kerintha movie
-
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో
టాలీవుడ్లో మరో హీరో పెళ్లి చేసేసుకున్నాడు. 'కేరింత' సినిమాతో నటుడిగా పరిచయమైన విశ్వంత్.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని అతడి భార్య భావన బయటపెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, ఐదు ఫొటోల్ని పోస్ట్ చేయడంతో ఈ వివాహం గురించి అందరికీ తెలిసింది.(ఇదీ చదవండి: చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్)సామర్లకోటకు చెందిన విశ్వంత్.. అమెరికాలో ఇంజినీరింగ్ చదువుతున్న టైంలో 'కేరింత' సినిమాలో అవకాశమొచ్చింది. దీంతో చదువు మధ్యలో ఆపేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఈ మూవీ హిట్ కావడంతో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరస ఛాన్స్‌లు వచ్చాయి. అలా 'మనమంతా', 'జెర్సీ', ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ తదితర చిత్రాల్లో నటించాడు.రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలోనూ విశ్వంత్ నటిస్తున్నాడు. ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే భావన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే పెళ్లి ఫొటోలేం బయటపెట్టలేదు. అయితే పలువురు నెటిజన్లు, సహ నటీనటులు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!) -
'కూరగాయలు అమ్మేదాన్ని ఎలా చేశావ్ బ్రో'.. ఆసక్తిగా ట్రైలర్!
కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తోన్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బీ2పీ స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో పార్వతీశం మాట్లాడుతూ.. 'ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. కేరింత తర్వాత మంచి హిట్ కొట్టలేకపోయాను. వరుస ఫ్లాప్‌లతో చాలా డిప్రెషన్లో ఉన్నా. అప్పుడే మనోడు ముఖేష్ నాకు కథ చెప్పాడు. మొదట్లో దర్శకుడిపై నమ్మకం లేదు. కానీ 4-5 రోజుల షూటింగ్ తర్వాత అతనిపై నాకు నమ్మకం ఏర్పడింది. కేరింత చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చిందో అదే విధంగా మార్కెట్ మహాలక్ష్మికి కూడా వస్తుందని నమ్ముతున్నా.' అని అన్నారు. హీరోయిన్ ప్రణీకాన్విక మాట్లాడుతూ..'తెలుగులో ఇది నా మొదటి సినిమా. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ని చూస్తున్నా. మంచి టాలెంట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. మార్కెట్ మహాలక్ష్మిలో నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది' అని అన్నారు. ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. "మార్కెట్ మహాలక్ష్మిలో నేను రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. పార్వతీశం, ప్రణీకాన్వికతో నా కాంబినేషన్ సీన్స్ నవ్విస్తాయి. దర్శకుడు నా క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. మార్కెట్ మహాలక్ష్మిని థియేటర్లలో చూసి మా టీమ్‌కి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకి థాంక్స్" చెప్పారు. డైరెక్టర్ వీఎస్ ముఖేష్' మాట్లాడుతూ.. ‘నేను కథ రాసుకున్నప్పుడు టైటిల్ వెంటనే తట్టింది మార్కెట్ మహాలక్ష్మి. అప్పుడే ఫిక్స్ అయ్యా. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి హీరోలు, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు అయితే బాగుంటుంది. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా తీసుకోలేకపోయామని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జో ఎన్మవ్ సంగీతమందిస్తున్నారు. -
'కేరింత' మూవీ నటి సుకృతి అంబటి పెళ్లి (ఫొటోలు)
-
పెళ్లి పీటలెక్కిన 'కేరింత' హీరోయిన్.. ఫోటోలు వైరల్
'కేరింత' సినిమా నటి సుకృతి అలియాస్ భావనా పెళ్లిపీటలు ఎక్కింది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడింది. బంధువులు, కుటుంసభ్యుల సమక్షంలో సోమవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కేరింత సినిమాతో ఇండస్ట్రీకి పరిచమయైన సుకృతి చేసింది ఒక్క సినిమా అయినా తన నటనతో మెప్పించింది.సుకృతి కంటే భావన గానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సుమంత అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నూకరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌గా సుకృతి నటన ఆకట్టుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ కేరింత సినిమా తర్వాత సుకృతి సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. ఇటీవలె ప్రీ వెడ్డింగ్ ఫోటోలను సైతం పంచుకుంది. View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) -
ఘనంగా కేరింత నటి నిశ్చితార్థం
కేరింత నటి సుకృతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. సుకృతి అంటే అందరికీ పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ భావన.. అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కేరింత సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న సుకృతి ఆ తర్వాత మాత్రం ఒక్క మూవీ కూడా చేయకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇదిలా ఉంటే తాజాగా సుకృతి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అక్షయ్ సింగ్‌తో ఆమె పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ మేరకు సుకృతి, అక్షయ్ ఎంగేజ్మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా సుకృతి భావోద్వేగానికి లోనైంది. 'నా ప్రపంచం నాన్న. భయపడినప్పుడు నా భుజం తట్టుతూ, నన్ను సంతోషపరుస్తూ, నా చేయి పట్టుకుని నడిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నాడు. ఎప్పుడూ ఉత్తమ నాన్నలాగే ప్రవర్తించాడు. ఐదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అమ్మ ప్రేమను సైతం తానే అందించాడు. సింగిల్ పేరెంట్‌గా ఉండటం అంత సులువేం కాదు. నాకు తెలిసిన బలమైన వ్యక్తివి నువ్వే నాన్న.. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) View this post on Instagram A post shared by Akshay Singh (@singhakshay) View this post on Instagram A post shared by Akshay Singh (@singhakshay) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) చదవండి: యంగ్ హీరోస్ డేరింగ్ స్టెప్స్.. ఒక్కసారిగా మారిన ప్లానింగ్ పక్షవాతం బారిన జస్టిన్ బీబర్, వీడియో వదిలిన స్టార్ సింగర్ -
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా కొత్త చిత్రం
కేరింత ఫేమ్ పార్వతీశం, ఐశ్యర్య హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ హరియాల, శ్రీమతి తాలబత్తుల మాధవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకటరమణ ఎస్. మాట్లాడుతూ...ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి, ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. మంచి సామాజిక సందేశంతో పాటు ఓ విభిన్నమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అన్నారు. ‘సమాజాన్ని, సమాజాన్ని పాలించే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే చిత్రమిది. సామాజిక సందేశాన్ని ప్రేమకథతో మిళితం చేసి ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది’అని నిర్మాత సిద్దార్థ హరియాల అన్నారు. రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘కేరింత’ నటుడు విశ్వంత్‌కు నోటీసులు
సాక్షి, బంజారాహీల్స్: డిస్కౌంట్లో కారు ఇప్పిస్తానని ఓ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఘటనలో సినిమా హీరో విశ్వంత్ (కేరింత,మనసంతా, ఓ పిట్టకథఫేమ్) కు బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) కింద నోటీసులు అందజేశారు. ఈ కేసులో విచారణ కోసం హాజరుకావాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే... రామకృష్ణ అనే వ్యాపారి కారు కొనేందుకు స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ అధినేత ఆత్మకూరి ఆకాష్ గౌడ్ ద్వారా రూ. 25 లక్షల విలువచేసే ఇన్నోవా క్రిస్టా కారును రూ.17.60 లక్షలకు ఇప్పిస్తానని హీరో విశ్వంత్ నమ్మించాడు. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. మరో నెల తర్వాత రూ. 2.50 లక్షలు ఇచ్చి కారు తీసుకున్నాడు. నెల రోజుల్లో ఈ కారును రామకృష్ణ పేరు మీదికి మారి్పస్తానని, అప్పుడు మిగతా డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. రెండు నెలలుదాటినా కారు బదిలీ కాలేదు. ఆరా తీయగా ఆ కారుపై రూ.20 లక్షల అప్పుతీసుకున్నట్లు తెలిసింది. హీరో విశ్వంత్, ఆయన తండ్రి లక్షి్మకుమార్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపోలీసులు నోటీసు జారీ చేశారు. కాగా విశ్వంత్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ మూవీలో విశ్వంత్ సెకండ్ హీరోగా నటించి టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మలయాళ నటుడు మోహన్‌లాల్, గౌతమిలు నటించిన ‘మనమంతా’లో నటించాడు. అనంతరం ఇటీవల వచ్చిన ‘ఓ పిట్టకథ’ మూవీతో పాలు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటించాడు. కాగా కాకినాడ సామర్లకోటకు చెందిన అతడు పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాద్‌లో.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూర్‌లో పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే విశ్వంత్‌కు 2015లో ‘కేరింత’లో నటించే అవకాశం వచ్చింది. -
విజయవాడలో 'కేరింత'
విజయవాడ: చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న 'కేరింత' సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులను ప్రత్యక్షంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత 'దిల్'రాజు అన్నారు. తాజాగా శనివారం విజయవాడలోని పీవీఆర్ సినీమాల్లో 'కేరింత' యూనిట్ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సుమంత్ అశ్విన్‌తో పాటు నటీనటులు పాల్గొన్నారు. -
'కేరింత' బృందంపై కోడిగుడ్ల దాడి
శ్రీకాకుళం: విజయ యాత్ర చేస్తున్న 'కేరింత' చిత్ర బృందానికి శ్రీకాకుళంలో చేదుఅనుభవం ఎదురైంది. శ్రీకాకుళం భాష, యాసను కించపరిచారనే ఆగ్రహంతో చిత్రబృందానికి వ్యతిరేకంగా స్థానిక ధియేటర్ వద్ద ఏబీపీవీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిర్మాత దిల్ రాజు, హీరో సుమంత్ అశ్విన్ కార్లపై కోడిగుడ్లు విసిరారు. తమ ప్రాంత భాష, యాసను కించపరిస్తే సహించబోమని విద్యార్థులు హెచ్చరించారు. దిల్ రాజు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 'కేరింత' సినిమాలో సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ముఖ్యతారలు. అడివి సాయికిరణ్ దర్శకుడు.