Oru Adaar Love
-
సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్
ఒక్క అడుగు జీవితాన్ని మార్చేస్తుందంటారు. అలా ఒకే ఒక్క చిత్రం నటి ప్రియా ప్రకాష్ వారియర్ జీవితాన్నే మార్చేసింది. ఆమె హీరోయిన్గా పరిచయమైన మలయాళ చిత్రం ఓరు అదారు లవ్. ఈ చిత్రం విజయం సాధించిందా అంటే అదీ లేదు. అయితే ట్రైలర్.. ఆ చిత్రానికి కావలసిన దానికంటే ఎక్కువ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా నటి ప్రియాప్రకాష్ వారియర్ తన లవర్‌కు కన్ను కొట్టే దృశ్యం యువత గుండెల్లో గిలిగింతలు పెట్టించింది. ఆ చిత్రం మలయాళంతో పాటు ఇతర భాషల వ్యాపారానికి కూడా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ప్రియా ప్రకాష్ వారియర్‌ను పాపులర్ చేసింది. (ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!) అయితే ఇదంతా జరిగి చాలాకాలమైంది కదా.. మళ్లీ ఇప్పుడెందుకు అంటారా? దీనిపై ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తనకు చిన్నతనం నుంచి సినిమాలు చూడడం చాలా ఇష్టమని చెప్పింది. సినిమాలు చూసి ఇంటికి వచ్చిన తరువాత అద్దం ముందు నిలబడి ఆయా చిత్రాల హీరోయిన్ల మాదిరి నటించేదానినని చెప్పింది. తాను నటి అవుతానని తన తల్లిదండ్రులే కాదు.. తానూ ఊహించలేదని తెలిపింది. అలా చదువుకుంటున్న సమయంలోనే ఆడిషన్లో పాల్గొన్న సెలెక్ట్ అయ్యానని.. ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి తన తల్లిదండ్రులు అంగీకరించినట్లు చెప్పింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో నటిగా మారినట్లు చెప్పింది. కాగా ప్రియా ప్రకాశ్ మలయాళంతో పాటు తెలుగు తమిళం , హిందీ భాషల్లోనూ నటిస్తోంది. కాగా తను తొలి చిత్రం ట్రైలర్లో కన్ను కొట్టిన దృశ్యాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ చూసి చాలా మంచి నటి అవుతుందని, ఈ నటి తన కాలంలో ఎందుకు రాలేదని ప్రశంసలు కురిపించారట. దీంతో ఆయన ప్రశంసల కంటే పెద్ద అవార్డు ఏముంటుందని పేర్కొంది . నటిగా తాను ఎంత పాపులర్ అయ్యానో తెలియదు.. కానీ రిషికపూర్ కితాబును జీవితాంతం మరిచిపోలేనని ట్విట్టర్లో వెల్లడించింది. (ఇది చదవండి: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్ హీరోయిన్‌కు సమన్లు!) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
సహ నటుడిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్!
యంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. తనతో పాటు కలిసి పనిచేసిన ఓ నటుడితో ప్రేమలో పడింది. కొన్ని నెలల ముందు నిశ్చితార్థం చేసుకుంది. ఫైనల్‌గా ఇప్పుడు గ్రాండ్ లెవల్లో జరిగిన వేడుకలో నిఖా చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని స్వయంగా ఆ బ్యూటీనే ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో అవికాస్త ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. (ఇదీ చదవండి: 'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!) ప్రియా ప్రకాశ్ వారియర్ 'లవర్స్ డే' (మలయాళంలో 'ఒరు అదార్ లవ్') అనే సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైంది. అయితే ఆ మూవీలో మెయిన్ హీరోయిన్ నూరిన్ షరీఫ్. ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో మలయాళంలో నటిగా స్థిరపడిపోయింది. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె 'చంక్జ్'తో నటిగా మారింది. ఒరు అదార్ లవ్, శాంతాక్రూజ్, వెళ్లప్పం, బర్ముడా, ఆన్ ద అదర్ హ్యాండ్ తదితర చిత్రాల్లోనూ నటించింది. అలా ఓ సినిమాకు పనిచేస్తున్న క్రమంలో యాక్టర్ కమ్ రైటర్ ఫహిమ్ సఫర్, నూరిన్ షరీప్‌కు పరిచయమైంది. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబరులో పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. తిరువనంతపురంలో సోమవారం ఓ వెడ్డింగ్ హాల్లో నిఖా చేసుకున్నారు. వీళ్లకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by AVALON WEDDINGS (@avalonweddings) View this post on Instagram A post shared by Decor Lab Events (@decorlabevents) View this post on Instagram A post shared by Noorin Shereef (@noorin_shereef_) (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) -
వాన పాటకి చాన్స్ వస్తే కాదంటానా?
అలా కన్ను కొట్టి ఇలా ఫేమస్ అయిపోయారు ప్రియా ప్రకాశ్ వారియర్. తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఈ కన్ను కొట్టే సీన్ ఆమెకు ‘వింక్ బ్యూటీ’ అనే పేరు తెచ్చింది. ఈ కేరళ కుట్టి ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇక.. ఈ బ్యూటీని ‘వానాకాలమ్’ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. ► చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలు... వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. అది కూడా ట్రాన్స్ప్యారంట్ గొడుగు, రెయిన్ కోట్ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్ స్లిప్పర్స్ వేసుకుని, స్కూల్ బస్ కోసం వెయిట్ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో వేరే వాహనాలు వెళ్లినప్పుడు మా యూనిఫామ్ మీద బురదనీళ్లు పడేవి. చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలంటే నాకివే. ఆ రోజులే వేరు. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ ఇంట్లో? వానలో తడిచినా ఏమీ అనేవాళ్లు కాదు. మా సొసైటీలో ఉండే పిల్లలమంతా వానలో తడుస్తూ ఆడుకునేవాళ్లం. వానలో తడుస్తూ దాగుడుమూతలు ఆడేవాళ్లం. చివరికి బ్యాడ్మింటన్ కూడా ఆడుకునేవాళ్లం. అయితే వానలో తడిచి, జ్వరం తెచ్చుకుంటే అప్పుడు తిట్లు పడేవి. ► కాగితపు పడవలు చేసేవారా? చేసేదాన్ని. అది మాత్రమే కాదు.. వర్షం నీళ్లను సీసాల్లో పట్టి, ఆడుకునేదాన్ని. ► చివరిసారిగా ఫుల్లుగా ఎప్పుడు తడిశారు? రష్యాలో... షాపింగ్ కోసం బయటకెళ్లాం. ఒక్కసారిగా బాగా వర్షం వచ్చింది. పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చర్చిలోకి వెళ్లాం. అప్పటికే కొంచెం తడిసిపోయాం. ► వర్షాకాలం ఇష్టమేనా? చాలా. నేను మాన్సూన్ లవింగ్ పర్సన్‌ని. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి నా మూడ్ కూడా అలానే ఉంటుంది. మంచి మ్యూజిక్ వింటూ, ఎంజాయ్ చేస్తుంటాను. ► నచ్చే రెయినీ ఫుడ్? మా అమ్మగారు చేసే ఫుడ్ ఏదైనా ఇష్టమే. వాన అంటే మాత్రం న్యూడుల్స్ తినాల్సిందే. ► మరి.. వాన పాటల్లో నటించడం ఇష్టమేనా? నేను ఫిల్మీ పర్సన్. వాన పాటకి చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. అంతెందుకు.. షవర్ కింద నిలబడి దాన్నే వాన అనుకుని, ఎంజాయ్ చేస్తుంటాను. ఇక వాన పాట అంటే కాదంటానా? ► రెయినీ సీజన్లో వర్క్ చేయడం ఇష్టమేనా? అస్సలు ఇష్టం ఉండదు. ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడను. ► నచ్చిన వాన పాట? చాలా పాటలు ఉన్నాయి. ఒక్క పాట అంటే చెప్పలేను. అయితే రెయినీ సీజన్లో మెలోడీ సాంగ్స్ వింటాను. రెయినీ సీజన్ కోసం ప్రత్యేకంగా నా ప్లే లిస్ట్‌లో కొన్ని పాటలు పెట్టుకున్నాను. అవి వింటుంటాను. ► వర్షాకాలంలో ఇబ్బందులకు గురైన సందర్భాలు... వ్యక్తిగతంగా నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. దినదిన గండంలా గడిపారు. ఆ సమయంలో స్వయంగా క్యాంప్స్‌కి వెళ్లి నాకు చేతనైనంత సాయం చేశాను. ఇళ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలీక వాళ్లు పడిన బాధ చూసి చలించిపోయాను. -
‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్
ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియ ప్రకాష్ వారియర్. తొలి సినిమా ఒరు ఆదార్ లవ్ రిలీజ్‌కు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ప్రియా ఆ సినిమా ఫ్లాప్ అయినా తనపై వచ్చిన క్రేజ్‌ను మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ఓ వివాదాస్పద చిత్రంలో నటిస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రియా ప్రకాష్ నటిస్తున్న తాజా చిత్ర ‘శ్రీదేవి బంగ్లా’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే వివాదం మొదలైంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ శ్రీదేవి అనే నటి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు బాత్‌టబ్‌లు మునిగి చనిపోయినట్టుగా చూపించటంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ చిత్రయూనిట్‌కు నోటీసులు పంపారు. అయితే ఈ వివాదంపై స్పందించిన నటి ప్రియా ప్రకాష్, ఈ వివాదాలన్నీ చిన్న విషయాలంటూ కొట్టి పారేశారు. నటిగా నా పాత్రకు న్యాయం చేయటం వరకే నా బాద్యత, వివాదాలు వస్తే దర్శక నిర్మాతలు చూసుకుంటారు. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆరాత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ దర్శకుడు. -
లవ్‌ను హ్యాక్ చేస్తా
‘ఇది డిజిటల్ యుగం. జాగ్రత్తగా లేకపోతే మన ఇన్ఫర్మేషన్ అయినా, మన లవ్ అయినా ఈజీగా హ్యాక్ అయిపోతుంది’ అంటున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. కేవలం కన్ను గీటి సౌత్ నుంచి నార్త్ వరకూ పాపులర్ అయ్యారు ప్రియా ప్రకాశ్ వారియర్. తన తొలి సినిమా ‘ఒరు అధార్ లవ్’ రిలీజ్ కంటే ముందే బాలీవుడ్ ఆఫర్ సంపాదించుకున్నారు. ‘ఒరు అధార్ లవ్’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. బాలీవుడ్ తొలి సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ వివాదాల్లో ఉంది. లేటెస్ట్గా బాలీవుడ్లో మరో సినిమా సైన్ చేశారు ప్రియా వారియర్. మయాంక్ ప్రకాశ్ శ్రీవాత్సవ్ రూపొందించనున్న ‘లవ్ హ్యాకర్స్’ సినిమాలో హీరోయిన్గా ప్రియా ప్రకాశ్ యాక్ట్ చేయనున్నారు. సైబర్‌క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమా గురించి ప్రియా వారియర్ మాట్లాడుతూ – ‘‘అనుకోకుండా ఓ ట్రాప్‌లో చిక్కుకున్న హీరోయిన్ తన తెలివితేటలతో చాకచక్యంగా ఎలా తప్పించుకుంది? అనేది కథ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది’’ అని అన్నారు. -
ఉల్కలు– ఉరుములు
ప్రజాభిమానాన్ని చూరగొనడానికి సుదీర్ఘ పరిశ్రమ, ప్రతిభ, కొండొకచో చిన్న అదృష్టం కలిసి రావాలంటారు. అయితే ఇవేవీ అక్కరలేని అడ్డుతోవ ఒకటుంది. నిర్భయ దుర్ఘటన, బాబ్రీ మసీద్ కూల్చివేత, అణు పరీక్ష ఇలాంటివి. అయితే కొన్ని ప్రచారాలు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆశ్చర్యమూ, షాకూ కలుగుతుంది. ఈ మధ్య సినీరంగంలో ఈ అడ్డుతోవల సంఘటనలు, ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి అనూహ్యం, ఆశ్చర్యకరం, ఇంకా చెప్పాలంటే విచిత్రం, విలక్షణం. ఈ మధ్య ఒమార్ లులు అనే దర్శకుడు ‘‘ఒరు ఆధార్ లవ్’’ అనే మలయాళ సినిమాను నిర్మించాడు. ఇది పామర భాషలో ‘విరగదీసే’ చిత్రం కాదు. అయితే అందులో ప్రియా వారియర్ అనే కొత్త అమ్మాయి నటించింది. ఒకానొక సీన్లో ఆ పిల్ల సరదాగా దూరపు క్లాసు బెంచీలో కూర్చున్న కుర్రాడిని చూసి కన్నుకొట్టింది. కుర్రాడు నవ్వాడు. రెండు వేళ్లు బిగించి రివాల్వర్లాగా కాల్చింది. కుర్రాడు గాయపడినట్టు తలవొంచాడు. అంతే, మిన్నువిరిగి మీద పడింది. ఇదేం కొత్త విన్యాసం కాదు. కానీ ఈమె కన్నుకొట్టడాన్ని దేశం ఉర్రూతలూగి అందుకుంది. ప్రచార సాధనాలన్నీ ఒళ్లు విరుచుకుని ఈ దృశ్యాన్ని ప్రచారం చేశాయి. దేశం పిచ్చెక్కిపోయింది. ఈ పాపులారిటీ ఎంతవరకూ పోయిందంటే – దేశంలోని ఇస్లాం వర్గాలు అలా ఓ ఆడపిల్ల బరితెగించడం సంప్రదాయ విరుద్ధమని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి! ఎక్కడ చిన్న మలయాళ సినిమా? ఎక్కడ ఊసుపోని సంఘటన. సుప్రీంకోర్టు ఆశ్చర్య పోయింది. చివరకు ‘‘పోవయ్యా. ఇదేదో చిన్నపిల్లల ఆట’’ అని కేసుని కొట్టి వేసింది. కొన్నేళ్ల కిందట– కొందరు కుర్రాళ్లు కలిసి ఓ సినిమా తీశారు. ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇందులో హీరో. సినిమా పెద్ద ఊడబొడిచింది కాదు. కానీ ఆడుతూ పాడుతూ కుర్రాళ్లందరూ కలిసి – అనురుద్ రవి శంకర్ అనే కుర్రాడి ‘‘కొలవరి డీ’’ అనే పాటను రికార్డు చేశారు. అంతే, ఆ పాట కార్చిచ్చులాగా– భాషలకతీతంగా దేశంలో గంగవెర్రులెత్తించింది. ఎంత వెర్రి! బహుశా ఈ ‘కొలవరి’ నిర్మాతలే ఆశ్చర్యపోయి ఉంటారు. ఈమధ్య మా పెద్దబ్బాయి నన్ను లాక్కెళ్లి ధియేటర్లో కూర్చోపెట్టాడు. సినిమా పేరు ‘‘96’’. 1996లో కొందరు ఓ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇందులో ఆడా మగా–రకరకాల మనస్తత్వాల పిల్లలు. ఓ పదేళ్ల తర్వాత ఈ గుంపు మళ్లీ కలుసుకోవాలనుకున్నారు. కలుసుకోవడమే సినిమా. ఇందులో ఓ అమ్మాయిపట్ల మక్కువ ఉన్నా మనసిప్పలేని మొహమాటస్తుడు హీరో. ఆ పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఓ కూతుర్ని కని సింగపూర్‌లో భర్తతో కాపురం చేస్తోంది. అందరూ కలిశారు. ఇందులో ఓ అమ్మాయి గర్భవతి. నలుగురూ రకరకాలుగా జీవితాల్లో సెటిల్ అయినవారు. ఈ సింగపూర్ అమ్మాయి వచ్చింది. మొహమాటస్తుడయిన కుర్రాడూ వచ్చాడు. తెల్లవారితే మళ్లీ అందరూ విడిపోతారు. ఈ కుర్రాడికీ, ఆ అమ్మాయికీ ఇప్పుడు తమతమ మనస్సులు తెలిశాయి. నిజానికి రాత్రంతా ఏకాంతంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. కలిసి జీవించలేక పోయిన అసంతృప్తి ఇద్దరిలో–ప్రేక్షకులకీ తెలుస్తోంది. అదొక nostalgic pain. అయితే ఏకాంతంలో కూడా వారిద్దరూ సభ్యతను పాటించారు. తమ తమ దూరాల్ని ఎరిగి ప్రవర్తించారు. ఒక్కసారయినా ఏకాంతంలో తొందరపడతారా? అయినా ఒకరినొకరు కనీసం ముట్టుకోలేదు. తెల్లవారింది. ఆమెకు వీడ్కోలు చెప్పాడు హీరో. ఇద్దరి మనస్సుల్లోనూ – వాస్తవం కాని ‘కల’ అలాగే ఉండి పోయింది! ఇంతే కథ. ఇదిపెద్ద పెద్ద చిత్రాల్ని తలదన్నేసింది. హీరో కర్మాగారంలో ‘కళాసీ’లాగ ఉంటాడు. అమ్మాయి ఒప్పులకుప్ప. స్టార్. హీరో ఈసినిమాతో పెద్ద స్టార్ అయిపోయాడు. మొన్న ఒక సభలో ప్రేక్షకులు గింగుర్లెత్తి –‘మీరెలాగూ సినీమాలో ఒకరి నొకరు ఆలింగనం చేసుకోలేదు. ఇప్పుడు మా కళ్ల ముందు చేసుకోం ‘‘అని కేకలేశారు! ఆ దృశ్యానికి ప్రేక్షకుల గగ్గోలు! ప్రజా సందోహంలో ‘పాపులారిటీ’కి అర్థాలు మారిపోయాయి. అయితే – చాప్లిన్ పాపులారిటీకి కన్నుకొట్టిన కుర్రదాని పాపులారిటీకి, కొలవరికీ ‘కొల బద్దలు’ మారాయి. ఉరకలెత్తించే ఉత్తేజాలు కనిపించని ఆధునిక జీవితంలో ఈ చిన్న చిన్న ‘మెరు పుల్ని’ జనసందోహం ఏరుకుంటోందా? లక్షలాది ప్రజల సమష్టి ఆనందానికి ఇది విచిత్రమయిన కుదింపా? సినిమా హృదయాల్ని కదిలించే ఆనందానికి విడాకులిచ్చి– ఇప్పుడిప్పుడు పాపులారిటీకి నరాల్ని నమ్ముకుంటోంది. - గొల్లపూడి మారుతీరావు -
ఆ ఫొటో కావాలి!
‘‘లవర్స్ డే’ చిత్రం విడుదలయ్యాక ఇక్కడ కూడా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక కొత్త నటిగా నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేరళ కుట్టి నూరిన్ షరీఫ్. ఒమర్ లులు దర్శకత్వంలో రోషన్ అబ్దుల్, ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్ ముఖ్యతారలుగా రూపొందిన మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. ఈ చిత్రం ‘లవర్స్ డే’గా తెలుగులో ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నూరిన్ మాట్లాడుతూ– ‘‘నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. ప్రియా ప్రకాష్ వింక్ ఎపిసోడ్, స్క్రిప్ట్ కొంచెం మారడం వంటి అంశాల వల్ల నా పాత్ర నిడివి తగ్గింది. దాంతో బాధ అనిపించింది. ప్రియా ప్రకాష్‌తో నాకు గొడవలు ఏం లేవు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాత గురురాజ్ బాగా హెల్ప్ చేశారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు క్లైమాక్స్‌ను మార్చడం మంచి నిర్ణయమే అనిపించింది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు అల్లు అర్జున్‌గారి సినిమాలను టీవీలో చూశాను. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ‘లవర్స్ డే’ వేడుకకు ఆయన అతిథిగా రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయనతో ఓ ఫొటో దిగాను. ఆయన నన్ను చూసి నవ్వారు. ఆ స్మైల్ చాలు నాకు. ఆ ఫొటో ఎవరు తీశారో తెలుసుకుని తీసుకోవాలని ఉంది. ఒమర్ లులు దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు నూరిన్ షరీఫ్. -
కన్నుగీటి.. నా కేరీర్ నాశనం చేసింది
సొగసుగా కన్నుకొట్టి.. కుర్రకారును తన వైపు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఆ వీడియోతో రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ఈ వీడియోనే తన కేరీర్‌ను గందరగోళంలో పడేలా చేసిందని అంటోంది మరో హీరోయిన్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్, రోషన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఒరు అడార్ లవ్’ రొమాంటిక్ మూవీని ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో ఫిబ్రవరి 14న విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఇప్పుడు ప్రియా వారియర్‌కు వచ్చిన ఇమేజ్ మొత్తం మరో భామ నూరిన్ షెరిఫ్ రావాల్సి ఉండేదట. ఈ విషయాలని నూరిన్ స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పింది. ప్రియా ప్రకాష్‌ని ఉద్దేశిస్తూ నూరిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజానికి ముందుగా సినిమాలో లీడ్ క్యారెక్టర్‌గా నూరిన్‌ని అనుకున్నారట. కథ మొత్తం ఆమె చుట్టూ తిరిగేలా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారట. కానీ, కన్నుకొట్టే సీన్‌తో ప్రియా ప్రకాష్ సెన్సేషనల్‌గా మారడంతో కథ మొత్తం మార్చేసి, ప్రియా పాత్రకు ప్రాధాన్యతనిస్తూ నూరిన్ రోల్ తగ్గించేశారట. ప్రియా వారియర్ సెన్సేషనల్‌గా మారిన తరువాత తనను పక్కన పెట్టారని వాపోయింది. ఆ కారణంగా ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పింది. నిజానికి అంతా తనను సెకండ్ హీరోయిన్ అనుకుంటున్నారని, కానీ తానే సినిమాలో మొదటి హీరోయిన్ అని చెబుతుంది. చిత్ర హీరో రోషన్ అబ్దుల్‌తో మళ్లీ నటించాల్సి వస్తే ఆనందంగా ఒప్పుకొంటాను. ప్రియా వారియర్‌తో నటించాల్సి వస్తే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. వీలైనంత వరకు ఒప్పుకోకుండానే ఉంటాను. ఎందుకంటే నా కెరీర్‌ను ఆమె గందరగోళంలో పడేసింది అని నూరీన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విడుదలకు ముందే ఏ మళయాళ చిత్రానికి లేని క్రేజ్ ‘ఒరు అడార్ లవ్’కి ఏర్పడింది. కన్నుకొట్టిన వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ హీరోయిన్గా మారిన ప్రియా వారియర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దీనికి తోడు ఈ మూవీ టీజర్లో ఘాటైన ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి సినిమాపై అంచనాలు పెంచేసింది ప్రియావారియర్. సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరిచింది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత ఈ మూవీ క్లైమాక్స్‌ని మార్చుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో క్లైమాక్స్ విషాదాంతంగా ముగుస్తుంది. దీన్ని మార్పు చేసి కొత్తగా సన్నిశాలని రీషూట్ చేసి యాడ్ చేయబోతున్నారట. 10 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి హైప్ తీసుకువచ్చేదిగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. -
ఇంట్లోనే నిర్బంధించారు
తనను ఇంట్లోనే నిర్బంధించారని వర్థమాన నటి ప్రియ ప్రకాశ్ వారియర్ చెప్పింది. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత పెద్ద నటినా అని అడగకండి. నిజం చెప్పాలంటే ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కూడా ఇంకా తెరపైకి రాలేదు. అయినా ఒక క్రేజీ నటి అంత ప్రాచుర్యం పొందేసింది. అందుకు కారణం ఒక చిత్ర ట్రైలర్లో ప్రియా ప్రకాశ్ వారియర్ నటనే. ఈ కేరళా కుట్టి ఒరు ఆడార్ లవ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతోంది. ఆ చిత్ర ట్రైలర్ గత ఏడాది విడుదలై సంచలనం సృష్టించింది. పాఠశాలలో తన లవర్‌కు ప్రేమ సిగ్నల్ ఇచ్చే సన్నివేశాల్లో కన్ను కొట్టి, తన చేతి వేళ్లనే గన్‌గా మార్చి గురి చూసి అతని గుండెల్లో పేల్చే సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా పేలింది. అంతే కుర్రకారు రెచ్చిపోయి ఆ ట్రైలర్‌ను వీక్షించడం, అది దేశవ్యాప్తంగా ట్రెండీ అవడం తెలిసిందే. ఆ ట్రైలర్ తెచ్చి పెట్టిన క్రేజ్ ఒరు ఆడార్ లవ్ చిత్రానికి ఎంతగానో లాభించింది. ఇప్పుడా చిత్రం మలయాళంలో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం తెరపైకి వచ్చింది. ఒరు ఆధార్ లవ్ చిత్రం ట్రైలర్ దేశ వ్యాప్తంగా ట్రెండీ అవడం నటి ప్రియ ప్రకాశ్వారియర్కు మంచి క్రేజ్ తెచ్చి పెట్టినా, చాలా భయపెట్టిందట. దీని గురించి ఈ బ్యూటీ ఒక ఇంటర్వూ్యలో పేర్కొంటూ ఒరు ఆడార్ లవ్ చిత్ర ట్రైలర్లో తాను కన్ను కొట్టే సన్నివేశం సంచలనం సృష్టించడంతో తన కుటుంబసభ్యులు చాలా భయపడ్డారని చెప్పింది. అది తన కుటుంబంతో పాటు తనకూ వినూత్న అనుభవం అని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే తనను తల్లిదండ్రులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే నిర్బంధించారని చెప్పింది. సెల్‌ఫోన్ కూడా తనకు దూరం చేశారని వాపోయింది. ఈ చిత్రం విడుదల కాక ముందే ఈ అమ్మడికి పలు అవకాశాలు తలుపుతట్టాయి. అయితే ఈ అమ్మడి ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే పారితోషికాన్ని రూ.కోటి డిమాండ్ చేస్తూ దర్శక, నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తోందట. ఒరు ఆడార్ లవ్ రిజల్ట్ తెలియాల్సిఉంది. ఈ చిత్రం కనుక హిట్‌టాక్ తెచ్చుకుంటే ఇక ప్రియ ప్రకాశ్ వారియర్‌ను పట్టుకోవడం కష్టమే అవుతుంది. అందులోనే క్లాసికల్ సంగీతం, నృత్యంలో శిక్షణ పొందిన ఈ బ్యూటీకి అవి అదనపు అర్హతగా నిలుస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. -
పాత రోజులు గుర్తొస్తాయి
ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన చిత్రం ‘లవర్స్ డే’ (మలయాళంలో ‘ఒరు ఆడార్ లవ్). ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి అందిస్తున్నారు. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) విడుదల కానుంది. నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘ఒరు ఆడార్ లవ్’ సినిమాపై క్రేజ్ పెరగడంతో తెలుగు హక్కుల కోసం టాలీవుడ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. దాంతో భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులను సొంతం చేసుకొన్నాం. ఇందుకు సహకరించిన సీతారామరాజు, సురేష్ వర్మలకు థ్యాంక్స్. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఒమర్ లులు ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ తమ యూత్ రోజులను గుర్తు చేసుకొంటారు. స్నేహం, ప్రేమ విలువను అద్భుతంగా చెప్పారు. గతంలో వచ్చిన ‘ప్రేమసాగరం, ప్రేమదేశం’ లాంటి సినిమాల రేంజ్లో ఉంటుంది ఈ సినిమా’’ అన్నారు . ‘‘ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లకు పైగా రిలీజ్ అవుతోంది. తెలుగులో సుమారు 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత వినోద్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: శీను సిద్ధార్థ్, సంగీతం: షాన్ రెహమాన్. -
లవర్స్‌డే టీజర్ : ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా’
జస్ట్ అలా అలవోకగా కన్ను కొట్టి కుర్రకారు హృదయాలను దోచేసుకున్నారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. లక్షల మంది కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిన ఈ కన్నుకొట్టుడు పిల్ల నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ‘లవర్స్ డే’ మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్ అవుతుందని నేను అనుకోలేదు.. అయ్యా..సెట్ అయిందా ఏంది సెట్ అయింది. మరి నిన్న నాకు ఎందుకు సైట్ కొంటావ్.. నేనా’ అంటూ రోషన్, ప్రియా వారియర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. షాన్ రెహమాన్ అందించిన బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. -
ప్రేమికుల రోజు
జస్ట్ అలా అలవోకగా కన్ను కొట్టి కుర్రకారు హృదయాలను దోచేసుకున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్లో ప్రియా కన్ను కొట్టడం, ఆ టీజర్ వైరల్ అవ్వడం తెలిసిందే. రోషన్, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఈ నెల 14న పేమికుల దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి బన్నీ (అల్లు అర్జున్) అందించిన సహకారాన్ని మర్చిపోలేం. తెలుగులో ప్రియా వారియర్ పాత్రకు సింగర్ లిప్సిక డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉన్నాయి. ఇందులో ఓ పాట ఆడియన్స్‌కు థియేటర్లో సర్ప్రైజ్గా ఉంటుంది. మంచి బిజినెస్ జరిగింది’’ అని అన్నారు. ఈ సినిమాకు షాన్ రెహమాన్ స్వరకర్త. -
సపోర్ట్ చేయడం నా బాధ్యత అనుకున్నా
‘‘సౌత్ ఇండియన్ సినిమాల్లో నేషనల్ వైడ్‌గా, ఇంటర్నేషనల్ వైడ్‌గా వైరల్ అయిన వీడియోస్‌లో ‘కొలవెరి డీ..’ పాట, ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’... ఈ మధ్య కాలంలో ఆ రేంజ్లో వైరల్ అయిన వీడియోస్‌లో ‘ఒరు ఆధార్ లవ్’ కూడా ఒకటి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్, రోషన్ ముఖ్య తారలుగా ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రాన్ని ‘లవర్స్ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. షాన్ రెహమాన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు సౌతిండియా అంటే పిచ్చి. నా ప్రొఫెషన్లో సౌతిండియన్ యాక్టర్ అని రాసుకుంటాను. నేను దక్షిణాదికి చెందినవాడినని చెప్పుకోవడానికి గర్వపడతాను. నేను పుట్టింది చెన్నైలో.. పెరిగింది హైదరాబాద్‌లో.. మలయాళం, కర్ణాటకవాళ్లు కూడా నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి నేను సౌతిండియన్‌నే. నా సినిమాలను కేరళవాళ్లు సొంత సినిమాల్లాగా ఆదరిస్తున్నారు. ఓ ల్యాండ్ మార్క్ ఉన్న మలయాళ సినిమా తెలుగులోకి వస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేయాలని భావించా. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సమయంలో వినోద్ రెడ్డిగారిని ‘బన్నీ’వాసు పరిచయం చేశాడు. ఆయన అడగ్గానే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నేను ఎంత కాలం నిలబడగలనో తెలియదు కానీ.. అవకాశం ఉన్న ప్రతిసారీ నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరి కోసం నిలబడతా’’ అన్నారు. ‘‘మలయాళంలో ఎంత మంది స్టార్స్ ఉన్నా మా సినిమా వీడియోను ఎవరూ షేర్ చేయలేదు. అల్లు అర్జున్‌గారు మాత్రమే షేర్ చేశారు’’ అన్నారు ఒమర్ లులు. ‘‘అల్లు అర్జున్‌గారంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి స్టేజ్‌పై నిలబడే అవకాశం వస్తుందనుకోలేదు. ఆయన్ను కలుసుకున్నందుకు వెరీ హ్యాపీ’’ అని ప్రియా ప్రకాష్ వారియర్ అన్నారు. ‘‘మా యూనిట్‌ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు చిత్రసమర్పకుడు వినోద్ రెడ్డి. ‘‘సీతారామరాజుగారు, సురేశ్‌గారి సపోర్ట్‌తో ‘లవర్స్ డే’ సినిమా అవకాశం దక్కించుకున్నాను. అల్లు అర్జున్‌తో పాటు చాలా మంది నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇందుకు వారికి థ్యాంక్స్’’ అని ఎ.గురురాజ్ అన్నారు. నటుడు అలీ, నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ, పాటల రచయిత చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నన్ను హౌస్ అరెస్ట్ చేశారు
ప్రియా ప్రకాశ్ వారియర్... ఓ సంవత్సరం కిందట జస్ట్ కాలేజీ అమ్మాయి. ఏడాది తర్వాత పాపులర్ గాళ్. అలా అలవోకగా ప్రియ కన్ను కొట్టడాన్ని నెటిజన్లు కళ్లు పెద్దవి చేసుకుని చూశారు. ఆ విధంగా మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాను ‘లవర్స్ డే’ పేరుతో గురురాజ్ తెలుగులో విడుదల చేయనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రియా ప్రకాశ్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ∙ నేను కేరళ అమ్మాయిని. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. మా కుటుంబంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లెవరూ లేరు. కానీ చిన్నప్పటినుండి నటి అవ్వాలని మాత్రం ఉండేది. చివరికి అనుకున్నది సాధించాను. ∙‘ఒరు అడార్ లవ్’ టీజర్ చూశాక అందరూ నన్ను ‘వింక్ గాళ్’ అంటున్నారు. అయితే నేను ఏదో ఒక టైటిల్‌తో ఇండస్ట్రీలో నిలబడాలనుకోవడంలేదు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. ‘ఒరు అడార్..’ని పాట చిత్రీకరణతో మొదలుపెట్టాం. అది పూర్తవ్వగానే టీజర్లా రిలీజ్ చేశాం. దానివల్లే ఇంత పేరొచ్చింది. సోషల్ మీడియాలో నాకు చాలా క్రేజ్ తీసుకొచ్చింది. సాంగ్ రిలీజయిన తర్వాత మా ఇంట్లో చాలా పెద్ద దుమారమే జరిగింది. చాలామంది ఫ్యాన్స్ మా ఇల్లు కనుక్కొని మా ఇంటికి వచ్చి ప్రియాని చూడాలి అనేవారు. మా నాన్న వాళ్లందరికీ మంచి కథలు చెప్పి మాయ చేసి పంపేవారు. నన్ను కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. ∙ కాలేజీలో నన్నెవరూ టీజ్ చేయలేదు. అందుకని కాలేజ్ మారాల్సిన అవసరం రాలేదు. మాది గాళ్స్ కాలేజ్. ఇప్పటికీ స్టేజ్ షోలు, సింగింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొంటాను. టీచర్స్, స్నేహితులు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వాళ్లలో ఏ మార్పూ లేదు. నాకు ఫ్రెండ్స్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లటం, వాళ్లతో సిటీ బస్‌లో ప్రయాణం చేయడం అంటేæ ఇష్టం. ∙ నేను సినిమా చేయాలంటే ముందుగా కథ వింటాను. నచ్చితే ఆ కథను నాన్నకు చెప్తాను. నాకు చాలా ఆఫర్స్ వచ్చినా ఒక్కటీ చేయలేదు అనుకుంటున్నారు అందరూ. దానికి కారణం మేం ‘ఒరు అడార్..’ని చిన్న సినిమాగా మొదలుపెట్టాం. అందుకే ముందుగా చిన్న బిట్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు మా సినిమా టీమ్. అది హిట్టయి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మిగతా షూటింగ్ కంప్లీట్ చేయటానికి ఇప్పటివరకు పట్టింది. అంతేకానీ నాకు అవకాశాలు రాక కాదు. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అంత పెద్ద స్టార్ సినిమాలో ఓ సాంగ్ చేయమని అడిగారు. డేట్స్ కుదరక చేయలేకపోయాను. ఇలా చాలా సినిమాలు మిస్సయ్యాయి. హిందీ ‘సింబా’కి నన్నెవరూ అప్రోచ్ అవ్వలేదు. అవన్నీ రూమర్స్ మాత్రమే. ∙ నేను కేరళ అమ్మాయినైనా నా ఫాలోవర్స్ ఎక్కువ శాతం నార్త్ ఇండియన్స్, హైదరాబాద్ వాళ్లే. చాలా ఇంటరాక్ట్ అవుతారు వాళ్లు. ‘లవర్స్ డే’ క£ý విషయానికొస్తే స్కూల్ డేస్లోని ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు. మీరు వీడియోలో చూసిన ఆ సీన్ ఇద్దరు ఫ్రెండ్స్ చేసే నార్మల్ అల్లరి సీన్. సింగిల్ టేక్‌లో చేసేశాను. మలయాళంలోని ఓ చిన్న సినిమా 4 భాషల్లో రిలీజవ్వటం మలయాళ చిత్రపరిశ్రమలో ఇదే మొదటిసారి. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున విడుదలవుతుంది. ∙ బాలీవుడ్లో చేస్తున్న ‘శ్రీదేవి బంగ్లా’లోని నా పాత్ర వివాదాస్పదమయ్యింది. కారణం ఆ సినిమా ట్రైలర్‌లోని సీన్ దివంగత నటి శ్రీదేవిగారిని పోలి ఉండటమే. సినిమా కథలో భాగం మాత్రమే అది. సినిమా మొత్తం చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అయితే శ్రీదేవిగారి భర్త బోనీకపూర్ సినిమా నిలిపివేయాలని నోటీసు పంపించారు. కేసు కోర్టులో ఉంది. ∙ విమర్శలు వచ్చినప్పుడు మొదట్లో మనసుకు తీసుకుని ఫీలయ్యేదాన్ని. ఎవరైతే ఆకాశానికి ఎత్తుతారో వారే కింద పడేస్తారు. ఒక సినిమా వయసుతో, ఓ సంవత్సరంలో చాలా విషయాలు నేర్చుకున్నాను.ఈరోజు జరిగే నా సినిమా ఆడియో ఫంక్షన్‌కు అల్లు అర్జున్ రావటం చాలా ఆనందంగా ఉంది. ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. నేను ట్రోల్స్‌ను బాగా ఫాలో అవుతాను. అల్లు అర్జున్ చేసే అన్ని వీడియోలను ఫాలో అవుతాను. అన్నిట్లోకి బన్నీ వాళ్లబ్బాయితో చేసిన వీడియో అంటే ఇష్టం. -
ప్రేమికుల రోజున...
కొంటె సైగతో దేశంలోని యూత్ అందర్నీ ఫిదా చేసిన ‘వింక్ సెన్సేషన్’ ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్లో ఆమె కన్ను కొట్టే షాట్ ఎంత హల్చల్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రం ‘లవర్స్ డే’ అనే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ కానుంది. సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్ వినోద్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఒరు ఆధార్ లవ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క కంటి సైగతో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత గొప్పది. భారీ పోటీ మధ్య ఈ సినిమా హక్కులను మేం సొంతం చేసుకున్నాం. వేలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రొమాంటిక్ కామెడీగా సాగే ఈ కథకు షాన్ రెహమాన్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శీను సిద్ధార్ధ్, కథ– దర్శకత్వం: ఒమర్ లులు. -
తెలుగులో ప్రియా ప్రకాష్ మూవీ..!
అమ్మాయి ఓరచూపు చూస్తే వలలో పడని అబ్బాయిలు ఉండరని అంటారు. మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ విషయంలో అది మరోసారి రుజువైంది. కాకపోతే ప్రియా ప్రకాష్ వారియర్ మరో అడుగు ముందుకేశారు. ఆమె కొంటెగా కంటి సైగ చేస్తే రాష్ట్రాల సరిహద్దులు దాటి మరీ యువకులు ఆమె గురించి ఆరా తీశారు. కేవలం 27 సెకన్ల వీడియోతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. యువకుల్లో అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రియా నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా గురించి తెలుగు నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘ఒరు ఆధార్ లవ్’ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు. ప్రియా చేసిన ఒక్క కంటి సైగతో ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత గొప్పది. ఆ చిత్రం తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. భారీ పోటీ మధ్య హక్కులను మేం దక్కించుకున్నాం. వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగులో లవర్స్ డే అనే పేరుతో విడుదల చేస్తున్నాం’ అన్నారు. -
వెండితెర మీద కన్నుగీటనుంది..!
ఒక్క ప్రోమోతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ఓ పాటకు ఆమె తన కళ్లతో పలికించిన హావభావాలతో ఒక్కరోజులోనే ఆమె పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెకు పాపులారిటీ పెరిగిపోవడంతో వరుస అవకాశాలు క్యూ కట్టినట్టుగా వార్తలు వచ్చాయి. ఫిబ్రవరిలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినా ఇంత వరకు సినిమా రిలీజ్ కాలేదు. ఇన్ని రోజుల వెయిటింగ్ తరువాత ఒరు అదార్ లవ్ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాను 2019 ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లు బుల్లితెర మీదే ప్రియా ప్రకాష్‌ను చూసి అభిమానులు త్వరలో వెండితెర మీద చూసేందుకు రెడీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రియా ప్రకాష్‌కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. -
మళ్లీ వార్తల్లో నిలిచిన ప్రియా వారియర్
ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆదార్ లవ్ సినిమాలోని మాణిక్య మలరాయ సాంగ్‌లో కన్నుకొట్టి, గన్నుతో పేల్చి కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిందీ భామ. ఈ ఒక్క సాంగ్‌తో బాలీవుడ్లో చాన్స్ కొట్టేసింది. ఇక ప్రస్తుతం ఒరు అదార్ లవ్ సినిమాలోని మరో సాంగ్‌ను రిలీజ్చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇది కూడా మరో కొత్త రికార్డును సెట్ చేస్తోంది. యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డిస్‌లైక్‌లు సాధించిన సాంగ్‌గా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ పాటను పది లక్షలకు పైగా వీక్షించగా, రెండు లక్షలకు పైగా డిస్‌లైక్‌లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రియకు ఇంతటి వ్యతిరేకతకు గల కారణాలు ఏంటో తెలియడం లేదు. తన అభిమానులు సైతం ఈ డిస్లైక్లకు గల కారణాలేంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా మళ్లీ ప్రియా వారియర్ వార్తల్లోకెక్కేసింది. -
ప్రియా వర్రీయర్
ఒక్క కొంటె సైగతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు ప్రియా ప్రకాశ్ వారియర్. నార్త్ టు సౌత్ ‘వింక్ గర్ల్’గా ఫేమస్ అయిపోయారు. ఎంత పాపులారిటీ సంపాదించారో అంతే విరివిగా వివాదాల్లో కూడా వినిపిస్తూనే ఉన్నారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు అడార్ లవ్’ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు విపరీతంగా అప్సెట్ అవుతున్నారట ప్రియా వారియర్. ఇంతకుముందు ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే ఇప్పుడు ఆన్లైన్లో విమర్శలు చేస్తుండటం వర్రీగా ఉందట. మలయాళంలో నజ్రియా నజీమ్ తన కంబ్యాక్ ఇచ్చారు. ఆ హీరోయిన్‌తో ప్రియా ప్రకాశ్‌ను పోల్చి విమర్శిస్తున్నారట. నిజానికి ‘ఒరు అడార్ లవ్’ ట్రైలర్ రిలీజ్ కాగానే ‘ఇంత అందమైన కళ్లను చూడలేదు’ అని ప్రియాని చాలామంది పొగడ్తల్లో ముంచెత్తారు. ఇప్పుడేమో తన కళ్ల కంటే నజ్రియా కళ్లు ఇంకా బావుంటాయి అని కామెంట్ చేశారట సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు. ఇలా సినిమా రిలీజ్ కాకముందే తన మీద నెగటివిటీ, కామెంట్స్ చూడటం తన కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా చేస్తోంది అని పేర్కొన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. సో.. ఇప్పుడు వారియర్ కాస్తా వర్రీయర్ అయ్యారన్నమాట. -
ప్రియా వారియర్‌పై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కన్నుగీటి పాపులర్ అయిన మలయాళ నటి ప్రియా వారియర్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని పాట కారణంగా మత విశ్వాసాలు దెబ్బతిన్నాయంటూ నటి ప్రియ, దర్శక, నిర్మాతలపై తెలంగాణసహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవడం తెల్సిందే. దీంతో ప్రియ, దర్శక, నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సినిమాలో వివాదానికి కారణమైన ఆ పాట 1978 నుంచి ప్రజలకు, ముఖ్యంగా ముస్లింల ఆదరణ పొందిన ఒక జానపద గీతమని ప్రియా తరఫు న్యాయవాది తెలిపారు. పాటపై తమకెలాంటి అభ్యంతరం లేదనీ, చిత్రీకరణే అభ్యంతరకరంగా ఉందంటూ ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘ఎవరో పాటలు పాడుకుంటున్నారు. కేసు నమోదు చేయడం మినహా మీకు మరే పనీ లేదు..’ అంటూ తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడింది. -
ప్రియా ప్రకాశ్‌కు ఊరట
-
సుప్రీం తీర్పు.. ప్రియా ప్రకాశ్‌కు ఊరట
న్యూఢిల్లీ : ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. సామాన్యుల నుంచి స్టార్ హీరోల వరకూ ప్రియా ప్రకాశ్ కన్నుగీటుకి ఫిదా అయ్యారు. అయితే ఆ కన్నుగీటు ఆమెకు పేరుతో పాటు సమస్యలు కూడా తెచ్చిపెట్టింది. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ఓ పాటలో ప్రియా ప్రకాశ్ ముస్లింల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించిందంటూ కొందరు ముస్లింలు ఆమెపై కేసు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసులో ప్రియా ప్రకాశ్‌కు ఊరటనిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రియా ప్రకాష్‌పై కేసును కొట్టివేయడమే కాక.. కేసు వేసిన వారిని ఉద్దేశిస్తూ ‘మీకేం పని లేదా.. ప్రతి దానికి ఇలా కేసులు వేసుకుంటూ కూర్చుంటారా’ అంటూ చివాట్లు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు ఫలితంగా ఇన్నాళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ‘ఒరు అదార్ లవ్’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమర్ లులు దర్శకత్వంలో వచ్చిన ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియ కన్ను కొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాట కేరళకు చెందిన ముస్లిం సంప్రదాయపు గీతం అని, ఇందులో ప్రియ కన్నుకొట్టడం అసభ్యకరంగా ఉందంటూ పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రియా ప్రకాశ్ మీద కేసు వేశారు. -
మాలీవుడ్ కాలింగ్
సన్నీ లియోన్.. నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ ఉన్న హాట్ స్టార్. బాలీవుడ్ మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ‘వీర మహాదేవి’లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ సన్నీకి స్వాగతం పలికిందట. ‘ఒరు అడార్ లవ్’ రూపొందించిన ఒమర్ లులూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ప్రియా ప్రకాశ్ వారియర్ కొంటెగా కన్ను కొట్టి నేషనల్ పాపులారిటీ వచ్చేసింది ‘ఒరు అడార్ లవ్’ సినిమాకే. రంజాన్ పండుగకే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అనుకోని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఒమర్ తెరకెక్కించే తదుపరి చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారట సన్నీ. జయరామ్, హనీ రోస్ ముఖ్య తారలు. -
ప్రియా ప్రకాశ్‌కు భారీ ఆఫర్!
మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే స్టార్ అయిన విషయం తెలిసిందే. ప్రియా రూ. కోటి ఆఫర్ దక్కించుకున్నారు. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ఓ పాటకు ఆమె తన కళ్లతో పలికించిన హావభావాలతో ఒక్కరోజులోనే ఆమె పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెకు పాపులారిటీ పెరిగిపోవడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. భారీ పారితోషికం ఇచ్చేందుకు కూడా పలువురు సినీ నిర్మాతలు ముందుకు వచ్చారు. ఇటీవల ప్రియా ఓ వాణిజ్య ప్రకటన చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఇందు కోసం ఆమెకు కోటి రూపాయల పారితోషికం దక్కినట్టు ప్రచారం జరుగుతోంది. రూ. కోటి డీల్‌పై ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది. అది జాతీయ ప్రకటన అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హాల్చల్ చేస్తున్నాయి. -
ప్రియా వారియర్ సందడి
ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సన్సేషన్‌గా మారారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ టీజర్లో సందడి చేసిన ప్రియా, ఆ సినిమా విడుదలకు ముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియాకు వచ్చిన ఆదరణ చూసిన చిత్ర యూనిట్ ఆ తర్వాత సినిమాలో ఆమె పాత్ర నిడివిని పెంచేలా రీ షూట్ చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌కు ఏ మ్రాతం తీసిపోని ఆదరణ ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవడానికి అభిమానులు సోషల్ మీడియాలో వెతుకుతూనే ఉన్నారు. తాజాగా ఆమె ఓ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఒరు అదార్ లవ్‌లో నటించిన తన సహ నటుడు అరుణ్ మ్యారేజ్‌కు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంతమంది మాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈ వివాహ వేడకలో ప్రియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పింక్ రంగు చీరలో పెళ్లికి హాజరైన ప్రియా మరోసారి అందరిని మాయ చేశారు. అంతే కాకుండా తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. సంజయ్ దత్ ఫేమస్ సాంగ్ ‘హవా హవా’ పాటను పాడుతూ.. చిన్నగా డాన్స్ కూడా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పెళ్లిలో పాట పాడిన ప్రియా వారియర్
-
కన్ను గీటింది...అవార్డు పట్టింది
ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రెటీగా మారిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం ఈ 19ఏళ్ల యవ్వనవతి సంపాదన, పాపులారిటీ స్టార్ హీరో కంటే తక్కువేం కాదు. కేవలం సంపాదన, పేరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ అమ్మడి ఖాతాలోకి మరో గౌరవం వచ్చి చేరింది. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొందరు నటులను వరించని అదృష్టం ప్రియా వారియర్‌ను వరించింది. ఇంతకు ఏంటా అదృష్టం అంటే ప్రియ తన తొలి అవార్డును అందుకుంది. అందేంటి ప్రియ నటించిన సినిమాలు ఇంతవరకూ ఒక్కటి కూడా విడుదల కాలేదు మరి అప్పుడే అవార్డు అందుకోవడం ఏంటి అనుకుంటున్నారా?. మరేంలేదు ప్రియ అందుకున్న అవార్డు సినిమాలకు సంబంధించింది కాదు సోషల్ మీడియాకు సంబంధించి అవార్డు. 2018 సంవత్సరానికి గాను ‘వైరల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రియ సొంతం చేసుకుంది. ఇది తన జీవితంలో తాను అందుకున్న తొలి అవార్డు అని, అందుకు చాలా గర్వంగా ఉందని ప్రియా వారియర్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రియా వారియర్ నటించిన ‘ఒరు ఆదర్ లవ్’ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చక్కనమ్మ ఏ చీర కట్టినా అందమే..
ముంబై : ఒక్క కనుసైగతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ సినిమా విడుదల కాకముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో ఉండడం సహజమే. అందుకే ప్రియా వారియర్ కూడా అభిమానులను ఖుషీ చేసేందుకు తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మలయాళ నూతన సంవత్సరాది ‘విషూ’ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియా వారియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎరుపు రంగు అంచు ఉన్న క్రీమ్ కలర్ చీర కట్టుకున్న ప్రియా.. ఎర్రటి బొట్టు పెట్టుకుని పూర్తి సంప్రదాయ వస్త్రాధారణతో అభిమానులను కట్టిపడేశారు. ప్రియా వారియర్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఒరు ఆదర్ లవ్’ జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమర్ లూలు దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు సియార్ షాజహాన్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షరీఫ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Happy vishu!🌼 📸: @mojin_thinavilayil Wearing: @ann_ancy Makeup & hair: pinky Thank you @mithunmithran A post shared by priya prakash varrier (@priya.p.varrier) on Apr 14, 2018 at 8:07am PDT -
మూడు భాషల్లోకి ప్రియా వారియర్ సినిమా
ఒక్క కనుసైగతో దేశ వాప్తంగా పాపులర్ అయిన మళయాల నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం ఆమె నటించిన ఒరు అదార్ లవ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రియ పాపులారిటీని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సినిమా దర్శక, నిర్మాతలు. ఈ చిత్రాన్ని మరో మూడు భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో ప్రియకు జోడీగా రోషన్ అబ్దుల్ రహూఫ్ నటిస్తున్నాడు. ఒమర్ లులు దర్శకత్వం వహించగా, ఒసెపచ్చన్ ఒళకుంజి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియ పాపులారిటీ దర్శక, నిర్మాతలకు ఏమేరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలిమరి. -
‘అమ్రపాలి’ని కాపీ కొట్టిన ప్రియా వారియర్?
ఒక్క కనుసైగతో కుర్రకారు మతి పొగొట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమా విడుదలవ్వక ముందే తన హావభావాలతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియా వారియర్ కన్నుగీటే ఈ సన్నివేశం ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ‘మణిక్య మలరాయ పూవి’ పాటకు సంబంధించినది. ఈ వీడియోలో ప్రియ కన్నుగీటే హవభావలతో స్టార్ హీరోలను సైతం ఆకట్టుకుంది. అయితే ఈ కన్నుగీటే దృశ్యాన్ని మూడు సంవత్సరాల క్రితం ప్రియ కంటే ముందే ఒక భోజపూరి నటి చేసింది. ఆ నటి భోజ్‌పూరికి చెందిన అమ్రాపాలి దూబే. ఆ సన్నివేశం అమ్రపాలి దూబే, దినేశ్ లాల్ యాదవ్ నిరావ్ నటించిన ‘రాజు భాయ్’ సినిమాలోని ‘మాతా ఫెయిల్ హో జైల్’ పాటలో ఉంది. 2015లో విడుదలయిన ‘ఈ రాజు భాయి’ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఒరు ఆదర్ లవ్‌లో ప్రియ కన్నుగీటే దృశ్యానికి, అమ్రపాలి చేసిన కన్నుగీటినదానికి చాలా పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీంతో అమ్రపాలిని ప్రియా ప్రకాశ్ వారియర్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఒమర్ లూలు దర్శకత్వం వహిస్తున్న ఒరు ఆదర్ లవ్ రోమాంటిక్ డ్రామా. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు సియార్ షాజహాన్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షరీఫ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రియాకు చిక్కులు: కన్నుకొట్టడం దైవదూషణే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ప్రియాప్రకాశ్ వారియర్ తొలి చిత్రం ‘ఓరు ఆదార్ లవ్’ సినిమాకు ఒక్కొక్కటిగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఇద్దరు హైదరాబాద్ వాసులు ఈ సినిమాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటను తొలగించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. పవిత్రమైన పాటలో కన్నుగీటినట్టు చిత్రించడం.. ఇస్లాంలో ‘దైవదూషణ’ లాంటిదేనని పేర్కొన్నారు. ‘మాణిక్య మలరాయ పూవి’ పాట వీడియోను కొన్ని రోజుల కిందట ఇంటర్నెట్లో విడుదల చేయగా.. ఈ పాటలోని ప్రియా వారియర్ తన క్లాస్‌మేట్‌ను చూసి నవ్వుతూ.. కన్నుకొట్టే దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోతో ప్రియా వారియర్ ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. అయితే, ఈ వీడియో క్లిప్‌పై పలు ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటున్నాయి. మహమ్మద్ ప్రవక్త, ఆయన భార్య ఖదీజా బివీని ప్రశంసిస్తూ రాసిన పాటను ఈ సినిమాలో ఉపయోగించుకొని.. అభ్యంతరకర దృశ్యాలను చిత్రీకరించారని పిటిషనర్లు పేర్కొన్నారు. ‘30 సెకన్ల వీడియోలో పాఠశాల బాలిక.. ఓ బాలుడి పట్ల నవ్వుతూ.. కనుబొమ్మలు ఎగరేస్తూ.. కన్నుకొట్టినట్టు చూపించారు. కన్నుకొట్టడం ఇస్లాంలో నిషేధం. మహమ్మద్ ప్రవక్త, ఆయన భార్యను ప్రశంసిస్తూ రాసిన పవిత్రమైన పాటలో ఇలా కన్నుకొట్టే సన్నివేశాలు పెట్టడం దైవదూషణే’ అని పిటిషనర్లు తెలిపారు. పిటిషనర్లలో ఒకరు ఇప్పటికే సినిమా దర్శకుడు ఒమర్ లులుకు వ్యతిరేకం పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. -
అదే నా లక్ష్యం
తమిళసినిమా: ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. పేరు మాత్రం దక్షిణాదిని దాటి ఉత్తరాది సినిమాకు పాకేసింది. ఆ పేరే ప్రియా వారియర్. కథానాయికలకు చిరునామా కేరళా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అక్కడి అమ్మాయిలిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్లో హీరోయిన్లుగా దుమ్మురేపుతున్నారు. ఇక ప్రియా వారియర్ గురించి చెప్పాలంటే ఈమె కథానాయకిగా పరిచయం అవుతున్న ఒరు అడార్ లవ్ అనే మలయాళ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఆ చిత్రం ట్రైలర్లో ప్రియ నటించిన దృశ్యాలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రియా వారియర్ కన్ను కొట్టే దృశ్యం కుర్రకారులో కేక పుట్టిస్తోంది. ఈ సందర్భంగా ఈ క్రేజీ నటి ఏమంటుందో చూద్దాం. ఒరు అడార్ లవ్ చిత్ర ట్రైలర్‌తోనే నాకు ఒక్క మాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందుకు నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. గాలిలో తేలిపోతున్నట్లుంది. ఈ సంతోషం భవిష్యత్తులోనూ కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాన్న ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్నారు. అమ్మ హౌస్‌వైఫ్. నేను బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చదువుకు ఆటంకం కలగకుండా నటిస్తున్నా. ఇప్పుడు మా కళాశాల్లో నేను చాలా పాపులర్ అయ్యాను. ఇలా సడన్‌గా పాపులర్ కావడం వినూత్న అనుభవం. నేను నటిని కావడం నా తల్లిదండ్రులకు సంతోషమే. తాతా,బామ్మలు ఆనందపడుతున్నారు. నేను పెద్ద నటిని కావాలన్నది వారి కోరిక. ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించాను. అందాల పోటీల్లోనూ పాల్గొన్నాను. డాన్స్ పోటీలో గెలుపొందాను. కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. స్టార్ హీరోయిన్ కావాలన్నది నా కోరిక. అన్ని భాషల్లోనూ నటించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. -
షాపింగ్ మాల్లో ప్రియా ప్రకాశ్.. వీడియో వైరల్
తిరువనంతపురం : ఒక్క కనుసైగతో దేశవ్యాప్తంగా పాపులరైన మలయాళ కుట్టి ‘ ప్రియా ప్రకాశ్ వారియర్’. ఆమెకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెటిజన్లకు పండగే. కొద్దిరోజులుగా ప్రియా ప్రకాశ్ షాపింగ్‌మాల్ వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. షాపింగ్‌మాల్‌లో అభిమానులతో కలసి ఫోటోలు దిగిన ఈ వీడియోను ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాదు ‘‘ ప్రియా వారియర్ హోలిక్స్’’ పేరిట ఆమెకు ఓ అభిమాన సంఘం ఉంది. ప్రియకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటుంది. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రియా వారియర్ తెలుగులో..
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మత్తుగొలిపే కళ్లతో ముద్దుల తూటాలను పేల్చి యువతకు ఆరాధ్యం అయిపోయిందీ పద్దెనిమిదేళ్ల కేరళ అందం. సోషల్ మీడియాలో‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ఓ రొమాంటిక్ వీడియో క్లిప్ హల్చల్ చేయడంతో..రాత్రికి రాత్రే ప్రియా పాపులర్ అయింది. ఈ వీడియో క్లిప్ ఆమెకు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఒక్క దెబ్బతో ‘ఒరు అదార్ లవ్’ సినిమా అంచనాలు అమాంతం పెరిగాయి. దాంతో అటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నిర్మాతలు, ఇటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ప్రియా కాల్షీట్ల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. తెలుగులో తాజాగా విడుదలైన ‘ఇగో’ సినిమా నిర్మాతలు తమ తదుపరి సినిమా కోసం ఆమెకు భారీ పారీతోషికం ఆఫర్ చేసినట్టు వినికిడి. చూడాలి మరి తెలుగులోనూ ప్రియ తన కళ్లతో ఏ భావాలు పలికిస్తుందో...!! -
మాలీవుడ్ టు బాలీవుడ్
‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఒక్క సినిమా హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు’.. కానీ.. ఒక్క చూపుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు మాలీవుడ్ బ్యూటీ ప్రియాప్రకాశ్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ మలయాళ చిత్రం ట్రైలర్లో ప్రియ కన్నుకొట్టే సన్నివేశానికి ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ప్రియకు అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా రణ్వీర్ సింగ్ సరసన నటించే అవకాశం ప్రియా ప్రకాశ్‌ని వరించిందని బాలీవుడ్ టాక్. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ కి రీమేక్‌గా బాలీవుడ్లో ‘శింబా’ మూవీ తెరకెక్కుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రణ్‌వీర్‌కి జోడీగా అలనాటి అందాలనటి శ్రీదేవి తనయ జాన్వీ నటించనున్నారంటూ బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ప్రియాప్రకాశ్ పేరు తెరపైకి వచ్చింది. ‘శింబా’ చిత్రవర్గాలు ప్రియను సంప్రదించాయట. అయితే.. తొలి సినిమా ‘ఒరు అదార్ లవ్’ విడుదల వరకూ ఏ సినిమా ఒప్పుకోకూడదనే ఒప్పందం కారణంగా ఆమె ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని టాక్. -
నేనేనా? ఇది నిజమేనా?
కన్ను కొట్టి, కవ్వించిన పిల్ల రివ్వున ఎగి రింది. మబ్బులను దగ్గరగా చూసి సంబరపడిపోయింది. ‘మనం ఏంటి? ఎగరడం ఏంటి? ఇది కలా? నిజమా?’ అని ఒక్కసారి గిల్లి చూసుకుంది. ‘మనమే.. ఎగురుతున్నది మనమే’ అని ఆనందపడింది. మరి.. ఫస్ట్ టైమ్ విమానం ఎక్కితే ఎవరైనా ఇలానే ఆనందపడతారు కదా. జస్ట్ చిరునవ్వు నవ్వి, కన్ను కొట్టినందుకు బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ తొలిసారి ఫ్లైట్ ఎక్కింది. కొచ్చి టు తిరువనంతపురం ట్రావెల్ చేసిందీ బ్యూటీ. తొలి విమాన ప్రయాణం టికెట్‌ను దాచుకుందట. ‘లైఫ్‌లో తొలిసారి ఫ్లైట్ ఎక్కాను’ అని పేర్కొంది. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈలోపు టీజర్ ద్వారా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అందరూ ఆమె నటిస్తున్న తొలి చిత్రం ‘ఒరు అడార్ లవ్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒమర్ లులు దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో విడుదల చేస్తారు. -
ప్రియా ప్రకాష్ స్పూఫ్ చేసిన బన్నీ
-
ప్రియా ప్రకాష్లా బన్నీ..!
సినిమాలు, షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తూ ఉంటాడు యంగ్ హీరో అల్లు అర్జున్. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఉండేందుకే ఇష్టపడే బన్నీ తన చిన్నారులతో కలిసి అల్లరి చేస్తుంటాడు. బన్నీ పిల్లలతో చేసే అల్లరి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తుంటుంది అల్లు అర్జున్ భార్య స్నేహ. తాజాగా స్నేహ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం ఒరు ఆదార్ లవ్ లోని ఓ సన్నివేశం నాకు బాగా నచ్చిందంటూ బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సన్నివేశానికి స్పూఫ్ చేశాడు స్టైలిష్ స్టార్. హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ చేసినట్టుగానే చేతితో తన కొడుకును షూట్ చేయటం, బన్నీ కొడుకు అయాన్ అమాంతం బెడ్ మీద పడిపోవటాన్ని వీడియో తీసిన స్నేహ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. -
ప్రియాప్రకాశ్‌కు భారీ ఊరట!
-
ప్రియా వారియర్‌కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్(18)కు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రియాతో పాటు ఈ చిత్ర దర్శకుడు ఒమర్ లులూపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అలాగే వీరిద్దరిపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుచేయరాదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఒరు అదార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ పాట ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా చిత్రీకరించారంటూ తెలంగాణ, మహారాష్ట్రల్లో వారిపై క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పాట కేరళలో చాలా ప్రాచుర్యం పొందిందనీ, దీన్ని అపార్థం చేసుకోవడం వల్లే వేర్వేరు రాష్ట్రాల్లో తమపై కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయమై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. -
ప్రియాప్రకాశ్‌కు భారీ ఊరట!
-
ప్రియాప్రకాశ్‌కు భారీ ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా సెన్సేషన్, కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ, మహారాష్ట్రల్లో నమోదైన కేసులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ లోని పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో దేశంలో ఎక్కడా కూడా నటి ప్రియపై, సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విషయంలో క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలంటూ ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ స్టే విధించింది. కాగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమాలో పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తోపాటు చిత్ర దర్శక, నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోనూ ఇదేవిధంగా కేసు నమోదైంది. ఈ మూవీలోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఒక్క ‘కంటిసైగ’ వీడియోతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఇటీవల ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని 'మాణిక్య మలరాయ పూవి' పాటలో ఆమె కన్నుగీటే సన్నివేశాలు సంచలనంగా మారి.. ప్రేమికులరోజు సందర్భంగా దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. -
‘ప్రియా నీ హావభావాలు చూడ ముచ్చటగా..’
మలయాళం భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో స్టార్‌గా మారి సంచలనం సృష్టించింది. ఆమె నటించిన సినిమా ‘ఒరు అడార్ లవ్’’ . ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో గతవారంలో విడుదల అయింది. దాంట్లో ఈ భామ కను సైగలతో చేసిన హావభావాలు అందర్నీ కట్టి పడేశాయి. టాలీవుడ్ హీరోల నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ లుంగీ ఎంగిడీ వరకూ ప్రియాకు ఫ్యాన్స్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ లిస్ట్‌లో చేరిపోయ్యాడు బాలీవుడ్ నటుడు, దర్శకుడు రిషి కపూర్. ఇటీవల ఆమె వీడియో చూసిన ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ‘ ప్రియాకు ఊహించని స్టార్ డమ్ వచ్చింది. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటున్నాను. మై డియర్ ప్రియా .. నీ వయస్సు వాళ్లకు నీవు స్ఫూర్తిగా నిలుస్తున్నావు. ఈ వీడియో నీ హావభావాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. గాడ్ బ్లెస్, ఆల్ ది బెస్ట్’ అని రిషి కపూర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ పెరిగిపోయింది. ప్రియా ప్రస్తుతం కేరళ త్రిస్సూర్‌లోని ‘విమల కాలేజ్’లో బీకామ్ చదువుతోంది. ‘ఒరు ఆదార్ లవ్’ మలయాళ చిత్రంలో హీరోయిన్ ప్రియా వారియర్ కనుగీటిన సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఒరు ఆదార్ లవ్ అంటే అసాధారణ ప్రేమ అని అర్థం. -
‘పనికొచ్చే విషయాలపై స్పందిస్తే మంచిది’
సాక్షి, తిరువనంతపురం : మళయాళంలో ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవీ’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అంతే వివాదాస్పదంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్ బుక్‌లో స్పందించారు. అయితే ఓ సినిమా పాటకు స్పందించిన సీఎంకు.. రాష్ట్రంలో మిగతా సమస్యలు కనిపించటం లేదా? అని సీనియర్ నటుడు, రాజకీయ ఉద్యమకారుడు జాయ్ మాథ్యు.. పినరయిపై విరుచుకుపడ్డారు. ‘పోలీస్ శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఓ సినిమా పాట వివాదంపై స్పందిస్తూ భావ స్వేచ్ఛ ప్రకటన అంటూ మద్ధతిచ్చారు. కానీ, రాజకీయ హత్యలు ఆయన కంట పడటం లేదనుకుంటా. కన్నూర్‌లో కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తను కొందరు దారుణంగా హత్య చేశారు. వారిని ఇంత వరకు అరెస్ట్ చేయలేకపోయారు. అంటే హంతకులకు కూడా తప్పించుకుని తిరుగే స్వేచ్ఛను విజయన్ ప్రభుత్వం ప్రసాదించారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయని.. అనవసరమైన విషయాలపై స్పందించటం మానేసి.. పనికొచ్చే పనులపై దృష్టిసారిస్తే మంచిదని మాథ్యూ.. విజయన్‌కు సూచించారు. కాగా, కళలో భావ ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని సీఎం పినరయి విజయన్ తన ఫేస్బుక్లో పాట వివాదంపై స్పందించారు. ఈ క్రమంలో పాట పుట్టుపూర్వోత్తరాల గురించి ఆయన పూర్తి వివరాలు తెలియజేశారు. మాప్పిలపట్లు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బర్ రాసిన ఈ పాటను రఫీఖ్ పాడారు. 1978 ఆకాశవాణిలోనే ఈ పాట ప్రసారమైంది. ఏళ్ల తరబడి ముస్లింల వివాహాల్లో ఈ పాటను పాడుతున్నారు కూడా. అలాంటప్పుడు ఒప్పుడు కొత్తగా అభ్యంతరం ఏంటి? ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలు. వాటిని నాశనం చేసే ప్రయత్నం మంచిది కాదు అని విజయన్ తెలిపారు. కాగా, ఈ పాట రాసిన జబ్బర్ కూడా వివాదాలు సాధారణమే అని వ్యాఖ్యానించారు. ప్రియా ప్రకాశ్ వారియర్ మూలంగా ఈ పాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమా నుంచి ఈ సాంగ్‌ను తొలగించేలా సెన్సార్ బోర్డుకు, చిత్ర బృందానికి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పలు ముస్లిం సంఘాలు లేఖలు రాశాయి. -
కన్ను కుట్టి
ప్రియా ప్రకాశ్ కేరళ కుట్టి.. తను కన్ను కొట్టి.. ఎంతోమందిని టెన్షన్లో పెట్టి అభిమానులతో చేయిస్తోంది వెట్టి ఎవరీ ప్రియాప్రకాశ్ వారియర్. సమాజాన్ని ఉద్ధరించే పనేదైనా చేసిందా? పోనీ నలుగురికి ఉపయోగపడే పనేదైనా? పోనీ ఇద్దరికి.. ఊహూ.. ఒక్కరికి. అబ్బే లేదు. మరేం చేసింది అంటే.. జస్ట్ కన్ను కొట్టింది. అంతే... లక్షలాది మంది ‘ఫ్లాట్’. సినిమా రిలీజ్‌కి ముందు టీజర్ వదులుతారు కదా? ఆ టీజర్లో రెండు కనుబొమలను పైకి లేపి, చిరునవ్వు నవ్వి, కన్నుకొట్టి... బాసూ.. ఓవర్‌నైట్ స్టార్ అవ్వడానికి ఇంత చేస్తే చాలు. ప్రియ చేసింది ఇంతే. అంతే.. నిన్న మొన్నటి వరకూ తనెవరో కేరళలో కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్. ఇంత పాపులార్టీ తెచ్చుకున్నది కన్ను కొట్టినందుకు.. అందంగా కొట్టినందుకు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మలయాళీ టీనేజ్ గర్ల్ ఫేమస్. ఆ మాత్రం చాలు ఈ అమ్మాయి యాక్ట్ చేసిన ‘ఒరు అడార్ లవ్’ సినిమా ఫేమస్ అయిపోవడానికి. టీజర్‌తోనే ఇంత సెన్సేషన్ అయింది కాబట్టి ఈసారి ఇంకో టీజర్ వదిలారు. ఇప్పుడు ప్రియా ఏం చేసిందో టీజర్ చూసినవారికి తెలిసే ఉంటుంది. అయినా చెబుతాం. దొండపండులాంటి పెదాల మీద రెండు వేళ్లు పెట్టుకుని ‘మ్చ్’ అంటూ బాయ్‌ఫ్రెండ్‌కి ఓ ముద్దు విసిరింది. అంతేనా.. ఆ రెండు వేళ్లను పెదాల మీద నుంచి తీసేసి, గన్నులా పెట్టి, కన్ను కొట్టి షూట్ చేసేట్లు సైగ చేస్తుంది. అంతే.. అక్కడ ఉన్నది తూటా కాకపోయినా సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్లు ఆ కుర్రాడు ఫీలయ్యాడు. చూసిన కుర్ర హృదయాల్లో డ్రీమ్ గర్ల్ అయి కూర్చుంది ప్రియ. ఈ టీజర్ తనను ఇంతగా పాపులర్ చేస్తుందని ప్రియ ఊహించలేదు. ‘‘ఇంతమంది చూపిస్తున్న ప్రేమను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడంలేదు. ఇది కలా? నిజమా?’’ అనిపిస్తోంది అని ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ప్రియాప్రకాశ్ తన ఇంట్లో తానే ఉండలేకపోతోంది. ఎందుకో తెలుసా? ఎప్పుడెప్పుడు ఈ బ్యూటీ బయటికొస్తుందా? అని ఎదురు చూస్తూ ఇంటి గేటు ముందు పహారా కాస్తున్నారట. అందుకే ప్రియాని ఆమె తల్లి ఇంట్లో నుంచి పంపించేశారు. అయ్యో.. మనసెలా వచ్చింది అనుకుంటున్నారా? మరేం లేదండి. మూడో కంటికి తెలియకుండా ప్రియాని హాస్టల్‌కి పంపించేశారు. అది లేడీస్ హాస్టల్ కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంతకీ ప్రియాప్రకాశ్ ఏం చదువుకుంటోంది? బ్యాగ్రౌండ్ ఏంటి? అంటే.. ప్రియాప్రకాశ్ వారియర్ వయసు 18. ఊరు కేరళలోని త్రిశ్సూరు. అక్కడి విమలా కాలేజీలో బీకామ్ స్టూడెంట్. క్లాసికల్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. మోడలింగ్ అంటే మోజు. అందుకే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మోడలింగ్‌లోకి ఎంటరైంది. పలువురు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ కోసం ర్యాంప్ వాక్ చేసింది. అప్పుడెవరూ ఊహించలేదు. ప్రియా ఓవర్‌నైట్ స్టార్ అవుతుందని. అన్నట్లు టీజర్స్‌లో ప్రియా కూర్చుని కనిపించింది. మరి.. నిలబడితే ఎంత ఎత్తు ఉంటుందంటే.. సుమారు 5 అడుగుల 4 అంగుళాలు. బరువు 50 కేజీలు. ఎత్తుకి తగ్గ బరువు అని చెప్పొచ్చు. అబ్బాయిల గుండెల్లో సునామీ ప్రియా ఫస్ట్ మూవీ ‘ఒరు అడార్ లవ్’ త్వరలో రిలీజ్ కానుంది. టీజర్ ఎఫెక్ట్‌తో మేం కొంటామంటే మేం కొంటామంటూ బయ్యర్లు క్యూలు కట్టారట. బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది. రిలీజ్ తర్వాత టికెట్లు కూడా బ్రహ్మాండంగా తెగుతాయి. అన్నట్లు.. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారు. చిన్నగా మొదలయ్యే చినుకు తుఫానుకి కారణమవుతుంది. అలాగే చిన్ని ఎక్స్ప్రెషన్ కుర్రకారు హృదయాల్లో సునామీ సృష్టించింది. మరోవైపు కొంతమంది హీరోయిన్ల గుండెల్లో అలజడి సృష్టించింది. ప్రియాప్రకాశ్ గట్టి పోటీ అవుతుందని ఇప్పటికే చాలామంది జోస్యం చెబుతున్నారు. ప్రియా.. వాట్యా? వాటీజ్ దిస్ యా? అలవోకగా కనురెప్ప మూసి.. యువత కనురెప్పలు మూతపడకుండా చేశావ్ యా.. యా.. యా..? గుండె దిటవు చేసుకోండి ప్రియాప్రకాశ్ను తొలిసారి చూసి ఇష్టపడిన అమర ప్రేమికుల్లారా.... ‘లవ్ ఎట్ ఫస్ట్ టీజర్’ రోమియోల్లారా... ప్రియా ప్రకాశ్ కోసం గుండెల్లో గుడి కట్టడానికి ముడి సరుకులు తెచ్చుకున్న యువకుల్లారా.... గుండె దిటవు చేసుకోండి. మీరు ఇష్టపడుతున్న ప్రియా రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ కాదట. ‘స్పూఫ్’ వీడియోల హల్చల్ ప్రియా కన్ను కొట్టిన వీడియో చూసి, తమ అభిమాన హీరోలు కన్ను కొట్టిన సీన్‌తో పోల్చి, రెంటినీ కలిపి ఓ వీడియోగా క్రియేట్ చేసి, అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఉదాహరణకు... ∙‘ముత్తు’ సినిమాలో రజనీకాంత్ సిగ్గుపడితూ కన్ను కొట్టే సీన్ ∙‘అతడు’ సినిమాలో కన్ను కొట్టే సీన్లో ‘ఇలా కొట్టు..అలా పడి ఉంటారు’ అని హీరోయిన్ త్రిషకు మహేశ్‌బాబు చెప్పే సీన్‌ను భలేగా ఎడిట్ చేశారు ∙‘తెరీ’ సినిమాలో హీరోయిన్ను చూసి తమిళ హీరో విజయ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ∙‘ఏం మాయ చేసావే’ తమిళ వెర్షన్ ‘విన్నైత్తాండి వరువాయా’ సినిమాలో త్రిషను ఫస్ట్‌టైమ్ చూసినప్పుడు ఎక్స్ప్రెషన్స్ ∙‘ప్రేమమ్’ సినిమాలో నివిన్ పౌలీ హీరోయిన్ సాయిపల్లవిని చూసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్. ఇది ఇప్పటి పాట కాదు విశేషం ఏంటంటే.. ‘ఒరు అడార్ లవ్’ టీజర్ బ్యాగ్రౌండ్లో వినిపిస్తోన్న ‘మాణిక్య మలరాయ పూవీ’ పాట ఈ సినిమా కోసం ఫ్రెష్‌గా రాసింది కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పి.యం జబ్బర్ రాసిన ‘మాపిళ్ల..’ అనే పాటకు స్టైలిష్ వెర్షన్... అదేనండి రీమిక్స్ అని కేరళ టాక్. అక్కడివారి మాటల ప్రకారం ఈ పాటకున్న చరిత్ర అంతా ఇంతా కాదని తెలుస్తోంది. మహమ్మద్ ప్రవక్త మొదటి భార్య ఖజీదా బీవీ గుణాలను వివరిస్తూ జబ్బర్ రాసిన ఈ పాట కేరళలో చాలా ఫేమస్. ఈ పాటను పెళ్లిళ్లు, ఇతర ముఖ్య ఫంక్షన్స్‌లో పాడుకుంటారట. అలా ఒరిజినల్ వెర్ష¯Œ చాలా పాపులర్ అట∙ ఒకవైపు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రియాపై ప్రేమే కాదు ఈ పాటకు ఆగ్రహం కుడా వ్యక్తం చేస్తున్నారు కొందరు. పాట తమ మత మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందంటూ హైదరాబాద్‌లో ఈ చిత్రదర్శకుడు ఒమర్ లులూపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు యువకులు. ∙‘ఒరు అడార్ లవ్’ టీజర్ మాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. స్టార్ హీరోల మూవీ టీజర్ వ్యూస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. 24 గంటల్లో దగ్గర దగ్గర 50 లక్షల మంది చూశారు. గత ఏడాది చివర్లో విడుదలైన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ‘మాస్టర్ పీస్’ టీజర్ కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ దక్కించుకోలేదు. ఆ మాటకొస్తే మలయాళ టీజర్స్‌కి.. అది ఎంత పెద్ద స్టార్‌ది అయినా పది లక్షలు వ్యూస్ దక్కితే అది ఎక్కువ. అలాంటిది ఐదింతలు దక్కించుకుంది ‘ఒరు అడార్ లవ్’. కన్ను కొట్టుడా? మజాకానా? -
ఆ ‘కనుగీటే’ సన్నివేశం ఊహించనిది!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒరు ఆదార్ లవ్’ మలయాళ చిత్రంలో హీరోయిన్ ప్రియా వారియర్ కనుగీటిన సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఒరు ఆదార్ లవ్ అంటే అసాధారణ ప్రేమ అని అర్థం. జూన్ చివరలో విడుదలవుతున్న ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. అందుకని దీన్ని ‘సంగీతభరిత ప్రేమ కథా చిత్రం’ అని పిలవచ్చు. ఈ పాటల వీడియోను ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్లోకి విడుదల చేశారు. అందులోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలోనిదే ప్రియా వారియర్ కనుగీటే సన్నివేశం. 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఐదుగురు హీరోలు, నలుగురు బాలికల మధ్య నడిచే ప్రేమాయణం, వారిచుట్టూ అల్లుకునే స్నేహబంధం, వారి జీవితాల నేపథ్యంలో సినిమా నడుస్తుంది. సినిమాలో రకరకాల ప్రేమను చూపిస్తారు. అందులో అసాధారణ ప్రేమ ఏమిటో ప్రేక్షకులే నిర్ణయించాల్సి ఉంటుంది. మలబారు ప్రాంతం ముస్లిం మహిళలు పాడుకునే ‘మాణిక్య మలరాయ పూవి’ అనే పాటను ఈ సినిమాలో చూపించారు. మొహమ్మద్ ప్రవక్త, ఆయన భార్య ఖదీజా మధ్య నుండే పవిత్ర ప్రేమకథనే ముస్లిం మహిళలు పాటగా పాడుతారు. అయితే ప్రవక్త ప్రేమ కథను చూపించారన్న కారణంగా సినిమాలోని ఈ పాటను నిషేధించాల్సిందిగా కొంత మంది ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై హైదరాబాద్‌లో పోలీసులకు పలువురు ఫిర్యాదు కూడా చేశారు. ‘మాణిక్య మలరాయ పూవి’ పాటను 1978 పీఎంఏ జబ్బర్ రాయగా, తలస్సరీ కే. రెఫీక్ సంగీతం సమకూర్చారు. ఆ పాటంటే తన తల్లికి ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి తాను ఆ పాట వింటూనే పెరిగానని, అందుకనే ఆ పాట హక్కులను కొన్నానని చిత్రం దర్శకుడు ఒమర్ లూలు మీడియాకు తెలిపారు. సంగీత దర్శకులు షాన్ రెహమాన్ మళ్లీ పాటను కంపోజ్ చేయగా, వినీత్ శ్రీనివాసన్ అద్భుతంగా పాడారని ఆయన తెలిపారు. ఊహించిన దానికంటే ఇప్పుడు ఈ పాట పాపులర్ అయిందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు విశేష ఆధరణ లభిస్తోందని చెప్పారు. ప్రవక్త, ఆయన భార్య మధ్య నున్న ప్రేమ గురించి చెప్పడం ఇస్లాంకు వ్యతిరేకమని కొంత మంది వ్యతిరేకిస్తున్నారని, అయితే అలాంటి వారి సంఖ్య చాలా తక్కువని ఆయన అన్నారు. మలబారు ప్రాంతం ముస్లిం మహిళలు మత, ఇతర సామాజిక కార్యక్రమాల సందర్భంగా ప్రవక్త ప్రేమ గురించి పాటలు పాడడం ఇప్పటికీ చూడవచ్చని ఆయన చెప్పారు. ఈ సినిమాలో ప్రియా వారియర్ది చిన్న పాత్రేనని, సినిమా షూటింగ్లో అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన మేరకు ఆమె కనుగీటే సన్నివేశాన్ని షూట్ చేశామని ఒమర్ లూలు తెలిపారు. సన్నివేశం బాగా పండిందని అనుకున్నాంగానీ, ఇంతగా సోషల్ మీడియాను ఆకర్షిస్తుందని ఊహించలేదని ఆయన వివరించారు. ఒమర్ లూలు ఇంతకుముందు తీసిన ‘హాపీ వెడ్డింగ్ (2016)’ ‘చుంక్జ్ (2017)’ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద హిట్టయ్యాయి.