తన హావభావాలతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియా వారియర్ కన్నుగీటే ఈ సన్నివేశం ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ‘మణిక్య మలరాయ పూవి’ పాటకు సంబంధించినది. ఈ వీడియోలో ప్రియ కన్నుగీటే హవభావలతో స్టార్ హీరోలను సైతం ఆకట్టుకుంది. అయితే ఈ కన్నుగీటే దృశ్యాన్ని మూడు సంవత్సరాల క్రితం ప్రియ కంటే ముందే ఒక భోజపూరి నటి చేసింది. ఆ నటి భోజ్‌పూరికి చెందిన అమ్రాపాలి దూబే. ఆ సన్నివేశం అమ్రపాలి దూబే, దినేశ్ లాల్ యాదవ్ నిరావ్ నటించిన ‘రాజు భాయ్’ సినిమాలోని ‘మాతా ఫెయిల్ హో జైల్’ పాటలో ఉంది. 2015లో విడుదలయిన ‘ఈ రాజు భాయి’ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఒరు ఆదర్ లవ్‌లో ప్రియ కన్నుగీటే దృశ్యానికి, అమ్రపాలి చేసిన కన్నుగీటినదానికి చాలా పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీంతో అమ్రపాలిని ప్రియా ప్రకాశ్ వారియర్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఒమర్ లూలు దర్శకత్వం వహిస్తున్న ఒరు ఆదర్ లవ్ రోమాంటిక్ డ్రామా. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు సియార్ షాజహాన్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షరీఫ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రియాకు చిక్కులు: కన్నుకొట్టడం దైవదూషణే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ప్రియాప్రకాశ్ వారియర్ తొలి చిత్రం ‘ఓరు ఆదార్ లవ్’ సినిమాకు ఒక్కొక్కటిగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఇద్దరు హైదరాబాద్ వాసులు ఈ సినిమాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటను తొలగించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. పవిత్రమైన పాటలో కన్నుగీటినట్టు చిత్రించడం.. ఇస్లాంలో ‘దైవదూషణ’ లాంటిదేనని పేర్కొన్నారు. ‘మాణిక్య మలరాయ పూవి’ పాట వీడియోను కొన్ని రోజుల కిందట ఇంటర్నెట్లో విడుదల చేయగా.. ఈ పాటలోని ప్రియా వారియర్ తన క్లాస్‌మేట్‌ను చూసి నవ్వుతూ.. కన్నుకొట్టే దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోతో ప్రియా వారియర్ ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. అయితే, ఈ వీడియో క్లిప్‌పై పలు ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటున్నాయి. మహమ్మద్ ప్రవక్త, ఆయన భార్య ఖదీజా బివీని ప్రశంసిస్తూ రాసిన పాటను ఈ సినిమాలో ఉపయోగించుకొని.. అభ్యంతరకర దృశ్యాలను చిత్రీకరించారని పిటిషనర్లు పేర్కొన్నారు. ‘30 సెకన్ల వీడియోలో పాఠశాల బాలిక.. ఓ బాలుడి పట్ల నవ్వుతూ.. కనుబొమ్మలు ఎగరేస్తూ.. కన్నుకొట్టినట్టు చూపించారు. కన్నుకొట్టడం ఇస్లాంలో నిషేధం. మహమ్మద్ ప్రవక్త, ఆయన భార్యను ప్రశంసిస్తూ రాసిన పవిత్రమైన పాటలో ఇలా కన్నుకొట్టే సన్నివేశాలు పెట్టడం దైవదూషణే’ అని పిటిషనర్లు తెలిపారు. పిటిషనర్లలో ఒకరు ఇప్పటికే సినిమా దర్శకుడు ఒమర్ లులుకు వ్యతిరేకం పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. -
అదే నా లక్ష్యం
తమిళసినిమా: ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. పేరు మాత్రం దక్షిణాదిని దాటి ఉత్తరాది సినిమాకు పాకేసింది. ఆ పేరే ప్రియా వారియర్. కథానాయికలకు చిరునామా కేరళా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అక్కడి అమ్మాయిలిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్లో హీరోయిన్లుగా దుమ్మురేపుతున్నారు. ఇక ప్రియా వారియర్ గురించి చెప్పాలంటే ఈమె కథానాయకిగా పరిచయం అవుతున్న ఒరు అడార్ లవ్ అనే మలయాళ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఆ చిత్రం ట్రైలర్లో ప్రియ నటించిన దృశ్యాలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రియా వారియర్ కన్ను కొట్టే దృశ్యం కుర్రకారులో కేక పుట్టిస్తోంది. ఈ సందర్భంగా ఈ క్రేజీ నటి ఏమంటుందో చూద్దాం. ఒరు అడార్ లవ్ చిత్ర ట్రైలర్‌తోనే నాకు ఒక్క మాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందుకు నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. గాలిలో తేలిపోతున్నట్లుంది. ఈ సంతోషం భవిష్యత్తులోనూ కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాన్న ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్నారు. అమ్మ హౌస్‌వైఫ్. నేను బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చదువుకు ఆటంకం కలగకుండా నటిస్తున్నా. ఇప్పుడు మా కళాశాల్లో నేను చాలా పాపులర్ అయ్యాను. ఇలా సడన్‌గా పాపులర్ కావడం వినూత్న అనుభవం. నేను నటిని కావడం నా తల్లిదండ్రులకు సంతోషమే. తాతా,బామ్మలు ఆనందపడుతున్నారు. నేను పెద్ద నటిని కావాలన్నది వారి కోరిక. ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించాను. అందాల పోటీల్లోనూ పాల్గొన్నాను. డాన్స్ పోటీలో గెలుపొందాను. కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. స్టార్ హీరోయిన్ కావాలన్నది నా కోరిక. అన్ని భాషల్లోనూ నటించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. -
షాపింగ్ మాల్లో ప్రియా ప్రకాశ్.. వీడియో వైరల్
తిరువనంతపురం : ఒక్క కనుసైగతో దేశవ్యాప్తంగా పాపులరైన మలయాళ కుట్టి ‘ ప్రియా ప్రకాశ్ వారియర్’. ఆమెకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెటిజన్లకు పండగే. కొద్దిరోజులుగా ప్రియా ప్రకాశ్ షాపింగ్‌మాల్ వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. షాపింగ్‌మాల్‌లో అభిమానులతో కలసి ఫోటోలు దిగిన ఈ వీడియోను ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాదు ‘‘ ప్రియా వారియర్ హోలిక్స్’’ పేరిట ఆమెకు ఓ అభిమాన సంఘం ఉంది. ప్రియకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటుంది. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
షాపింగ్ మాల్లో ప్రియా ప్రకాశ్..
-
ప్రియా వారియర్ తెలుగులో..
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మత్తుగొలిపే కళ్లతో ముద్దుల తూటాలను పేల్చి యువతకు ఆరాధ్యం అయిపోయిందీ పద్దెనిమిదేళ్ల కేరళ అందం. సోషల్ మీడియాలో‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ఓ రొమాంటిక్ వీడియో క్లిప్ హల్చల్ చేయడంతో..రాత్రికి రాత్రే ప్రియా పాపులర్ అయింది. ఈ వీడియో క్లిప్ ఆమెకు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఒక్క దెబ్బతో ‘ఒరు అదార్ లవ్’ సినిమా అంచనాలు అమాంతం పెరిగాయి. దాంతో అటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నిర్మాతలు, ఇటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ప్రియా కాల్షీట్ల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. తెలుగులో తాజాగా విడుదలైన ‘ఇగో’ సినిమా నిర్మాతలు తమ తదుపరి సినిమా కోసం ఆమెకు భారీ పారీతోషికం ఆఫర్ చేసినట్టు వినికిడి. చూడాలి మరి తెలుగులోనూ ప్రియ తన కళ్లతో ఏ భావాలు పలికిస్తుందో...!! -
ప్రియా ‘కన్నుగీటు’తో ప్రజల్లో అవగాహన
వడోదర : ఒక్క కన్ను గీటుతో మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎంత ఉర్రూతలూగించిందో అందరికీ తెలిసిందే. ఆ కన్నుగీటుతో ఆమెకి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ పాపులారిటీని వడోదర సిటీ పోలీసులు, సురక్షితమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడానికి వాడుతున్నారు. ప్రియా ప్రకాశ్ కన్ను గీటుతో ఓ క్యాప్షన్ పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ‘రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. పరధ్యానంగా లేకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. #ట్రాఫిక్ఏక్సర్కార్.. ’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. పోలీసులు క్రియేటివ్‌తో రూపొందించిన ఈ పోస్టర్, ప్రస్తుతం వైరల్ అయింది. ఈ మాదిరిగా సందేశాన్ని తెలియజేయడం గొప్ప మార్గమంటూ ట్విటర్ యూజర్లు పొగుడుతున్నారు. ‘ఈ వినూత్న బ్యానర్ మేము చాలా ప్రేమిస్తున్నాం. అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న వర్క్ చాలా అభినందనీయం’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వేధింపులు, వెంబడింపులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఫేమస్ 'హసినా మాన్ జాయేగి' పాటను ఉపయోగించింది మరో పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. యువతరాన్ని ఎక్కువగా చేరుకోడానికి అంతకముందు సిటీ పోలీసులు సోషల్ మీడియా క్రియేటివిటీని వాడారు. ఇటీవల వడోదర, ముంబై పోలీసు, బెంగళూరు పోలీసులు ఆకట్టుకునే పదబంధాలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. -
ఉట్టికెగరలేనయ్య!
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరుతానందట! కాన్ఫిడెన్స్ మంచిదే. అయితే ఇప్పుడు స్వర్గం ఎవరిక్కావాలి? చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటేనూ! పనిలేని వాళ్లకు, పని ఉన్నవాళ్లకు కూడా వాట్సాప్ ఇప్పుడు స్వర్గధామం. ఈ స్వర్గంలో ప్రముఖులదీ, అనామకులదీ ఒకటే బెంచ్. దమ్ మార్ దమ్. ఏక్ హై హమ్. చిన్న పోస్టుతో అబద్ధం నిజం అయిపోతుంది, నిజం అబద్ధం అయిపోతుంది. ఎవరికి లాభం.. ఇలాంటి ఫేక్ పోస్టులతో? ఎవరికీ లేదు. అదో గంజాయ్ లాంటి ఎంజాయ్మెంట్. రెండు రోజులుగా వాట్సాప్‌లలో ఒక కాలేజ్ ‘సర్క్యులర్’ సర్క్యులేట్ అవుతోంది. మీకూ వచ్చే ఉంటుంది. కోయంబత్తూర్‌లోని ‘వి.ఎల్.బి.జానకీయమ్మాళ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్’ ప్రిన్సిపాల్ పేరుతో అది బయటికి వచ్చింది. ‘డియర్ స్టూడెంట్స్.. ప్రియా వారియర్‌లా మీరూ కూడా క్లాస్ రూమ్‌లలో కన్నుగీటుతున్నట్లు తెలిసింది. అలా చేసినట్లు మా దృష్టికి వస్తే వెంటనే మిమ్మల్ని వన్ ఇయర్ పాటు కాలేజ్ నుంచి డీబార్ చేస్తాం’ అన్నది సారాంశం! అమ్మో ఈ పిల్ల దేశం మొత్తాన్నీ పాడు చేస్తోందే.. అనిపిస్తుంది ఆ సర్క్యులర్ని చూడగానే. పాడై పోయే మాట నిజమేనేమో కానీ... ఈ సర్క్యులర్ మాత్రం నిజం కాదు. ఎవరో ఉట్టికెగరలేనయ్యలు ఊరికే ఉండలేక ఇలా ఫేక్ పని చేసినట్లున్నారు. ఎలాగంటారా! ప్రియ ‘కన్నుగీటింది’ ఫిబ్రవరిలో. ఆ సర్క్యులర్ మీద ఉన్న డేటు జనవరిది. -
ప్రియా వారియర్‌ను టార్గెట్ చేసిందెవరు...?
న్యూ ఢిల్లీ : ఒక్క కనుసైగతో ప్రియ ప్రకాశ్ వారియర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కుర్రాళ్లంత ఆ కనుసైగకు ఫిదా అయిపోయారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలను కూడా ఆ వీడియో విపరీతంగా ఆకర్షించింది. చాలామంది అమ్మాయిలు ప్రియా ప్రకాశ్‌ను అనుకరిస్తూ వీడియోలు తీసి సోషలోమీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ జాబితాలో ఇప్పుడు గాయకురాలు నేహ కక్కర్ చేరారు. ‘ఒరు ఆదర్ లవ్’ సిన్మా టీజర్‌లోని ఫ్లైయింగ్ కిస్ సన్నివేశాన్ని నేహ కక్కర్ తానే నటిస్తూ వీడియో తీశారు. ‘ప్రియా వారియర్ నన్ను ప్రేరేపించింది. ‘గన్ ఉల్టి హో గయి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియోకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు చాలా బాగుందని చెప్పగా కొందరు గన్లోడింగ్ సరిగ్గా చేయలేదని చెప్పారు. ఈ విషయాన్ని నేహ ముందుగానే గుర్తించారు. అదే విషయాన్ని క్యాప్షన్‌గా పెట్టారు. పోస్టు చేసిన ఒక్క రోజులోనే ఈ వీడియోకు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పోస్టు చేసిన ‘ఒరు ఆదర్ లవ్’ వీడియోకు ఒక్క రోజులోనే 4లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ఒక్కరోజులోనే ప్రియా వారియర్ పేరు దేశం అంతా మార్మోగిపోయింది. ప్రస్తుతం ప్రియ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 51లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం ప్రియా వారియర్ ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్టు ఖరీదు రూ.8 లక్షలయ్యింది. -
ప్రియా వారియర్‌ను టార్గెట్ చేసిందెవరు...?
-
మాలీవుడ్ టు బాలీవుడ్
‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఒక్క సినిమా హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు’.. కానీ.. ఒక్క చూపుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు మాలీవుడ్ బ్యూటీ ప్రియాప్రకాశ్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ మలయాళ చిత్రం ట్రైలర్లో ప్రియ కన్నుకొట్టే సన్నివేశానికి ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ప్రియకు అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా రణ్వీర్ సింగ్ సరసన నటించే అవకాశం ప్రియా ప్రకాశ్‌ని వరించిందని బాలీవుడ్ టాక్. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ కి రీమేక్‌గా బాలీవుడ్లో ‘శింబా’ మూవీ తెరకెక్కుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రణ్‌వీర్‌కి జోడీగా అలనాటి అందాలనటి శ్రీదేవి తనయ జాన్వీ నటించనున్నారంటూ బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ప్రియాప్రకాశ్ పేరు తెరపైకి వచ్చింది. ‘శింబా’ చిత్రవర్గాలు ప్రియను సంప్రదించాయట. అయితే.. తొలి సినిమా ‘ఒరు అదార్ లవ్’ విడుదల వరకూ ఏ సినిమా ఒప్పుకోకూడదనే ఒప్పందం కారణంగా ఆమె ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని టాక్. -
ప్రియా ప్రకాశ్ ఒక్క పోస్ట్ సంపాదనెంతో తెలుసా?
ఒక్క సీన్‌తో కుర్రకారును ఫ్లాట్ చేసిన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ సోషల్ మీడియా వేదికగా ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ మళయాల భామ.. ఒక్క పోస్టుకు ఏకంగా రూ.8 లక్షలు ఆర్జిస్తోంది. ఇక సోషల్‌మీడియాలో ఆమెను అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇంటర్నెట్లో నిత్యం బాలీవుడ్ భామలు సన్నీలియోన్ ,దీపికా పదుకునే అంటూ ఫన్నీ కలలుకనే నెటిజన్లు.. ఇప్పుడు ప్రియా ప్రకాశ్ జపం చేస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాచ్ చేసుకోవాలని భావించిన ఈ అమ్మడు ఒక్క పోస్టుకు 8 లక్షలు డిమాండ్ చేస్తోందని ఓ జాతీయ చానెల్ పేర్కొంది. ఇక ప్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో 24 గంటల వ్యవధిలోనే 6 లక్షల 6 వేల మంది ఫాలోవర్స్‌తో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికన్ టీవీ స్టార్, మోడల్ కైలీ జెన్నర్ (8 లక్షల 6 వేలు), ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (6 లక్షల 50 వేలు) తర్వాత ప్రియానే కావడం విశేషం. ఇక ఫొటో-వీడియో షేరింగ్ యాప్‌లో ప్రియాను అనుసరించే వారి సంఖ్య ఏకంగా యాబై లక్షలకు చేరింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవీ’ పాట ఎంతో పాపులర్ అయిందో తెలిసిన విషయమే. ఈ పాటకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఫిదా అయ్యారు. మార్చి5నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇద్దరి స్కూల్ విద్యార్థుల మధ్య నడిచే ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విశేష స్పందన రాబట్టుకుంది. ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
నేనేనా? ఇది నిజమేనా?
కన్ను కొట్టి, కవ్వించిన పిల్ల రివ్వున ఎగి రింది. మబ్బులను దగ్గరగా చూసి సంబరపడిపోయింది. ‘మనం ఏంటి? ఎగరడం ఏంటి? ఇది కలా? నిజమా?’ అని ఒక్కసారి గిల్లి చూసుకుంది. ‘మనమే.. ఎగురుతున్నది మనమే’ అని ఆనందపడింది. మరి.. ఫస్ట్ టైమ్ విమానం ఎక్కితే ఎవరైనా ఇలానే ఆనందపడతారు కదా. జస్ట్ చిరునవ్వు నవ్వి, కన్ను కొట్టినందుకు బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ తొలిసారి ఫ్లైట్ ఎక్కింది. కొచ్చి టు తిరువనంతపురం ట్రావెల్ చేసిందీ బ్యూటీ. తొలి విమాన ప్రయాణం టికెట్‌ను దాచుకుందట. ‘లైఫ్‌లో తొలిసారి ఫ్లైట్ ఎక్కాను’ అని పేర్కొంది. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈలోపు టీజర్ ద్వారా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అందరూ ఆమె నటిస్తున్న తొలి చిత్రం ‘ఒరు అడార్ లవ్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒమర్ లులు దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో విడుదల చేస్తారు. -
శ్రీదేవి కోసం...ప్రియాప్రకాశ్ పాట!
-
శ్రీదేవి కోసం.. కభీ అల్విదా నా కహెనా!
శ్రీదేవి ఆకస్మిక మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది. ఆమె మృతి పట్ల ఎంతోమంది ఆవేదనను విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. దివ్యమైన సౌందర్యం, అద్భుతమైన నటనాకౌశలంతో సినీ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్న ఆమె కృషిని గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియాప్రకాశ్ వారీయర్ శ్రీదేవికి నివాళులర్పించింది. శ్రీదేవికి నివాళులర్పిస్తూ.. ‘కభీ అల్విదా నా కహెనా’ (ఎప్పుడూ వీడ్కోలు చెప్పొద్దు) పాటను విషాదంగా ఆలపించింది. ‘చరిత్ర ఎప్పుడూ గుడ్‌బై చెప్పద్దు. చరిత్ర కేవలం తర్వాత కలుద్దామని అంటుంది’ అని పేర్కొంటూ ఆమె ఈ వీడియోను ట్వీట్ చేశారు. ప్రియా కూడా శ్రీదేవి అభిమాని.. ఆమె మృతి వార్త తెలిసి తాను షాక్‌కు గురైనట్టు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. ‘నా ఆల్‌టైమ్ ఫెవరేట్ శ్రీదేవి ఇకలేరని తెలియడం గుండెపగిలే వార్త. షాక్‌కు గురయ్యాను. ఆమె ఎల్లప్పుడూ మన గుండెల్లో బతికే ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి మనోధైర్యం కలుగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని ప్రియా పేర్కొన్నారు. -
'నేను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశాను'
-
సచిన్‌తో ప్రియా ప్రకాశ్ సందడి
మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌లో ఈ భామ కను సైగలతో చేసిన హావభావాలు అందర్నీ కట్టి పడేశాయి. టాలీవుడ్ హీరోల నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ లుంగీ ఎంగిడీ వరకూ ప్రియాకు ఫ్యాన్స్ అయ్యారు. ఇపుడామే తనకు వచ్చిన స్టార్డమ్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ప్రియ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఐఎస్ఎల్-2018కు తన సహనటుడు రోషన్ అబ్దుల్ రవూఫ్‌తో కలిసి హాజరైంది. ఇందులో భాగంగా అక్కడే ఉన్న మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్, అభిషేక్ బచ్చన్ ను కలిసింది. ఈ సందర్భంగా సచిన్‌ను కలుసుకున్న ఫొటోను ప్రియా ట్విటర్లో షేర్ చేసింది. ‘ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు నేను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను’ అంటూ పోస్ట్ చేసింది. సచిన్‌తో ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్ -
ప్రియా ప్రకాష్ స్పూఫ్ చేసిన బన్నీ
-
ఎఫ్బీ సీఈవోను బీట్ చేసిన ప్రియా వారియర్
మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి, సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్(18) మరోసారి వార్తల్లో నిలిచింది. ఫాలోయర్లలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్నే మించిపోయింది ఈ కేరళ నటి. ఇన్స్టాగ్రామ్ సంస్థ యజమాని జూకర్‌బర్గ్‌కు ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లు 4 మిలియన్లు (40 లక్షల మంది) ఉండగా, ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే సెలబ్రిటీగా మారిన ప్రియా ప్రకాశ్ కు 4.5 మిలియన్లు (45 లక్షల మంది) ఫాలోయర్లు ఉండటం గమనార్హం. ఒక్క కన్ను కొట్టి కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఒరు ఆదార్ లవ్’ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాందించుకుంది. రోజురోజుకి ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని క్రాస్ చేసిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌ని మించిపోయింది. ఆయనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేరళ కుట్టికి 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏదైన ఫోటో పోస్ట్చేసిన లేదంటే వీడియో అప్లోడ్ చేసిన మిలియన్స్‌కి పైగా లైకులు, వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియా సంచలనంగా మారిన ప్రియా రోజురోజుకి ఎవరికి అంతనంత ఎత్తుకి ఎదుగుతుంది. ఈ అమ్మడికి పలు సినిమాలలో ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లో నిఖిల్ సరసన నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుండగా , దీనిపై క్లారిటీ రావలసి ఉంది. ‘ఒరు అదార్ లవ్’లో ఒక్క సీన్లో కన్ను కొట్టి కోట్లాది అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. ఫాలోయర్స్ పరంగా బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, సన్నీలియోన్ లను దాటేస్తూ పోతున్న ఈ కేరళ బ్యూటీ ఇన్‌స్ట్రాగ్రామ్ ఫాలోయర్లలో ఏకంగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్ నే మించిపోయింది. రోజురోజుకి ఈ నటిని ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగి పోతుండటంతో రోజుల వ్యవధిలోనే పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. జూకర్బర్గ్ పోస్ట్ చేసిన వీడియో, ఫొటోలకు నాలుగైదు లక్షల వరకు కామెంట్స్, లైక్స్ వస్తుండగా.. ప్రియా వారియర్ ఒక్కో పోస్ట్‌కు పది లక్షలకు పైగా లైక్స్, కామెంట్స్ రావడం గమనార్హం. మరోవైపు తొలి సినిమా ఇంకా విడులవ్వక ముందే వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. -
ప్రియాప్రకాశ్‌కు భారీ ఊరట!
-
ప్రియా వారియర్‌కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్(18)కు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రియాతో పాటు ఈ చిత్ర దర్శకుడు ఒమర్ లులూపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అలాగే వీరిద్దరిపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుచేయరాదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఒరు అదార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ పాట ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా చిత్రీకరించారంటూ తెలంగాణ, మహారాష్ట్రల్లో వారిపై క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పాట కేరళలో చాలా ప్రాచుర్యం పొందిందనీ, దీన్ని అపార్థం చేసుకోవడం వల్లే వేర్వేరు రాష్ట్రాల్లో తమపై కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయమై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. -
ప్రియాప్రకాశ్‌కు భారీ ఊరట!
-
ప్రియాప్రకాశ్‌కు భారీ ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా సెన్సేషన్, కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ, మహారాష్ట్రల్లో నమోదైన కేసులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ లోని పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో దేశంలో ఎక్కడా కూడా నటి ప్రియపై, సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విషయంలో క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలంటూ ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ స్టే విధించింది. కాగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమాలో పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తోపాటు చిత్ర దర్శక, నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోనూ ఇదేవిధంగా కేసు నమోదైంది. ఈ మూవీలోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఒక్క ‘కంటిసైగ’ వీడియోతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఇటీవల ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని 'మాణిక్య మలరాయ పూవి' పాటలో ఆమె కన్నుగీటే సన్నివేశాలు సంచలనంగా మారి.. ప్రేమికులరోజు సందర్భంగా దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. -
వారియర్‌పై వల్గర్ కామెంట్లు
సాక్షి, తిరువనంతపురం : సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా వారియర్‌పై పలువురు యువకులు అనుచితంగా వ్యవహరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోపై అభ్యంతరకర కామెంట్లు చేశారు. దీంతో ఆమె సన్నిహితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోకు కొందరు యువకులు మరీ దారుణమైన కామెంట్లు చేశారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం కాదంటూ.. డబుల్ మీనింగ్ డైలాగులతో కామెంట్లు పోస్ట్ చేశారు. దీనిని ప్రియా వారియర్ సీరియస్‌గా తీసుకుంది. ఆమె సన్నిహితులు సోమవారం ఈ విషయమై సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒరు ఆదార్ లవ్ చిత్రంలోని ఒక్క సీన్‌తో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోసం వివిధ భాషల మేకర్లు క్యూ కడుతున్నా ఆమె మాత్రం అంగీకరించటం లేదు. -
సుప్రీంను ఆశ్రయించిన ప్రియా వారియర్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా సెన్సేషన్, కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె నటించిన లేటెస్ట్ మలయాళ మూవీ ‘ఒరు ఆదార్ లవ్’ లోని ఓ పాటలోని వీడియో సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో ఇటీవల పోలీస్ కేసు నమోదైంది. అయితే తమ మూవీ యూనిట్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా రేపు (మంగళవారం) తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశం ఉందని ప్రియా ప్రకాశ్ ఆశిస్తోంది. ఇదిలాఉండగా.. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతోపాటుగా ఈ మూవీలోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ మహారాష్ట్రలోనూ పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కొన్నిరోజుల కిందట దేశవ్యాప్తంగా మీడియాలో ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఇందుకు కారణంగా ‘ఒరు ఆదార్ లవ్’ మూవీ 'మాణిక్య మలరాయ పూవి' పాటలోని సన్నివేశాలు. హీరోయిన్ కనుబొమ్మలను ఎగరేయడం, కన్ను కొడుతూ హీరోకు బదులిస్తున్న వీడియో సంచలనంగా మారింది. దీంతో మూవీ యూనిట్‌కు కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుండగా.. మూవీ యూనిట్‌పై నమోదైన కేసుల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని నటి ప్రియా ప్రకాశ్ వారియర్ భావిస్తోంది. కేసులను త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్న ప్రియా ప్రకాశ్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌పై రేపే (మంగళవారం) విచారణ జరగవచ్చునని అశిస్తున్నట్లు తెలిపింది. -
‘ప్రియా నీ హావభావాలు చూడ ముచ్చటగా..’
మలయాళం భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో స్టార్‌గా మారి సంచలనం సృష్టించింది. ఆమె నటించిన సినిమా ‘ఒరు అడార్ లవ్’’ . ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో గతవారంలో విడుదల అయింది. దాంట్లో ఈ భామ కను సైగలతో చేసిన హావభావాలు అందర్నీ కట్టి పడేశాయి. టాలీవుడ్ హీరోల నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ లుంగీ ఎంగిడీ వరకూ ప్రియాకు ఫ్యాన్స్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ లిస్ట్‌లో చేరిపోయ్యాడు బాలీవుడ్ నటుడు, దర్శకుడు రిషి కపూర్. ఇటీవల ఆమె వీడియో చూసిన ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ‘ ప్రియాకు ఊహించని స్టార్ డమ్ వచ్చింది. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటున్నాను. మై డియర్ ప్రియా .. నీ వయస్సు వాళ్లకు నీవు స్ఫూర్తిగా నిలుస్తున్నావు. ఈ వీడియో నీ హావభావాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. గాడ్ బ్లెస్, ఆల్ ది బెస్ట్’ అని రిషి కపూర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ పెరిగిపోయింది. ప్రియా ప్రస్తుతం కేరళ త్రిస్సూర్‌లోని ‘విమల కాలేజ్’లో బీకామ్ చదువుతోంది. ‘ఒరు ఆదార్ లవ్’ మలయాళ చిత్రంలో హీరోయిన్ ప్రియా వారియర్ కనుగీటిన సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఒరు ఆదార్ లవ్ అంటే అసాధారణ ప్రేమ అని అర్థం. -
‘పనికొచ్చే విషయాలపై స్పందిస్తే మంచిది’
సాక్షి, తిరువనంతపురం : మళయాళంలో ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవీ’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అంతే వివాదాస్పదంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్ బుక్‌లో స్పందించారు. అయితే ఓ సినిమా పాటకు స్పందించిన సీఎంకు.. రాష్ట్రంలో మిగతా సమస్యలు కనిపించటం లేదా? అని సీనియర్ నటుడు, రాజకీయ ఉద్యమకారుడు జాయ్ మాథ్యు.. పినరయిపై విరుచుకుపడ్డారు. ‘పోలీస్ శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఓ సినిమా పాట వివాదంపై స్పందిస్తూ భావ స్వేచ్ఛ ప్రకటన అంటూ మద్ధతిచ్చారు. కానీ, రాజకీయ హత్యలు ఆయన కంట పడటం లేదనుకుంటా. కన్నూర్‌లో కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తను కొందరు దారుణంగా హత్య చేశారు. వారిని ఇంత వరకు అరెస్ట్ చేయలేకపోయారు. అంటే హంతకులకు కూడా తప్పించుకుని తిరుగే స్వేచ్ఛను విజయన్ ప్రభుత్వం ప్రసాదించారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయని.. అనవసరమైన విషయాలపై స్పందించటం మానేసి.. పనికొచ్చే పనులపై దృష్టిసారిస్తే మంచిదని మాథ్యూ.. విజయన్‌కు సూచించారు. కాగా, కళలో భావ ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని సీఎం పినరయి విజయన్ తన ఫేస్బుక్లో పాట వివాదంపై స్పందించారు. ఈ క్రమంలో పాట పుట్టుపూర్వోత్తరాల గురించి ఆయన పూర్తి వివరాలు తెలియజేశారు. మాప్పిలపట్లు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బర్ రాసిన ఈ పాటను రఫీఖ్ పాడారు. 1978 ఆకాశవాణిలోనే ఈ పాట ప్రసారమైంది. ఏళ్ల తరబడి ముస్లింల వివాహాల్లో ఈ పాటను పాడుతున్నారు కూడా. అలాంటప్పుడు ఒప్పుడు కొత్తగా అభ్యంతరం ఏంటి? ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలు. వాటిని నాశనం చేసే ప్రయత్నం మంచిది కాదు అని విజయన్ తెలిపారు. కాగా, ఈ పాట రాసిన జబ్బర్ కూడా వివాదాలు సాధారణమే అని వ్యాఖ్యానించారు. ప్రియా ప్రకాశ్ వారియర్ మూలంగా ఈ పాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమా నుంచి ఈ సాంగ్‌ను తొలగించేలా సెన్సార్ బోర్డుకు, చిత్ర బృందానికి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పలు ముస్లిం సంఘాలు లేఖలు రాశాయి. -
‘స్మృతీజీ..ప్రియా పాటను నిషేధించండి’
సాక్షి,న్యూఢిల్లీ : కంటిబాసతో ఇంటర్నెట్ సంచలనంగా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ వార్తల్లో నానుతూనే ఉంది. ప్రియా హల్చల్ చేసిన వైరల్ సాంగ్ మాణిక్య మలరయ పూవి ట్రాక్‌ను నిషేధించాలని రజా అకాడమీ తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాసింది. ప్రియా ప్రకాష్ తొలి మూవీ ఒరు ఆదార్ లవ్‌లోని ఈ పాట వివాదాస్పదమైనన సంగతి తెలిసిందే. ఈ మళయాళీ పాట మహ్మద్ ప్రవక్తను అవమానించేలా ఉందని మంత్రికి రాసిన లేఖలో రజా అకాడమీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా నుంచి ఈ సాంగ్‌ను తొలగించేలా సెన్సార్ బోర్డుకు, చిత్ర బృందానికి సూచించాలని రెహ్మానీ గ్రూప్ అధ్యక్షుడు అసిఫ్ సర్ధార్ మంత్రిని కోరారు. మరోవైపు ఈ పాటను వ్యతిరేకిస్తూ రజా అకాడమీ మినరా మసీదు ఎదుట నిరసన తెలిపింది. పవిత్ర వ్యక్తులను అవమానించడం మానుకోవాలని రాసిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. మళయాళ మూవీ ఒరు ఆదార్ లవ్ నుంచి విడుదలైన చిన్న క్లిప్‌లో ప్రదర్శించిన హావభావాలతో ప్రియా ప్రకాష్ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. -
ఈ సంచలన నటి ఎవరో తెలుసా?
ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారి సంచలనం సృష్టించిందీ తార. ఆమె ఎవరో ఈపాటికి మీరు కనిపెట్టేసి ఉంటారు. మీరు ఊహించినట్టుగా ఈ చిన్నారి మలయాళం భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె నటించిన మొదటి సినిమా ‘ఒరు అడార్ లవ్’ విడుదల కాకుండానే ఆమె స్టార్‌గా మారింది. ఒక్కరోజులో పాపులర్ అయిపోయింది. దీంతో ఆమెకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 35 లక్షలు దాటేసింది. అతి తక్కువ టైమ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ని రాబట్టుకుని సంచలనం సృష్టించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోలు ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసినవే. కేరళ త్రిస్సూర్‌లోని ‘విమల కాలేజ్’లో బీకామ్ చదువుతున్న ప్రియ బహుముఖ ప్రతిభావంతురాలు. ఆమె నృత్యకారిణి కూడా. సంప్రదాయ మోహనిహట్టం నృత్యం నేర్చుకుంది. కాగా, ‘ఒరు అడార్ లవ్’ సినిమా లవ్ సీన్లో ప్రియ ‘కన్నుగీటే’ వీడియో ఇంటర్నెట్లో నిర్విరామంగా షేర్ అవుతూనే ఉంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకానుంది. Mohiniyattom💁💁💁 A post shared by priya prakash varrier (@priya.p.varrier) on Dec 15, 2016 at 12:46am PST -
ప్రియా.. ప్రియా.. చంపొద్దే!
సోషల్ మీడియా ఎప్పుడు ఎవర్ని సెలబ్రిటీని చేస్తుందో ఊహించలేం! త్రిస్సూర్‌లో బీకాం ఫస్టియర్ చదువుతున్న మలయాళీ అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు లేటెస్ట్ సెలబ్రిటీ! ఈ „ý ణమో, మరుక్షణమో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 30 లక్షలకు చేరుకోబోతోంది! అసలు ప్రియ 87వ పోస్టింగ్ దగ్గరే ఆమె ఫాలోవర్లు సుమారు 20 లక్షల ఎనభై వేలు! ఇది మామూలు విషయమేం కాదు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ మూవీ స్టార్ మోహన్లాల్కి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వెనుక ఇంతమంది అనుచరుల్లేరు. 7 లక్షల 14 వేల దగ్గర వాళ్ల అడుగులు ఆగిపోయాయి. అది కూడా ఆయన 2015లో నెట్లోకి ప్రవేశిస్తే.. ఇప్పటికి ఇంతమంది అయ్యారు. మరో మలయాళీ స్టార్ మమ్ముట్టి తనయుడు, యువ నటుడు దుల్కర్ సల్మాన్‌కి కేరళలోనే కాకుండా, తమిళనాడులోనూ పెద్ద ఫాలోయింగ్ ఉంది. తెలుగు, íß ందీ చిత్రాల్లో కూడా హీరోగా చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు అతడి ఫాలోవర్స్ 10 లక్షల 90 వేలు. అతడి పోస్టింగ్స్ 150. బాహుబలి తర్వాత అనుష్కాశెట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 20 లక్షలకు పెరిగారు. అయితే 463 వరకు ఆమె పోస్టింగ్‌లు ఉన్నాయి. ఆ మాత్రానికి ఈ మాత్రం ఫాలోయింగ్ ఎటూ ఉంటుంది. పైగా అనుష్క బిగ్ స్టార్. త్రిష పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలోఉన్నారు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో నటించారు. మలయాళంలో తొలిసారి ఆమె నటించిన ‘హే జ్యూడ్’ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్లు పది లక్షల 50 వేల మంది. ఇక మోడల్ మిలింద్ సోమన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ కుప్పలు తెప్పలుగా ఫొటోగ్రాఫ్స్‌ని అప్లోడ్ చేస్తుంటాడు. ఆయన ఫాలోవర్లు 2 లక్షల 49 వేల మంది. ఆయన పోస్ట్‌లు 488. తమిళ్ బిగ్‌బాస్ ఫేమ్ ‘ఓవియా’.. ఆ ‘షో’లో ఉన్నంత కాలం ఆమె ఇన్స్టాగ్రామ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. లక్షా 54 వేల మంది ఓవియాను ఫాలో అయ్యారు. వీళ్లందరిదీ ఫాలోవర్ల సంఖ్య తక్కువేం కాదు కానీ.. ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క 24 గంటల్లోనే 6 లక్షల 6 వేల మంది ఫాలోవర్లు వచ్చి చేరడం రికార్డ్ అయింది. ఇలా ఇంత తక్కువ టైమ్‌లో ఫాలోవర్స్‌ని రాబట్టుకున్న వారిలో అమెరికన్ టీవీ స్టార్, మోడల్ కైలీ జెన్నర్ (8 లక్షల 6 వేలు), ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (6 లక్షల 50 వేలు) తర్వాత ప్రియే కావడం సెన్సేషన్ అయింది. ఇదంతా కూడా ‘ఒరు ఆదార్ లవ్’ అనే.. ఇంకా విడుదల కాని సినిమాలోని చిన్న లవ్ సీన్లో ప్రియ ‘కన్నుగీటే’ సీన్ కారణంగానే. ఇంటర్నెట్లో ఆ సన్నివేశం నిర్విరామంగా షేర్ అవుతూనే ఉంది, ప్రియ ఫాలోవర్ల సంఖ్యను పెంచుతూనే ఉంది. ప్రియ తొలి చిత్రం ఇది. ప్రస్తుతం ఆమె త్రిస్సూర్‌లోని ‘విమల కాలేజ్’లో చదువుతోంది. మలయాళీ నటి అమలాపాల్ మలయాళంలో, తమిళంలో, తెలుగులో కూడా బాగా పాపులర్. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు పది లక్షల 20 వేలు. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులు 323. -
కన్ను కుట్టి
ప్రియా ప్రకాశ్ కేరళ కుట్టి.. తను కన్ను కొట్టి.. ఎంతోమందిని టెన్షన్లో పెట్టి అభిమానులతో చేయిస్తోంది వెట్టి ఎవరీ ప్రియాప్రకాశ్ వారియర్. సమాజాన్ని ఉద్ధరించే పనేదైనా చేసిందా? పోనీ నలుగురికి ఉపయోగపడే పనేదైనా? పోనీ ఇద్దరికి.. ఊహూ.. ఒక్కరికి. అబ్బే లేదు. మరేం చేసింది అంటే.. జస్ట్ కన్ను కొట్టింది. అంతే... లక్షలాది మంది ‘ఫ్లాట్’. సినిమా రిలీజ్‌కి ముందు టీజర్ వదులుతారు కదా? ఆ టీజర్లో రెండు కనుబొమలను పైకి లేపి, చిరునవ్వు నవ్వి, కన్నుకొట్టి... బాసూ.. ఓవర్‌నైట్ స్టార్ అవ్వడానికి ఇంత చేస్తే చాలు. ప్రియ చేసింది ఇంతే. అంతే.. నిన్న మొన్నటి వరకూ తనెవరో కేరళలో కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్. ఇంత పాపులార్టీ తెచ్చుకున్నది కన్ను కొట్టినందుకు.. అందంగా కొట్టినందుకు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మలయాళీ టీనేజ్ గర్ల్ ఫేమస్. ఆ మాత్రం చాలు ఈ అమ్మాయి యాక్ట్ చేసిన ‘ఒరు అడార్ లవ్’ సినిమా ఫేమస్ అయిపోవడానికి. టీజర్‌తోనే ఇంత సెన్సేషన్ అయింది కాబట్టి ఈసారి ఇంకో టీజర్ వదిలారు. ఇప్పుడు ప్రియా ఏం చేసిందో టీజర్ చూసినవారికి తెలిసే ఉంటుంది. అయినా చెబుతాం. దొండపండులాంటి పెదాల మీద రెండు వేళ్లు పెట్టుకుని ‘మ్చ్’ అంటూ బాయ్‌ఫ్రెండ్‌కి ఓ ముద్దు విసిరింది. అంతేనా.. ఆ రెండు వేళ్లను పెదాల మీద నుంచి తీసేసి, గన్నులా పెట్టి, కన్ను కొట్టి షూట్ చేసేట్లు సైగ చేస్తుంది. అంతే.. అక్కడ ఉన్నది తూటా కాకపోయినా సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్లు ఆ కుర్రాడు ఫీలయ్యాడు. చూసిన కుర్ర హృదయాల్లో డ్రీమ్ గర్ల్ అయి కూర్చుంది ప్రియ. ఈ టీజర్ తనను ఇంతగా పాపులర్ చేస్తుందని ప్రియ ఊహించలేదు. ‘‘ఇంతమంది చూపిస్తున్న ప్రేమను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడంలేదు. ఇది కలా? నిజమా?’’ అనిపిస్తోంది అని ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ప్రియాప్రకాశ్ తన ఇంట్లో తానే ఉండలేకపోతోంది. ఎందుకో తెలుసా? ఎప్పుడెప్పుడు ఈ బ్యూటీ బయటికొస్తుందా? అని ఎదురు చూస్తూ ఇంటి గేటు ముందు పహారా కాస్తున్నారట. అందుకే ప్రియాని ఆమె తల్లి ఇంట్లో నుంచి పంపించేశారు. అయ్యో.. మనసెలా వచ్చింది అనుకుంటున్నారా? మరేం లేదండి. మూడో కంటికి తెలియకుండా ప్రియాని హాస్టల్‌కి పంపించేశారు. అది లేడీస్ హాస్టల్ కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంతకీ ప్రియాప్రకాశ్ ఏం చదువుకుంటోంది? బ్యాగ్రౌండ్ ఏంటి? అంటే.. ప్రియాప్రకాశ్ వారియర్ వయసు 18. ఊరు కేరళలోని త్రిశ్సూరు. అక్కడి విమలా కాలేజీలో బీకామ్ స్టూడెంట్. క్లాసికల్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. మోడలింగ్ అంటే మోజు. అందుకే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మోడలింగ్‌లోకి ఎంటరైంది. పలువురు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ కోసం ర్యాంప్ వాక్ చేసింది. అప్పుడెవరూ ఊహించలేదు. ప్రియా ఓవర్‌నైట్ స్టార్ అవుతుందని. అన్నట్లు టీజర్స్‌లో ప్రియా కూర్చుని కనిపించింది. మరి.. నిలబడితే ఎంత ఎత్తు ఉంటుందంటే.. సుమారు 5 అడుగుల 4 అంగుళాలు. బరువు 50 కేజీలు. ఎత్తుకి తగ్గ బరువు అని చెప్పొచ్చు. అబ్బాయిల గుండెల్లో సునామీ ప్రియా ఫస్ట్ మూవీ ‘ఒరు అడార్ లవ్’ త్వరలో రిలీజ్ కానుంది. టీజర్ ఎఫెక్ట్‌తో మేం కొంటామంటే మేం కొంటామంటూ బయ్యర్లు క్యూలు కట్టారట. బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది. రిలీజ్ తర్వాత టికెట్లు కూడా బ్రహ్మాండంగా తెగుతాయి. అన్నట్లు.. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారు. చిన్నగా మొదలయ్యే చినుకు తుఫానుకి కారణమవుతుంది. అలాగే చిన్ని ఎక్స్ప్రెషన్ కుర్రకారు హృదయాల్లో సునామీ సృష్టించింది. మరోవైపు కొంతమంది హీరోయిన్ల గుండెల్లో అలజడి సృష్టించింది. ప్రియాప్రకాశ్ గట్టి పోటీ అవుతుందని ఇప్పటికే చాలామంది జోస్యం చెబుతున్నారు. ప్రియా.. వాట్యా? వాటీజ్ దిస్ యా? అలవోకగా కనురెప్ప మూసి.. యువత కనురెప్పలు మూతపడకుండా చేశావ్ యా.. యా.. యా..? గుండె దిటవు చేసుకోండి ప్రియాప్రకాశ్ను తొలిసారి చూసి ఇష్టపడిన అమర ప్రేమికుల్లారా.... ‘లవ్ ఎట్ ఫస్ట్ టీజర్’ రోమియోల్లారా... ప్రియా ప్రకాశ్ కోసం గుండెల్లో గుడి కట్టడానికి ముడి సరుకులు తెచ్చుకున్న యువకుల్లారా.... గుండె దిటవు చేసుకోండి. మీరు ఇష్టపడుతున్న ప్రియా రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ కాదట. ‘స్పూఫ్’ వీడియోల హల్చల్ ప్రియా కన్ను కొట్టిన వీడియో చూసి, తమ అభిమాన హీరోలు కన్ను కొట్టిన సీన్‌తో పోల్చి, రెంటినీ కలిపి ఓ వీడియోగా క్రియేట్ చేసి, అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఉదాహరణకు... ∙‘ముత్తు’ సినిమాలో రజనీకాంత్ సిగ్గుపడితూ కన్ను కొట్టే సీన్ ∙‘అతడు’ సినిమాలో కన్ను కొట్టే సీన్లో ‘ఇలా కొట్టు..అలా పడి ఉంటారు’ అని హీరోయిన్ త్రిషకు మహేశ్‌బాబు చెప్పే సీన్‌ను భలేగా ఎడిట్ చేశారు ∙‘తెరీ’ సినిమాలో హీరోయిన్ను చూసి తమిళ హీరో విజయ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ∙‘ఏం మాయ చేసావే’ తమిళ వెర్షన్ ‘విన్నైత్తాండి వరువాయా’ సినిమాలో త్రిషను ఫస్ట్‌టైమ్ చూసినప్పుడు ఎక్స్ప్రెషన్స్ ∙‘ప్రేమమ్’ సినిమాలో నివిన్ పౌలీ హీరోయిన్ సాయిపల్లవిని చూసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్. ఇది ఇప్పటి పాట కాదు విశేషం ఏంటంటే.. ‘ఒరు అడార్ లవ్’ టీజర్ బ్యాగ్రౌండ్లో వినిపిస్తోన్న ‘మాణిక్య మలరాయ పూవీ’ పాట ఈ సినిమా కోసం ఫ్రెష్‌గా రాసింది కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పి.యం జబ్బర్ రాసిన ‘మాపిళ్ల..’ అనే పాటకు స్టైలిష్ వెర్షన్... అదేనండి రీమిక్స్ అని కేరళ టాక్. అక్కడివారి మాటల ప్రకారం ఈ పాటకున్న చరిత్ర అంతా ఇంతా కాదని తెలుస్తోంది. మహమ్మద్ ప్రవక్త మొదటి భార్య ఖజీదా బీవీ గుణాలను వివరిస్తూ జబ్బర్ రాసిన ఈ పాట కేరళలో చాలా ఫేమస్. ఈ పాటను పెళ్లిళ్లు, ఇతర ముఖ్య ఫంక్షన్స్‌లో పాడుకుంటారట. అలా ఒరిజినల్ వెర్ష¯Œ చాలా పాపులర్ అట∙ ఒకవైపు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రియాపై ప్రేమే కాదు ఈ పాటకు ఆగ్రహం కుడా వ్యక్తం చేస్తున్నారు కొందరు. పాట తమ మత మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందంటూ హైదరాబాద్‌లో ఈ చిత్రదర్శకుడు ఒమర్ లులూపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు యువకులు. ∙‘ఒరు అడార్ లవ్’ టీజర్ మాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. స్టార్ హీరోల మూవీ టీజర్ వ్యూస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. 24 గంటల్లో దగ్గర దగ్గర 50 లక్షల మంది చూశారు. గత ఏడాది చివర్లో విడుదలైన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ‘మాస్టర్ పీస్’ టీజర్ కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ దక్కించుకోలేదు. ఆ మాటకొస్తే మలయాళ టీజర్స్‌కి.. అది ఎంత పెద్ద స్టార్‌ది అయినా పది లక్షలు వ్యూస్ దక్కితే అది ఎక్కువ. అలాంటిది ఐదింతలు దక్కించుకుంది ‘ఒరు అడార్ లవ్’. కన్ను కొట్టుడా? మజాకానా? -
సినిమాపై నమోదైన కేసు గురించి నాకు తెలిదు
-
ఆ ‘కనుగీటే’ సన్నివేశం ఊహించనిది!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒరు ఆదార్ లవ్’ మలయాళ చిత్రంలో హీరోయిన్ ప్రియా వారియర్ కనుగీటిన సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఒరు ఆదార్ లవ్ అంటే అసాధారణ ప్రేమ అని అర్థం. జూన్ చివరలో విడుదలవుతున్న ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. అందుకని దీన్ని ‘సంగీతభరిత ప్రేమ కథా చిత్రం’ అని పిలవచ్చు. ఈ పాటల వీడియోను ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్లోకి విడుదల చేశారు. అందులోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలోనిదే ప్రియా వారియర్ కనుగీటే సన్నివేశం. 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఐదుగురు హీరోలు, నలుగురు బాలికల మధ్య నడిచే ప్రేమాయణం, వారిచుట్టూ అల్లుకునే స్నేహబంధం, వారి జీవితాల నేపథ్యంలో సినిమా నడుస్తుంది. సినిమాలో రకరకాల ప్రేమను చూపిస్తారు. అందులో అసాధారణ ప్రేమ ఏమిటో ప్రేక్షకులే నిర్ణయించాల్సి ఉంటుంది. మలబారు ప్రాంతం ముస్లిం మహిళలు పాడుకునే ‘మాణిక్య మలరాయ పూవి’ అనే పాటను ఈ సినిమాలో చూపించారు. మొహమ్మద్ ప్రవక్త, ఆయన భార్య ఖదీజా మధ్య నుండే పవిత్ర ప్రేమకథనే ముస్లిం మహిళలు పాటగా పాడుతారు. అయితే ప్రవక్త ప్రేమ కథను చూపించారన్న కారణంగా సినిమాలోని ఈ పాటను నిషేధించాల్సిందిగా కొంత మంది ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై హైదరాబాద్‌లో పోలీసులకు పలువురు ఫిర్యాదు కూడా చేశారు. ‘మాణిక్య మలరాయ పూవి’ పాటను 1978 పీఎంఏ జబ్బర్ రాయగా, తలస్సరీ కే. రెఫీక్ సంగీతం సమకూర్చారు. ఆ పాటంటే తన తల్లికి ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి తాను ఆ పాట వింటూనే పెరిగానని, అందుకనే ఆ పాట హక్కులను కొన్నానని చిత్రం దర్శకుడు ఒమర్ లూలు మీడియాకు తెలిపారు. సంగీత దర్శకులు షాన్ రెహమాన్ మళ్లీ పాటను కంపోజ్ చేయగా, వినీత్ శ్రీనివాసన్ అద్భుతంగా పాడారని ఆయన తెలిపారు. ఊహించిన దానికంటే ఇప్పుడు ఈ పాట పాపులర్ అయిందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు విశేష ఆధరణ లభిస్తోందని చెప్పారు. ప్రవక్త, ఆయన భార్య మధ్య నున్న ప్రేమ గురించి చెప్పడం ఇస్లాంకు వ్యతిరేకమని కొంత మంది వ్యతిరేకిస్తున్నారని, అయితే అలాంటి వారి సంఖ్య చాలా తక్కువని ఆయన అన్నారు. మలబారు ప్రాంతం ముస్లిం మహిళలు మత, ఇతర సామాజిక కార్యక్రమాల సందర్భంగా ప్రవక్త ప్రేమ గురించి పాటలు పాడడం ఇప్పటికీ చూడవచ్చని ఆయన చెప్పారు. ఈ సినిమాలో ప్రియా వారియర్ది చిన్న పాత్రేనని, సినిమా షూటింగ్లో అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన మేరకు ఆమె కనుగీటే సన్నివేశాన్ని షూట్ చేశామని ఒమర్ లూలు తెలిపారు. సన్నివేశం బాగా పండిందని అనుకున్నాంగానీ, ఇంతగా సోషల్ మీడియాను ఆకర్షిస్తుందని ఊహించలేదని ఆయన వివరించారు. ఒమర్ లూలు ఇంతకుముందు తీసిన ‘హాపీ వెడ్డింగ్ (2016)’ ‘చుంక్జ్ (2017)’ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద హిట్టయ్యాయి. -
ఆరెస్సెస్.. ఇదిగో మీకు సమాధానం..
ప్రియాప్రకాశ్ వారియర్ ఇప్పుడో ఇంటర్నెట్ సెన్సేషన్. ఆమె గురించి తెలియని వారు ఉండరంటే అతియోశక్తి కాదు.. బాలీవుడ్ సార్ట్ కిడ్స్‌కు కూడా సాధ్యంకానిరీతిలో ఆమె ఇంటర్నెట్ను ముంచెత్తింది. ఒక్కరోజులోనే సోషల్ మీడియాను తన సామ్రాజ్యం చేసుకుంది. కనుసైగలతో ఇష్టసఖుడిని లాలించి.. కన్నుగీటి అతన్ని ప్రేమమైకంలో దింపి.. ఆ హావభావాలతో యువత గుండెలోకి దిగిపోయింది. ఈమేరకు ఆమె కనుసైగల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనే.. దేశమంతటా మీడియాలో మర్మోమోగుతోంది. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా హల్చల్ చేస్తోంది. ప్రియాప్రకాశ్ వీడియోపై ఇప్పటికే సినీ స్టార్లు మొదలు ఎంతోమంది ప్రముఖులు స్పందించారు. తాజాగా గుజరాత్ దళిత ఫైర్‌బ్రాండ్ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఈ వీడియోపై స్పందించారు. ప్రేమికుల రోజుపై నిరసనలు వ్యక్తంచేసే ఆరెస్సెస్‌కు ఇదిగో సమాధానం అని పేర్కొన్నారు. ‘మాణిక్య మలరయ పూవీ’ వైరల్ హిట్ కావడం.. వాలెంటైన్స్ డేను నిరసించే ఆరెస్సెస్‌కు ఒక సమాధానం. ఒకరిని ద్వేషించడం కన్నా ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతామని భారతీయులు మరోసారి రుజువు చేశారు’ అని జిగ్నేశ్ ట్వీట్ చేశారు. హిందుత్వ అతివాద సంస్థలు మొదటినుంచి ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. హిందూ మహాసభ, శ్రీరామసేన, భరతసేన, బజరంగ్ దళ్ మొదలైన సంస్థలు మోరల్ పోలీసింగ్ పేరిట ప్రేమికులరోజున బయట కనిపించే జంటలపై దౌర్జన్యం చేసి.. బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఆమె కన్నుగీటితే.. అంతా ఇలా విలవిలలాడాల్సిందే!
ఎవరినీ విడిచిపెట్టలేదు. ఆమె కన్నుగీటితే.. ఎవరూ మాత్రం సిగ్గుపడకుండా ఉంటారు. ఎవరు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వకుండా ఉంటారు. ఎవరు మాత్రం ఆమె కనుసైగల సెగలు తగలకుండా రాతిబొమ్మలుగా ఉండిపోగలరు. అందుకే మన నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు రాహుల్ గాంధీ వరకు.. అటు సినీ రంగంలో రజనీ మొదలు రానా వరకు అందరినీ ప్రియాప్రకాశ్ వారియర్ కనుసైగల వాలుచూపుల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆమె కన్నుగీటితే.. వారు ఎలా స్పందిస్తారో చూపిస్తూ.. స్పూఫ్ వీడియోలు వదిలారు. ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రియా కన్నుగీటితే.. బ్రహ్మచారి రాహుల్‌గాంధీ ముసిముసి నవ్వులు రువ్వుతూ.. లోలోపల సిగ్గుపడుతున్నట్టు ఉన్న స్పూఫ్ నెటిజన్లను తెగ అలరిస్తోంది. ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేస్తున్న ప్రియా ప్రకాశ్.. 40 సెకన్ల నిడివి ఉన్న కనుసైగల వీడియోతో ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. గన్నులాంటి కన్నులతో ఆమె కన్నుగీటినా.. తాజా టీజర్లో తూటాలాంటి ఫ్లయింగ్ కిస్‌తో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా.. యువత అమాంతం ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఇప్పటికే మిలియన్‌కుపైగా ఫాలోవర్లు యాడ్ అయ్యారు. పలువురిపై వచ్చిన స్ఫూప్ వీడియోలు ఇవే.. Kya yahi pyaar hai? pic.twitter.com/FL5r13eekI — East India Comedy (@EastIndiaComedy) February 11, 2018 .@realDonaldTrump babu Ye aap kis line me aa gaye bhai? 😂 pic.twitter.com/mlj2TFUQPi — Err.. (@Gujju_Er) February 11, 2018 who tf did this 😭😂 pic.twitter.com/87SlMPWhre — ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤㅤ ㅤ ㅤ ㅤ (@firkiii) February 11, 2018 Mahi ❤❤❤❤ #PriyaPrakashVarrier pic.twitter.com/KTrnCkkQ47 — Shash (@pokershash) February 11, 2018