
కేరింత నటి సుకృతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. సుకృతి అంటే అందరికీ పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ భావన.. అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కేరింత సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న సుకృతి ఆ తర్వాత మాత్రం ఒక్క మూవీ కూడా చేయకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది.
ఇదిలా ఉంటే తాజాగా సుకృతి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అక్షయ్ సింగ్‌తో ఆమె పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ మేరకు సుకృతి, అక్షయ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా సుకృతి భావోద్వేగానికి లోనైంది. 'నా ప్రపంచం నాన్న. భయపడినప్పుడు నా భుజం తట్టుతూ, నన్ను సంతోషపరుస్తూ, నా చేయి పట్టుకుని నడిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నాడు. ఎప్పుడూ ఉత్తమ నాన్నలాగే ప్రవర్తించాడు. ఐదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అమ్మ ప్రేమను సైతం తానే అందించాడు. సింగిల్ పేరెంట్‌గా ఉండటం అంత సులువేం కాదు. నాకు తెలిసిన బలమైన వ్యక్తివి నువ్వే నాన్న.. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్' అని రాసుకొచ్చింది.
చదవండి: యంగ్ హీరోస్ డేరింగ్ స్టెప్స్.. ఒక్కసారిగా మారిన ప్లానింగ్
పక్షవాతం బారిన జస్టిన్ బీబర్, వీడియో వదిలిన స్టార్ సింగర్
Comments
Please login to add a commentAdd a comment