
టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి చేసేసుకున్నాడు. 'కేరింత' సినిమాతో నటుడిగా పరిచయమైన విశ్వంత్.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని అతడి భార్య భావన బయటపెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, ఐదు ఫొటోల్ని పోస్ట్ చేయడంతో ఈ వివాహం గురించి అందరికీ తెలిసింది.
(ఇదీ చదవండి: చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్)
సామర్లకోటకు చెందిన విశ్వంత్.. అమెరికాలో ఇంజినీరింగ్ చదువుతున్న టైంలో 'కేరింత' సినిమాలో అవకాశమొచ్చింది. దీంతో చదువు మధ్యలో ఆపేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఈ మూవీ హిట్ కావడంతో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరస ఛాన్స్‌లు వచ్చాయి. అలా 'మనమంతా', 'జెర్సీ', ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ తదితర చిత్రాల్లో నటించాడు.
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలోనూ విశ్వంత్ నటిస్తున్నాడు. ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే భావన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే పెళ్లి ఫొటోలేం బయటపెట్టలేదు. అయితే పలువురు నెటిజన్లు, సహ నటీనటులు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)





Comments
Please login to add a commentAdd a comment