మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది. కుర్రాళ్ల మనసుల్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ నటుడితో ఏడడుగులు వేసింది. హల్దీ, సంగీత్ లాంటి వాటిని గ్రాండ్‌గా చేసుకున్నారు. పెళ్లి మాత్రం సంప్రదాయ పద్ధతిలో ఓ గుడిలో సింపుల్‌గా చేసేసుకున్నారు. తాజాగా బుధవారం ఈ పెళ్లి జరగ్గా ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లి కొడుకు ఎవరంటే?
(ఇదీ చదవండి: అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్ దేవరకొండ)
దళపతి 'బీస్ట్' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా దాస్.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఫేమ్ సంపాదించింది. 'దాదా' అనే తమిళ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది తెలుగులో వచ్చిన 'ఆదికేశవ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళంలోనే హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తోంది.
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. కానీ అపర్ణ దాస్ మాత్రం కేవలం 28 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. 'మంజుమ్మల్ బాయ్స్'తో పాటు పలు మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోల్‌ని అపర్ణ పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు హాజరైన పలువురు నటీనటులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment