MLAs Purchase
-
Delhi: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను కొని తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని బాంబు పేల్చారు. ‘ఈ మధ్యే మా పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు సంప్రదించారు. లిక్కర్ కేసులో మరికొద్ది రోజుల్లో మీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు తప్పదని మా ఎమ్మెల్యేలను బెదిరించారు. అరెస్టు తర్వాత ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పారు. ఇప్పటికే తమకు ఆప్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు వారు తెలిపారు. మీరు కూడా మాతో కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్‌తో పాటు రూ.25 కోట్లు ఆర్థిక సాయం చేస్తామని ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆశ చూపారు’ అని కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్)లోపోస్టు చేశారు. पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे… — Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024 ఇదీచదవండి.. నేడు సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా -
అసంపూర్తిగా ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ..సుప్రీం న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా ముగిసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కేసును సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేసింది. తదుపరి విచారణపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. కోర్టు సమయం ముగియడంతో వాదనలను నిలిపివేసింది. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు కావడంతో శుక్రవారమే విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టును కోరారు. అయితే శుక్రవారం విచారించటం సాధ్యం కాదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేసు తదుపరి విచారణపై సందిగ్ధత నెలకొంది. సోవారం వాదనల సందర్భంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలను ఆలకించింది. అనంతరం జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్‌లు జడ్జీలకు పంపడం సరైన విషయం కాదన్నారు. ముఖ్యమంత్రి నేరుగా తమకు పంపడం బాగాలేదన్నారు. ఒక సామాన్యుడు చేస్తే ఏమైనా అనుకోవచ్చు.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే సిట్ కూడా మీ ప్రభుత్వం అధీనంలో ఉంది కదా? అని అడిగారు. పెన్డ్రైవ్లపై క్షమాపణలు.. జడ్జీలకు సీఎం కేసీఆర్ కేసు వీడియోల పెన్‌డ్రైవ్‌లు పంపడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొట్టలని చూస్తే ఆ పార్టీ అధినేత చూస్తూ ఊరుకుంటారా, జరిగిన కుట్రను చెప్పకూడదా అని కోర్టుకు తెలిపారు. 'బీజేపీ నేతలు కేసులో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది, సీబీఐ పారదర్శకంగా విచారణ జరపదు. దేశంలో ఉన్న ప్రతిపక్షంపై దాడులు జరుగుతున్నాయి. 8 ప్రభుత్వాలను కూల్చారు. మనీష్ సిసోడియా వ్యవహారం అంతా సీబీఐ బయటకు చెబుతోంది. కేవలం ప్రతిపక్ష నేతల వెంట పడుతున్నారు. బీజేపీ నేతలను మాత్రం పట్టుకోవడం లేదు. కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించవద్దు. సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పంజరంలో చిలకలాగా మారింది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచి ఒకసారి సమర్థించి మరొకసారి వ్యతిరేకించింది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా బీజీపీ నేతలు దురుద్దేశపూర్వకంగానే మరో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళితే అన్ని ఆధారాలు ధ్వంసం అయిపోతాయి. కేసు పూర్తిగా నీరు గారి పోతుంది' అని దవే కోర్టుకు తెలియజేశారు. 'బీజేపీలో జాయిన్ అయితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని, పదవులు ఇస్తామని డీల్ పెట్టారు. బీజేపీలో జాయిన్ కాకపోతే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని బెదిరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టలని చూశారు. అందుకే ట్రాప్ వేసి పట్టుకున్నాం. అన్ని వీడియో రికార్డులు మా వద్ద ఉన్నాయి బీఎల్ సంతోష్ , రామచంద్ర భారతి సమావేశం జరిగింది. వాట్సాప్ చాట్ కూడా ఉంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అప్డేట్స్ ఎప్పటికప్పుడు బీఎల్ సంతోష్‌కు ఇచ్చారు. బీఎల్ సంతోష్, తుషార్, రామచంద్ర భారతి సమావేశం ఢిల్లీ నివాసంలో జరిగింది. ఫోన్ లోకేషన్స్ అన్నీ దొరికాయి. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేసింది.' అని దవే కోర్టుకు తెలిపారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సిట్‌కు చుక్కెదురు.. హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌కు చుక్కెదురైంది. ప్రభుత్వ రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. కేసులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మోమో జారీ చేసిన సంగతి తెలిసిందే.. కాగా, బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్‌లపై మెమో విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇప్పటికే ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు గత ఏడాది డిసెంబర్లో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనిని విచారిస్తున్న సిట్‌గానీ, దర్యాప్తు అధికారిగానీ ఇక ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63 రద్దు చేసింది. కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను సీబీఐకి అందజేయాలని సిట్, దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కావాలనే అలా మాట్లాడా! నేరం ఒప్పుకోలు.. భైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు -
రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ హైకోర్టులో రోహిత్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘మనీలాండరింగ్ జరగనప్పుడు ఈసీఐఆర్ చట్ట విరుద్ధం. పార్టీ మారితే రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు.. ఇక్కడ డబ్బు ఎక్కడా లభ్యం కాలేదు’’ అని రోహిత్‌రెడ్డి తరఫు లాయర్ పేర్కొన్నారు. నిన్న ఈడీ విచారణకు రావాలని రోహిత్‌రెడ్డి నోటీసులు ఇచ్చామని, విచారణకు రాకపోవడంతో 30న మళ్లీ రావాలని నోటీసులు ఇచ్చామని ఈడీ తెలిపింది. సమన్లలో అడిగిన అన్ని వివరాలు ఇచ్చామని ఈడీ పేర్కొంది. వాదనలు విన్న హైకోర్టు.. ఈసీఐఆర్ నమోదు చేస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఈడీలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కి కోర్టు వాయిదా వేసింది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు?: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్నారు. 2018 నుంచి జరిగిన ఫిరాయింపులపై విచారణ జరగాలని, త్వరలో ఈ అంశంపై తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను బాధితులుగా చూపిస్తున్నారు. మరి ఇందులో దోషి ఎవరు?. నేరం జరిగింది.. కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడింది. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుంది. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. చదవండి: ఎరలు.. దాడులు.. ‘విచారణ’ల రాజకీయం! -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నియామకాన్ని రద్దు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో ఈ కేసులో దొంగల ముసుగులు తొలిగాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనటంపై కౌంటర్ ఇచ్చారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్‌రెడ్డికి సంబరమా? అంటూ ప్రశ్నించారు. సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అయ్యిందని ఆరోపించారు. హైదబారాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి కేటీఆర్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగల ముసుగులు తొలిగాయి. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారు. సంబంధం లేదన్నవారు దొంగలను భుజాలపై మోస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబురాల మర్మమేంటి? దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారు. నేరం చేసిన వాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోరు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటకు వస్తున్నారు.’ అని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఇదీ చదవండి: హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి -
హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కల్పితమైన ఎమ్మెల్యే ల కొనుగోలుకేసులో సిట్ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అబ ద్ధాలను హైకోర్టు ఎండగట్టిందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే లకు ఎర కేసులో హైకోర్టు తీర్పును స్వాగతి స్తున్నామన్నారు. నీతి, నిజాయతీలకు కట్టుబ డిన బీజేపీ జాతీయ నాయకులను ఈ వ్యవ హారంలోకి లాగి కేసీఆర్ ఘోరమైన నేరానికి పాల్పడ్డారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తన ఊహల్లోంచి పుట్టిన ఈ తప్పుడు కేసు కోసం కేసీఆర్ ప్రజాధనాన్ని, అధికార యంత్రాంగా న్ని దుర్వినియోగం చేయడంతో పాటు, ఆయా సంస్థలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఐపీఎస్ అధికారులు కూడా వాస్తవాలను వెల్లడించకపోవడం దురదృష్టకరమన్నారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
2022 Roundup-Hyderabad: సంచలనాల సమాహారం!
మహా నగరానికి సంబంధించి 2022 ఆద్యంతం సంచలనాత్మక ఉదంతాలు, ఘటనలు, నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఏడాది జనవరి నెలలో గుజరాత్‌కు చెందిన సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వరుస పెట్టి పంజా విసిరాడు. అక్టోబర్‌లో మొదలైన ‘ఫామ్‌హౌస్’ ఎపిసోడ్... ఈడీ కేసులు, నోటీసులతో డిసెంబర్ వరకు కొనసాగింది... కొనసాగుతోంది. సికింద్రాబాద్ స్టేషన్ కేంద్రంగా చోటు చేసుకున్న ‘అగ్నిపథ్’ అల్లర్లు, అమ్నేషియా–పుడింగ్ అండ్ మింక్ పబ్స్ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. ఆయా ఉదంతాలను ఒక్కసారి పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరో రికార్డులకు ఎక్కిన తొలి డ్రగ్ మరణం డ్రగ్ పెడ్లర్ ప్రేమ్ ఉపాధ్యాయ ఎల్ఎస్డీ బోల్ట్స, ఎక్స్టసీ పిల్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇతడి నుంచి నగరానికి చెందిన ఓ యువకుడు డ్రగ్స్ ఖరీదు చేశాడు. బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ యువకుడు మాదకద్రవ్యాల ప్రభావంతో క్లరోసిస్ స్ట్రోక్‌తో బాధపడి చనిపోయాడు. గోవాలో జరిగిన పార్టీలో ఒకేసారి ఎల్ఎస్డీ, కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ పిల్స్‌తో పాటు హష్ ఆయిల్ తీసుకోవడంతో నగరానికి వచ్చాక ఇలా జరిగింది. మూడు కమిషనరేట్లలో పంజా సీరియల్ స్నాచర్ జనవరిలో ఉమేష్ గులాబ్ భాయ్ ఖతిక్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారులకు సవాల్ విసిరాడు. మెహదీపట్నంలో యాక్టివా వాహనం చోరీ చేశాడు. మరుసటి రోజు ఆ ల్వాల్ నుంచి మేడిపల్లి వరకు నేరాలు చేశాడు. వీటిలో స్నాచింగ్స్తో పాటు యత్నాలు ఉన్నాయి. గుజరాత్ పోలీసులకు పట్టుబడిన ఇతడిని సిటీకి తీసుకురావడం, రికవరీల్లోనూ అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు నుంచి రూ.కోట్లు కొట్టేసి.. ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంలో నైజీరియన్లు కీలకంగా వ్యవహరించగా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చెన్నై వాసులు పాత్రధారులుగా ఉన్నాయి. ఈ కేసును కొన్ని రోజుల్లోనే ఛేదించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. అయితే ఇప్పటికీ సూత్రధారులు పరారీలోనే ఉన్నారు. ► జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని అమ్నేషియా పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిపై ఇన్నోవా కారులో అత్యాచారం జరగడానికి ముందు బెంజ్ కారులో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. నిందితులుగా ఉన్న వారిలో ఎమ్మెల్యే కుమారుడితో పాటు అనేక మంది ప్రముఖుల సంతానం ఉన్నారు. వీరిలో అత్యధికులు మైనర్లు కావడం గమనార్హం. ఫామ్‌హౌస్ టు ఈడీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఖరీదు చేయడానికి ప్రయత్నించిన ఆరోపణలపై నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి అరెస్టయ్యారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ కీలక నేత బీఎల్ సంతోష్‌తో పాటు అనేకమంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు నందు భాగస్వామిగా ఉన్న అభిషేక్‌తో పాటు ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులను విచారిస్తున్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్.. బంజారాహిల్స్‌లోని రాడిస్సన్ బ్లూ ఆధీనంలోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన డ్రగ్ పార్టీ గుట్టురట్టైంది. కొణిదెల నాగబాబు కుమార్తె నిహారికతో పాటు అనేక మంది ప్రముఖుల వారసులు దీనికి హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు ఇటీవలే పూర్తి చేసిన పోలీసులు, ఆరుగురిని నిందితులుగా ఖరారు చేస్తూ అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఉగ్రవాదికి 16 ఏళ్ల జైలు పాక్ నిఘా సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న మహ్మద్ నిస్సార్‌కు న్యాయస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బోరుమన్న బోయగూడ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న న్యూ బోయగూడ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం బీహార్ నుంచి వలసవచ్చిన 11 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు గోదాములో మొత్తం నలుగురు వ్యాపారాలు చేస్తున్నారు. దీని మధ్య భాగంలో దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన సంపత్ అనే వ్యాపారి శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నారు. ఇందులోనే అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిపథ్‌తో అట్టుడికింది కేంద్ర ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి సంబంధించిన సెగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తాకింది. నిరుద్యోగులు ఒక్కసారిగా ఈ స్టేషన్‌ను ముట్టడించారు. రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) లాఠీచార్జ్ చేసింది. దీంతో ఆందోళన ఉధృతం చేసిన నిరుద్యోగులు విధ్వంసానికి దిగారు. ఆరు ప్లాట్‌ఫామ్స్‌లోని దుకాణాలతో సహా ప్రతీది ధ్వంసం చేయడంతో పాటు రైళ్ల పైనా రాళ్లు రువ్వారు. కొన్ని బోగీలకు నిప్పుపెట్టారు. ఆర్పీఎఫ్ అధికారులు కాల్పుల్లో ఓ యువకుడు చనిపోగా... 12 మందికి గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు
బంజారాహిల్స్: ఇంటీరియర్ వర్క్ చేయించుకొని తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు కోరె నందుకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన డాగా శ్రీనివాస్ కుమార్.. ఇంటీరియర్, ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఫిలింనగర్లో ఫిల్మీ జంక్షన్‌లోని డక్కన్ కిచెన్‌లో ఇంటీరియర్ వర్క్ కోసం శ్రీనివాస్‌తో నందు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది మేలో ఫ్యాబ్రికేషన్, సివిల్ వర్క్ పూర్తి చేసి రూ.27 లక్షల బిల్లు అందజేశారు. ఇందులో రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చిన నందు మిగతా మొత్తాన్ని త్వరలో ఇస్తానని చెప్పాడు. తర్వాత మిగతా రూ.17 లక్షలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు -
‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లలో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ మీడియా ముందు ఫుటేజ్ పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సహా పలువురు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు 65బీ సర్టిఫికెట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. సీఎం మీడియో సమావేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను న్యాయమూర్తి ప్రశ్నించారు. 65బీ ఇచ్చేందు కు సమయం కావాలని కోరడంతో.. సాయంత్రం 4.30 గం. వరకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సాయంత్రం వరకు వాయిదా వేశారు. పిటిషనర్లు ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేం.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చట్టంలో లేదని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది జోగినపల్లి సాయికృష్ణ వాదించారు. యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి తీసుకొని వచ్చిన వీడియోను ఎవిడెన్స్‌గా పరిగణించలేమని చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 65బీ ప్రకారం సర్టిఫికెట్ లేకుండా ఎవిడెన్స్‌ను రికార్డుల్లోకి తీసుకోవడానికి వీలులేదని చెప్పారు. అసలు సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలి అనడానికి.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధం లేదన్నారు. ఇలాంటి ఎవిడెన్స్‌ను ట్రయల్ కోర్టులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని నివేదించారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాప్ చేసి.. నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అక్టోబర్ 26న ముఖ్యమంత్రి మీడియా భేటీ నిర్వహించగా, నవంబర్ 9న సిట్ ఏర్పాటు జరిగిందని కోర్టుకు దృష్టికి తేచ్చారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ మెటీరియల్ ఎలా ఇచ్చిందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీని కోసం సాయంత్రం 4.30 గంటల వరకు న్యాయమూర్తి సమయం ఇచ్చారు. సాయంత్రం వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వు చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని దాఖలైన కేసులో హైకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. ఈ కేసులో వాద, ప్రతివాదనలు ముగియడంతో త్వరలో తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి, న్యాయవాది బి.శ్రీనివాస్, తుషార్ వెల్లపల్లి ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసును ఏసీబీ అధికారులు మాత్రమే విచారణ చేయాలని.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు, సిట్‌కు ఆ అధికారం లేదని బుధవారం బీజేపీ తరఫున హాజరైన జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ సూచన మేరకు లేదా వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు పబ్లిక్ సర్వెంట్‌పై విచారణ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఉంటుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసును తప్పనిసరిగా ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఏజీ బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని అన్నారు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని సిట్‌కు బదలాయించారని చెప్పారు. ‘ప్రభుత్వం పూర్తి అధికారాలిస్తూ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏసీబీ, లా అండ్ ఆర్డర్ కేసులను ఏదైనా సిట్ దర్యాప్తు చేయవచ్చు. ఆ మేరకు సిట్‌కు అన్ని అధికారాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది. నిందితులు విచారణకు సహకరించడం లేదు. కేసులు వేస్తూ తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ఈ కేసులో పలువురు మధ్యంత పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ప్రధాన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలి’అని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, మధ్యంతర పిటిషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం తమ దృష్టికి తేవాలన్నారు. ప్రధాన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, అక్టోబర్ 27న ప్రధాన పిటిషన్ దాఖలైంది మొదలు ఇప్పటివరకు వాదప్రతివాదనలు వాడీవేడిగా సాగాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, సిట్ స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. సిట్ దర్యాప్తును అడ్డుకోవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ మీడియా ముందు పెట్టిన ఫుటేజ్‌ను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. హై ప్రొఫైల్ కేసు దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు బయటకు ఎలా వెళ్లాయని అన్న పిటిషన్లు.. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని కోర్టుకు తెలిపారు. సీఎం ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రేపు(శుక్రవారం) తుది వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌ను సీఎం కోర్టుకు పంపించారు. చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి.. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సిట్ నోటీసులపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జారీ చేసిన 41 ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 13వ తేదీ వరుకు సిట్ నోటీసులపై స్టే విధించింది. తదుపరి విచారణ చేసే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. చదవండి: మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్.. నిందితులకు బెయిలిచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. హైకోర్టు బెయిలిచ్చినా నిందితులు విడుదల కాలేదు. రూ.3 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమకూర్చలేక న్యాయవాదులు తంటాలు పడుతున్నారు. నందకుమార్‌పై పెండింగ్ కేసులో బెయిల్‌పై నాంపల్లి కోర్టు శనివారం తీర్పు చెప్పనుంది. కోర్టు ఆర్డర్ తర్వాతే నందకుమార్ విడుదలపై క్లారిటీ రానుంది. తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ నోటీసులతో పాటు లుకౌట్ నోటీసులు కొట్టేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ అన్నారు. చదవండి: పాపాలు పండుతున్నాయి.. కవితపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్ -
స్వామీజీ.. బీఎల్ సంతోష్.. వాట్సాప్ చాటింగ్ 25 మంది రెడీ!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఆర్ఎస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి (స్వామీజీ) బీజేపీ నేత సంతోష్ (జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్)కు సమాచారమిచ్చారు. వీలైనంత త్వరగా 40మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేలా ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న రామచంద్ర భారతి, బీజేపీ నేత సంతోష్ మధ్య జరిగిన ఈ చాటింగ్ వివరాలను సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రామచంద్ర భారతి, అమృత ఆస్పత్రి హెడ్ డాక్టర్ జగ్గుస్వామి మధ్య జరిగిన చాటింగ్‌లనూ సేకరించింది. ఇదే కేసులో మరో నిందితుడు నందుకుమార్ అలియాస్ నందు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14 వరకు మిగతా నిందితులు అడ్వొకేట్ శ్రీనివాస్, ప్రతాప్, సింహ యాజీ తదితరులతో జరిపిన వాట్సాప్ సంభాషణల వివరాలనూ సిట్ సేకరించింది. తెలంగాణలో టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు అవకాశమున్న నేతల పేర్లను నిందితులు చాటింగ్‌లలో ప్రస్తావించినట్టు పేర్కొంది. వారందరూ.. నా సర్కిల్‌కు చెందిన వారే! టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నట్టు ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి, బీజేపీ నేత సంతోష్‌కు మధ్య జరిగిన చాటింగ్‌లు వెల్లడిస్తున్నాయి. సిట్ నివేదికలోని వివరాల మేరకు.. ఈ ఏడాది ఏప్రిల్ 26న సాయంత్రం 5.30 ప్రాంతంలో ఇద్దరి మధ్య చాటింగ్ జరిగింది. అందులో ‘‘మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ నా సర్కిల్‌కు చెందిన వారే. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా 40 మంది వీలైనంత త్వరగా పార్టీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం. వారంతా ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా నేను ఎలా చెప్తే అలా నడుచుకుంటారు..’’ అని బీజేపీ సంతోష్‌కు రామచంద్ర భారతి వివరించారు. ఇక ఈ సంభాషణకు కొన్ని నిమిషాల ముందు 2022 ఏప్రిల్ 26న సాయంత్రం 4.47 గంటల సమయంలో బీజేపీ సంతోష్‌కు ఓ వ్యక్తి మెసేజీ పెట్టారు. ‘రామచంద్ర భారతి స్వామీజీ ఇక్కడ హరిద్వార్ బైఠక్‌లో మిమ్మల్ని కలిసేందుకు వచ్చారు. మిమ్మల్ని కలిసి తెలంగాణకు సంబంధించిన ముఖ్య విషయాలు చర్చించాలనుకుంటున్నారు’’ అని అందులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజనర్సింహ! రామచంద్ర భారతి, అమృత ఆస్పత్రి హెడ్ డాక్టర్ జగ్గుస్వామి మధ్యకూడా సెప్టెంబర్ 27న వాట్సాప్ సంభాషణ జరిగింది. ‘‘తెలంగాణకు సంబంధించి ఇటీవల ఓ కీలక పరిణామం జరిగింది. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశాన్ని సోనియాతో చర్చించే విషయంలో ఇటీవల దిగ్విజయ్ సింగ్, కేసీఆర్ నడుమ ఓ సమావేశం జరిగింది. ఇదే జరిగితే బీజేపీకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో మూడేళ్లుగా పనిచేస్తున్న నాకు తెలిసిన ఓ బృందం ద్వారా ఈ విషయం తెలిసింది. కాంగ్రెస్‌కు వెన్నెముకగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కాంటాక్ట్‌లో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా పనిచేసిన దామోదరకు దళితులు, రెడ్డి సామాజికవర్గంలో బలమైన అనుచరవర్గం ఉంది. తనకు సన్నిహితంగా ఉండే ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో దామోదర టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించి ఆయనకు అనేక అంశాలు తెలుసు. 20కి పైగా నియోజకవర్గాల్లో దామోదర సామాజికవర్గానికి 75 వేల చొప్పున ఓట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కేసీఆర్ బృందంలోని ఓ వ్యక్తి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు అమిత్‌షాను సంప్రదించారు. ఆయన బీజేపీలోకి వస్తే ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు పెరుగుతాయి. మీరు వీలైనంత త్వరగా సమయమిస్తే ఈ అంశంపై చర్చిద్దాం’’ అని ఆ చాటింగ్‌లో పేర్కొన్నారు. చేరికలపై నందు వరుస సంభాషణలు సింహయాజి, అడ్వొకేట్ శ్రీనివాస్, ప్రతాప్, విజయ్ అనే వ్యక్తులతో నందకుమార్ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14వరకు జరిపిన వాట్సాప్ సంభాషణ, మెసేజీలను కూడా సిట్ సేకరించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు బావమరిదిగా చెప్తున్న అడ్వొకేట్ శ్రీనివాస్‌తో పటాన్చెరు, తాండూరు, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, సంగారెడ్డి, జహీరాబాద్, చేవెళ్ల, పరిగి, మానకొండూరు, మంచిర్యాల, పెద్దపల్లి, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిర్మల్, భద్రాచలం, నర్సంపేట, మహబూబాబాద్, చెన్నూరు, జనగామ, ఆందోల్, నారాయణఖేడ్, మహేశ్వరం, బాన్స్వాడ, నిజామాబాద్ నియోజకవర్గాలు, ఎమ్మెల్యేల పేర్లను వాట్సాప్ చాటింగ్‌లో నందు ప్రస్తావించారు. ఇక మెదక్, పెద్దపల్లి, జహీరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నల్గొండ ఎంపీ స్థానాల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. సింహయాజితో జరిగిన సంభాషణలో తన అమెరికా వీసా, ప్రతాప్‌కు, తనకు పదవి, ఇతర వ్యాపార విషయాలను నందు ప్రస్తావించారు. సింహయాజి, ప్రతాప్‌లతో జరిగిన సంభాషణలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీలో చేరేందుకు అవకాశమున్న నేతల పేర్లపైనా చర్చించారు. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. సిట్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కోర్టులో కౌంటర్ సమర్పించారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు. ఇప్పటి వరకు జాబితాలో లేని కీలక వ్యక్తుల కొత్త పేర్లను అందులో ప్రస్తావించారు. నిందితులతో అనుమానితుల ఫోన్‌కాల్ డేటాను కోర్టుకు సమర్పించారు. కీలక నేతలతో నిందితులు దిగిన ఫోటోలు, వారు ప్రయాణించిన విమాన టికెట్లను సేకరించింది సిట్. అంతకుముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టులో ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి. ఇదీ చదవండి: MLA Poaching Case: హైకోర్టులో హీటెక్కిన విచారణ.. ఏం జరిగిందంటే? -
ఎమ్మెల్యేల కేసు: హైకోర్టులో హీటెక్కిన విచారణ.. ఏం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం.. పోలీసు శాఖతో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, కేసు దర్యాప్తులో భాగంగా సిట్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టు ఆశ్రయించి ఊరట పొందారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టులో ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా.. బీజేపీ తరఫున మహేష్ జఠ్మలానీ.. - సిట్‌పై మాకు నమ్మకం లేదు. - సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. సిట్ తరఫున దుష్యంత్ దవే.. - ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్రమైన నేరం. - బీజేపీకి సంబంధం లేదంటారు.. నిందుతల తరఫున కేసులు వేస్తారు. - బీజేపీ అనేక చోట్ల ప్రభుత్వాలను పడగొట్టింది. - తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా కుట్ర జరిగింది. - ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలున్నాయన్నారు. ఇక, అంతుకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కామెంట్స్ చేశారు. దీంతో, కోర్టు విచారణనున రేపటి(గురువారాని)కి వాయిదా వేసింది. -
ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గం జనాలకు ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారట. అందుకే తమ పీఏలు, అనుచరులతో పనులు చక్కబెడుతున్నారని టాక్. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫాంహౌజ్‌కే పరిమితం.? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో గులాబీ పార్టీకే 13 దక్కాయి. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన భీరం హర్షవర్థన్‌రెడ్డి కూడా తర్వాతి కాలంలో కారెక్కి హాయిగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హర్షవర్థన్‌రెడ్డితో పాటు.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చిక్కుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు ఆ ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాతి నుంచి తమ నియోజకవర్గాలకు రావటం లేదు. దీంతో వారు ప్రజలకు ముఖం చాటేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఈ ఇద్దరు మాత్రమే ఎందుకు ఆ వ్యవహారంలో తలదూర్చారనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతుంటే వారిద్దరు మాత్రమే ప్రగతిభవన్‌ను వదలటం లేదు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఇంటెలిజెన్స్ సూచన మేరకే నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని ఎమ్మెల్యేలు చెబుతుండటం విశేషం. ప్రభుత్వం కూడా వీరికి భద్రత పెంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు సమకూర్చింది. ఆయినా వారు నియోజకవర్గాల్లోకి రావడానికి భయపడుతున్నారు. గోడకెక్కిన గువ్వల అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు అతికించటం కలకలం రేపుతుంది. గతంలో ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లలో ఫోటోలు కూడా పెట్టారు. జిల్లా పరిషత్ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డిపై దాడి.. వికలాంగుడిపై దాడి.. గిరిజన సర్పంచ్‌పై దాడి.. ఫారెస్టు ఆఫీసర్‌పై దాడి.. సీఎం పర్యటనలో నన్నే ఆపుతావారా అంటు సీఐపై చిందులు వేశారంటూ పోస్టర్లలో ప్రచురించారు. వీటిని స్దానికులు ఆశ్చర్యంగా చూస్తుండటం ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే పోస్టర్ల వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: (హీటెక్కిన తెలంగాణ పొలిటికల్ సమీకరణాలు.. బీజేపీకి లాభమెంత?) తమ నేతను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. గతంలో కూడ పలు సందర్భాల్లో గువ్వల బాలరాజు తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత ఎమ్మెల్యేపై తిట్లపురాణంతో సాగుతున్న ఫోన్ సంభాషణలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని వందకోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యేను తరమికొట్టాలని.. అందుకు అన్నివర్గాల వారు సహకరించాలని..ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేకు సంకటంగా మారుతున్నాయి. క్షేత్ర స్థాయి కష్టాలు కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్‌రెడ్డి ఇప్పటికే పార్టీ మారి ఆనేక విమర్శలు ఎదుర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారిన నాయకుడు డబ్బు కోసం ఇప్పుడు కూడా మారడని గ్యారెంటీ ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో సఖ్యత లేని కారణంగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. దిద్దుబాటు చర్యలకు అధిష్టానం పెద్దగా చొరవ చూపకపోవటంతోపాటు.. ఫామ్ హౌజ్ వ్యవహారంతో పార్టీకి నష్టం కలుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే కొల్లాపూర్‌కు రావాలని ప్రయత్నించినా స్దానికంగా ఉండే తన అనుచరుల సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడ ప్రతిపక్షాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అదునుగా ఎమ్మెల్యే వైరివర్గం నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని మరింత తీవ్రం చేసింది. ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లో తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపధ్యంలో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల బాటపడతారో లేక ఫాంహౌస్ కేసు తెగేంతవరకు దూరంగా ఉంటారో చూడాలి. -
ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు.. హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదు
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు(మంగళవారం) సిట్ ముందు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10:30కి కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంటూ సిట్ ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆర్థిక మూలాలపై సిట్ విచారణ ముమ్మరం చేసింది. నిందితులతో రఘురామ కృష్ణరాజు ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ1, ఏ2లతో ఎంపీ రఘురామకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. 41ఏ నోటీసులు అందుకున్న నలుగురిని సిట్ నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ చేస్తామని సిట్ పేర్కొంది. ఇప్పటికే సిట్ విచారణకు హాజరుకాని ఇద్దరిపై లుకౌట్ నోటీసులుజారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరుకానున్న ఎంపీ రఘురామకృష్ణరాజు సిట్ విచారణ కీలకం కానుంది. చదవండి: (ఎమ్మెల్యేలకు ఎర కేసు: నందుతో ఏం మాట్లాడారు?) -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఎన్జీవో పాత్ర?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్మాదిగకు సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విచారణాధికారి ముందు శనివారం హాజరయ్యా రు. కేసులోని నిందితులతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆయనను ప్రశ్నించారు. కేసుతో తన కుగానీ, సంస్థకు గానీ ఎలాంటి సంబంధమూ లేదని దాటవేసినట్లు తెలిసింది. అధికారులు సాంకేతిక ఆధారాలు చూపించడంతో జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. విజయ్.. గతంలో నగరానికి చెందిన ఓ సామాజికవర్గ రిజర్వేషన్ల పోరాట సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతాప్‌గౌడ్ బ్యాంకు లావాదేవీలపై ఆరా.. అంబర్‌పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్ రెండో రోజూ విచారణకు హాజరయ్యారు. నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్‌లతో జరిపిన పలు బ్యాంకు లావాదేవీలపై ప్రతాప్‌ను ప్రశ్నించగా.. ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను ఆయన ముందు పెట్టగా.. వ్యక్తిగత అవసరాల కోసం ఆయా మొత్తాన్ని వారికి ఇచ్చానని సమాధానమిచి్చనట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆ ‘35’పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ -
సిట్‌కు జవాబులు చెప్పకుండా ఏడ్చేసిన ప్రతాప్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని 41–ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. అంబర్‌పేటకు చెందిన న్యాయ వాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్, నిందితుడు నందుకుమార్ భార్య చిత్రలేఖలు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు, వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా వారిని విచారించారు. నిందితుడు నందు, ఆయన భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్‌కు మధ్య పలు ఫోన్ సందేశాలు, వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డ్లను గుర్తించిన పోలీసులు.. వాటిపై ప్రతాప్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. తొలుత తాను ఎవరితోనూ సంభాసించలేదని, మెసేజ్‌లు చేయ లేదని పోలీసులతో వాదించినట్లు సమాచారం. దీంతో అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసు లు ఆయన ముందు ఉంచి ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది. నందుతో పరిచయం, ఇతరత్రా సంబంధాలపై ఆరా తీయగా జవాబు చెప్పకుండా దాటే శారు. సాయంత్రం వరకు ప్రతాప్‌ను విచారించినా లాభం లేకపోవటంతో శనివారం కూడా విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారి ఆయన్ను ఆదేశించారు. సోమవారం మరోసారి రండి..: నందు భార్య చిత్రలేఖను విచారించిన సిట్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్లో ఆమెకు, ప్రతాప్ గౌడ్, నందుకు మధ్య పలు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు బయటపడ్డాయి. ఆయా మెసేజ్‌లలో ఏ సమాచా రం ఉందని? ఎందుకు చేశారని చిత్రలేఖను ప్రశ్నించగా.. తెలియదు, గుర్తులేదు, నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నందుకు చెందిన డెక్కన్ కిచెన్, నివాసంలోని సీసీ రికార్డుల్లో నమోదైన పలువురు ఫొటోలను చూపించి, వారెవరు? ఎందుకొచ్చారని ఆమెను ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. అయితే ఆమె డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ కార్యకలాపాలు, లావాదేవీల గురించి ప్రశ్నించగా ధైర్యంగా సమాధానాలు ఇచ్చిన చిత్రలేఖ.. ఈ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకపోవటంతో, ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరిగి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. హైకోర్టు ఆదేశించినా శ్రీనివాస్ గైర్హాజరు: శుక్రవారం సిట్ విచారణకు హాజరుకావాలని శ్రీనివాస్‌ను హైకోర్టు ఆదేశించినా ఆయన గైర్హాజరయ్యారు. కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌ను ఈ కేసులో ఏ–7గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. నందు, సింహయాజీలతో కలిసి శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో సంచరించడానికి సంబంధించిన ఆధారాలు, నందుతో రూ.55 లక్షలకు సంబంధించిన లావాదేవీలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: మల్లారెడ్డి కేసులో ట్విస్ట్.. హైకోర్టులో భద్రారెడ్డికి షాక్! -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బీఎల్ సంతోష్‌కు ఊరట లభించింది. సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. అంతేకాదు.. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన క్వాష్ పిటిషన్లో.. సిట్ నోటీసులను రద్దు చేయాలని కోరారు. రోహిత్‌రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన తరపు న్యాయవాది. అంతేకాదు ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పుడు.. ఆయన్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని బీఎల్ సంతోష్ తరపు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సిట్ నోటీసులపై స్టే విధించింది. అంతకు ముందు.. ఫాంహౌజ్ కేసులో మరో దఫా బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో.. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. -
ఎమ్మెల్యేల కేసులో భలే ట్విస్ట్.. బీఎల్ సంతోష్ బిగ్ ప్లాన్ ఫలిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరగనుందా?. వివరాల ప్రకారం.. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం క్వాష్ పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఇక, సిట్ నోటీసులు చట్టవిరుద్ధమంటూ బీఎల్ సంతోష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు.. ఫాంహౌస్ కేసులో భాగంగా బీఎల్ సంతోష్ ఈనెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసుల్లో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాగంగా బీఎల్ సంతోష్‌కు వాట్సాప్, మెయిల్ ద్వారా మరోసారి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. దీంతో, ఈ కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్. ఏ-4గా బీఎల్ సంతోష్, ఏ-5గా తుషార్, ఏ-6గా జగ్గుస్వామి, ఏ-7గా న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో చేర్చింది. అదే సమయంలో సిట్ స్వర నమూల నివేదిక సిట్ చేతికి అందింది. -
Telangana: ఫాంహౌజ్ కేసు.. హైకోర్టుకు నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఇవాళ(శుక్రవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫాంహౌజ్ కేసులో నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అయితే.. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును నిందితులు ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై రేపు(శనివారం) విచారణ సాగనుంది. -
రామచంద్ర భారతి, నందులతో ‘రఘురామ’ చెట్టపట్టాల్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌తో.. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సత్సంబంధాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. నిందితుల సెల్ఫోన్లలో రఘురామ కృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడినట్లు సమాచారం. దీంతో ఎంపీని విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 41–ఏ సీఆర్పీసీ కింద గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్లో విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని, ఢిల్లీకి వెళ్లారని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం ఆయన నివాసంలో నోటీ సులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామ కృష్ణరాజుకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను విచారించాలని నిర్ణయించింది. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతో‹Ù, కర్ణాటక బీడీజేఎస్ చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న హైకోర్టు సింగిల్ జడ్జికి కూడా ఈ సమాచారం అందజేసినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితులు సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలు అరెస్టయి, చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా నలుగురు నిందితులకు కూడా 120–బీ, 171–బీ రెడ్ విత్ 171–ఈ, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్–8 కేసులు వర్తిస్తాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరో ఐదుగురికి మళ్లీ నోటీసులు.. ఈ కేసు వెలుగులోకి వచి్చనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) ప్రతాపన్లను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆ నలుగురు సాక్షులకు సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే వారు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ‘అమృత’తో జగ్గుస్వామి సంబంధాలు నిర్ధారణ! జగ్గు స్వామిని విచారించేందుకు కేరళ వెళ్లిన సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బృందాన్ని .. అమృత ఆసుపత్రితో జగ్గుకు ఎలాంటి సంబంధాలు లేవంటూ ఆసుపత్రి సీఎస్ఓ తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. దీంతో సిట్ బృందం స్థానిక పోలీసుల సహకారంతో జగ్గు ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా.. అమృత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్)లో పరిపాలన విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా జగ్గు స్వామి పనిచేస్తున్నారని తేలింది. ఆసుపత్రి తరఫున బ్యాంక్ చెక్‌లను జారీ చేసే అధికారం కూడా ఆయనకు ఉందని గుర్తించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని ఎంపీ రఘురామ అన్నట్లు సమాచారం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది? తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు లభించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. 2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం? క్రికెట్ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య ఇద్దరూ పెద్ద కంపెనీల్లో టెక్కీలు, కావలసినంత జీతం వస్తుంది, విలాసవంతమైన జీవితం ముందుంది. కానీ భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్లో ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాతో వన్డే సిరీస్‌తో పాటు టెస్టులకు కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయం బారిన పడిన జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Kamal Haasan: కమల్ హాసన్‌కు అస్వస్థత స్టార్ హీరో కమల్‌హాసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్లో ఆయనను చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, డిశ్చార్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సంతోష్ ఎప్పుడు వస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ విచారణకు ఎప్పుడు వస్తారో చెప్పేదెవరని హైకోర్టు ధర్మాసనం.. బీజేపీ తరఫు న్యాయ వాదిని ప్రశ్నించింది. హాజరుపై స్పష్టత ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా మళ్లీ నోటీసులు అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సిట్ విచారణను ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నిందితులు రామచంద్ర భారతి, నందు, సింహయాజి, కరీంనగర్ న్యాయవాది బి.శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్, ఏఏజీ రామచంద్రరావు, కేంద్రం తరఫున గాడి ప్రవీణ్‌కుమార్, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ చిదంబరేశ్, ఎన్.రామచంద్రరావు హాజరయ్యారు. పార్టీ ప్రతినిధుల్లా మాట్లాడకూడదు.. ‘సంతోష్‌కు నోటీసులు ఇవ్వడం కోసం 16వ తేదీ నుంచి సిట్ ప్రయత్నిస్తోంది. ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. సంతోష్ కావాలనే నోటీసులు తీసుకోకుండా తప్పించుకుంటున్నారు. దీంతో ఆయన కార్యాలయంలోని వారికి సిట్ వాటిని అందజేసింది. ఆయనపై అనేక అనుమానాలున్నాయి. విచారణకు రాకుండా జాప్యం చేయడం మూలంగా సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది’ అని ఏజీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎన్. రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆధారాలు మొత్తం బహిరంగపర్చిందని ఆరోపిం చారు. బీఎల్ సంతోష్ సీనియర్ సిటిజన్ అని.. ఏం చేయలన్నదానిపై న్యాయసలహా తీసుకుంటున్నా రని తెలిపారు. ఈ క్రమంలో సంతోష్ అసలు విచా రణకు ఎందుకు హాజరుకావడం లేదు.. ఎప్పుడు హాజరవుతారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తమ కు సమాచారం లేదని బీజేపీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇంకా వ్యక్తిగతంగా ఆయనకు నోటీసులు అందలేదని ఆయన చెప్పడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల విషయం తెలియనప్పుడు 70 ఏళ్ల వయసులో విచారణకు హాజరుకా లేనని సిట్‌కు సంతోష్ ఎలా లేఖ రాశారని ప్రశ్నించారు. కాగా, ఈ సందర్భంగా బీజేపీ, ప్రభుత్వ న్యాయవాదుల తీరు పట్ల న్యాయమూర్తి అభ్యంత రం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రతినిధుల్లా మాట్లాడకూడదని.. రాజకీయ నాయకుల్లా వాదించుకోవడం సరికాదన్నారు. వృత్తి నిపుణుల్లా ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. ఆవేశానికి లోనుకావొద్దన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవ్వాలని ఏజీని న్యాయమూర్తి కోరగా, ఇంకా రాలేదని చెప్పారు. ఉత్తర్వులు వచ్చాకే విచారణ జరుపుతామంటూ మధ్యాహ్నం 2:30కి వాయిదా వేశారు. సిట్‌పై తేల్చాల్సింది ఈ ధర్మాసనమే.. తిరిగి విచారణ ప్రారంభం సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని ఏజీ న్యాయమూర్తికి అందజేశారు. ‘సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినా సంతోష్ విచారణకు హాజరుకాలేదు. బీఎల్ సంతోష్ తరఫున న్యాయవాదులెవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ నెల 19న అరెస్టు చేయకూడదని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిట్ స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ సాగించే వెసులుబాటు కల్పించాలి’ అని ఏజీ విజ్ఞప్తి చేశారు. విచారణ కోసమే 41ఏ నోటీ సులు ఇచ్చామని చెప్పి.. ఇప్పుడు అరెస్టు చేయకూడదన్న ఆదేశాలు రద్దు చేయాలని కోరడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. బీజేపీ కీలక నేత అయిన సంతోష్‌ను అరెస్టు చేస్తే.. దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చిదంబరేశ్ నివేదించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఏజీ బదులిచ్చారు. సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షించాలని డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిందని మహేశ్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సిట్ భవితవ్యాన్ని తేల్చే అధికారం ఈ ధర్మాసనానిదేనని చెప్పారు. సిట్ ఉండాలా?. వద్దా ? కొత్త సిట్‌ను ఏర్పాటు చేయాలా? లేదా సీబీఐకి బదిలీ చేయాలా?.. ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఈ ధర్మాసనానికి ఉందన్నారు. హైకోర్టు జడ్జి దర్యాప్తును పర్యవేక్షించగలరా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు జఠ్మలానీ బదులిస్తూ.. పర్యవేక్షించవచ్చని.. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముగ్గురు నిందితులు గురువారం హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. సిట్ వేధిస్తోంది: శ్రీనివాస్ విచారణ పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని పేర్కొంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిరోజూ తమ ఎదుట హాజరుకావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ నెల 25న సిట్ ఎదుట హాజరైతే సరిపోతుందని తెలిపింది. అలాగే తనకు సిట్ సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది ప్రతాప్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వేధిస్తున్నారని, ఈ నోటీసులను కొట్టేయాలని కోరారు. ఇదీ చదవండి: రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో కొనసాగిన దాడులు -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కస్టడీ పిటిషన్ వాదనలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు బుధవారంతో ముగిశాయి. ఈ కేసులో నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇవాళ్టితో వాదనలు పూర్తి కావడంతో.. కస్టడీ పిటిషన్‌పై రేపు(గురువారం) ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ నవంబర్ 30వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసు.. సంతోష్‌కు మళ్లీ నోటీసులు! -
ఎమ్మెల్యేల కేసు: రామచంద్ర భారతికి ఊహించని షాక్.. ఉచ్చు బిగుసుకుంటోందా!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో రామచంద్ర భారతికి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో మరో ఫిర్యాదు నమోదైంది. రామచంద్ర భారతిపై సిట్ అధికారి గంగాధర్ ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో ఐఫోన్, ల్యాప్‌ట్యాప్‌లో నకిలీ పాస్ట్‌పోర్ట్ లభ్యమైంది. కర్నాటక అడ్రస్‌తో T9633092 నెంబర్‌తో నకిలీ పాస్‌పోర్ట్ దొరికింది. దీంతో, ఆయనపై 467, 468, 471, ఐపీసీ12(3) పాస్‌పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. -
కేరళ వైద్యుడు జగ్గుస్వామికి లుకౌట్ నోటీసులు
-
బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్‌కు 41–ఏ సీఆర్పీసీ కింద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అయితే సంతోష్‌కు నోటీసులు అందించేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించక పోవడంతో, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు అందించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. సిట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేస్తారా? సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్ వెల్లాపల్లి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతి.. తుషార్‌కు మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. దీంతో నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేయాలా? బీఎల్ సంతోష్‌కు మాదిరిగానే వారికి కూడా మరోసారి నోటీసులు జారీ చేయాలా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సిట్ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోసారి కస్టడీపై నేడు విచారణ ఈ కేసుకు సంబంధించి రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే నిందితుల నుంచి సంతృప్తికర సమాధానాలు రాలేదని, మరోసారి వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సిట్‌కు స్వేచ్ఛ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం స్పష్టీకరణ -
టికెట్ ఎందుకు బుక్ చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిట్ పలువురికి 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమీప బంధువు, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరయ్యారు. సిట్ సభ్యులైన సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కళ్మేశ్వర్, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ వేర్వేరుగా సాయంత్రం 6:30 గంటల వరకూ ఆయనను సుమారు 8 గంటలపాటు విచారించారు. శ్రీనివాస్ ఫోన్ కాల్‌డేటాతోపాటు, ఆయన బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించి, వాటిపై పలు సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. గత నెల 26న నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో హరియాణాకు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్ వ్యాపారి నందుకుమార్, తిరుపతి స్వామి సింహయాజీలు రహస్య మంతనాలు జరుపుతుండగా.. పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అదేరోజు మధ్యాహ్నానికి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా విమాన టికెట్‌ను బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సింహయాజీతో మీకున్న సంబంధం ఏంటని అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. సింహయాజీతో పూజలు చేయించడం కోసమే ప్రత్యేకంగా టికెట్ బుక్ చేశానని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అలాగే శ్రీనివాస్ ఫోన్లోని యూపీఐ లావాదేవీల జాబితాను ముందు పెట్టి విచారించారు. కాగా, విచారణలో శ్రీనివాస్ ఓ జాతీయ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. దీంతో వారికీ 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. అరగంట ఫోన్లో ఏం మాట్లాడారు? తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ మొదటిది కానుంది. నోటీసులు జారీ చేసిన నలుగురిని విచారించేందుకు 16, 17 అంతస్తుల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. విచారణకు హాజరయ్యే వారి ప్రతి కదలిక, హావభావాలు, విచారణ సమయంలో సిట్ ప్రశ్నలు, రాబట్టే సమాధానాలు, వారి స్పందన.. ఇలా అన్ని అంశాలూ స్పష్టంగా రికార్డయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు నందుకుమార్ ఫోన్‌ను విశ్లేషించగా.. గత నెల 26 కంటే ముందు అరగంట సేపు సెల్ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఏం మాట్లాడారు? 26న టికెట్లు బుక్ చేయాలని ఎవరైనా కోరారా? అని లోతుగా విచారించినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. శ్రీనివాస్ నుంచి సంతృప్తికర సమాధానాలు రాబట్టలేని అధికారులు.. మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: సామాన్యుడి కోసం ధర్మపీఠం -
సిట్‌కు స్వేచ్ఛ: సింగిల్ జడ్జి పర్యవేక్షణ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షించాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మెరిట్ ఆధారంగా సింగిల్ జడ్జి విచారణ కొనసాగించాలని స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తమపై కేసు కొట్టివేయాలని, సిట్ విచారణ నిలిపివేయాలంటూ నిందితులు రామచంద్రభారతి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్లతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. తొలుత ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. హైకోర్టులో జరిగిన పరిణామాలు వివరించారు. కింది కోర్టు బెయిల్‌ను తిరస్కరించినా నిందితులు సవాల్ చేయలేదని తెలిపారు. నిందితుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. రిమాండు ఉత్తర్వులు, బెయిలు ఉత్తర్వులు వేర్వేరని తెలిపారు. అరెస్టు చేయడానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పడం సరికాదన్నారు. హైకోర్టు అనుమతితో నిందితులను ట్రయల్‌కోర్టులో హాజరుపరిచి రెండు రోజుల కస్టడీకి తీసుకున్నామని, దీంతో హైకోర్టు రిమాండు ఉత్తర్వులకు కాలం చెల్లిందని దుష్యంత్ దవే తెలిపారు. ‘ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అర్నేశ్‌కుమార్ తీర్పును హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పులో పలు లోపాలున్నాయని నిందితుల తరఫు న్యాయవాది తన్మయ్ మెహతా తెలిపారు. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 ప్రయోగించారని.. లంచం తీసుకున్న వారిపై దీన్ని ప్రయోగిస్తారని చెప్పారు. హైకోర్టు తీర్పు అర్నేశ్‌కుమార్ తీర్పునకు విరుద్ధంగా ఉందన్నారు. ఇవేం వ్యాఖ్యలు? హైకోర్టు తీర్పులోని పదాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘సుప్రీంకోర్టు, హైకోర్టులు సమానమే. హైకోర్టులేమీ కింది కోర్టులు కాదని చెబుతుంటాం. సింగిల్ జడ్జి పదాలు ఆక్షేపణీయంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో నాయకులను అరెస్టు చేయొచ్చు.. అధికార పార్టీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం అన్ని అంశాలు మాట్లాడతారంటూ దుష్యంత్ దవే పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసి చట్టపరమైన అంశాలపైనే మాట్లాడాలని దుష్యంత్ దవేకు సూచించింది. అన్ని పార్టీల నేతలను బెయిల్‌పై విడుదల చేస్తుంటామని పేర్కొంది. అవినీతి నిరోధక కేసులో పోలీసులు ట్రాప్ చేసి నిందితులను పట్టుకున్నారని దుష్యంత్ దవే తెలిపారు. ప్రతి కేసులోనూ నోటీసులు జారీ చేసి అరెస్టు చేయాలనడం సరికాదన్నారు. రూ.వందల కోట్లలో లంచానికి సంబంధించిన ఈ అంశం పోలీసుల సమక్షంలో జరిగిన నేరమని, ఇది దర్యాప్తు చేయదగిన కేసు అని చెప్పారు. ట్రాప్ కేసుల్లో అప్పటికప్పుడే సాక్ష్యాధారాలు సేకరించకుంటే వాటిని నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా తెలిపారు. దర్యాప్తునకు సహకరించినప్పుడు అరెస్టు అవసరం లేదని సిద్ధార్థ్ దవే చెప్పారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారా అని ధర్మాసనం ప్రశ్నించగా లేదని దవే బదులిచ్చారు. రాజకీయ పార్టీ పిటిషన్ లేకపోతే అదే రోజు బెయిలిచ్చే వారమని గత విచారణలో చెప్పినట్లు ధర్మాసనం పేర్కొంది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు సరిగాలేవు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సి ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలు అవసరం లేదు. నిందితులు రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలి. బెయిల్ పిటిషన్లపై విచారణ త్వరగా పూర్తి చేయాలి’ అని పేర్కొంటూ ధర్మాసనం పిటిషన్‌పై విచారణ ముగించింది. సిట్ దర్యాప్తు పిటిషన్‌పై... తొలుత నిందితుల తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తును సీబీఐ లేదా న్యాయమూర్తుల నేతృత్వంలోని సిట్‌కు బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఓ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లో దర్యాప్తుపై సింగిల్ జడ్జి స్టే విధించారని, తర్వాత స్టే ఎత్తివేశారని తెలిపారు. దీన్ని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయగా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తునకు ఆదేశాలిచ్చిందన్నారు. ఈ సందర్భంలో సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకొని హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి నిందితుల పిటిషన్‌పై విచారణ చేయాలని సూచిస్తామంది. ప్రభుత్వం తరఫున హాజరైన దుష్యంత్ దవే విభేదించడంతో ప్రత్యేక దర్యాప్తునకు అర్హత ఉన్న కేసా కాదా అని హైకోర్టు నిర్ణయిస్తుందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను న్యాయమూర్తి పర్యవేక్షించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. జైన్ హవాలా తదితర కేసుల్లో సుప్రీంకోర్టు కూడా పర్యవేక్షణ అదేశాలిచ్చిందని దుష్యంత్ దవే చెప్పారు. దర్యాప్తుపై స్టే విధించొద్దని కోరారు. ఇదీ చదవండి: ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే! -
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
-
బీజేపీ నేతల విచారణ పై కొనసాగుతున్న ఉత్కంఠ
-
Hyderabad: నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా...
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కోరె నందుకుమార్ అలియాస్ నందుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో చీటింగ్ కేసు నమోదైంది. వ్యవసాయ భూమికి సంబంధించి కమీషన్ కోసం తనను బెదిరించడమే కాకుండా అంతు చూస్తానంటూ హెచ్చరించాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యా పారి ఎస్.సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ భూమి లావాదేవీలకు సంబంధించి రూ.21 లక్షలు నందుకుమార్‌కు ఇచ్చామని ఈ విషయంలోనే పలుమార్లు తనను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలోనే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అప్పుడు తాను డిప్యూటీ చీఫ్ మినిష్టర్‌ను అవుతానని, పరిగి సమీపంలోని దోమ మండలం భూంపల్లి గ్రామంలో 12 ఎకరాల స్థలం తన పేరు మీద రాయకపోతే అంతు చూస్తానని బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు) -
ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్లు.. పొరపాటా లేక స్పష్టత కోసమా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో భాగంగా జారీ చేసిన నోటీసులలో గందరగోళం నెలకొంది. సోమవారం హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్లు లక్ష్మీ జనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇరువు రూ విచారణకు వచ్చేటప్పుడు వారు వినియోగించే మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వెంట తీసుకురావాలని నోటీసులో సిట్ పేర్కొంది. ఫలానా ఫోన్ నంబరు, ఫలానా ఐఎంఈఐ నంబరు గల సెల్‌ఫోన్‌ను తప్పనిసరిగా తీసుకు రావాలని ఆదేశించింది. ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం లేదా చెరపడం కానీ చేయరాదని పేర్కొంది. అయితే బీఎల్ సంతోష్, శ్రీనివాస్.. ఇద్దరికీ సిట్ జారీ చేసిన నోటీసులలో పేరొన్న ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబర్లు ఒకటే ఉండటం గందరగోళానికి తెరతీసింది. ముద్రణలో పొరపాటేనా.. ఇరువురు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సిట్ విచారణాధికారి, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ బి.గంగాధర్ ఈ నెల 16న నోటీసులు జారీ చేశా రు. అయితే ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరికీ నోటీసులు జారీ చేసే క్రమంలో ముద్రణలో పొరపాటు జరిగిందా? లేక దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నంబరు ఎవరి దగ్గర ఉంది? ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకోవటానికే అలా ఇద్దరి నోటీసుల్లోనూ ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్ల ను పేర్కొన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబరుకు ‘సాక్షి’ కాల్ చేసేందుకు ప్రయత్నించగా.. ట్రూ కాలర్‌లో బీఎల్ సంతోష్ అనే పేరు రావటం గమనార్హం. దీంతో శ్రీనివాస్‌కు జారీ చేసిన నోటీసు ముద్రణలో సిట్ అధికారు లు పొరపాటు చేసి ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో ఈనెల 29లోగా దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సమయం తక్కువగా ఉండటంతో నోటీసుల జారీలో పొరపాట్లు దొర్లి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా హిరియాడ్కా పట్టణం కాగా.. సిట్ అధికారులు మాత్రం బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ చిరునామాతో నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎవరికీ భౌతికంగా అందించలేదు.. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు హరియాణాలోని ఫరీదాబాద్ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహాయాజీలను విచారించి న పోలీసులు వారి నుంచి మరింత సమాచారా న్ని రాబట్టారు. వీటి ఆధారంగా సంతోష్, శ్రీనివాస్‌లతో పాటు కేరళలో బీజే పీకి మిత్రపక్షమైన భరత్ ధర్మజనసేన(బీడీజేఎస్) అధినేత తుషార్ వెల్లపళ్లి, రామచంద్రభారతికి మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామికి కూడా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరిలో ఏ ఒక్కరికీ కూడా సిట్ అధికారులు భౌతికంగా నోటీసులు అందించకపోవటం గమనార్హం. శ్రీనివాస్, జగ్గు స్వామి ఇళ్లకు నోటీసులు అతికించగా, తుషార్ ఇంట్లో లేకపోవటంతో ఆయన ఆఫీసు సెక్రటరీకి నోటీసులు అందించారు. అయితే ఈనెల 3న సీఎం కేసీఆర్.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి సంభాషించిన ఆడియో, వీడి యో రికార్డులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో రామచంద్రభారతి, బీఎల్ సంతోష్, సునీల్‌కుమార్ బన్సల్, తుషార్ పేర్లను పలుమార్లు ప్రస్తావించారు. ఇందులో సంతోష్, తుషార్లకు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. బన్సల్‌కు నోటీసులు జారీ చేశారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత కోసమేనా? కాగా.. అరెస్టు సమయంలో రామచంద్రభా రతి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోని కాంటాక్ట్‌లను పరిశీలించగా.. ‘సంతోష్ బీజేపీ’ పేరిట ఉన్న ఫోన్ నంబర్‌కు ఇంగ్లీషులో పంపిన సందేశాలను పోలీసులు గుర్తించారు. ‘నేను రామచంద్రభారతిస్వా మీజిని, హరిద్వార్ బైఠక్‌లో మిమ్మల్ని కలిశా. తెలంగాణలో కీలకాంశాలపై చర్చించాలి. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ అపాయింట్మెంట్ కావాలి, ఆ ముగ్గురికీ కొంత విట మిన్ ఎం అవసరం.. వంటి పలు సందేశాలను పోలీసులు గుర్తించారు. సంతోష్ బీజేపీ నుంచి మాత్రం రామచంద్రభారతికి ఎలాంటి రిప్లైలు వచ్చినట్లు పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత కోసమే సిట్ అధికారులు బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌లకు ఇరువురికీ ఒకే ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబరును తీసుకురావాలని సూచించినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. అసలు ఆ ఫోన్‌ను ఎవరు వినియోగిస్తున్నారో బయటపడుతుందని చెపుతున్నారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. బీజేపీకి కొత్త టెన్షన్! -
ఎమ్మెల్యేలకు ఎర’ కేసు: సిట్ నోటీసులపై స్టే ఇవ్వలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలన్న ఆ పార్టీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తును అడ్డుకోలేమని పేర్కొంది. తదు పరి ఆదేశాలిచ్చే వరకు సంతోష్, శ్రీనివాస్‌ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. సీఆర్పీసీ 41(ఏ) నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. వెంటనే నోటీసులు అందజేసి విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఉన్న సంతోష్‌కు నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు.. సిట్‌కు సహకరించాలని సూచించింది. ఈ మేరకు వివరాలను ఢిల్లీ పోలీసులకు ఈ–మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపాలని సిట్‌ను ఆదేశించింది. సీఆర్పీసీ 41(ఏ) నోటీసులు ఇవ్వ డం.. నిందితుల విచారణ లాంటి అంశాలు మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయని ప్రశ్నించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించింది. దర్యాప్తు వివరాలను సింగిల్ జడ్జికి అందజేయాలని మాత్రమే ద్వి సభ్య ధర్మాసనం చెప్పిందని.. అనుమతి తీసుకోమని చెప్పలేదని స్పష్టం చేసింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనలో ప్రధాన నిందితులకు బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌తో సంబంధాలు ఉన్నాయని.. విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందజేసేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని సిట్, నోటీసులు ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. వాదనల తర్వాత.. దర్యాప్తును రోజువారీ పర్యవేక్షణ చేయాలన్న బీజేపీ అభ్యర్థనపై ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ చిదంబరేశ్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రామచంద్రరావు వాదనలు వినిపించారు. 41ఏ కింద నోటీసులు ఎలా ఇస్తారు... చిదంబరేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘ద్వి సభ్య ధర్మా సనం ఆదేశాల మేరకు నోటీసుల జారీకి సిట్ సింగిల్ జడ్జి అనుమతి తీసుకోవాలి. కానీ, తీసుకోలేదు. నోటీసుల జారీ, నిందితుల విచారణకు సంబంధించి దర్యాప్తు వివరాలను మీడియాకు లీకులిస్తోంది. ఆ వివరాలన్నీ పత్రికలు, చానళ్లలో ప్రసా రమయ్యాయి. ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. అసలు ఈ కేసులో సంతోష్ నిందితుడు కాదు. అయినా అతనికి నోటీసులు ఇచ్చారు. మనీశ్ మహేశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ తీర్పు ప్రకారం.. నిందితుడు కాని వారికి సెక్షన్ 160 కింద నోటీసులు ఇవ్వాలి. సెక్షన్ 41ఏ కింద కాదు. విచారణకు వచ్చిన వెంటనే ఆయనను అరెస్టు చేయడం కోసమే ఈ నోటీసులు ఇచ్చారు. అతన్ని అరెస్టు చేస్తే రాజకీయ వివాదంగా మారే పరిస్థితి ఉంది. ఇది ద్వి సభ్య ధర్మాసనం ఉత్తర్వులకు విరుద్ధం. బీజేపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇస్తూ.. ఆ పార్టీకి లోకస్(అర్హత) లేదనడం అర్థరహితం. ఈ విషయం విచారణలో ఉంది. దీని పై ద్వి సభ్య ధర్మాసనం కూడా కలుగజేసుకోలేదు. విచారణ పారదర్శకంగా సాగాలన్నదే పిటిషనర్ ఉద్దేశం. ఈ క్రమంలో నోటీసులపై స్టే విధించాలి’అని నివేదించారు. ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.. ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘నోటీసులు ఇ చ్చేందుకు సహకరించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. 16న సిట్ వెళ్లినా వారు సహకరించలేదు. బీజేపీ ప్రధాన కార్యాయానికి అధికారులు వెళ్లినా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఇది ద్వి సభ్య ధర్మాసనం ఆదేశాల ఉల్లంఘనే అవుతుంది’ అని చెప్పారు. ఈ కేసులో మనీశ్మహేశ్వరీస్ తీర్పు వర్తించదని ఏజీ పేర్కొన్నారు. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో నోటీసులు జారీ చేయలేదని చెప్పారు. ఆడియో, వీడియోలోని విషయాలను ఖరారు చేసుకోవడానికి వారిని విచారణ చేయాల్సి ఉందన్నారు. -
ఎమ్మెల్యేల కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. బీజేపీకి కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే స్పీడ్ పెంచిన సిట్.. బీజేపీ సీనియర్ నేతకు నోటీసులు ఇచ్చింది. దీంతో, ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్ దర్యాప్తుపై మండిపడుతున్నారు. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చింది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇక, బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగింది. మరోవైపు.. సిట్ నోటీసులపై హైకోర్టులో స్టే ఇవ్వాలని బీజేపీ కోరింది. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని సిట్ వేధిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. సిట్ నోటీసులపై శనివారం హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. 41ఏ నోటీసుల వెనుక అరెస్ట్ చేసే కుట్ర దాగి ఉంది. కేసుతో సంబంధంలేని వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో 8 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
-
MLAs Purchase Case: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు బూసారపు శ్రీనివాస్‌కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 21న ఉదయం 10:30కి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న రామచంద్రభారతికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు మరో ఇద్దరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని ఫరీదాబాద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం. వీరిద్దరూ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న రామచంద్రభారతికి అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. ఈ ఇద్దరికీ కేసులో సహ నిందితుడిగా ఉన్న నందుకుమార్‌తోనూ సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఎర కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం (సిట్)కు అప్పగించిన మరుసటి రోజునే సైబరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందం ఒకటి ఢిల్లీకి చేరుకొని విచారణ చేపట్టింది. నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం, కాల్‌డేటా ఆధారంగా ఫరీదాబాద్‌లో వీరిని అదుపులోకి తీసుకుంది. వీరికి ముగ్గురు ముద్దాయిలతో ఉన్న సాన్నిహిత్యం, ఎమ్మెల్యేల కొనుగోళ్లలో వీరి ప్రమేయం తదితర వివరాలపై ఆరా తీస్తోంది. ఇప్పటికే అదుపులో ఉన్న నిందితులకు సంబంధించిన వీడియోల్లో రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధంచేసిన ప్రణాళిక, దీనికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారంలో వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో అరెస్ట్ చూపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి అరెస్ట్‌తో కేసు విచారణ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. చదవండి: (బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం) -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. MLAs Purchase Case: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 21న ఉదయం 10:30కి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అబద్ధాలపై పేటెంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఒక రికార్డు ఉంది. దేశంలోనే మరే నేత అంతలా అబద్దాలు ఆడలేరన్నది ఆయన రికార్డుగా చాలామంది చెబుతుంటారు. ఆయన విశిష్టత ఏమిటంటే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్న అబద్దాన్ని అలవోకగా చెప్పడం. దానిని ప్రజలు నమ్మాలన్న ఉద్దేశంతో పదే, పదే వల్లె వేస్తుండడం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్.. అనూహ్యంగా ఎదిగిన కమలం ఇటీవల పర్యటనలో ప్రధాని మోడీ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా కెసిఆర్ పైన, ఆయన కుటుంబంపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాకపోతే కెసిఆర్ పేరు ఎత్తలేదు. కాని మోడీ ప్రసంగంలో విమర్శల తీవ్రత భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా తీసుకోవచ్చు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇక ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవు.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశావ్ చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. చివరి అవకాశం అంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా ప్రజల మీద పడ్డావు అని మండిపడ్డారు. కులపిచ్చితో రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని నాశనం చేశావని మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారికి భారీగా పెరగనున్న జీతాలు రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అమెరికా అధ్యక్ష బరిలో బరాక్ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్ అమెరికా మాజీ ప్రథమ మిచెల్ ఒబామాకి తరుచుగా ఎదరవుతున్న ప్రశ్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా అని. ఈ ప్రశ్న ఆమెకి తన భర్త ఒబామా అధ్యక్షుడిగా (2009 నుంచి 2017) ఉన్న సమయంలో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అంటూ పలువురు ఇప్పటికీ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్....నివ్వెరపోయిన పోలీసులు యావత్తు దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఢిల్లీ మెహ్రౌలీ హత్య కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అప్తాబ్ పూనావాలా, శ్రద్ధ ఇద్దరూ ఢిల్లీలో ఒక ఫ్లాట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు ఫ్లాట్ విషయంలో క్లూస్ కోసం దర్యాప్తు చేస్తుండగా.. నీటిబిల్లుల విషయం వారిని ఆశ్చర్యపరిచింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం! సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 కష్టమే! టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం అనంతరం టీమిండియా తొలి టీ20 సిరీస్‌కు సిద్దమైంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టీ20 సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ కావడంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగామరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తారు అసలు ఏం కంపెనీకి సీఈవోగా ఉండాలని కోరుకోవడం లేదని ఈ క్రమంలోనే త్వరలోనే ట్విటర్‌కు కొత్త సీఈవోను ఎంపిక చేయనున్నామని ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎమ్మెల్యేల కేసులో తుషార్‌ను టార్గెట్ చేసిన సిట్.. ఆయన ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నందుపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేయగా.. ఈ వ్యవహారంతో లింకులు ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఫౌంహాస్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన విచారణకు హాజరుకావాలని తుషార్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రామచంద్రభారతి, రోహిత్‌రెడ్డితో తుషార్ ఫోన్లో మాట్లాడారు. తుషార్‌కు బీజేపీ కీలక నేతలు సన్నిహితులు అంటూ ఫోన్ సంభాషణ కొనసాగింది. ఇక, గత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడులో రాహుల్‌పై తుషార్ పోటీ చేశారు. మరోవైపు.. రెమా రాజేశ్వరి నేతృత్వంలో సిట్ బృందం కేరళలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రామచంద్రభారతి ప్రధాన అనుచరుడు జగ్గుస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, తుషార్‌ను రామచంద్రభారతికి పరిచయం చేసింది జగ్గుస్వామినే కావడం విశేషం. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఢిల్లీలో హైటెన్షన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు మరో ఇద్దరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని ఫరీదాబాద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం. వీరిద్దరూ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న రామచంద్రభారతికి అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. ఈ ఇద్దరికీ కేసులో సహ నిందితుడిగా ఉన్న నందుకుమార్‌తోనూ సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఎర కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం (సిట్)కు అప్పగించిన మరుసటి రోజునే సైబరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందం ఒకటి ఢిల్లీకి చేరుకొని విచారణ చేపట్టింది. నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం, కాల్‌డేటా ఆధారంగా ఫరీదాబాద్‌లో వీరిని అదుపులోకి తీసుకుంది. వీరికి ముగ్గురు ముద్దాయిలతో ఉన్న సాన్నిహిత్యం, ఎమ్మెల్యేల కొనుగోళ్లలో వీరి ప్రమేయం తదితర వివరాలపై ఆరా తీస్తోంది. ఇప్పటికే అదుపులో ఉన్న నిందితులకు సంబంధించిన వీడియోల్లో రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధంచేసిన ప్రణాళిక, దీనికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారంలో వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో అరెస్ట్ చూపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి అరెస్ట్‌తో కేసు విచారణ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. -
నందుకు బిగుస్తున్న ఉచ్చు.. తెరపైకి హీరో రానా ప్లాట్ వ్యవహారం
బంజారాహిల్స్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందుకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫిలింనగర్ రోడ్ నం.1 లోని ప్లాట్ నం. 2లో సినీ హీరో దగ్గుబాటి రానా ప్లాట్‌ను నందు లీజుకు తీసుకొని జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అద్దెకిచ్చాడు. అయితే, చట్టపరమైన హక్కులు లేకుండా ఈ ప్లాట్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు గత ఆదివారం కూల్చివేశారు. ఇక్కడ ఐస్‌క్రీం పార్లర్ ఏర్పాటు కోసం రూ.8 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించానని, రూ.40 లక్షలతో మరమ్మతులు, ఇంటీరియర్ చేయించుకున్నానని, ఇప్పుడు ఈ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారని, డబ్బులు వసూలు చేసి మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలని సంజయ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశా రు. అలాగే బాంబే గార్మెంట్ స్టోర్ పేరుతో తనకు ఓ అక్రమ కట్టడాన్ని అంటగట్టి పెద్ద ఎత్తున అడ్వాన్స్ తీసుకున్నాడని ఇంటీ రియర్ కోసం తాను లక్షలాది రూపాయలు ఖర్చు చేశానని మియాపూర్‌కు చెందిన ఇందిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్లాట్‌లో అక్రమంగా నిర్మించిన ఓ షాపును బరిస్టా స్టోర్ పేరుతో తాను ఏర్పాటు చేశానని.. ఇది అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు యత్నించడమే కాకుండా నోటీసులు జారీ చేశారని తనను మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌కు చెందిన అశిజ్‌రెడ్డి ఫిర్యాదు చేశా రు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు నందుపై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద కేసులు నమో దుచేశారు. ఇదిలా ఉండగా ఆరు రోజుల క్రితం దక్కన్ కిచెన్ హోటల్స్ యజమాని సయ్యద్ అయాజ్, మొబైల్ యాక్ససెరీస్ గాడ్జెట్ స్టూడియో యజమాని సందీప్ కుమార్ కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా నందుపై పోలీసులు అయిదు చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యేల కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం జరిగింది. ఈ కేసులో సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ బీజేపీ నేత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీల్ చేశారు. దీంతో, రిట్ అప్పీల్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది. మరోవైపు తాను దాఖలు చేసిన పిటిషన్లో ప్రేమేందర్ రెడ్డి.. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణ హైకోర్టులో ఉన్న నేపథ్యంలో నిందితులు.. కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ సోదాలు
-
ఎమ్మెల్యేల ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్.. రోహిత్ రెడ్డికి ఊహించని ఫోన్ కాల్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ఇప్పటికే నిందితులను సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోహిత్ రెడ్డి. తనకు యూపీ, గుజరాత్‌కు చెందిన 11 నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను హత్య చేస్తామంటూ బెదిరించనట్టు రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్స్ రికార్డు చేసింది సిట్ బృందం. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. నిందితులు ఎలా సంప్రదించారనే కోణంలో సిట్ విచారణ చేపట్టింది. రూ. 100 కోట్ల డీల్‌పై ఫాంహౌస్‌లో ఏం మాట్లాడారనే అంశంపై విచారణ జరిపింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కీలకం కానున్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో భాగంగా నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి స్వామి, నందకుమార్‌ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మొదటిరోజు విచారణలో భాగంగా పలు కీలక ప్రశ్నలకు సంధించారు సిట్ అధికారులు. ఇక, నిందితుల కస్టడీలో రెండో రోజు కూడా విచారణ జరుగుతోంది. కాగా, రెండో రోజు కస్టడీలో భాగంగా పోలీసులు.. నిందితుల వాయిస్ రికార్డ్ చేయనున్నారు. ఎఫ్ఎస్ఎల్లో నిందితుల వాయిస్ పరిశీలన పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు సూత్రధారులు, పాత్రధారులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీ అనంతరం నిందితులను కోర్టులో కోర్టులో హాజరపర్చనున్నారు పోలీసులు. -
మీ వెనుక ఎవరున్నారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి స్వామి, నందకుమార్‌ను సిట్ అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల విచారణకు కోర్టు అనుమతించడంతో ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఇక్కడే సిట్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటైంది. ‘ఫామ్‌హౌస్’వ్యవహారంలో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ కీలకమని భావిస్తున్న అధికారులు అతడిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. హరియాణాలోని ఫరీదాబాద్ సెక్టార్ 31లో ఉన్న ప్లాట్ నం.229లోని విలాసవంతమైన నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్లో ఇతడు నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇంట్లోకి ఆయన ఇటీవలే గృహప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. సమీపంలోని శ్రీకృష్ణ–నవగ్రహ ఆలయంలో పూజారిగా చెలామణి అవుతున్న ఇతడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? దీనికీ, ఎమ్మెల్యేలకు ఎర అంశానికి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ సిట్ దర్యాప్తు సాగుతోంది. అనేక మంది ప్రముఖులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ రామచంద్ర భారతిని ప్రశ్నించింది. ఎవరి ప్రోద్బలంతో ఫామ్‌హౌస్ మీటింగ్‌కు వచ్చారు?. ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్ల వరకు వెచ్చింది ఖరీదు చేయడానికి అంత మొత్తం ఎక్కడ నుంచి రానుంది? దాన్ని ఇవ్వడానికి ఎవరు ముందుకొచ్చారు? అనే అంశాలపైనా ప్రశ్నించింది. కోడ్ భాషలో జరిగిన చాటింగ్‌లు, వాటికి సమాధానం ఇచ్చిన అవతలి వ్యక్తులు.. తదితర అంశాలను నిందితుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరోపక్క పోలీసులు రామచంద్రభారతి నుంచి రెండేసి చొప్పున ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు పేర్లు, చిరునామా, ఒకే ఫొటోతో ఉన్న ఇవి ఎలా వచ్చాయనేది ఆరాతీశారు. నిందితులకు సంబంధించిన అడియో, వీడియో సంభాషణలను విశ్లేషించిన అధికారులు కస్టడీలో వీరి నుంచి సేకరించాల్సిన వివరాలకు సంబంధించి 42 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని తయారు చేసుకున్నారు. ఈ ప్రశ్నలపై ముందుగా గురువారం ఉదయం ఒక్కొక్కరిని వేర్వేరుగా ప్రశ్నించారు. మధ్యాహ్నం తరువాత అందరిని కలిపి ఈ ప్రశ్నలపై సమాధానాలు సేకరించే ప్రయత్నం చేశారు. అయితే అందులో 17 ప్రశ్నలకు సంబంధించిన సరైన సమాధానాలు రాలేదు. ఒక్కొక్కరు ఒకో రకంగా మాట్లాడారు. వీటిపై శుక్రవారం జరిగే విచారణలో పోలీసులు స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ 17 ప్రశ్నల్లో నిందితులు చెప్పిన సమాధానాలతో మరిన్ని సందేహాలు పోలీసులకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మరిన్ని ప్రశ్నలను పోలీసులు తయారు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిందితుల విచారణకు కోర్టు అనుమతించడంతో న్యాయవాది సమక్షంలో విచారణ పూర్తి అయిన తర్వాత ముగ్గురు నిందితులనూ చంచల్‌గూడ జైలుకు తరలించారు. శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. సిట్ అధికారుల ప్రత్యేక సమావేశం... సిట్ ఏర్పాటైనా దానికి పోలీసుస్టేషన్ హోదా లేకపోవడంతో కేసు రాజేంద్రనగర్ ఏసీపీ పరిధిలోని మొయినాబాద్ ఠాణాలోనే ఉంది. ఏసీబీ కోర్టు సైతం నిందితులను ఆ పోలీసులకే అప్పగించింది. ఈ కారణంగానే ప్రస్తుతానికి ఏసీపీ ఆఫీస్‌నే సిట్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. గురువారం డీసీపీలు కల్మేశ్వర్ సింగెన్వర్, జగదీశ్‌రెడ్డి, ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి విచారణలో పాల్గొన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ అధికారులంతా గురువారం నగరంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సిట్‌లో మూడు విభాగాలను ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. నిందితుల విచారణ, ఇతర రాష్ట్రాలు/ప్రాంతాల్లో దర్యాప్తునకు ఓ బృందం, సాంకేతిక అంశాల దర్యాప్తునకు మరోటి ఏర్పాటు చేయనున్నారు. అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాల విశ్లేషణకూ ఓ బృందం పని చేయనుంది. సిట్‌లోకి మరికొందరిని తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి నియామకాలు పూర్తైన తర్వాత సిట్ కోసం ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. సిట్ సమావేశాలు, నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు తదితరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. -
'ఆయనేమో తడిబట్టలతో తిరుగుతాడు.. వీళ్లేమో కోర్టుకు.. ఎందుకంత భయం?'
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ కేసులో విచారణను ఆపాలంటూ బీజేపీ కోర్టులో పిటిషన్ ఎందుకేసిందో చెప్పాలని మంత్రి హరీష్‌రావు కోరారు. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడేమో మాకు దొరికిన వాళ్ళు ఎవరో తెలియదంటూ తడిబట్టలతో తిరుగుతారు. కానీ వాళ్ల పార్టీ ప్రధాన కార్యదర్శి సిట్‌ని నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేస్తారని ఎద్దేవా చేశారు. మీకు సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్ళారు? మీకెందుకంత భయం? అంటూ ప్రశ్నించారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ, తెలంగాణలో విఫల ప్రయత్నం చేసిందన్నారు. అయితే ఇక్కడ బీజేపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలక మాదిరిగా తయారైందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ దొంగలు అడ్డంగా దొరికిపోవడంతో జాతీయ స్థాయిలో ఆ పార్టీ పరువు పోయిందన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతలు గందరగోళంలో ఉన్నారని తెలిపారు. బీజేపీ నేతలు చెంపలు వేసుకుని తప్పు ఒప్పుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. 'మరోవైపు గవర్నర్ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మాట్లాడుతున్నారు. రాహుల్‌పై పోటీ చేసిన తుషార్ గురించి మేం చెప్పాం. కానీ గవర్నర్ మాత్రం తన ఏడీసీ తుషార్ గురించి మాట్లాడారు. గవర్నర్ హుందాగా ఉండాలి. గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని మంత్రి హరీష్ రావు అన్నారు. చదవండి: (పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు) -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు: వేర్వేరు గదుల్లో ఒకే ప్రశ్న ముగ్గురికి.. కీలక స్టేట్మెంట్?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను రాజేంద్రనగర్ సీఎస్‌లో పోలీసులు విచారించారు. తొలి రోజు విచారణలో సుమారు 7 గంటల పాటు నిందితులను ప్రశ్నించారు. ముగ్గురు నిందితులను వేర్వేరు గదుల్లో విచారించారు. ఒకే ప్రశ్నను ముగ్గురికి వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రశ్నలకు ముగ్గురూ వేర్వేరు సమాధానాలు చెప్పినట్టు గుర్తించారు. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్న రామచంద్రభారతి.. మరికొన్ని ప్రశ్నలను దాటవేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు రాలేదని రామచంద్రభారతి చెప్పినట్లు తెలిసింది. రేపు(శుక్రవారం) మరోసారి నిందితులను పోలీసులు ప్రశ్నించనున్నారు. రామచంద్రభారతి కేంద్రంగా విచారణ కొనసాగింది. ఆయన ముందు సాక్ష్యాధారాలు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. అతని గత చరిత్ర గురించి ఆరా తీశారు. ఢిల్లీ, హర్యానాలో స్వచ్ఛంద సంస్థల పేరుతో కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పూజల పేరుతో పలువురి నేతలకు దగ్గరైనట్టు తేలింది. రామచంద్రభారతి స్టేట్మెంట్ కీలకం కానుంది. మహారాష్ట్ర, గోవా ప్రభుత్వాలను కూల్చినట్టు ఆడియో టేప్‌లో రామచంద్రభారతి చెప్పారు. ఢిల్లీలోనూ త్వరలో ప్రభుత్వం కూలుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, రామచంద్రభారతి పరిచయాల గురించి పోలీసులు ఆరా తీశారు. చదవండి: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. కాగా, ఈ ఎపిసోడ్‌పై తెలంగాణ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక, గురువారం మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారిని రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఇక, రాజేంద్రనగర్ ఏసీపీ ఆఫీసులో సిట్ కార్యాలయం సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలను నియమించింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గత నెలలో మొయినాబాద్ పోలీసులు రామచంద్రభారతి, సింహయాజితోపాటు నగరానికి చెందిన నందుపై కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, రామచంద్రభారతి తనకు రెండు డ్రైవింగ్ లైసెన్సులు, రెండు పాన్‌కార్డులు, రెండు ఆధార్ కార్డులు చూపించి ప్రభుత్వంలో తాము ఏమైనా చేయగలమని చెబుతూ మోసం చేసేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రామచంద్రభారతిపై ఐపీసీ 467, 468, 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచడం గమనార్హం. చదవండి: గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? -
ఫామ్ హౌస్ లీక్స్..
-
‘వీడియోలో అమిత్‌షా పేరు చెబితే.. సంబంధం ఉన్నట్టేనా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దల హస్తం ఉందంటూ సీఎం కేసీఆర్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు బయటపెట్టారు. ఈ వీడియోలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై సెటైరికల్ కామెంట్స్‌తో కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న కేసీఆర్ చూపించిన వీడియోల్లో ఏమీలేదు. ఫస్ట్ షో.. సెకండ్ షో అన్నాడు. చివరికి కామెడీ షో అయింది. కేసీఆర్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఇదంతా చేస్తున్నారు. లిక్కర్ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగొచ్చు. ఈ ఎపిసోడ్ అంతా పెద్ద డ్రామా. ఫామ్‌హౌస్ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారైంది. కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే సీఎస్, డీజీపీని పిలిపించాడు. వాళ్లకు ఫామ్‌హౌస్ ఎపిసోడ్ మొత్తం వివరించారు. ఫామ్‌హౌస్‌లో నేనింతే.. నా బతుకు ఇంతే అనే సినిమా తీశారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆ నలుగురు ఆణిముత్యాలను మాత్రం ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. ఈ ఎపిసోడ్లో డబ్బులు ఎక్కడా చూపించలేదు. 26న ఘటన జరిగితే.. సాక్షుల సంతకాలు 27న ఎలా తీసుకుంటారు?. ఇదంతా ప్లాన్ ప్రకారం కేసీఆర్ డైరెక్షన్లోనే నడిచింది. అమిత్‌షా పేరు చెప్పినంత మాత్రాన ఆయనతో సంబంధాలు ఉన్నట్లేనా?. తుషార్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. -
వీడియోలు రిలీజ్ చేసిన సీఎం కేసీఆర్.. ఇది మినీ సినిమా మాత్రమే..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్.. బీజేపీపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో బీజేపీ ఎనిమిది ప్రభుత్వాలను కూలదోసింది. ఇంకా నాలుగు ప్రభుత్వాలను కూలిదోసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రలోభాలను పెట్టినవారు దేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తులు. మా ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి ప్రలోభపెట్టారు. ఎమ్మెల్యే మా దృష్టికి తెచ్చి, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. నేను చూపించే వీడియోలు చూస్తే జనం నివ్వెరపోతారు. ప్రలోభపెట్టిన ముఠాను మా ఎమ్మెల్యేలు పట్టించారు. ఒకే వ్యక్తికి రెండు, మూడు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉంటాయి. తుషార్ అనే వ్యక్తి బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేశారు. ఫేక్ ఐడీ కార్డులు ఎలా వచ్చాయి?.మేము ఏమైనా చేస్తాం.. మమ్మల్ని ఎవరేం చేస్తారని చెబుతున్నారు. నా దగ్గర ఉన్నవి ఆషామాషీ ఆధారాలు కావు. ఈవీఎంలు ఉన్నంత కాలం బీజేపీకి ఢోకా లేదని చెబుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ కుట్రలు పన్నుతున్నారు. ప్రజాస్వామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ప్రభుత్వాలను ఎలా కూలగొట్టామని వారి మాటల్లోనే చెప్పారు. మాకు దేశంలో ఎదురేలేదన్న ధీమా వారిది. ఇలాంటి అప్రజాస్వామిక పనులను అడ్డుకోవాలి. రూ. 100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంనగా ఉన్నామని చెప్పారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. మీకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తామని చెబుతున్నారు. కొనుగోలు కోసం 24 మంది ఉన్నామని వాళ్లే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే దేశంలో ఎన్నికలు ఎందుకు?. ఈ డబ్బులన్నీ వీరికి ఎవరు సమకూరుస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ ముఠాను ఆపరేట్ చేసేది బీఎల్ సంతోష్, జేపీ నడ్డా, అమిత్ షా అని చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు ఫాంహౌస్ ఫైల్స్ పంపించాము. ఈ ఎపిసోడ్లో అమిత్ షా పేరు చాలా సార్లు చెప్పారు. 2015 నుంచి వారి కాల్ డేటా మా చేతికొచ్చింది. వారి అరాచకాలన్నీ పబ్లిక్ డొమైన్‌లోకి చేరినట్టే. మాకు దొరికిన ప్రతీ ఆధారాన్ని కోర్టుకు సమర్పించాము. హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఊరుకోవాలా?. దీనికి బాధ్యులైన ప్రతీ ఒక్కరినీ అరెస్ట్ చేయాలి. న్యాయవ్యవస్థ దీనిని సింగిల్ కేసులా చూడొద్దు. ఈ పాలిటిక్స్ ఆపాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. మోదీజీ మీరు.. మీ పార్టీ చేస్తున్నది తప్పు. ప్రభుత్వాలను కూల్చి ఏం సాధించాలనుకుంటున్నారు. మోదీతో సఖ్యత లేకపోతే ఈడీ మీ దగ్గరకు వస్తుందని చెబుతున్నారు. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. దేశం ఎప్పుడు ప్రమాదంలో పడ్డా న్యాయవ్యవస్థే ఆదుకుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను. సుప్రీంకోర్టు సహా దేశంలోని న్యాయమూర్తుల్ని చేతులు జోడించి కోరుతున్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ కామెంట్స్ చేశారు. -
‘అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో ప్రమాణం చేయడం పాపం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కేటీఆర్ మాట్లాడుతూ.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రజల ముందకు అన్ని విషయాలు వచ్చాయి. దొంగ ఎవరో.. దొర ఎవరో తేలిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేయడం పాపం. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. యాదాద్రిని సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరుతున్నాను. ప్రమాణాలు చేసుకుంటూ పోతే చట్టాలు, కోర్టుల అవసరం ఏముంది. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా నేను మాట్లాడను. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణం చేస్తున్న సందర్భంగా బండి సంజయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ, తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఎమ్మెల్యేల కొనుగోలుపై కోర్టు కీలక వ్యాఖ్యలు.. అక్కడ ముందే కెమెరాలున్నాయా?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. ఈ నేపథ్యంలో వారి అరెస్ట్‌ను ఏబీసీ కోర్టు రిజక్ట్ చేయడంపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో, పోలీసుల పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏజీ వాదిస్తూ.. ప్రతీ కేసులో 41C నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలకు రూ. 50కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాలని ఆఫర్ చేశారు. ఈడీ, సీబీఐ కేసుల నుంచి కాపాడుతామని చెప్పారు. అనంతరం, నిందితుల తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదిస్తూ.. తమ పిటిషనర్లపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఘటన స్థలంలో ఎలాంటి డబ్బు దొరకలేదన్నారు. హై ప్రొఫెషనల్ కేసులో ప్రతీ ఒక్కరికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలన్నారు. ఇక, విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫామ్‌హౌస్‌లో ముందే కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థ పెట్టారా? అని ప్రశ్నించింది. 24 గంటలపాటు నిందితులు హైదరాబాద్‌ను విడిచి వెళ్లొదని ఆదేశించింది. సాయంత్రంలోపు నిందితుల చిరునామాలు సీపీకి ఇవ్వాలని పేర్కొంది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. కేసు వివరాలు అఫిడవిట్స్ అన్ని ప్రతివాదులకు ఇవ్వాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. ఇది కూడా చదవండి: మునుగోడు ఎన్నికల ముందే పని అయిపోవాలి.. ఆడియో లీక్ కలకలం -
‘డబ్బుల బ్యాగ్‌లు ఎక్కడ?.. ఆ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు?’
సాక్షి, యాదాద్రి: తెలంగాణ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవుడి సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. ఈ అంశంపై బీజేపీకి, తనకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. అనంతరం, మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కడున్నాయి.. బ్యాగ్‌లు ఏవి?. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు సీఎం కేసీఆరే సూత్రధారి. అవన్నీ ఫేక్ వీడియోలే. లై డిటెక్టర్ పరీక్షకు కేసీఆర్ సిద్ధమా?. కేసీఆర్‌కు దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. నిజంగా ఆధారాలుంటే కోర్టుకు ఎందుకు సమర్పించలేదు?. మునుగోడు ఎన్నికల్లో మందు, మనీ, మాంసం పంచినా, ఓటుకు రూ.40 వేలు పంచినా, ఓటుకు తులం బంగారం ఇచ్చినా ప్రజలు టీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఈ కారణంగానే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కుట్రలకు తెరలేపాడు. కేసీఆర్‌కు సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దుస్ధితి ఏర్పడింది. మునుగోడు ఫలితాల తరువాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపారు. ఆ స్వామిజీ ఎవరో నాకు తెలియదు. బాధితులు టీఆర్ఎస్ పార్టీ నేతలే. పైసలకు అమ్ముడుపోయేందుకు సిద్ధమైంది కూడా వాళ్లే. డబ్బు తీసుకొచ్చిన వాహనాలు టీఆర్ఎస్ నేతలవే. ఇందులో బీజేపీకి సంబంధం లేకపోయినా బురదచల్లి రాజకీయ లబ్ది పొందే కుట్రకు కేసీఆర్ తెరదీశాడు. ఆడియో టేపుల పేరుతో మరో కొత్త సినిమా చూపే యత్నం చేసి కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. అసలు ఆ ఎమ్మెల్యేలు ఎటు వెళ్లారు? మూడు రోజులుగా కనిపించడంలేదు. బయటకు ఎందుకు రావడం లేదు? ప్రగతి భవన్‌కే పరిమితం చేశారా? అంటూ ప్రశ్నించారు. -
నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు.. పట్టించుకోవద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు — KTR (@KTRTRS) October 27, 2022 ఇదీ చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? -
అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా?
సాక్షి, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో గురువారం నిర్వహించిన గౌడ ఆత్మీయ సమావేశంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్‌కు మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ బేరసారాలు టీఆఎస్ చేసిన డ్రామాగా పేర్కొన్నారు. నెత్తి మీద రూపాయి పెడితే అర్థ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా పెడతారా? వాళ్ళను మేము కాదుకదా ఎవరు ఏ పార్టీలోకి రానివ్వరు అని ధ్వజమెత్తారు. ‘ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడలేదు. ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయం చేస్తున్నారు. దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు కేసీఆర్. ఇటువంటి ముఖ్యమంత్రికి సరైన జవాబు చెప్పాలి. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు చేసే వారివి బానిస బతుకులు. అవమానాలు భరించలేక బూర నర్సయ్య గౌడ్ బయటకు వచ్చారు. ఎంతోమంది ఉద్యమకారులు ఇప్పుడు ఆ పార్టీలో లేరు. దురహంకార పాలనకు చరమగీతం పాడాలి. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి ఆలీబాబా 40 దొంగల ముఠా దిగింది. పోలీస్ జీపులో, ఎస్కార్ట్ జీపులల్లోనే డబ్బులు తీసుకెళుతున్నారు. నీ డబ్బు, నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు.’ అని టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసమని, ప్రస్తుతం పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇదీ చదవండి: ఫాంహౌస్ డీల్‌పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది? -
ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఫోన్! విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న సీఎం
చండీగఢ్: ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల మొదట్లో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 22న(గురువారం) పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. పంజాబ్ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు కృత నిశ్చయంతో ఉన్నారని రుజువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు వీడియో సందేశం పంపారు. ਲੋਕਾਂ ਦੇ ਵਿਸ਼ਵਾਸ ਦੀ ਦੁਨੀਆਂ ਦੀ ਕਿਸੇ ਕਰੰਸੀ ਵਿੱਚ ਕੋਈ ਕੀਮਤ ਨਹੀਂ ਹੁੰਦੀ …22 September ਦਿਨ ਵੀਰਵਾਰ ਨੂੰ ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਦਾ ਸਪੈਸ਼ਲ ਸ਼ੈਸ਼ਨ ਬੁਲਾ ਕੇ ਵਿਸ਼ਵਾਸ ਮਤਾ ਪੇਸ਼ ਕਰਕੇ ਕਾਨੂੰਨੀ ਤੌਰ ‘ਤੇ ਇਹ ਗੱਲ ਸਾਬਤ ਕਰ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ…ਇਨਕਲਾਬ ਜ਼ਿੰਦਾਬਾਦ..! pic.twitter.com/VM2zA1upDP — Bhagwant Mann (@BhagwantMann) September 19, 2022 తమ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదిస్తోందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ ఛీమ ఇటీవలే ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దాదాపు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కాగా.. ఈ నెలలోనే ఢిల్లీ అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అనంతరం ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు తలొగ్గలేదని చెప్పారు. ఈ విశ్వాస పరీక్షలో ఆప్‌కు 58 ఓట్లు వచ్చాయి. మరో నలుగురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి హాజరు కాలేదు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు కాగా.. ఆప్‌కు 62, బీజేపీకి 8 మంది సభ్యులున్నారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్! సోనియాతో కీలక భేటీ -
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి... రూ.6,300 కోట్లు వెచ్చించింది
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఏకంగా రూ.6,300 కోట్లు వెచ్చించిందని శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘బీజేపీ ఆ పని చేయకపోతే ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించే అవసరమే ఉండేది కాదు. ప్రజలకు ధరాఘాతం తప్పేది’’ అని ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. ‘‘పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, జీఎస్టీ సొమ్ములను ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ వెచ్చిస్తోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పడుతుంటే ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోయడంలో బిజీగా ఉంది’’ అన్నారు. బీజేపీలో చేరాలంటూ రూ.20 కోట్లు చొప్పున ఆశ చూపారని ఆప్ ఎమ్మెల్యేలు ఇటీవల ఆరోపించడం తెలిసిందే. అస్సాం సీఎం, కేజ్రీవాల్ ట్విట్టర్ వార్ కేజ్రీవాల్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అస్సాంలో సర్కారీ స్కూళ్ల పరిశీలనకు ఎప్పుడు రమ్మంటారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తోనూ కేజ్రీవాల్‌కు విభేదాలు ముదురుతున్నాయి. కేజ్రీవాల్ సంతకాలు లేవంటూ 47 ఫైళ్లను ఎల్జీ తిప్పిపంపారు. -
కేజ్రీవాల్‌కు షాక్.. అజ్ఞాతంలోకి పలువురు ఆప్ ఎమ్మెల్యేలు?
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముందు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు కలవటం లేదని, వారితో మాట్లాడలేకపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో మొత్తం మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆప్ నేత దిలీప్ పాండే. అయితే, 40 మంది ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలందరితో టచ్‌లో ఉన్నాం. బుధవారమే అందరికి సందేశాలు పంపించాం. ఫోన్లు కలవని వారికి సైతం సందేశాలు చేరుతాయి. మీటింగ్‌కు ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. 40 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది’ అని పేర్కొన్నారు దిలీప్ పాండే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, పలువురు ఎమ్మెల్యేల ఆచూకీ లభించకపోవటంతో ఆప్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీలో చేరే ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు కాషాయపార్టీ ఆఫర్ చేసిందని బుధవారం ఆరోపించారు సౌరభ్ భరద్వాజ్. అంతకు ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం బీజేపీపై ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలంటే బీజేపీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి: మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం -
మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ‘‘బీజేపీలో చేరాల్సిందిగా నలుగురు ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్‌లను ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. లేదంటే మనీశ్ సిసోడియా మాదిరిగా తప్పుడు కేసులు, సీబీఐ, ఈడీ దాడులు తప్పవంటూ బెదిరించారు. ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఆఫర్ చేశారు. తమతో పాటు మరో ఎమ్మెల్యేను కూడా తీసుకొచ్చిన వారికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు’’ అని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నయానో భయానో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన వ్యూహాన్నే తమ పార్టీపైనా ప్రయోగిస్తోందని ఆరోపించారు. ‘‘వాళ్ల ప్రలోభాలకు సిసోడియా లొంగకపోవడంతో ఇతర ఎమ్మెల్యేలపై పడ్డారు. కానీ వాళ్లంతా ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చారు. బెదిరింపులకు లొంగే, అమ్ముడుపోయే రకం కాదు’’ అన్నారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ పార్టీకి ద్రోహం చేయబోమని సిసోడియా ట్వీట్ చేశారు. ‘‘మేమంతా కేజ్రీవాల్ సైనికులం. భగత్‌సింగ్ అనుయాయులం. మీ సీబీఐ, ఈడీ మమ్మల్నేమీ చేయలేవు’’ అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ముగిసేదాకా తమపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. విపక్షాలను లేకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరపాలని నిర్ణయించింది. ఈ ప్రశ్నలకు బదులివ్వండి: బీజేపీ ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మద్యం పాలసీలో అవినీతి బట్టబయలు కావడంతో శిక్ష తప్పదనే అసహనంతోనే ఆ పార్టీ నేతలు ఇలాంటి తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా విమర్శించారు. వాళ్లకు దమ్ముంటే డబ్బులు ఆఫర్ చేసిన బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సవాలు విసిరారు. ‘‘ఆప్‌కు భారీ కమీషన్లు ముట్టజెప్పిన వాళ్లకే కేజ్రీవాల్ సర్కారు మద్యం లైసెన్సులు కట్టబెట్టింది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే. విచారణను తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా ఒక్క ఫైలుపై తన సంతకం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై తమ ప్రశ్నలకు బదులివ్వలేక ఆప్ ఇలా తప్పుడు ఆరోపణలకు దిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆరోపించారు. ‘నిపుణుల కమిటీ వద్దన్నా వినకుండా హోల్‌సేల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులపరం చేశారు. భారీగా లంచాలు తీసుకుని బ్లాక్ లిస్టెడ్ కంపెనీలకూ లైసెన్సులిచ్చారు’ అని అన్నారు. కేజ్రీవాల్ అండ్ కో నిజాయతీ, పారదర్శకతలకు పాతరేసి చూస్తుండగానే అవినీతిలో కూరుకుపోయిందంటూ కాంగ్రెస్ కూడా దుమ్మెత్తిపోసింది. -
ఎమ్మెల్యేల రేట్లు పెరిగాయి
జైపూర్: ఆగస్టు 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం జోరందుకుందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గురువారం వ్యాఖ్యానించారు. ‘ఇప్పటివరకు ఒక్కో ఎమ్మెల్యేకు అడ్వాన్స్‌గా రూ. 10 కోట్లు, రెండో విడతగా రూ. 15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇప్పుడు.. అసెంబ్లీ సమావేశాల తేదీ ప్రకటించిన తరువాత.. ఎంత కావాలో చెప్పండి అంటూ అపరిమిత ఆఫర్‌తో ముందుకు వస్తున్నారు’ అని ఆరోపించారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని బీజేపీపై పరోక్ష ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయడాన్ని ప్రస్తావిస్తూ.. బీఎస్పీ చీఫ్ మాయావతి బీజేపీ తరఫున మాట్లాడుతున్నారని గెహ్లోత్ విమర్శించారు. 200 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మొత్తంగా 107 మంది సభ్యులుండగా, వారిలో సచిన్ పైలట్ నేతృత్వంలో 19 మంది నాయకత్వ మార్పు కోరుతూ తిరుగుబాటు చేయడంతో, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తన వర్గం ఎమ్మెల్యేలను పైలట్ గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉంచారు. మరోవైపు, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను జైపూర్ శివార్లలోని ఫెయిర్మాంట్ హోటల్‌కి సీఎం గహ్లోత్ తరలించారు. ఆగస్ట్ 14 వరకు కూడా వారంతా ఒకే దగ్గర ఉంటారని కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి అన్నారు. ఫెయిర్మాంట్ హోటల్లోనే సీఎల్పీ భేటీని నిర్వహించారు. కాగా, తమ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై గురువారం హైకోర్టు స్పందించింది. ఆగస్టు 11 లోగా స్పందించాలని ఆదేశిస్తూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, శాసన సభ కార్యదర్శి, బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. -
ఛీకొట్టిన బీజేపీ
* టీడీపీ నిర్వాకంతో నోటాకు రెండో ప్రాధాన్యత ఓటు * అమిత్‌షా సూచన మేరకే * టీడీపీతో కటీఫ్‌కు నిర్ణయం? సాక్షి, హైదరాబాద్: టీడీపీని బీజేపీ ఛీకొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ఎమ్మెల్యేల కొనుగోలుకు దిగిన తన మిత్రపక్షం తీరును ఆ పార్టీ అసహ్యించుకుంది. ఈ ఉదం తంతో టీడీపీతో దోస్తీకి ఇక రాంరాం చెప్పాలన్న నిర్ణయానికి కూడా బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థికి ఓటేయలేకే, శుక్రవారం నాటి ఓటింగ్‌లో బీజపీ ఎమ్మెల్యేలు తమ ఓట్లను చెల్లకుండా చేసుకున్నట్టు చెబతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆదివారం రూ.50 లక్షలు ఇవ్వజూపడం, స్వయంగా తమ బాస్ చంద్రబాబు పంపితేనే వచ్చానని చెబుతూ బేరసారాలాడుతూ ఏసీబీకి రెడ్హాండెడ్గాపట్టుబడటం తెలిసిందే. ఈ ఉదంతం బీజేపీని పునరాలోచనలో పడేసింది. ఈ పరిణామాలన్నింటినీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించారు. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగానే బీజపీ ఎమ్మెల్యేలు తమ రెండో ప్రాధాన్యత ఓటును నోటాకు వేసినట్లు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలే చెబుతున్నాయి. అలా చేస్తే సదరు సభ్యులు వేసే తొలి ప్రాధాన్యత ఓటు కూడా చెల్లకుండా పోతుంది. ఈ విషయం బీజేపీకి ముందే తెలుసని, టీడీపీకి తాము వేసిన తొలి ప్రాధాన్యతా ఓటు చెల్లకుండా పోవాలనే ఉద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కావాలనే నోటాకు రోండో ప్రాధాన్యత ఓటు వేయిం చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో టీడీపీతో దోస్తీ తమకిప్పటికే చాలా నష్టం కలిగించిందని బీజేపీ నేతలు కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీగా టీడీపీకి బలమైన ముద్ర పడిపోయిందని, అది నానాటికీ పెరగడమే తప్ప టీడీపీని తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశమే లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టమైన అంచనాకు వచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ముడుపుల ఉదంతం తెరపైకి రావడంతో టీడీపీ పరువు పూర్తిగా అధఃపాతాళానికి దిగజారిందని బీజేపీ నేతలంటున్నారు. అందుకే టీడీపీతో తెగదెంపులు చేసుకుంటామనే స్పష్టమైన సంకేతాలను నోటాకు ఓటేయడం ద్వారా బీజేపీ పంపిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.