
బంజారాహిల్స్: ఇంటీరియర్ వర్క్ చేయించుకొని తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు కోరె నందుకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన డాగా శ్రీనివాస్ కుమార్.. ఇంటీరియర్, ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఫిలింనగర్‌లో ఫిల్మీ జంక్షన్‌లోని డక్కన్ కిచెన్‌లో ఇంటీరియర్ వర్క్ కోసం శ్రీనివాస్‌తో నందు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
గతేడాది మేలో ఫ్యాబ్రికేషన్, సివిల్ వర్క్ పూర్తి చేసి రూ.27 లక్షల బిల్లు అందజేశారు. ఇందులో రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చిన నందు మిగతా మొత్తాన్ని త్వరలో ఇస్తానని చెప్పాడు. తర్వాత మిగతా రూ.17 లక్షలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు
Comments
Please login to add a commentAdd a comment