Noorin Shereef Wedding With Actor Fahim Safar; See Photos - Sakshi
Sakshi News home page

Noorin Shereef Wedding: గ్రాండ్‌గా హీరోయిన్ వెడ్డింగ్.. ఫైనల్‌గా ఇన్నాళ్లకు

Published Mon, Jul 24 2023 6:26 PM | Last Updated on Mon, Jul 24 2023 6:42 PM

Noorin Shereef Wedding With Actor Fahim Safar - Sakshi

యంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. తనతో పాటు కలిసి పనిచేసిన ఓ నటుడితో ప్రేమలో పడింది. కొన్ని నెలల ముందు నిశ్చితార్థం చేసుకుంది. ఫైనల్‌గా ఇప్పుడు గ్రాండ్ లెవల్లో జరిగిన వేడుకలో నిఖా చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని స్వయంగా ఆ బ్యూటీనే ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో అవికాస్త ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.

(ఇదీ చదవండి: 'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!)

ప్రియా ప్రకాశ్ వారియర్ 'లవర్స్ డే' (మలయాళంలో 'ఒరు అదార్ లవ్') అనే సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైంది. అయితే ఆ మూవీలో మెయిన్ హీరోయిన్ నూరిన్ షరీఫ్. ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో మలయాళంలో నటిగా స్థిరపడిపోయింది. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె 'చంక్జ్'‌తో నటిగా మారింది. ఒరు అదార్ లవ్, శాంతాక్రూజ్, వెళ్లప్పం, బర్ముడా, ఆన్ ద అదర్ హ్యాండ్ తదితర చిత్రాల్లోనూ నటించింది.

అలా ఓ సినిమాకు పనిచేస్తున్న క్రమంలో యాక్టర్ కమ్ రైటర్ ఫహిమ్ సఫర్, నూరిన్ షరీప్‌కు పరిచయమైంది. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబరులో పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. తిరువనంతపురంలో సోమవారం ఓ వెడ్డింగ్ హాల్‌లో నిఖా చేసుకున్నారు. వీళ్లకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement