![Priya Prakash Varrier Disappointed That Trolls Are Connecting Her With Nazriya Nazim's Comeback! - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/11/priya-prakash.jpg.webp?itok=kx4hv52h)
ప్రియా ప్రకాశ్ వారియర్
ఒక్క కొంటె సైగతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు ప్రియా ప్రకాశ్ వారియర్. నార్త్ టు సౌత్ ‘వింక్ గర్ల్’గా ఫేమస్ అయిపోయారు. ఎంత పాపులారిటీ సంపాదించారో అంతే విరివిగా వివాదాల్లో కూడా వినిపిస్తూనే ఉన్నారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు అడార్ లవ్’ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు విపరీతంగా అప్‌సెట్ అవుతున్నారట ప్రియా వారియర్. ఇంతకుముందు ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే ఇప్పుడు ఆన్‌లైన్‌లో విమర్శలు చేస్తుండటం వర్రీగా ఉందట.
మలయాళంలో నజ్రియా నజీమ్ తన కంబ్యాక్ ఇచ్చారు. ఆ హీరోయిన్‌తో ప్రియా ప్రకాశ్‌ను పోల్చి విమర్శిస్తున్నారట. నిజానికి ‘ఒరు అడార్ లవ్’ ట్రైలర్ రిలీజ్ కాగానే ‘ఇంత అందమైన కళ్లను చూడలేదు’ అని ప్రియాని చాలామంది పొగడ్తల్లో ముంచెత్తారు. ఇప్పుడేమో తన కళ్ల కంటే నజ్రియా కళ్లు ఇంకా బావుంటాయి అని కామెంట్ చేశారట సోషల్ మీడియాలో కొందరు నెటిజన్‌లు. ఇలా సినిమా రిలీజ్ కాకముందే తన మీద నెగటివిటీ, కామెంట్స్ చూడటం తన కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా చేస్తోంది అని పేర్కొన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. సో.. ఇప్పుడు వారియర్ కాస్తా వర్రీయర్ అయ్యారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment