
మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. సింపుల్‌గా గుడిలో ఏడడుగులు వేసింది. శనివారం ఉదయమే జరిగిన ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం ఈ నటి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
మలయాళ బ్యూటీ మీరా నందన్.. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్ అయింది. 2008లో ఈమెకు సొంత భాషలో తొలి అవకాశమొచ్చింది. అనంతరం తమిళ, తెలుగు, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో 'జై బోలో తెలంగాణ', హితుడు, 4th డిగ్రీ తదితర చిత్రాల్లో యాక్ట్ చేసింది. వీటిలో 'జై బోలో తెలంగాణ'తో ఈమెకు హిట్ దక్కినా ప్రయోజనం లేకుండా పోయింది.

గతేడాది 'ఎన్నలుమ్ ఎంటే ఆలియా' అనే మలయాళ సినిమాలో చివరగా నటించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. ఇప్పుడు శ్రీజు అనే యూకేకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్‍ని పెళ్లి చేసుకుంది. ప్రముఖ గురువాయుర్ దేవాలయంలో వీళ్లు ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని మీరానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)

Comments
Please login to add a commentAdd a comment