
'కేరింత' సినిమా నటి సుకృతి అలియాస్ భావనా పెళ్లిపీటలు ఎక్కింది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడింది. బంధువులు, కుటుంసభ్యుల సమక్షంలో సోమవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా కేరింత సినిమాతో ఇండస్ట్రీకి పరిచమయైన సుకృతి చేసింది ఒక్క సినిమా అయినా తన నటనతో మెప్పించింది.సుకృతి కంటే భావన గానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సుమంత అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నూకరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌గా సుకృతి నటన ఆకట్టుకుంది.
అయితే ఏమైందో ఏమో కానీ కేరింత సినిమా తర్వాత సుకృతి సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. ఇటీవలె ప్రీ వెడ్డింగ్ ఫోటోలను సైతం పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment