సాక్షి, బంజారాహీల్స్: డిస్కౌంట్‌లో కారు ఇప్పిస్తానని ఓ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఘటనలో సినిమా హీరో విశ్వంత్ (కేరింత,మనసంతా, ఓ పిట్టకథఫేమ్) కు బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) కింద నోటీసులు అందజేశారు. ఈ కేసులో విచారణ కోసం హాజరుకావాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే... రామకృష్ణ అనే వ్యాపారి కారు కొనేందుకు స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ అధినేత ఆత్మకూరి ఆకాష్ గౌడ్ ద్వారా రూ. 25 లక్షల విలువచేసే ఇన్నోవా క్రిస్టా కారును రూ.17.60 లక్షలకు ఇప్పిస్తానని హీరో విశ్వంత్ నమ్మించాడు. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. మరో నెల తర్వాత రూ. 2.50 లక్షలు ఇచ్చి కారు తీసుకున్నాడు. నెల రోజుల్లో ఈ కారును రామకృష్ణ పేరు మీదికి మారి్పస్తానని, అప్పుడు మిగతా డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. రెండు నెలలుదాటినా కారు బదిలీ కాలేదు. ఆరా తీయగా ఆ కారుపై రూ.20 లక్షల అప్పుతీసుకున్నట్లు తెలిసింది.
హీరో విశ్వంత్, ఆయన తండ్రి లక్షి్మకుమార్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపోలీసులు నోటీసు జారీ చేశారు. కాగా విశ్వంత్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ మూవీలో విశ్వంత్ సెకండ్ హీరోగా నటించి టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మలయాళ నటుడు మోహన్‌లాల్, గౌతమిలు నటించిన ‘మనమంతా’లో నటించాడు. అనంతరం ఇటీవల వచ్చిన ‘ఓ పిట్టకథ’ మూవీతో పాలు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటించాడు. కాగా కాకినాడ సామర్లకోటకు చెందిన అతడు పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాద్‌లో.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూర్‌లో పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే విశ్వంత్‌కు 2015లో ‘కేరింత’లో నటించే అవకాశం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment