సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కోర్టులో కౌంటర్ సమర్పించారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు. ఇప్పటి వరకు జాబితాలో లేని కీలక వ్యక్తుల కొత్త పేర్లను అందులో ప్రస్తావించారు. నిందితులతో అనుమానితుల ఫోన్‌కాల్ డేటాను కోర్టుకు సమర్పించారు. కీలక నేతలతో నిందితులు దిగిన ఫోటోలు, వారు ప్రయాణించిన విమాన టికెట్లను సేకరించింది సిట్.
అంతకుముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టులో ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి.
ఇదీ చదవండి: MLA Poaching Case: హైకోర్టులో హీటెక్కిన విచారణ.. ఏం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment