న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు(మంగళవారం) సిట్ ముందు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10:30కి కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంటూ సిట్ ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆర్థిక మూలాలపై సిట్ విచారణ ముమ్మరం చేసింది. నిందితులతో రఘురామ కృష్ణరాజు ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏ1, ఏ2లతో ఎంపీ రఘురామకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. 41ఏ నోటీసులు అందుకున్న నలుగురిని సిట్ నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ చేస్తామని సిట్ పేర్కొంది. ఇప్పటికే సిట్ విచారణకు హాజరుకాని ఇద్దరిపై లుకౌట్ నోటీసులుజారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరుకానున్న ఎంపీ రఘురామకృష్ణరాజు సిట్ విచారణ కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment