సాక్షి, హైదరాబాద్: కల్పితమైన ఎమ్మెల్యే ల కొనుగోలుకేసులో సిట్ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అబ ద్ధాలను హైకోర్టు ఎండగట్టిందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఎమ్మెల్యే లకు ఎర కేసులో హైకోర్టు తీర్పును స్వాగతి స్తున్నామన్నారు. నీతి, నిజాయతీలకు కట్టుబ డిన బీజేపీ జాతీయ నాయకులను ఈ వ్యవ హారంలోకి లాగి కేసీఆర్ ఘోరమైన నేరానికి పాల్పడ్డారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తన ఊహల్లోంచి పుట్టిన ఈ తప్పుడు కేసు కోసం కేసీఆర్ ప్రజాధనాన్ని, అధికార యంత్రాంగా న్ని దుర్వినియోగం చేయడంతో పాటు, ఆయా సంస్థలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఐపీఎస్ అధికారులు కూడా వాస్తవాలను వెల్లడించకపోవడం దురదృష్టకరమన్నారు.
చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం..
Comments
Please login to add a commentAdd a comment