Viswant Duddumpudi
-
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో
టాలీవుడ్లో మరో హీరో పెళ్లి చేసేసుకున్నాడు. 'కేరింత' సినిమాతో నటుడిగా పరిచయమైన విశ్వంత్.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని అతడి భార్య భావన బయటపెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, ఐదు ఫొటోల్ని పోస్ట్ చేయడంతో ఈ వివాహం గురించి అందరికీ తెలిసింది.(ఇదీ చదవండి: చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్)సామర్లకోటకు చెందిన విశ్వంత్.. అమెరికాలో ఇంజినీరింగ్ చదువుతున్న టైంలో 'కేరింత' సినిమాలో అవకాశమొచ్చింది. దీంతో చదువు మధ్యలో ఆపేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఈ మూవీ హిట్ కావడంతో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరస ఛాన్స్‌లు వచ్చాయి. అలా 'మనమంతా', 'జెర్సీ', ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ తదితర చిత్రాల్లో నటించాడు.రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలోనూ విశ్వంత్ నటిస్తున్నాడు. ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే భావన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే పెళ్లి ఫొటోలేం బయటపెట్టలేదు. అయితే పలువురు నెటిజన్లు, సహ నటీనటులు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!) -
‘హైడ్ న్ సీక్’ మూవీ రివ్యూ
టైటిల్: హైడ్ న్ సిక్నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులునిర్మాణ సంస్థ: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారిదర్శకత్వం: బసిరెడ్డి రానాసంగీత దర్శకుడు: లిజో కె జోష్విడుదల తేది: సెప్టెంబర్ 21, 2024కథేంటంటే..కర్నూలుకు చెందిన శివ(విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనుకుంటాడు. తన తండ్రి, బావా ఇద్దరూ ఆర్మీలో పని చేస్తూ దేశం కోసం వీర మరణం పొందుతారు. తాను ఏదో ఒకరకంగా దేశానికి సేవ చేయాలనుకుంటాడు. అక్కతో కలిసి ఉంటూ మెడిసిన్ చదువుతుంటాడు.తోటి విద్యార్థిని వర్ష(రియా సచ్దేవ్)తో ప్రేమలో పడతాడు. వీరి పెళ్లికి వర్ష తండ్రి డాక్టర్ కేకే కూడా ఒప్పుకుంటాడు. ఓ రోజు శివ ఇంటి పక్కన ఒక డెలివరీ బాయ్ హత్యకు గురవుతాడు. ఎవరో అతన్ని రాడ్‌తో కొట్టి చంపుతారు. అయిదే అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేశారు. అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి పోలీసు స్టేషన్‌కి లెటర్ వస్తుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న వైష్ణవి(శిల్ప మంజునాథ్) దాన్ని సిరీయస్‌గా తీసుకోదు. ఈ సమయంలో శివ ఫ్రెండ్ చందు సుసైడ్ చేసుకుంటాడు. ముందు అందరూ దాన్ని సుసైడ్ అనుకుంటారు కానీ శివ మాత్రం అది హత్య అని నమ్ముతాడు. కట్ చేస్తే మీడియాకు అది సూసైడ్ కాదు హత్య అని శివ లెటర్ పంపిస్తాడు. దాంతో ఆ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది. పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఆ తరువాత ఈ కేసులో శివను ఫ్రేమ్ చేస్తారు. దాంతో శివ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. శివను ఎందుకు కార్నర్ చేశారు? ఎవరు చేశారు? అసలు కర్నూలులో వరుస హత్యలు చేస్తుందన్నదెవరు? వాళ్ల లక్ష్యం ఏంటి? చివరకు పోలీసులు అధికారి వైష్ణవి ఈ కేసును ఎలా డీల్ చేసింది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఈ మధ్య పిల్లలు చాలా మంది మొబైల్ గేమ్స్‌కి బాగా అలవాటు పడ్డారు. ఆ మధ్య పబ్జీ, బ్యూవేల్ గేమ్‌లాంటి గేమ్స్ బాగా ట్రెండ్ అయింది. అలాంటి గేమ్స్‌కి కొంతమంది యువకులు బానిసలై ప్రాణాలను సైతం కోల్పోయారు. కొంతమంది క్రిమినల్స్‌గా మారారు. గేమ్ కోసం సొంతవాళ్లను దారుణంగా హత్య చేసిన ఘటనలు జరిగాయి. అలాంటి ఆన్లైన్ గేమింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘హైడ్ న్ సిక్’, ఆన్లైన్ గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి జీవితాలతో ఎలా ఆడుకుంటుందో ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.దటి మర్డర్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహకు అందనట్లుగా చాలా క్రియేటీవ్ గా తెరకెక్కించారు. అయితే సెకండ్ ఆఫ్ లో సినిమా కాస్త స్లో అవుతుంది. కొంత సేపటికి మళ్లీ వేగం పుంజుకుంటుంది. అసలు మర్డర్ల వెనుక ఎవరు ఉన్నారు అనేది ఎవరు ఊహించని ఒక ట్విస్ట్. అయితే ఈ మర్డర్లను ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే విషయాలతో పాటు ఏ పద్దతిలో చేస్తున్నారు. అనేది పూరాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం మెప్పించింది. మారణహోమం జరిగితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనకు ప్రేక్షకుడిని తీసుకెళ్లి భయపెట్టిస్తుంది. తరువాత మర్డర్ ఎక్కడ ఎలా చేయబోతున్నారు అనే విషయాన్ని కనుగోనే పద్దతి మెప్పించింది. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి ఈ చిత్రంలో. ప్రీ క్లైమాక్స్ తరువాత మళ్లీ సినిమా వేగం పెరగుతుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఇది రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాల లాగా ఉండదు. క్లైమాక్స్ కూడా చాలా స్మూత్ గా హ్యండిల్ చేశారు. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు లవర్ బాయ్‌గా అలరించిన విశ్వంత్ హైడ్ న్ సిక్ చిత్రంలో ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించారు. బాధ్యతగల తమ్ముడిగా, స్టూడెంట్ గా ఫ్రెండ్ కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్ గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. విశ్వంత్ తరువాత పోలీసు క్యారెక్టర్ చేసిన శిల్పా మంజునాథ్ మంచి మార్కులు వేసుకుంది. ఆఫీసర్ గా తన లుక్స్ చాలా బాగున్నాయి. తన ఫేస్ లో సీరియస్ నెస్ ను మెయింటైన్ చేస్తూనే ఒక సీన్లో ఎమోషనల్ సీన్ అద్భుతంగా పండించింది. అలాగే ఇందులో కేకే క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టుకు తక్కువ స్పేస్ ఉంది కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర. ఉన్నంతలో మెప్పించారు. అలాగే మిగితా ఆర్టిస్టుల అంతా వారి వారి పాత్రల మేరకు అద్భుతంగా చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. లిజో కె జోష్ నేపథ్య సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటో గ్రాఫర్ చిన్న రామ్ తనకు ఉన్నంతలో బాగాచేశారు.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.