Cheating case filed
-
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు
బంజారాహిల్స్: ఇంటీరియర్ వర్క్ చేయించుకొని తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు కోరె నందుకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన డాగా శ్రీనివాస్ కుమార్.. ఇంటీరియర్, ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఫిలింనగర్లో ఫిల్మీ జంక్షన్‌లోని డక్కన్ కిచెన్‌లో ఇంటీరియర్ వర్క్ కోసం శ్రీనివాస్‌తో నందు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది మేలో ఫ్యాబ్రికేషన్, సివిల్ వర్క్ పూర్తి చేసి రూ.27 లక్షల బిల్లు అందజేశారు. ఇందులో రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చిన నందు మిగతా మొత్తాన్ని త్వరలో ఇస్తానని చెప్పాడు. తర్వాత మిగతా రూ.17 లక్షలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు -
స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు
Nawazuddin Siddiqui Wife Aaliya Siddiqui: విలక్షణ పాత్రలతో బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. పాజిటివ్, నెగెటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్నాడు. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. సీరియస్ మెన్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఎమ్మీ అవార్డ్‌కు సైతం నామినేట్ అయిన నవాజుద్దీన్.. థాక్రే, మాంటో, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, భజరంగీ భాయిజాన్, బదలాపూర్, మాన్సూన్ షూట్ అవుట్ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా నవాజుద్ధీన్ భార్య ఆలియా సిద్దిఖీపై కేసు నమోదైంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం 'హోలీ కౌ' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి నవాజుద్దీన్ సతీమణి ఆలియా సిద్దిఖీ నిర్మాతగా వ్యవహరిస్తోంది. మంజు అగర్వాల్ అనే యువతి నుంచి ఆలియా రూ. 31 లక్షలను అప్పుగా తీసుకుందని, తర్వాత అడిగితే సరిగ్గా స్పందింట్లేదని తెలుస్తోంది. దీంతో జూన్ 20న అంబోలి పోలీస్ స్టేషన్లో మంజు అగర్వాల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ''ఆలియాతో నాకు 2005 నుంచి పరిచయముంది. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె చాలా కాలం నుంచి నిర్మాతగా మారాలని ఎదురుచూస్తోంది. ఇక పరిస్థితులు అనుకూలించడంతో 'హోలీ కౌ' చిత్రంతో నిర్మాతగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రియేటివ్ పనులు చూసుకోమ్మని, ఆర్థిక విషయాలను ఆమె చూసుకుంటానని చెప్పింది. దీంతో నటీనటుల విషయాలను నేను చూసుకున్నాను. కానీ వారికి చెల్లించాల్సిన చెక్కులు కొంతకాలానికే బౌన్స్ అయ్యాయి. దీంతో ఆలియాకు కొంచెం డబ్బులు అవసరం కావడంతో మా నాన్నను అడిగింది. ఉజ్జయినిలోని ఓ ఇంటిని అమ్మి ఆమెకు డబ్బు ఇచ్చారు మా నాన్న. నెల రోజుల్లోనే తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా ఆమె డబ్బు తిరిగి ఇవ్వలేదు'' అని మంజు అగర్వాల్ పేర్కొంది. -
Big Breaking News: నిర్మాత బెల్లంకొండ సురేష్ పై చీటింగ్ కేసు
-
నెల్లూరు: ఈఎంఐ కట్టాలని మెసేజ్.. వెలుగులోకి ఎస్బీఐ ఉద్యోగి మోసం
సాక్షి, నెల్లూరు: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటగిరి బ్రాంచిలో పనిచేస్తున్న షేక్ రబ్బానీ అనే ఉద్యోగి (క్లర్క్) ఓ ఖాతాదారునికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్‌పై సదరు ఖాతాదారునికి తెలియకుండా రుణం తీసుకున్న కేసుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా మరో ఇద్దరి అకౌంట్ల నుంచి లోన్ కింద రూ.9.26 లక్షలు డ్రా చేసుకున్న కేసులో నిందితుడు రబ్బానీని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగమల్లేశ్వరరావు కథనం మేరకు.. వెంకటగిరి ఎస్బీఐలో పనిచేస్తున్న క్లర్క్ రబ్బానీ తన తల్లి, తమ్ముడు, స్నేహితుడిపై ఉన్న మూడు ఖాతా లను రాపూరు ఎస్బీఐ బ్రాంచ్ నుంచి వెంకటగిరి బ్రాంచ్‌కు మార్చుకున్నాడు. బ్యాంక్ ఉద్యోగి అయిన రబ్బానీ ఆ కౌంట్లకు ఉన్న పరిమితులను కార్పొరేట్ తరహాగా మార్చుకుని వాటిలో ఓ అకౌంట్ నుంచి రూ.3.22 లక్షలు, మరో అకౌంట్ నుంచి రూ.6.02 లక్షలను రుణం కింద తీసుకున్నాడని తెలిపారు. ఇక బ్యాంక్‌కు వచ్చిన ఓ ఖాతాదారుడికి ఓ యాప్ ద్వారా రబ్బానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు. అయితే ఖాతాదారుడికి తెలియకుండా ఆ ఫిక్స్డ్ డిపాజిట్‌పై రబ్బానీ రూ.1.35 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ రుణంకు సంబంధించి ఈఎంఐ కట్టాలని మెసేజ్ ఖాతాదారుడికి వెళ్లింది. దీంతో తాను తీసుకోని రుణంకు వాయిదా చెల్లించాలంటూ మెసేజ్ రావడంపై ఆయన బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించాడు. ఈ వ్యవహారంపై బ్యాంక్‌లో విజిలెన్స్ విచారణ జరిపి మోసాలకు కారణమైన రబ్బానీపై బ్యాంక్ మేనేజర్ ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు ఆదివారం నిందితుడు రబ్బానీని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. చదవండి: అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌కు షాక్.. పాన్ కార్డుపై అప్పటికే.. ఉత్తుత్తి బ్యాంక్: ఓటీపీ చెప్పాడు.. క్షణాల్లోనే రూ.1,64,612 మాయం -
శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై చీటింగ్ కేసు
Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై లక్నోలోని రెండు పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్‌గంజ్, విభూతిఖండ్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఎర్పడి విచారణ చేపట్టారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్ సుమన్ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం ముంబై చేరుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శిల్పాశెట్టి అయోసిస్ వెల్నెస్ అండ్ స్పా పేరుతో ఫిటినెస్ సెంటర్‌ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫిట్నెస్ సెంటర్ మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి వారు ఫ్రాంచెజ్ ఇచ్చి, సెంటర్‌ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. డీసీసీ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ.. ఈ విషయం ఉన్నత స్థాయికి చేరిందని, అందువల్ల పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. -
ఇసుక రీచ్‌ల పేరిట భారీ మోసం: రూ.కోట్లకు టోకరా
సాక్షి, అమరావతి: ఏపీలో ఇసుక రీచ్‌ల పేరిట ఓ వ్యక్తి భారీ మోసాకి పాల్పడ్డాడు. ఇసుక రీచ్‌లకు సంబంధించి తవ్వకాల సబ్ లీజులు ఇస్తానని చెప్పి రూ.కోట్లకు టోకరా వేశాడు. వివిధ జిల్లాలకు చెందిన ఏడుగురి నుంచి రూ.3.50 కోట్లు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ కేటుగాడు గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సంతకం ఫోర్జరీ చేశాడు. సంతకం ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ మోసాలకు తెగపడ్డాడు. జేపీ గ్రూప్ నుంచి తాను సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్నట్లు నమ్మబలికాడు. ఈ విషయంపై జేపీ గ్రూప్ మేనేజర్ హర్షకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన విజయవాడ భవానీపురం పోలీసులు నిందితుడు కాకినాడకు చెందిన సతీష్‌కుమార్‌గా గుర్తించారు. నిందితుడు సతీష్‌పై 471, 420, 465, 469, 471, 120(బి) సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు బ్యాంక్ అకౌంట్లో రూ.2 కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి -
అతడు నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్
బెంగుళూరు : శాండిల్ వుడ్లో గతేడాది వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో హీరోయిన్ సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు ఆమె జైలు శిక్ష అనుభవించింది. తాజాగా సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిఖిల్ హెగ్డే అనే బిజినెస్‌మెన్‌పై చీటింగ్ కేసు పెట్టడమే ఇందుకు కారణం. ఇందులో కర్ణాటకలోని కోరమంగలలో 2016లో కేఫ్ పెట్టాలని నిఖిల్ హెగ్డే ఆశ్రయించాడని,ఇందుకు గానూ తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అగ్రిమెంట్ ప్రకారం.. ప్రతీ నెలా తనకు లక్ష రూపాయలు చెల్లించాలని, అయితే ఇప్పటివరకు పేమెంట్ చేయలేదని నిక్కీ గల్రానీ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా నా ఫోన్‌కాల్స్‌కు సైతం సమాధానం ఇవ్వడం లేదని పేర్కొంది. నిక్కీ గల్రానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాలని అతడికి నోటీసులు పంపారు. కాగా 2014లో సినీ ఇండసస్స్ర్టీలోకి అడుగుపెట్టిన నిక్కీ గల్రానీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది. చదవండి : జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్ ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా! -
యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి...
నల్లగొండ : ఉద్యోగాలు ఇప్పిస్తామని, జ్యోతిష్యం పేరిట ప్రజలను నిండా ముంచిన విజయవాడలోని భవానీపురంకు చెందిన కోనాల అచ్చిరెడ్డిని ఆదివారం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశాడని నల్లగొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన సమ్మినేని సాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అచ్చిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు మరిన్ని విషయాలు తెలిశాయి. ఖమ్మంకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్వేర్ కంపెనీలో వాటా ఇస్తానని రూ.50లక్షల తీసుకుని మోసం చేసిన కేసులో ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో గత ఏడాది కేసు నమోదు చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన మరో మహిళకు రైల్వేలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు మోసం చేసిన విషయంలో విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన ఒక మహిళను టీవీలో యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి రూ.25లక్షలు మోసం చేసిన కేసులో భవానీపురం స్టేషన్లోనే మరో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నల్లగొండలో జ్యోతిష్యం పేరిట మరో వ్యక్తి దగ్గర రూ.4లక్షలు తీసుకొని మోసం చేసినట్లు తెలిసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని, జ్యోతిష్యం పేరిట మోసపోయిన వారు ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. -
‘కేరింత’ నటుడు విశ్వంత్‌కు నోటీసులు
సాక్షి, బంజారాహీల్స్: డిస్కౌంట్లో కారు ఇప్పిస్తానని ఓ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఘటనలో సినిమా హీరో విశ్వంత్ (కేరింత,మనసంతా, ఓ పిట్టకథఫేమ్) కు బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) కింద నోటీసులు అందజేశారు. ఈ కేసులో విచారణ కోసం హాజరుకావాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే... రామకృష్ణ అనే వ్యాపారి కారు కొనేందుకు స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ అధినేత ఆత్మకూరి ఆకాష్ గౌడ్ ద్వారా రూ. 25 లక్షల విలువచేసే ఇన్నోవా క్రిస్టా కారును రూ.17.60 లక్షలకు ఇప్పిస్తానని హీరో విశ్వంత్ నమ్మించాడు. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. మరో నెల తర్వాత రూ. 2.50 లక్షలు ఇచ్చి కారు తీసుకున్నాడు. నెల రోజుల్లో ఈ కారును రామకృష్ణ పేరు మీదికి మారి్పస్తానని, అప్పుడు మిగతా డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. రెండు నెలలుదాటినా కారు బదిలీ కాలేదు. ఆరా తీయగా ఆ కారుపై రూ.20 లక్షల అప్పుతీసుకున్నట్లు తెలిసింది. హీరో విశ్వంత్, ఆయన తండ్రి లక్షి్మకుమార్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపోలీసులు నోటీసు జారీ చేశారు. కాగా విశ్వంత్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ మూవీలో విశ్వంత్ సెకండ్ హీరోగా నటించి టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మలయాళ నటుడు మోహన్‌లాల్, గౌతమిలు నటించిన ‘మనమంతా’లో నటించాడు. అనంతరం ఇటీవల వచ్చిన ‘ఓ పిట్టకథ’ మూవీతో పాలు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటించాడు. కాగా కాకినాడ సామర్లకోటకు చెందిన అతడు పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాద్‌లో.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూర్‌లో పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే విశ్వంత్‌కు 2015లో ‘కేరింత’లో నటించే అవకాశం వచ్చింది. -
స్కీం పేరిట మోసం!
విజయనగరం,వేపాడ: వారం వారం కొంత మొత్తం కడితే గృహోపకరణాలు ఇస్తామంటూ ఆకర్షిస్తూ మహిళలను మోసం చేసిన మరో స్కీం బాగోతం వెలుగులోకి వచ్చింది. తొలుత డబ్బులు కట్టిన వారికి చిన్నచిన్న వస్తువులు ఇచ్చి నమ్మించి తరువాత పెద్ద మొత్తంలో వసూలు చేసి చేతులెత్తేసిన వైనం బయటపడింది. బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రమైన వేపాడ, వల్లంపూడి గ్రామాల్లోకి ఏడు వారాల కిందట శ్రీసిద్ధి వినాయక ఈజీ ఇన్స్టాల్మెంట్ స్కీం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళలను మోసపుచ్చారు. మొత్తం 19 వారాలు స్కీం ఉంటుందని మొదటి వారం రూ.30, రెండో వారం రూ.50, మూడో వారం రూ.100 ఇలా వారానికి రూ.50లు పెంచుకుంటూ ఏడు వారాలు, ఎనిమిదో వారం నుంచి వారానికొక రూపాయి చొప్పులు పెంచుకుతూ 17వ వారం వరకు, 18, 19 వారాల్లో రూ.పది పెంచి రూ.320, 330 కట్టాలంటూ... ఇందులో 201 మంది సభ్యులు ఉంటారని స్కీం లబ్ధిదారులను ఆకర్షించి కార్డులు అందజేశారు. ప్రతీ వారం డ్రా తీసి విజేతలకు దుప్పట్లు మొదటి వారం ఇచ్చారని, రెండో వారం నుంచి బహుమతులు ఇవ్వడానికి కరోనా అడ్డంకిగా మారిందని నమ్మబలికారు. ఇలా ఏడు వారాలు నమ్మించి డబ్బులు కట్టించుకుని ఏడో వారంలో అదనపు సొమ్ము కడితే వస్తువులు ఇంటికి తెచ్చి ఇస్తామంటూ నమ్మబలికి పలువురి నుంచి రూ.2వేల నుంచి నాలుగు వేల వరకు కార్డుకు అదనంగా వసూలు చేశారని వల్లంపూడిలోని యాతపేటకు చెందిన బాధితులు శెట్టి ఈశ్వరమ్మ, శెట్టి సత్యవతి, కక్కల భవానీ, కక్కల భారతి, గొర్లె ఈశ్వరమ్మ, కక్కర రమణమ్మ, శెట్టి వెంకటరమణ తదితరులు తెలిపారు. ఆగస్టు 1న సొమ్ము తీసుకువెళ్లిన వ్యక్తులు ఎనిమిదో తేదీకి వస్తామని చెప్పి రాకపోవడంతో 15వ తేదీన ఫోన్లు చేస్తే పలకపోవడంతో తామంతా మోసపోయినట్టు గుర్తించి లబోదిబోమంటున్నారు. స్కీం కార్డుపై ప్రొ.గౌరీశంకర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, డోర్ నంబరు 16 – 20 – ఇ/ఏ అని రబ్బరు స్టాంప్ తప్ప ఊరు పేరు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కట్టించుకున్న వారు పలువురు కొత్తవలస, ఎస్.కోట అని చెప్పారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించనున్నట్టు చెప్పారు. అదనంగా 20వేలు కట్టాం.. మా ఇంట్లో ఐదు కార్డులు కట్టాం. ఏడు వారాల తరువాత వస్తువులిస్తామంటే అదనంగా రూ.20వేలు కట్టాను. తీరా ఇప్పుడు కనిపించకుండా పోయారు. మాతో పాటు చాలా మంది ఉన్నారు. ఫోన్ నంబరుకు చేస్తుంటే అందుబాటులో లేదని చెబుతోంది. – శెట్టి వెంకటరమణ, వల్లంపూడి వస్తువు సమకూర్చుకుందామని.. స్కీం డబ్బులు కట్టి మోసపోయా.. స్కీం కాకుండా అదనంగా రూ.800 కట్టాను. మా తోటికోడలు భారతి డబుల్‌కాట్ మంచం కోసం అదనంగా రూ.నాలుగు వేలు కట్టింది. మోసం చేశారు. – కక్కల భవానీ, వల్లంపూడి -
ఎంబీఎస్ జ్యువెలరీ అధినేతపై ఛీటింగ్ కేసు
-
‘ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలి’
సాక్షి, గన్నవరం : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నకిలీ ఇళ్ల పట్టాలు పంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికను రద్దుచేయాలని బాపులపాడు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దుట్టా శివనారాయణ డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం పార్టీ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యురు గ్రామాల్లో మండల రెవిన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు ప్రజలను మోసం చేసిన వంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గన్నవరం మండల కన్వినర్ తులిమిల్లి ఝాన్సీలక్ష్మీ మాట్లాడుతూ నకిలీ పట్టాల పంపిణీపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా సహకరించ లేదని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళ్లామని, విచారించి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. వల్లభనేని వంశీ నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైన విషయం తెలిసిందే. చదవండి: గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు -
సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్
సాక్షి, గుంటూరు : ప్రముఖుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు అనే యువకుడు గుంటూరులోని ఓ మొబైల్ షోరూమ్ యజమానికి ఫోన్‌చేసి తాను సీఎం పీఏ అని పరిచయం చేసుకున్నాడు. ఓ క్రికెటర్‌కి రూ.3 లక్షలు స్పాన్సర్ చేయాలంటూ ఆదేశాలు జారీచేశాడు. మరి కొద్దిసేపట్లో ఆ క్రికెటర్ షోరూమ్ దగ్గరకి వస్తాడని తెలిపాడు. కాసేపటి తర్వాత తీరిగ్గా నాగరాజే షోరూమ్‌కు వెళ్లి సీఎం పీఏ పంపించాడంటూ డబ్బులు డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన షోరూమ్ యజమాని అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాగరాజు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహాలో చాలా మోసాలకు పాల్పడ్డాడని నిర్ధారణ చేసుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
ఆడపిల్లలు పుట్టారని వదిలించుకున్నాడు..
పంజగుట్ట: వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని తన భర్త తనను వదిలేసి మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడని అంబర్‌పేటకు చెందిన బాధితురాలు ప్రియాంక వాపోయింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తల్లి సుధతో కలిసి వివరాలు వెల్లడించింది. ఇంటిలిజెన్స్ విభాగం (మినిస్టీరియల్ స్టాఫ్)లో పనిచేస్తున్న మొగిలి సాయికుమార్‌తో 2015 ఫిబ్రవరి 10న వివాహం జరిగిందని, పెళ్లి సమయంలో రూ.10లక్షల కట్నకానుకలుగా ఇచ్చామన్నారు. అంబర్‌పేటలోని ఛే నంబర్లో కాపురం ఉండేవారమని, అదే సంవత్సరం అక్టోబర్‌లో కుమార్తె జన్మించడంతో అప్పటి నుంచి తనను మానసికంగా వేధించే వాడని తెలిపింది. తనకు మగబిడ్డను కనివ్వాలని, లేని పక్షంలో వదిలేస్తానని బెదిరించే వాడని తెలిపింది. 2016 జూలైలో రెండో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టడంతో వేధింపులు ఎక్కువయ్యాయని, చిన్నపిల్లలని కూడా చూడకుండా వారిని తీవ్రంగా కొట్టేవాడని, అదే సంవత్సరం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని వాపోయింది. తన భర్తకు 2013లోనే మొదటి వివాహం జరిగిందని, అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని ఆమె విడాకులు తీసుకుందని తెలిపింది. అంబర్‌పేటలోని చర్చిలో పరిచయమైన అతని సోదరి నేరుగా తమ ఇంటికి వచ్చి అడగడంతో పేదరికం కారణంగా రెండో పెళ్లయినా తాము అంగీకరించామన్నారు. ప్రస్తుతం సాయికుమార్ సిద్దిపేట కమిషనరేట్‌లో ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడని, అక్కడి వెళ్లి కలిసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్, అంబర్‌పేట పోలీసులు, మానవ హక్కులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కుటంబ పోషణ భారంగా మారిందని, ఇళ్లలో పనిచేసుకునే తన తల్లిపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన భర్త ఒంగోలులో సొంత ఇళ్లు కట్టుకున్నాడని, అక్కడి వెళ్లి ఆరా తీయగా మూడో పెళ్లికి సిద్దమవుతున్నట్లు తెలిసిందన్నారు. తనతో విడాకులు తీసుకోకుండానే మూడో పెళ్లికి సిద్దమైన తన భర్తపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఆమె కోరింది. -
డబ్బులిస్తే..డబుల్
విజయనగర్‌కాలని: సంవత్సరంలో మీ డబ్బులు రెట్టింపు చేసి ఇస్తానంటూ ప్రజలను నమ్మించి రూ. 50 లక్షలకు పైగా వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని గురువారం ఆసీఫ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసీఫ్‌నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ అశోకచక్రవర్తి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా, ఈపురుపాలెం పద్మనాభుని పేటకు చెందిన కొండ వెంకటమురళీ కృష్ణ వివిధ వ్యాపారాలు చేసేవాడు. ఐదు నెలల క్రితం మెహిదీపట్నం బోజగుట్టలో పాగా వేసిన అతను తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఏడాదిలో రెట్టింపు చేసి ఇస్తానని ప్రచారం చేసుకున్నాడు. పెట్టుబడులు పెట్టిన వారికి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇతర బహుమతులు వారికి ఇచ్చి వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. అతని మాటలు నమ్మిన కొందరు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టగా 15 రోజుల్లో రెట్టింపు మొత్తాలు ఇచ్చాడు. దీంతో బోజగుట్ట, జాందార్నగర్, అంబేద్కర్‌నగర్, శ్రీరాంనగర్, శివాజీనగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్పులు చేసి మరీ రూ. 50 లక్షలకు పైగా అతడికి ముట్టజెప్పారు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో జాందార్‌నగర్‌కు చెందిన మహ్మద్ యూసూఫ్ ఈనెల 18న ఆసీఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళ, బుధవారాల్లో బోజగుట్టకు వస్తాడని సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను మకాం వేసిన సికింద్రాబాద్ స్వాతి లాడ్జిలో సోదాలు చేసి రూ. 12,33,400 నగదు, 6 బంగారు గొలుసులు, రెండు బ్రాస్లెట్లు, 9 ఉంగరాలతో పాటు 3 వెండి పట్టా గొలుసులు, 3 వెండి గొలుసులు, ఒక వెండి బ్రాస్లెట్, 4 ఉంగరాలు, 7 కప్పులు, ఒక స్పూన్, రెండు వెండి బిస్కెట్లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వాట్సప్ చాటింగ్‌తో చీటింగ్
భవానీపురం (విజయవాడ పశ్చిమం): వాట్సప్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆ తరువాత చాటింగ్‌తో సన్నిహితమై చివరికి చీటింగ్ చేసిన ఘటనపై సోమవారం భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం మేరకు భవానీపురంలోని అట్కిన్సన్ స్కూల్ ప్రాంతంలో నాగేంద్రకుమార్, ప్రత్యూష దంపతులు నివసిస్తున్నారు. టీవీ సీరియల్స్‌లో నటించే రవికృష్ణ అనే వ్యక్తి ప్రత్యూషకు వాట్సప్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ప్రతి రోజూ చాటింగ్ కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన రవికృష్ణ ఆమెకు ఫోన్‌చేసి తన స్నేహితుడికి ఆరోగ్యం బాగోక హాస్పటల్లో ఉన్నాడు కొంత డబ్బు కావాలని అడిగాడు. దీంతో ప్రత్యూష పోలిశెట్టి కసి అనే వ్యక్తి ఎకౌంట్లో రూ.10 వేలు జమ చేసింది. ఈ నెల 3వ తేదీన రవికృష్ణ మళ్లీ ఫోన్‌చేసి మరో రూ.10 వేలు కావాల్సి వచ్చిందని అడిగాడు. ఈ సారి కోన శివ అనే వ్యక్తి ఎకౌంట్లో డబ్బు వేయమని చెప్పటంతో ఆమె వేసింది. తిరిగి 4వ తేదీన ఫోన్ చేసి అర్జంట్‌గా రూ.30 వేలు కావాలి, మొత్తం రూ.50 వేలు త్వరలోనే పంపిస్తానని చెప్పాడు. అంత మొత్తం తన వద్ద లేవని ప్రత్యూష చెప్పటంతో నువ్వు నాతో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్ చేసిన మెసేజ్‌లు తన వద్ద ఉన్నాయని వాటిని బయటపెడతానని ఆమెను బెదిరించాడు. తాను మోసపోయానని గుర్తించిన ఆమె భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మోహన్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. -
స్టార్ హీరోపై కేసు నమోదు
సాక్షి, చెన్నై : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సహా ఎనిమిది మందిపై చెన్నైలో చీటింగ్ కేసు నమోదైంది. 2014లో హెచ్ఆర్ఎక్స్ పేరుతో హృతిక్ ప్రారంభించిన బ్రాండ్‌కు స్టాకిస్ట్‌గా తనను నియమించారని, ఆపై తనను రూ 21 లక్షలకు మోసగించారని మురళీధరన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఆయా ఉత్పత్తులను పంపలేదని, తనకు సమాచారం ఇవ్వకుండానే తన సంస్థను మూసివేశారని ఆరోపించారు. స్టాక్‌ను తిప్పిపంపినా నిందితులు తనకు రావాల్సిన మొత్తం చెల్లించలేదని మురళీధరన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. మురళీధరన్ ఫిర్యాదు ఆధారంగా హృతిక్ రోషన్, మరో ఎనిమిది మందిపై కొడుంగయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హృతిక్ రోషన్ ప్రస్తుతం గణిత మేధావి బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న సూపర్ 30 మూవీలో నటిస్తున్నారు. క్వీన్ దర్శకుడు వికాస్ బల్ రూపొందిస్తున్న ఈ మూవీ జనవరి 2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మాజీ ఎమ్మెల్యే ‘గండ్ర’పై చీటింగ్ కేసు నమోదు
కాజీపేట అర్బన్: ఓ మహిళను మోసం చేశాడన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై వరంగల్‌లోని సుబేదారి పోలీసులు ఆదివారం చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సదయ్య, బాధితురాలు విజయలక్ష్మి కథనం ప్రకారం.. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఎనిమిదేళ్ల క్రితం హన్మకొండలో మదర్ ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఈ క్రమంలో పరిచయమైన మాజీ ఎమ్మెల్యే గండ్రతో సాన్నిహిత్యం పెరిగింది. కాగా, నాలుగేళ్లుగా తనతో అవసరాలను తీర్చుకుని తనను దూరం చేసే కుట్రలో భాగంగా అసత్య ఆరోపణలు చేస్తు సుబేదారి పోలీస్ స్టేషన్లో తనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తనను చంపే ప్రయత్నం చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డిపై నిర్భయ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసంవద్ద ధర్నా చేపట్టింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు గండ్రపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా ఈ ఘటనపై వెంకటరమణారెడ్డి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తనపై ఆమె అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
పినతల్లి ఇంటికి వస్తే.. ప్రే..ముంచాడు
విశాఖపట్నం ,పాయకరావుపేట: ప్రేమించానని నమ్మించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమంటే నిరాకరించి బెదిరిస్తున్నాడని ఓ యువతి శుక్రవారం మహిళా సమాఖ్య ప్రతినిధులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని పాతపేటకు చెందిన ఒక యువతి అప్పుడప్పుడు పండుగలకు నర్సీపట్నంలో ఉంటున్న పినతల్లి ఇంటికి వెళ్లేది. అక్కడ అత్తిలి భాస్కర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. అతని మాటలు నమ్మిన ఫలితంగా అతడి ద్వారా గర్భం దాల్చినట్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని భాస్కర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అడిగితే రూ. 5 లక్షలు కట్నం కావాలన్నారని,గర్భం తీయించి వేసుకుంటే పెళ్లి చేసుకుంటానని బెదిరి స్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను నమ్మించి మోసం చేసిన భాస్కర్‌తో తనకు వివాహం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధిత యువతి ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆమెతో పాటు మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు బందుల సుబ్బలక్ష్మి, దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వి.శివప్రసాద్, మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి ఎరుపల్లి రమణమ్మ , మహిళా సమాఖ్య మండల కార్యదర్శి ఎలిపే సత్యవతి ఉన్నారు. -
‘హ్యాపీ’ బాధితుల ఆందోళన
తల్లాడ ఖమ్మం : హ్యాపీ ఫ్యూచర్ మల్టీపర్పస్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బాధితులు శుక్రవారం తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూతపడిన తల్లాడ బ్రాంచి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత డిసెంబరు నెలలో తల్లాడ, కల్లూరులో ‘హ్యాపీ’ సొసైటీ బ్రాంచీలు ఏర్పాటయ్యాయి. తమ సంస్థకు ప్రభుత్వ గుర్తింపు (రిజిస్ట్రేషన్) ఉందని అక్కడి ఉద్యోగులు చెప్పారు. తమ సంస్థలో 90 రోజులపాటు ఆర్డీ కడితే ఆ తర్వాత రెట్టింపు మొత్తాన్ని లోనుగా ఇస్తామన్నారని చెప్పారు. వారం క్రితం తల్లాడ బ్రాంచి మూతపడడంతో తామంతా మోసపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేశారు. -
హీరోయిన్ నన్ను పెళ్లాడి మోసగించింది
నటి మేఘనారాజ్పై తమిళనాడు వ్యాపారవేత్త జనార్దన్ ఫిర్యాదు సాక్షి, బెంగళూరు: తెలుగు, కన్నడతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించిందంటూ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త జనార్దన్ బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఆయన కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే.. ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో కేసును మూసేసినట్లు బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సినీనటి మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించడంతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా దొంగలించారంటూ జనార్దన్ కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జేపీనగర పోలీసులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారు. జనార్దన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వివరాలను సేకరించారు. నటి మేఘనారాజ్‌తో వివాహమైనట్లుగా ఆయన ఎలాంటి సాక్ష్యాలనూ చూపలేకపోయారు. నగరంలో మేఘనారాజ్ నివాసం ఎక్కడున్నదీ కూడా చెప్పలేకపోయారు. దీంతో ఫిర్యాదు దశలోనే ఈ కేసును మూసేశారు. ఈ విషయంపై మేఘనా రాజ్ తల్లి ప్రమీలా జోషాయ్ మాట్లాడుతూ....‘అసలు జనార్దన్ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలీదు. సినీ రంగంలో నా కూతురు ఎదుగుదలను చూసి సహించలేని కొందరు ఈ విధంగా దుష్ర్పచారానికి దిగుతున్నారు. జనార్దన్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామ’ని చెప్పారు.